Archive For The “వినోదం” Category

సిద్ధార్థ-7

By |

సిద్ధార్థ-7

2. ప్రజలలో సిద్ధార్థుడు కామస్వామిని చూడడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్దమహలు. నౌకరులు అతనిని తివాసీలమీద నడిపించుకుంటూ లోపలికి తీసుకవెళ్ళారు. యజమాని కోసం నిరీక్షిస్తూ గదిలో కూర్చున్నాడు. కామస్వామి వచ్చాడు. ఇద్దరు స్నేహసూచకంగా వందనాలు తెలుపుకున్నారు. ”నీవు బ్రాహ్మణుడవనీ, పండితుడవనీ, ఉద్యోగం కోసం తిరుగుతున్నావని విన్నాను. అయితే జరగక ఉద్యోగంలో చేరదలచా వన్న మాట” అన్నాడు షాహుకారు. ”నాకు జరగకపోవడమనేది ఏనాడూ లేదు. నేను చాలా కాలం శ్రమణులతో కలిసి ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను.”…

Read more »

త్రీ ఇడియట్స్‌

By |

త్రీ ఇడియట్స్‌

పరీక్ష హాల్లోంచి నిర్లిప్తంగా బయటికి చూస్తోంది వినీల. నిర్మలాకాశాన్ని చూసి ఆమె ఈర్ష్య పడింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎంత బాగుందో, అనిపించిందామెకు. ఆమె మనసులోని బరువును నిదర్శిస్తున్నట్టు నిండు కుండలు మోసుకెళ్తున్నారు కొందరు స్త్రీలు. వాళ్లు, ఊరి బయట ఉన్న తన కాలేజీకి దగ్గర ఉన్న పల్లెల వాళ్లు. ఎండాకాలమంటే తనకి పరీక్షల కాలం. వాళ్లకేమో నీటి ఎద్దడి కాలం. ఏటేటా వాళ్లు ఈ పని చేస్తూంటారు. పాపం, ఎంత కష్టపడుతున్నారో! వాళ్లు పడేది ఓ…

Read more »

క్రేజీ బాక్సర్‌..!

By |

క్రేజీ బాక్సర్‌..!

ఫ్లాయిడ్‌ మే వెదర్‌ ప్రపంచ బాక్సింగ్‌ అభిమానులకు, క్రీడాప్రియులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు. ఓ నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లోకి దూసుకువచ్చాడు. అతికొద్ది సమయంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. క్రేజీ క్రేజీ బాక్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు. అమెరికాలోని మిషిగాన్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం ఫ్లాయిడ్‌ మే వెదర్‌ జూనియర్‌ ఓ నిరుపేద బాక్సర్‌ ఇంట్లో జన్మించాడు. తండ్రి మే వెదర్‌…

Read more »

పరాజయాల బాటలో విజయపు ‘మజిలీ’ !

By |

పరాజయాల బాటలో విజయపు ‘మజిలీ’ !

నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా మారాడు శివ నిర్వాణ. అలానే నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో నిర్మాతలుగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది. విశేషం ఏమంటే… ఆ దర్శకుడు, ఈ నిర్మాతలు కలిసి ఇప్పుడు నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ సినిమా రూపొందించారు. తొలి చిత్రంలో భగ్న ప్రేమను కథావస్తువుగా తీసుకున్న శివ నిర్వాణ ఇప్పుడు కూడా ఆ జానర్‌లోనే ‘మజిలీ’ని తెరకెక్కించాడు. పూర్ణ (నాగ చైతన్య) వైజాగ్‌లో తండ్రి చాటున…

Read more »

సిద్ధార్థ-6

By |

సిద్ధార్థ-6

కమల ఆ మాటలకు విరగబడి నవ్వుతూ అన్నది – నా అనుభవంలో ఇంతవరకు ఒక శ్రమణుడు నా వద్ద శుశ్రూష చేస్తానంటూ రాలేదు. జడలు పెంచుకొని, కావిగుడ్డలు కట్టుకునే శ్రమణులు నా వద్దకు ఎన్నడూ రారు. పెక్కుమంది యువకులు – బ్రాహ్మణ యువకులు కూడా – నా వద్దకు వస్తారు. కాని వారు అందమైన దుస్తులతో, సుగంధాలు విరజిమ్ముతూ సంచులలో ద్రవ్యాన్ని నింపుకొని నా వద్దకు వస్తారు.” ”కమలా ! నీ వద్ద శుశ్రూషను ఇదివరకే ప్రారంభించాను….

Read more »

అతిథి

By |

అతిథి

శ్రావణమాసం.. వర్షాలు పుంజుకొంటు న్నాయి. పాడేరు లోయ ఆకర్షణీయంగా అలరారు తోంది. ఘాట్‌రోడ్‌ అప్పుడే, కొత్తగా చిగుళ్లేస్తున్న ఆకుపచ్చని వృక్ష సంపదతో శోభాయమానంగా ఉంది. కొన్ని చోట్ల మైదాన ప్రాంతాలలో పచ్చని తివాసీపై కురిసిన మంచు బిందువుల మీద పడిన ప్రభాత కిరణాలు రంగు రంగుల కాంతులు వెదజల్లుతున్నాయి. మనోహరంగా ఉన్న ఆ ప్రకృతిని ఆరాధనాభావంతో వీక్షిస్తూ కొత్తగా కొనుకున్న ఆడికార్‌ను డ్రైవ్‌ చేస్తూ ఆనంద డోలికలలో తేలి ఆడుతున్నారు బంధూ, బంధూ ప్రక్కనే కూర్చున్న అతని…

Read more »

వర్మ తెరకెక్కించిన పరాజితుడి కథ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

By |

వర్మ తెరకెక్కించిన పరాజితుడి కథ  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీయార్‌ జీవిత చరిత్ర జనవరిలో ‘ఎన్టీయార్‌ మహానటుడు’గానూ, ఫిబ్రవరిలో ‘ఎన్టీయార్‌ మహానాయకుడు’గానూ వెండితెరకెక్కింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్య మంజు అనే వ్యక్తితో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ అంటూ మరో సినిమాను జనం ముందుకు తీసుకొచ్చారు. ఓ ప్రముఖుడి జీవితం ఇలా మూడు భాగాలుగా, వరుసగా మూడు మాసాల్లో, సినిమా రూపంలో ప్రేక్షకులకు చేరువ కావడం బహుశా ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావచ్చు. ఎన్టీయార్‌ బయోగ్రఫీ…

Read more »

సిద్ధార్థ -5

By |

సిద్ధార్థ -5

రెండవ భాగం 1.కమల సిద్ధార్థునికి ప్రపంచమంతా మారురూపం పొందింది. అతడు ప్రపంచానికి అంత వశమై పోయినాడు. అడుగుతీసి అడుగు పెడితే అతనికి ఒక క్రొత్త సొగసు గోచరిస్తున్నది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశాన నక్షత్రాలు, చిన్ని పడవలాగా తేలిపోతున్న నెలవంక, మబ్బులు, అడవిలో తీగెలు, పొదలు, పూలు, సెలయేరు, ఉదయాన చెట్ల ఆకులపై తళతళలాడే మంచు చుక్కలు, దూరాని కగుపించే కొండలు, పక్షుల కలకలారావాలు, తుమ్మెదల రొదలు, చేలమీదుగా మెల్లగా విచే గాలులు, ఇంకా వేర్వేరు రంగులతో వేర్వేరు…

Read more »

గూగుల్లో దొరకనిది

By |

గూగుల్లో దొరకనిది

”పిల్లల్ని నీతో తీసుకెళ్లు?” సఫారీ సూట్‌లోని తన నిండు సుందర విగ్రహాన్ని నిలువుటద్దంలో చూసుకుంటూ చెప్పాడు భార్గవ. ”నాకెక్కడ వీలౌతుంది? మా బ్యాచ్‌లోని ఇరవై మంది ఫ్రెండ్స్‌కీ నేనే మెంటర్‌ కమ్‌ గైడ్‌ కమ్‌ ఫిలాసఫర్‌ని. పానకంలో పుడకల్లా నా దారికడ్డుపడుతారు పిల్లలు. కావాలంటే మీరే తీసుకెళ్లండి” తన కంచి పట్టు చీరకు మ్యాచయ్యే జువెలరీ కోసం వెతుకుతూ ఉన్న సునంద భర్తతో అంది. తల్లిదండ్రులిద్దరూ తమ గురించి ఎందుకిలా కీచులాడుకుంటూన్నారో తెలియని పన్నెండేళ్ల గ్రీష్మ, పదేళ్ల…

Read more »

ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

By |

ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

గత ఆరున్నర దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైన భారత క్రీడారంగానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి. సూపర్‌ హిట్‌ 2018 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను న్యూఢిల్లీ వేదికగా విజయవంతంగా నిర్వహించారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా మొత్తం 16 క్రీడాంశాలలో 12వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాలలోపు వారే కావడం…

Read more »