Archive For The “వార్తలు” Category

శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్‌.ఎస్‌.ఎస్‌.

By |

శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్‌.ఎస్‌.ఎస్‌.

ఇటీవల సంభవించిన ‘తిత్లి’ తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్‌లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్‌గేట్‌ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు వాయుగుండం ధాటికి ప్రక్కకు ఒరిగి పోయాయి. ఇక సామాన్యుల గృహాల గురించి చెప్పనవసరం లేదు. 7 గురు మృత్యువాత పడ్డారు. గాలుల ఉధృతికి వేలాది ఎకరాలలో ప్రధాన పంటలైన కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌…

Read more »

కమలదళంలో కన్నడ కస్తూరి

By |

కమలదళంలో కన్నడ కస్తూరి

భారతీయ జనతా పార్టీ, భారతదేశం ఒక ఉత్తమ రాజకీయవేత్తనే కాదు, ఒక మంచి సంఘ సేవకుడిని కోల్పోయాయి. జాతీయ భావాలు కలిగిన, దూరదృష్టి కలిగిన ఒక నాయకుడిని కర్ణాటక కోల్పోయింది. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి హుబ్బళి నారాయణ అనంతకుమార్‌ ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనంతకుమార్‌ (జూలై 22, 1959 – నవంబర్‌ 12, 2018) కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. వారి కుటుంబమే ఆరెస్సెస్‌, జనసంఘ్‌…

Read more »

సాహితీ విరాణ్మూర్తి

By |

సాహితీ విరాణ్మూర్తి

తెలంగాణ సాహితీవేత్తల్లో కపిలవాయి లింగమూర్తి ప్రముఖులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్యంలో తొలి డాక్టరేట్‌ అందుకున్న అరుదైన సాహితీవేత్త. కథ, నవల, నాటకం, కవిత్వం, చరిత్ర, బాల సాహిత్యం, వ్యాఖ్య, సంకలనం, అనువాదం, కావ్య పరిష్కారం… ఒకటేమిటి సమస్త సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆయన రాసిన ఒక్కో రచన ఓ ఆణిముత్యంలా ప్రకాశిస్తూ ఉంటుంది. కపిలవాయి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట తాలూకా జినకుంటలో మార్చి 31, 1928న జన్మించారు. బాల్యం నుంచే గేయాలు, ఛందో…

Read more »

టిప్పు నిప్పు ఆరేదెన్నడు ?

By |

టిప్పు  నిప్పు  ఆరేదెన్నడు ?

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ జయంత్యుత్సవాలు ఈ సంవత్సరం కూడా రసాభాసగానే ముగిశాయి. కార్యక్రమానికి హాజరు కావలసిన ముఖ్యమంత్రి కుమారస్వామి డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కూడా రావాలి. కానీ ఆయన సింగపూర్‌లో ఉండిపోయారు. ఈ వైఖరికి మాజీ సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలను ఆయన అధికారంలో ఉండగా ఆరంభమైనవే. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ 2015లో వీహెచ్‌పీ ఆందోళన జరిపినప్పుడు అల్లర్లు జరిగి మడికేరి అనేచోట డీఎస్‌ కట్టప్ప…

Read more »

మన్నించు మహాశయా!

By |

మన్నించు మహాశయా!

”ఈ పోరాటంలో నేను ఓడిపోయాను. నీవైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 111 రోజుల పాటు నిరశన వ్రతం చేసిన జి.డి. అగర్వాల్‌ గొంతు నుంచి అంతిమ క్షణాలలో వెలువడిన మాటలివి. ఆ ఉద్యమంలో తన సహచరుడు, విద్యార్థి దశలో తన శిష్యుడు ఎస్‌.కె.గుప్తాతో ఎంతటి బాధాతప్త హృదయంతో ఈ మాటలు ఆయన అని ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అంత సుదీర్ఘ నిరశన తరువాత ఆసుపత్రి మంచం మీద…

Read more »

వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ అఖిల భారతీయ సమ్మేళనం

By |

వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ అఖిల భారతీయ సమ్మేళనం

భారతదేశంలోని వనవాసుల (గిరిజనుల) సమగ్ర వికాసం కోసం పనిచేస్తున్న అతి పెద్ద సంస్థ వనవాసీ కళ్యాణ ఆశ్రమం. ప్రతి మూడేళ్ళకోసారి ఈ సంస్థ కార్యకర్తల అఖిల భారతీయ సమ్మేళనం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం అఖిల భారతీయ సమ్మేళనం 2018 సెప్టెంబరు, 30, అక్టోబర్‌ 1,2 తేదీలలో మహరాష్ట్ర రాష్ట్రం శిర్డీలోని శిర్డీ సాయిబాబా సంస్థాన్‌, విశ్వస్త వ్యవస్థ ట్రస్టు ప్రాంగణంలో జరిగింది. శిర్డీ సాయిబాబా మహాసమాధి శతవార్షికోత్సవ సంవత్సరమిది. ఈ సమ్మేళనంలో సుమారు 3 వేల మంది…

Read more »

హిందూత్వం ఎవరినీ ద్వేషించదు

By |

హిందూత్వం ఎవరినీ ద్వేషించదు

ఢిల్లీ మూడురోజుల గోష్టిలో మోహన్‌ భాగవత్‌ సందేశం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) గురించి వాస్తవాలు అందరికీ తెలియవలసిన చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు వింటే కొందరికి ఒక భరోసా. ఆ సంస్థ మనుగడ భారతదేశపు చారిత్రక అవసరమని చాలామంది నిశ్చితాభిప్రాయం. ఇక్కడి జీవన విధానానికి ఆ సంస్థ రక్షా కవచమని ఇంకొందరి గాఢ విశ్వాసం. ఈ అభిప్రాయాలకు వజ్రసదృశ్య మైనవే. నిజం చెప్పాలంటే అత్యధికుల హృదయ నాదం ఇదే. కానీ వీటి…

Read more »

అదీ జాతీయవాదం అంటే !

By |

అదీ జాతీయవాదం అంటే !

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఈ దేశంలో నేను దేశభక్తుడిని కాదు అనేవారు లేరు. కేరళలో వరదలు వచ్చినపుడు లేదా ఉత్తర భారత్‌లో వరదలు వచ్చినపుడు నేను ఒకరోజు జీతం ఇచ్చానంటారు. అంటే మనం దేశభక్తిని ప్రదర్శించు కోడానికి వరదలు రావాలా? ప్రమాదాలు రావాలా? అలా కాదు, మన సాధారణ జీవితంలో దేశభక్తి ప్రతిబింబించాలి. దైనందిన వ్యవహారంలో దేశభక్తి తొణికిసలాడాలి అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌. ప్రముఖ జాతీయవాద రచయిత డా.పి.భాస్కర యోగి భాస్కరవాణి పేరుతో…

Read more »

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

By |

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

ఆర్‌ఎస్‌ఎస్‌ జ్యేష్ఠ కార్యకర్త, కర్నూలు విభాగ్‌ మాజీ సంఘచాలకులు ఎండివై రామమూర్తి (84) సెప్టెంబర్‌ 13న కర్నూలులో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లాలో సంఘ విస్తరణకు ఆయన విశేష కృషి చేశారు. ‘యజ్ఞన్న’ గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు మేడూరి దీక్షితుల యజ్ఞ రామమూర్తి. కర్నూలు-శ్రీశైలం రహదారిలో ఉన్న ఆత్మ కూరులో మే 1, 1934న రామమూర్తి జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. అక్కడే ‘శేతురావు బడి’ అనే…

Read more »

ఇది నిజమైన సేవ

By |

ఇది నిజమైన సేవ

కేరళ వరద బాధితుల సేవలో సేవాభారతి సేవాభారతి 1982 నుండి పనిచేస్తోన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థ. జాతీయ స్థాయిలో ప్రజలలో ఐక్యత, సమన్వయం కోసం పనిచేస్తూ, రాష్ట్రీయ సేవాభారతికి అనుబంధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారు, గిరిజనులు, ఆదివాసుల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నది. సమాజంలోని బీదవారు, నిరక్షరాస్యుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అందించే సహాయాలకు తోడుగా మరిన్ని సహాయక చర్యలు జోడించి వారి ఉన్నతికి పాటు పడుతోంది. సేవాభారతి ప్రజల అభ్యున్నతికి…

Read more »