Archive For The “బాల్యం” Category

పులి-మేకపిల్ల

By |

పులి-మేకపిల్ల

ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్లాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్లిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని…

Read more »

యువత ఆత్మహత్యలకు కారణం ఎవరు?

By |

యువత ఆత్మహత్యలకు కారణం ఎవరు?

టివి ఛానెళ్ళు తమ రేటింగ్‌లు పెంచుకుందుకు చూపిస్తున్నారో లేక నిజంగానే ఎక్కువయ్యాయో తెలియదు కానీ యువతలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా కనిపిస్తున్నది. ఆత్మహత్యల కారణాలను విశ్లేషిస్తే ముఖ్యంగా కన్పించేవి రెండు. అపజయం లేదా ఫెయిల్యూర్‌ని తట్టుకోలేకపోవడం ఒకటయితే, అనుకున్న కోరిక తీరకపోవడం రెండవది. అవమానాన్ని తట్టుకోలేక మరణించిన వారూ ఉన్నారు. ఇరవై, ముఫ్పై ఏళ్ళనాడు యువతీ యువకులు అపజయాన్ని, అసంతృప్తినీ, అవమానాన్నీ ఎదుర్కోలేదా? అవి ఎదురైనా వారు తట్టుకోలేదా? ఒక కుటుంబంలో కూతురికి మెరిట్‌ మీద ఇంజనీరింగ్‌లో…

Read more »

తన దాకా వస్తే కానీ

By |

తన దాకా వస్తే కానీ

అది ఆరో తరగతి. హరి ఆ క్లాసులో మహా దుడుకు, అల్లరివాడు. క్లాసులో పక్కనున్న పిల్లల్ని ఏడ్పించటం వాడి హాబీ. తను సరిగా పాఠం వినడు, పక్కన వారిని విననీయడు. ఒక టీచరు క్లాసు పూర్తి కాగానే, వేరొక టీచరు వచ్చే లోపల పక్క వారిని గిల్లటమో, వాడి పుస్తకం లాక్కోవటమో చేస్తాడు. క్లాసు లీడరు మాట వినడు. ఎన్నిసార్లు టీచర్లు హెచ్చరించినా, క్లాసులోంచి బయటకు పంపినా వాడి ధోరణి మారటం లేదు. గుండు సూదితో గుచ్చేవాడు….

Read more »

న్యాయ గంట

By |

న్యాయ గంట

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు న్నారు. ఆయన దయామయుడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకొనేవాడు. అయితే ఆయన మంచితనం అలుసుగా తీసుకొని అంతఃపురంలో పనిచేసే కొంతమంది లంచాలకు మరిగారు. రాజుగారి వద్దకు బాధ వెళ్ళబోసుకొనేందుకు వచ్చే వారు డబ్బిస్తేనే దర్శనానికి పంపేవారు. వారు అలా చేయడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడేవారు. కొన్ని రోజుల తరువాత తమ పరివారం ప్రజలను తన దగ్గరకు పంపించడానికి ధనం గుంజుతున్నారని రాజు తెలుసుకున్నాడు. తనను కలవడానికి వచ్చినవారి…

Read more »

ఆఫీసే కేర్‌సెంటర్‌

By |

ఆఫీసే కేర్‌సెంటర్‌

నేడు చాలామంది స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆర్జనకు ప్రయత్నిస్తు న్నారు. అందుకు ముఖ్యకారణం కుటుంబ ఆర్థిక స్థితిలో ఏర్పడే లోటు. ధరలు అధికమైన ఈ రోజుల్లో, కుటుంబ యజమాని సంపాదన కుటుంబ పోషణ, పిల్లల విద్యాబోధన, ఇంటి అద్దె, కనీస సౌకర్యాలు సమకూర్చు కోవటానికి సరిపోవటం లేదు. అందువల్ల అర్హతలను బట్టి స్త్రీలు కూడా ఉద్యోగానికి వెళ్ళి, తమ ఆర్జనతో కుటుం బంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉద్యోగినులు…

Read more »

గురువు గారి చాతుర్యం

By |

గురువు గారి చాతుర్యం

ఒక గురువుగారుండేవారు. ఆయన తన శిష్యులకు చిన్నతనం నుండే జీవితాన్ని గురించి తెలియజేయాలనుకున్నారు. ఆ విషయాలను సూటిగా చెప్పక, పంచతంత్ర కథల ద్వారా రాజకుమారులకు విద్యనేర్పిన విష్ణుశర్మ మార్గాన్నే గురువుగారు ఎంచుకున్నారు. గురువుగారు శిష్యులకు కథ చెప్పడం మొదలు పెట్టారు. ‘మీరు ఒక అడవికి వెళ్తున్నారు. అప్పుడు మీ తల్లిదండ్రులను తోడు తీసుకెళ్తారా? లేక మీ స్నేహితులను తీసుకెళ్తారా? లేక ఒంటరిగా వెళ్తారా?’ అని గురువుగారు శిష్యులను అడిగారు. ఒక శిష్యుడు మాత్రం ఒంటరిగా వెళ్తానన్నాడు. మిగిలిన…

Read more »

పిల్లల్లో అవగాహన పెంచాలి

By |

పిల్లల్లో అవగాహన పెంచాలి

పిల్లలను తల్లిదండ్రులు పెంచే విధానంపైనే వారి వ్యక్తిత్వం, నడవడి ఆధారపడి ఉంటుంది. పిల్లలందరి లోనూ సృజనాత్మకత ఉంటుంది. ఎవరికయినా బాల్యమే పునాది. బాల్యంలో వారు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో వారు రాణించేలా చేస్తాయి. పిల్లలలో దాగున్న సృజనాత్మకతను పెద్దలు గుర్తించి, వాటిని వెలికితీయాలి. సృజనాత్మక కళలను నేర్పించడంతోపాటు,  సామాజిక అంశాలను కూడా బోధిస్తూ, మానవీయ విలువలను నేర్పించాలి. ర్యాంక్‌లు, గ్రేడ్‌లు అంటూ వేధిస్తూ, ఆటలకు పంపితే హోంవర్క్‌ చేయరని, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందన్న అపోహతో ఆటలకు…

Read more »

నానమ్మ చెప్పిన కథ

By |

నానమ్మ చెప్పిన కథ

ప్రదీప్‌ స్కూల్‌కు వెళ్ళనని పేచీ పెట్టసాగాడు. ఆ విషయాన్ని గమనించిన అతని నానమ్మ మనవడిని స్కూల్లో దిగపెట్టడానికి సిద్ధపడింది. అయినా, ప్రదీప్‌ పేచీ తగ్గలేదు. అప్పుడు నాన్నమ్మ ప్రదీప్‌తో ఇలా చెప్పింది. ‘నేను స్కూల్‌కు ఎలా వెళ్ళేదాన్నో చెప్తే, నువ్విలా స్కూలుకు వెళ్ళనని అస్సలు పేచీ పెట్టవు’. ‘నువ్వూ చిన్నప్పుడు నా లాగే స్కూలుకు వెళ్ళేదానివా నానమ్మా’ అని అడిగాడు ప్రదీప్‌. ‘అందులో ఆశ్చర్యమేముంది రానాన్నా? చిన్నప్పుడు ప్రతివాళ్ళు బడికి వెళ్ళాల్సిందేగా… ఈ స్కూలు లాగా మా…

Read more »

చిన్నారులను పాఠశాలలో చేర్పిస్తున్నారా…?

By |

చిన్నారులను పాఠశాలలో చేర్పిస్తున్నారా…?

నేటి రోజుల్లో తల్లిదండ్రులు రెండు, మూడు సంవత్సరాల వయసు నుంచే తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నారు. చిన్న పిల్లలను పసి వయస్సు నుంచే పాఠశాలకు పంపిస్తే వారు బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతారు. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రు లిద్దరూ ఉద్యోగులైన సందర్భంలో పిల్లలను చిన్న వయసులోనే పాఠశాలకు పంపడం తప్పదు. కాబట్టి పిల్లలను పాఠశాలకు పంపే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు, తల్లిదండ్రులకు భయం ఉండదు. పిల్లలు ఉత్సాహంగా స్కూలుకు వెళ్ళటానికి సిద్ధమవుతారు….

Read more »

పుస్తక పఠనం అలవరచండిలా..

By |

పుస్తక పఠనం అలవరచండిలా..

నేడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్‌లు, టీవీల వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటే లేకుండా పోతోంది. టీవిలు, కంప్యూటర్లు, అంతర్జాలం వల్ల విషయాలు తెలుస్తాయేమోగానీ జ్ఞానం పెరగదు. అందుకు పుస్తకాలు చదవడం ఒక్కటే మార్గం. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది. పుస్తక పఠనం అన్నది మంచి అలవాటు. ఈ రోజుల్లో బాల సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పిల్లల కోసం విజ్ఞానపరమయిన, వినోద ప్రదమయిన ఎన్నెన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. పిల్లల…

Read more »