Archive For The “మహిళ” Category

నేటి సమాజంలో కొంతమంది తల్లిదండ్రుల్ని మనం గమనించినట్లైతే వాళ్లు చిన్నప్పుడు సాధించలేని కళల్ని తమ పిల్లలకు నేర్పించి, వాళ్ళకు శ్రద్ధాసక్తులు కలిగించి, అందులో రాణించేలా చూస్తారు. అలా తయారైన డ్యాన్సర్లూ, సింగర్లు ఎంతోమందిని చూస్తుంటాం. ‘మా అమ్మ ప్రేరణ వల్లే నేను ఈ స్థాయి పొందాను’ అని చాలా మంది చెబుతుంటారు. ‘మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. అప్పట్లో ఆయనకి కుదరక నేర్చు కోలేదట’ అని చెప్తారు చాలామంది గొప్పవాళ్ళు. కాని నేటి తల్లిదండ్రులు…
పూర్తిగా చదవండి
మహిళ.. మానవతా మూర్తి.. మ¬న్నత భావాలు కలగలిసిన వ్యక్తి.. కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన శక్తి.. తల్లిగా, ఇల్లాలిగా, సోదరిగా ఇలా ఆమె సేవలు ఋణం తీర్చుకోలేనివి. అందుకే పురాతన కాలం నుంచి నేటివరకు మన సమాజంలో మహిళలకు ప్రత్యేకస్థానం కల్పించారు. వారిని దేవతలా భావించి పూజిస్తున్నారు. ఇక్కడ పుట్టిన నదీనదాలను, చెట్లను కూడా తల్లిలాగానే గౌరవిస్తున్నాం. మనదేశాన్ని కూడా భారతమాత అని తల్లిలా గౌరవించి భావించి పూజిస్తున్నాం. అలాంటి మహిళాశక్తిని లోకమంతటికీ చాటేలా వారికోసం ఒక రోజునే…
పూర్తిగా చదవండి
కొంతమంది పిల్లల స్కూలు బ్యాగ్ తెరచి, నోట్‌బుక్స్ చూస్తే ఫ్రెష్‌గా, నీట్‌గా కనిపిస్తాయి. వాళ్ల శ్రద్ధ దాంట్లో తెలుస్తుంది. టెక్స్ట్ పుస్తకాలు వార్షిక పరీక్షలు పూర్తయినా కొత్త పుస్తకాల్లా ఉంటాయి. చాలా మందివి మూలాలు నలిగో, అట్టలు చిరిగో కనిపిస్తాయి. ఇంకా కొంతమంది వాళ్ల పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు, ఇంటూలు, ప్లస్‌లు, ముఖాల బొమ్మలు, బొమ్మలకు పెన్నుతో పెట్టిన మీసాలు మొదలైన వాటితో గలీజు గలీజుగా తయారు చేసుకుంటారు. ఒక్కోసారి సంవత్సరం మధ్యలో తల్లిదండ్రులు మళ్లీ కొత్త…
పూర్తిగా చదవండి
‘మా అబ్బాయికి అసలు తిండి మీద ధ్యాసే లేదు వాడికిష్టమైన వేపుడో, పోపన్నమో చేసి, బలవంతంగా ముద్దలు చేసి పెడితే సరిగ్గా ఇంత తింటాడు’ అని నిమ్మకాయ సైజు హస్తముద్ర పెడుతుంది తల్లి. ‘అదే మా ఆడపడుచు పిల్ల అయితే సుబ్బరంగా ఇంత తిని, మళ్ళీ గంటకే ఆకలంటుంది’ అంటూ వాపోతారు తల్లులు. పిల్లలు తినట్లేదు, తినట్లేదు అనడమే తప్ప, వారు ఎందుకు తినట్లేదో ఆలోచించ లేకపోతున్నారు ఈ తల్లులు. గడచిన తరం పిల్లలకి కథలు చెబుతూ…
పూర్తిగా చదవండి
కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు తెలుగునాట ప్రసిద్ధుడు. ఆయనకు రుద్రాంబ, గణపాంబ అని ఇద్దరు కుమార్తెలు. రుద్రాంబ రుద్రమదేవిగా సుపరిచితురాలు. గణపతి దేవుడు పెద్ద కూతురైన రుద్రమదేవిని తన వారసు రాలుగా గుర్తించాడు. ఆమెకు విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా, రాజ్య పాలనకు సంబంధించిన అన్ని అంశాల్లోను శిక్షణ ఇప్పించాడు. తండ్రి మరణించడంతో క్రీ.శ.1262లో రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించింది. రాజ్యం లోని దక్షిణ ప్రాంతంలోని కొందరు రుద్రమదేవిపై తిరుగుబాటు చేశారు. అయితే ఆ తిరుగుబాటు దారులను…
పూర్తిగా చదవండి
ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లి, ముగ్గులు వేసిన వారి ఇంట సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి నిరంతర నివాసాన్ని ఏర్పరచుకుని, ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహిస్తుందని శాస్త్రవచనం. ధనుర్మాసం మొదలైతే చాలు ఇంటి ముంగిళ్ళన్నీ రంగు రంగుల ముగ్గులతో కనువిందు చేస్తుంటాయి. ముత్యాల ముగ్గులను తలచుకోగానే ‘ధనుర్మాసం’ గుర్తుకొస్తుంది. సూర్య భగవానుడు సంవత్సరంలో ఆరు నెలల పాటు దక్షిణాభిముఖంగా, మరో ఆరునెలల పాటు ఉత్తరాభిముఖంగా సంచరిస్తుంటాడు. సూర్య భగవానుడు…
పూర్తిగా చదవండి
సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అరిసెలు, సకినాలు, రంగురంగుల ముగ్గులే. అరిసెలు, సకినాలతో సమానమైన ప్రాధాన్యత సంతరించుకున్న ముగ్గులకూ, మనకు ఉన్న అవినాభావ సంబంధం చాలా గొప్పది. సంక్రాంతి వస్తుందనగానే మహిళలు ముగ్గు పిండి, రంగులతో సిద్ధమైపోతారు. తమ వీధి మొత్తంలోకి చక్కటి ముగ్గులు వేసి అభినందనలు అందుకోవాలని ముచ్చటపడుతుంటారు. పెద్దల దగ్గర నేర్చుకున్న మెలికల ముగ్గులు మొదలుకొని తాజాగా అంతర్జాలం నుంచి అవపోసన పట్టిన చుక్కల ముగ్గుల వరకు ఏ ఒక్కటీ వదలకుండా ఎప్పుడెప్పుడు…
పూర్తిగా చదవండి
– ఈ ఖాతాను ఎలా తెరవాలి? – లాభాలేమిటి? భార్య గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు. నేటి సమాజంలో చాలా మంది భర్తలు భార్యలకు అబార్షన్లు చేయిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటనలు మనదేశంలో పెరుగుతూనే వస్తున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో పురుషులు – స్త్రీల నిష్పత్తి 1000:914 గా ఉంది. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి…
పూర్తిగా చదవండి
విదేశాల్లో వేలాది రూపాయల జీతాల ఉద్యోగాలు, ధనవంతులైన షేక్‌లతో పెళ్ళిళ్ళ పేరుతో నిరుపేద కుటుంబాలకు చెందిన అమాయక మహిళలు, యువతులను అక్రమంగా రవాణా చేస్తున్న నేరాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉభయ గోదావరి జిల్లాలు, కడప, అనంతపురం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో కూడా ఇటువంటి నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ మంది సంతానం, సరైన ఉపాధి లేని, దుర్భర జీవితాన్ని గడుపుతున్న కుటుంబాలు ఇటువంటి మోసాల…
పూర్తిగా చదవండి
లావుగా ఉండే వాళ్లు సన్నబడాలని కోరు కుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అయితే ఏ మహిళైనా తనంతట తానే బరువు పెరగాలని కోరుకుంటుందా ? అవును ! లేకపోతే అక్కడ బలవంతంగానైనా సరే బరువు పెంచేస్తారు. గత వందల ఏళ్లుగా ఆ దేశంలో జరుగుతున్న మూఢాచారం అది. ఆ దేశం పేరు మారేటేనియా. అక్కడి స్త్రీల పరిస్థితి మీకు తెలియాల్సిందే. ప్రపంచంలోని మగువలందరూ సన్నబడడానికి కసరత్తులు చేస్తుంటే వాళ్లు మాత్రం బరువు…
పూర్తిగా చదవండి