Archive For The “ముఖపత్ర కధనం” Category

‘బాగ్‌’ మారణ హోమానికి మరోసారి ‘విచారం’ క్షమాపణలకు ఇంగ్లండ్‌ ససేమిరా!

By |

‘బాగ్‌’ మారణ హోమానికి మరోసారి ‘విచారం’  క్షమాపణలకు ఇంగ్లండ్‌ ససేమిరా!

”జలియన్‌వాలా బాగ్‌ దురా’గతం’ గురించి మరోసారి విచారం వ్యక్తం చేయగలం! క్షమాపణ చెప్పలేం!” ఆ ఘోర దురంతం జరిగిన వందేళ్ల తరువాత, ఇంగ్లండ్‌ పార్లమెంట్‌ నుంచి ఆ దేశ ప్రధాని థెరిసా మే వినిపించిన సందేశం ఇదే. కారణం- ఇలాంటి క్షమాపణలతో కొన్ని ఆర్థికాంశాలు ముడిపడి ఉంటాయట. వీటికి క్షమాపణలు చెబితే పరిహారాలు చెల్లించేందుకు సిద్ధపడాలి. కాబట్టి మేం విచారం వ్యక్తం చేయడంతో సరిపెడతాం, మీరు దానితో సంతృప్తి పడండి అని హితవు చెప్పారు థెరిసా మే….

Read more »

ధార్మికత + ధనార్జన = భారతీయ ఆర్థికవ్యవస్థ

By |

ధార్మికత + ధనార్జన = భారతీయ ఆర్థికవ్యవస్థ

‘ధనం మూలం ఇదం జగత్‌…’ ఈ జగతి జీవనాధారానికి మూలం ధనమే అంటుంది మన ఈ ప్రాచీన శ్లోకపాదం. భారతీయత లేదా హిందూ జీవన విధానంలో పారమార్థిక చింతనే ప్రధానం అనుకోవడం ఒక అపోహ. భౌతిక ప్రపంచంలోని అన్ని కోణాలను అది ప్రభావితం చేసింది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, రాజనీతి, సైనిక వ్యవహారాలు, సాహిత్య సిద్ధాంతాలు, విమర్శ, రంగస్థలం, ఖనిజశాస్త్రం, సముద్ర రవాణా వంటి వాటి మీద భారతీయత ముద్ర సుస్పష్టం. గణితం, దానితో పాటు ఆర్థిక విషయాలు…

Read more »

ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

By |

ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

ప్రపంచం ఇప్పుడు అంతరిక్షమే హద్దుగా ఎదుగుతోంది. యుద్దమంటూ వస్తే సైనిక, నౌక, వైమానిక శక్తులైన త్రివిధ దళాలతో పాటు అంతరిక్షంలో కూడా ఇవాళ సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 21వ శతాబ్దపు తొలినాళ్లలో.. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చే శక్తి కేవలం మూడు దేశాలకే పరిమితం. తాజాగా భారత్‌ నిర్వహించినఉపగ్రహ విధ్వంసక ప్రయోగంతో ఆ సామర్థ్యం కూడా సాధించు కున్నట్టయింది. మొన్న జరిగిన ఏ-శాట్‌ మిసైల్‌ ప్రయోగంతో భారత్‌ ప్రపంచంలో ఈ తరహా శక్తి కలిగిన నాలుగవ…

Read more »

చిత్తశుద్ధితో అభివృద్ధి

By |

చిత్తశుద్ధితో అభివృద్ధి

దేశాభివృద్ధికి పాటుపడేది భాజపా ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాలే అనే అభిప్రాయం భారతీయులలో లోతుగా పాతుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రస్తుత కాపలాదారు (చౌకీదార్‌) మోదీ ప్రభుత్వం కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో విజయమే సాధించిందనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దానికి నిదర్శనం 2018లో 7.4 శాతం ఉన్న వృద్ధి రేటు 2019 లో 7.8 కి పెరగనుండటమే. ఇది సాక్షాత్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిన వాస్తవం. భారత ఆర్థిక వృద్ధి…

Read more »

‘భారతీయ’ ఓటు

By |

‘భారతీయ’ ఓటు

భారత రాజకీయాలు కనీవినీ ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరకు చేరాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల సమయానికే దేశ రాజకీయ దృశ్యంలో ఒక విభజన రేఖ స్పష్టంగా అవతరించింది. ‘హిందూత్వ’ రాజకీయాలు ఒక వైపు. హిందూయేతర రాజకీయాలు మరొకవైపు. ‘హిందూత్వ రాజకీయాలు’ అన్న పేరును నిజానికి హిందూత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరు పెట్టినది హిందూయేతర రాజకీయ శిబిరమే. పైగా హిందూత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న దాడి, విమర్శ ఇంత…

Read more »

జాతీయవాదం, జవాబుదారీతనం

By |

జాతీయవాదం, జవాబుదారీతనం

ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఒక భ్రమ, ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మాత్రమే పనికి వస్తుందని తెలిసిన తరువాత భారతీయత, జాతీయత అనే మెజారిటీ ప్రజల ఆకాంక్షల మీద దృష్టి పెట్టక తప్పదు. ఈ క్రమంలోనే ఒక రాజకీయ శక్తిగా భారతీయత ఎదిగిన క్రమాన్ని గమనించడం అవసరం. అదే సమయంలో ఆ ఆలోచనా ధోరణితో, చింతనతో దేశ రాజకీయాలలో పనిచేసిన ఆయా సంస్థల నేతల నేపథ్యం కూడా తెలుసుకోవాలి. ఏ దేశమైనా భవిష్యత్తును తీర్చి దిద్దుకొనే క్రమంలో…

Read more »

ముక్తకంఠంతో పలుకుదాం – ‘జైహింద్‌’

By |

ముక్తకంఠంతో పలుకుదాం – ‘జైహింద్‌’

జైహింద్‌! ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట మీద ప్రసంగం తరువాత ఆ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. అంటే గడచిన డెబ్బయ్‌ సంవత్సరాలుగా ఈ నినాదం ఎర్రకోట నుంచి జాతికి చేరుతోంది. నేటికీ దేశంలోని బాలబాలికలు జెండా వందనం చేసి ఏదో ఒక క్షణంలో ఆ నినాదం నోరారా పలుకుతున్నారు….

Read more »

ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిహేను రోజులు

By |

ప్రపంచాన్ని కుదిపేసిన  ఆ పదిహేను రోజులు

సరిగ్గా ఒక పక్షం…. పదిహేనురోజులే. అవే నేటి ప్రపంచాన్ని కుదిపాయి. స్వతంత్ర భారతాన్ని తొలిసారి గుండె నిండుగా సంతోషపెట్టాయి. రేపటి మన చరిత్రలోనూ శాశ్వతంగా వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్‌కీ, ఈ పదిహేను రోజుల తరువాతి భారత్‌కీ నడుమ ఎంతో వ్యత్యాసం. ఇంతకాలంగా దాయాది దేశం పాకిస్తాన్‌తో అనుసరిస్తున్న సహనశీల వైఖరిని అనివార్య పరిస్థితులలో నిర్మొహమాటంగా సడలించింది భారత్‌. కశ్మీరీల హక్కులకు మద్దతు పేరుతో మత ఛాందస వాదాన్ని ఎగదోస్తే సహించబోమనీ, కశ్మీరీల స్వతంత్ర…

Read more »

బెడిసికొట్టిన బెదిరింపు

By |

బెడిసికొట్టిన బెదిరింపు

ఈసారి పాకిస్తాన్‌ పెద్ద తప్పిదానికే పాల్పడింది. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో నలభయ్‌ మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు బలిగొని కనీవినీ ఎరుగని రీతిలో విమర్శల పాలైంది. మా సహనానికీ హద్దుంటుందని భారత్‌ సరిహద్దులలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది. దీనితో కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న భారత్‌ విదేశాంగ విధానం కొత్త పంథాలోకి మారిపోయింది. పుల్వామా దాడి, తదనంతరం భారత్‌ ప్రతీకార దాడి, దరిమిలా ప్రపంచ దేశాల వైఖరి పాకిస్తాన్‌ను…

Read more »

మహిళాశక్తికి జేజేలు

By |

మహిళాశక్తికి జేజేలు

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది’ అన్నారు గురజాడ. రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో, వాణిజ్యరంగంలో, సాహిత్య విద్యారంగాలలో, కళలో మహిళ కూడా తన స్థానం తను పొందగలిగితే ఈ చరిత్ర కొత్త మలుపు తిరుగడం ఇక ఒక లాంఛనమే మరి! భారత దేశంలోనే కాదు, ప్రపంచ జనాభాలోను మహిళల సంఖ్య దాదాపు పురుషులతో సమం. వారి సామర్థ్యం కూడా పురుషులతో సమానమేనని విశ్వం మొత్తం అంగీకరిస్తున్నది. కానీ చాలా ఆదర్శాలు…

Read more »