Archive For The “నివాళి” Category

ధన్యజీవి పాండురంగారావు

By |

ధన్యజీవి పాండురంగారావు

నిర్బంధంలోను నిలబడడం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన లక్షణం. అందుకు ప్రధాన కారణం సంఘ్‌కు ఉన్న నిబద్ధులైన కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలలో అగ్రగణ్యులే రాజా పాండురంగారావు దేశ్‌ముఖ్‌ (ఫిబ్రవరి 12, 1927-డిసెంబర్‌ 2,2018). మెదక్‌ జిల్లా ప్రథమ కార్యవాహగా పనిచేసిన పాండురంగా రావు స్వగ్రామం ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామం. రాజా కిషన్‌రావ్‌ దేశ్‌ముఖ్‌, శారదాబాయిల జ్యేష్ట పుత్రుడు పాండురంగారావు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినవారు. తుది ఘడియ వరకు స్వయంసేవక్‌గా, దేశభక్తితో జీవితం సాగించారు. వారిది పెద్ద కుటుంబం….

Read more »

కమలదళంలో కన్నడ కస్తూరి

By |

కమలదళంలో కన్నడ కస్తూరి

భారతీయ జనతా పార్టీ, భారతదేశం ఒక ఉత్తమ రాజకీయవేత్తనే కాదు, ఒక మంచి సంఘ సేవకుడిని కోల్పోయాయి. జాతీయ భావాలు కలిగిన, దూరదృష్టి కలిగిన ఒక నాయకుడిని కర్ణాటక కోల్పోయింది. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి హుబ్బళి నారాయణ అనంతకుమార్‌ ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనంతకుమార్‌ (జూలై 22, 1959 – నవంబర్‌ 12, 2018) కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. వారి కుటుంబమే ఆరెస్సెస్‌, జనసంఘ్‌…

Read more »

సాహితీ విరాణ్మూర్తి

By |

సాహితీ విరాణ్మూర్తి

తెలంగాణ సాహితీవేత్తల్లో కపిలవాయి లింగమూర్తి ప్రముఖులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్యంలో తొలి డాక్టరేట్‌ అందుకున్న అరుదైన సాహితీవేత్త. కథ, నవల, నాటకం, కవిత్వం, చరిత్ర, బాల సాహిత్యం, వ్యాఖ్య, సంకలనం, అనువాదం, కావ్య పరిష్కారం… ఒకటేమిటి సమస్త సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆయన రాసిన ఒక్కో రచన ఓ ఆణిముత్యంలా ప్రకాశిస్తూ ఉంటుంది. కపిలవాయి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట తాలూకా జినకుంటలో మార్చి 31, 1928న జన్మించారు. బాల్యం నుంచే గేయాలు, ఛందో…

Read more »

మన్నించు మహాశయా!

By |

మన్నించు మహాశయా!

”ఈ పోరాటంలో నేను ఓడిపోయాను. నీవైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 111 రోజుల పాటు నిరశన వ్రతం చేసిన జి.డి. అగర్వాల్‌ గొంతు నుంచి అంతిమ క్షణాలలో వెలువడిన మాటలివి. ఆ ఉద్యమంలో తన సహచరుడు, విద్యార్థి దశలో తన శిష్యుడు ఎస్‌.కె.గుప్తాతో ఎంతటి బాధాతప్త హృదయంతో ఈ మాటలు ఆయన అని ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అంత సుదీర్ఘ నిరశన తరువాత ఆసుపత్రి మంచం మీద…

Read more »

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

By |

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

ఆర్‌ఎస్‌ఎస్‌ జ్యేష్ఠ కార్యకర్త, కర్నూలు విభాగ్‌ మాజీ సంఘచాలకులు ఎండివై రామమూర్తి (84) సెప్టెంబర్‌ 13న కర్నూలులో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లాలో సంఘ విస్తరణకు ఆయన విశేష కృషి చేశారు. ‘యజ్ఞన్న’ గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు మేడూరి దీక్షితుల యజ్ఞ రామమూర్తి. కర్నూలు-శ్రీశైలం రహదారిలో ఉన్న ఆత్మ కూరులో మే 1, 1934న రామమూర్తి జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. అక్కడే ‘శేతురావు బడి’ అనే…

Read more »

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

By |

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా నిర్వహించడం! అమాయకులైన వనవాసులను (ఎస్‌.టి.) స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చడం, వారి హక్కులను హరించడం వంటి…

Read more »

మెంటా మస్తాన్‌రావుకు నివాళి

By |

మెంటా మస్తాన్‌రావుకు నివాళి

విశ్వహిందూపరిషత్‌ జ్యేష్ఠ కార్యకర్త మెంటా మస్తాన్‌రావు 83 సంవత్సరాల వయస్సులో 2018 జూన్‌ 18 ఉదయం 9 గంటలకు విజయవాడలోని వారి స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. మస్తాన్‌రావు గత 40 సంవత్సరాలుగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కోశాధ్యక్షులుగా, విజయవాడ మహానగర్‌ అధ్యక్షులుగా, శ్రీ సత్యనారాయణ సేవా సమితికి కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వహిందూ పరిషత్‌ని బలోపేతం చేయడం, కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వడంలో మంచి కృషి సల్పినట్లు అఖిల భారత వి.హెచ్‌.పి. సంయుక్త ప్రధాన కార్యదర్శి వై.రాఘవులు…

Read more »

వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

By |

వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

అక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేసే అద్భుత కథాకథన చక్రవర్తి వాకాటి పాండురంగారావు ధర్మపత్ని వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు. మే 18న హైదరాబాద్‌లో ఆమె స్వర్గస్థులయ్యారు. కాళహస్తీశ్వర మాహత్మ్యం వంటి కావ్యాన్ని వ్రాసిన మహాకవి ధూర్జటి ఆమె పూర్వజులు. ఆమె తండ్రి డి.వెంకటేశ్వర్లు నెల్లూర్‌ వి ఆర్‌ కాలేజీలో గణిత అధ్యాపకులు. ఆమె మాతామహులు సీ.రామయ్య. ఆయన చేయి తిరిగిన రచయిత. ఆధునిక భారత ఆధ్యాత్మిక దీప్తి వంటి దివ్యజ్ఞాన సమాజానికి పేరెన్నికగన్న…

Read more »

కళాపిపాసి ‘రవీంద్ర శర్మ’ ఇక లేరు

By |

కళాపిపాసి ‘రవీంద్ర శర్మ’ ఇక లేరు

ఆయన కళారంగంలో నిష్ణాతుడు. రాతి శిల్పాలు చెక్కడంలో మేటి. ఇత్తడితో కళారూపాలు, మట్టితో కళాఖండాలు, కర్రలు, వెదురుతోనూ కళాత్మక ఆకతులు రూపొందించడం వంటి 16 కళల్లో నిపుణుడు. ఆయనే కళాపిపాసి, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కళాశ్రమ స్థాపకుడు, రవీంద్ర శర్మ (65). ఆయన ఏప్రిల్‌ 29 ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. రవీంద్ర శర్మ 1952 సెప్టెంబరు 5న ఆదిలాబాద్లో జన్మించారు. జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ఆర్ట్స్‌లో డిప్లోమా పొందారు. 1979లో ఆదిలాబాద్‌లోని సొంత ఇంట్లో కళాశ్రమాన్ని స్థాపించారు….

Read more »

దానం హన్మంతరావు అస్తమయం

By |

సంతాపం తెలిపిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహసర్‌కార్యవాహ వి.భాగయ్య ఆర్‌.ఎస్‌.ఎస్‌. జ్యేష్ఠ కార్యకర్తలతో ఒకరైన దానం హన్మంతరావు (80), ఏప్రిల్‌ 22 రాత్రి 10గం||లకు హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో అస్తమించారు. 24న అంత్యక్రియలు జరిగాయి. హన్మంతరావు మృతిపట్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌కార్యవాహ భాగయ్య తమ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. భాగయ్య సంతాప సందేశం దానం హన్మంతరావుగారి మరణంతో భాగ్య నగర్‌లోని పాతతరం కార్యకర్తలను కోల్పోయాం. బాల్యం నుండి స్వయంసేవకులైన వీరు సాధారణ కుటుంబంలో జన్మించి కూడా తన సంపూర్ణ జీవితాన్ని…

Read more »