Archive For The “ప్రత్యేక వ్యాసం” Category

అన్నయ్య ప్రధాని అయినా మా టీకొట్టు అలాగే ఉంది !

By |

అన్నయ్య ప్రధాని అయినా మా టీకొట్టు అలాగే ఉంది !

మన ప్రధాని నరేంద్రమోదీ గురించిన చిన్ననాటి వివరాలను తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికుండదు..! ఆ అవకాశం రావాలే గాని ఆ విశేషాలను ప్రత్యేక శ్రద్ధతో వినరూ..! ఆ అవకాశం జాగృతి పాఠకులకు కలిగించడానికే అన్నట్లుగా ప్రధాని సోదరుడు (తమ్ముడు) ప్రహ్లాద్‌ భాగ్యనగరం విచ్చేశారు. మన ప్రధాని చిన్ననాటి విశేషాలు కొన్నిటిని మనకందించారు. చదవండి.. భారత ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ గత నెలలో భాగ్యనగర్‌ బండ్లగూడలోని శ్రీశారదాధామానికి వచ్చారు. నరేంద్ర మోదీకి సోదరుడే అయినా రాజకీయాలతో ప్రహ్లాద్‌…

Read more »

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

By |

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

13 డిసెంబర్‌ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి రోజున ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ జరుపు కుంటారు. దీనినే ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. తారకా సురుని సంహరించడానికి శివపార్వతులకు పుట్టిన అవతారమే సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు బ్రహ్మ ద్వారా వరం పొంది గర్వంతో ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేసి, దేవతలపై దండెత్తుతాడు. కొంతకాలం తర్వాత హిమవంతునికి సతీదేవి (పార్వతి) జన్మిస్తుంది. శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. ఆ నూతన దంపతుల…

Read more »

26/11 గాయానికి పదేళ్లు

By |

26/11 గాయానికి పదేళ్లు

నిత్యం ఉరుకులు పరుగులు తీసే ముంబైపై ఆ పూట ఒక్కసారి పెను ఉత్పాతమే విరుచుకుపడింది. 2008 నవంబర్‌ 26 తేదీ రాత్రి 8 గంటల సమయంలో సముద్ర మార్గంలో ఓ చేపల వేట బోటు ద్వారా 10 మంది సాయుధులు ప్రవేశించారు. వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టారు. వచ్చిన వారు ఉగ్రవాదులేనని స్పష్టమైపోయింది. వెంటనే పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. 26 నవంబర్‌, 2008. భారతదేశ చరిత్రలో మరో మాయని గాయంగా మిగిలిపోయిన తేదీ. దేశ…

Read more »

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

By |

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

ఇది భావురావ్‌ దేవరస్‌ శతజయంతి సంవత్సరం ఒకే కుటుంబం నుంచి వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా దేశానికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. సంఘ్‌ కుటుంబం అని పిలిపించుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ తుదిశ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనే గడిపిన అపూర్వ స¬దరులు బాలాసాహెబ్‌ దేవరస్‌, భావురావ్‌ దేవరస్‌. ‘బాల్‌-భావ్‌’ పేరుతో అందరికీ పరిచయమే. ఇందులో అన్నగారు సరసంఘ్‌చాలక్‌ అయ్యారు. కానీ భావురావ్‌ కృషి పూలమాల మధ్య అంతస్సూత్రం వంటిది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను ఏర్పరిచినప్పుడు అందులో…

Read more »

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

By |

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

‘నీవు నన్ను అనంతంగా సృష్టించావు….’ గురుదేవ్‌, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘గీతాంజలి’ మొదటి గీతంలో, మొదటి వాక్యమది. కవి సమస్త మానవాళికి ప్రతినిధిగా నిలబడి చేసిన ప్రకటన. మానవ జన్మలను నీవు అనంతంగా సృష్టిస్తూనే ఉంటావని ‘ప్రభు’ను కవి స్తుతిస్తున్నాడు. గీతాంజలిలో ప్రతి గీతం తనదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నట్టే అనిపిస్తుంది. మళ్లీ వరసగా చదువు తుంటే ఒక భావధారలో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటికి ఒక అంతస్సూత్రం కూడా ఉంది. అది- తల్లి గర్భం…

Read more »

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

By |

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

‘యుద్ధాలలో, సాయుధ సంఘర్షణలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఆ ఇరువురు చేసిన మహోన్నత కృషికి’ ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించినట్టు స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. ఆ ఇరువురు- కాంగో వైద్యుడు డాక్టర్‌ డెన్నిస్‌ ముక్విగ్‌, ఇరాక్‌లోని యాజిది మైనారిటీ మతానికి చెందిన యువతి నదియా మురాద్‌. నదియా వయసు కేవలం 25 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే ఇంతటి పురస్కారానికి ఎంపికైన నదియా గుండె నిజానికి ఒక అగ్ని పర్వతమే….

Read more »

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

By |

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

తెలంగాణలో బతుకమ్మ పండగకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూల పర్వమిది. ప్రపంచ చరిత్రలో విభిన్నమైన పూలను కొలిచే ఆచారం బతుకమ్మ పండగలోనే ఉండటం విశేషం. ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పిం చడం బతుకమ్మ వైశిష్ట్యానికి నిదర్శనం. సిరులొలికించే ప్రకృతి పండగ బతుకమ్మను మహిళలు అత్యంత భక్తి పారవశ్యంతో జరుపు కోవడం ఆనవాయితీ. ఎంగిలిపువ్వు బతుకమ్మ.. మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా ప్రతిరోజుకి…

Read more »

సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

By |

సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

విజయదశమి ప్రత్యేక వ్యాసం విజయ దశమి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపనా దినోత్సవం. ఆ సందర్భంగా సంఘ రెండవ సరసంఘచాలకులు మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ) స్వావలంబన, స్వయంసమృద్ధి గురించి చెప్పిన అంశాలను క్లుప్తంగా పాఠకులకు అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. (గురూజీ ప్రసంగ పాఠం ఉన్నదున్నట్టుగా) ఏ విధంగా చూచినా, ప్రస్తుత పరిస్థితి మనకొక సవాలు. సదవకాశం కూడా. జాతీయజీవనంలోని అన్ని రంగాల్లోనూ, స్వయంసమృద్ధిని సాధించు కోవటమే మనం ఎదుర్కోవలసిన ముఖ్యమైన సవాలు. స్వావలంబనమే స్వాతంత్య్రానికి…

Read more »

ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

By |

ఏడుకొండల వాడా.. వేంకట రమణా..

తిరుమల నవరాతి బహ్మోమత్సవాల సందర్భంగా… తిరుమల. నిత్యకల్యాణం పచ్చతోరణం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో కొండమీద వెలసిన దివ్యక్షేత్రం. హిందుస్థానం (భారతదేశం) లోని 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో మొదటిది. ప్రపంచంలోనే ప్రసిద్ధ దేవాలయంగా, పుష్పమండపంగా స్వయంవ్యక్త క్షేత్రంగా పేరుగాంచి, ఏడుకొండలైన అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిలపై వెలసిన కలియుగ మహా పుణ్యక్షేత్రం. భగవాన్‌ శ్రీ మహావిష్ణువుకు పాన్పు అయిన ఆదిశేషుడు చుట్టచుట్టుకొని తిరుపతిలో…

Read more »

కవన కుతూహల భీమన్న

By |

కవన కుతూహల భీమన్న

‘గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులార! నడవ నేర్చినతోనె బుడతను గొంపోయి పాలేరు దనముంచు మాలలార! పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించి మనుగడలే మాపు జనకులార! వంటయిల్లే ప్రపంచమ్ముగా చేసి తనయల మెడకోయు తల్లులార! జాతి శక్తివిహీనమై చచ్చుచుండ కనులను మూసికొంటిరే గాఢనిద్ర శక్తికంతకు మూలము చదువుకాన చదువ బంపుడు మీ తనూజాళినింక’ మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. పైన చెప్పుకున్న పద్యం ఆయనదే….

Read more »