Archive For The “అవీ ఇవీ” Category

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

By |

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

‘యుద్ధాలలో, సాయుధ సంఘర్షణలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఆ ఇరువురు చేసిన మహోన్నత కృషికి’ ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించినట్టు స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. ఆ ఇరువురు- కాంగో వైద్యుడు డాక్టర్‌ డెన్నిస్‌ ముక్విగ్‌, ఇరాక్‌లోని యాజిది మైనారిటీ మతానికి చెందిన యువతి నదియా మురాద్‌. నదియా వయసు కేవలం 25 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే ఇంతటి పురస్కారానికి ఎంపికైన నదియా గుండె నిజానికి ఒక అగ్ని పర్వతమే….

Read more »

నాటి భారతంలో నేటి ర్యాగింగ్‌

By |

నాటి భారతంలో నేటి ర్యాగింగ్‌

మహాభారతం రచిస్తూ దాని పరిధి గురించి వ్యాసుడొక మాటన్నాడు. ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర; యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌|| అంటే – ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ఈ భారతంలో ప్రస్తావించని విషయం లేదు. ఇందులో లేని విషయాలు లోకంలో కూడా లేనట్లే – అని అర్థం. మానవ జీవితంలో ఏ విషయమైనా ధర్మానికో, అర్థానికో, కామానికో, మోక్షానికో సంబం ధించినదై ఉంటుంది. అందువల్ల మహాభారతంలో మానవ జీవితాలకు సంబంధించి ప్రతి విషయం ప్రత్యక్షంగానో…

Read more »

సమర్థునికి సరైన సంస్థ

By |

సమర్థునికి సరైన సంస్థ

సమర్థుడైన వ్యక్తికి సరైన సంస్థలో ఉద్యోగం దొరకకపోతే అతని ప్రతిభ రాణించదు. ఉన్నతమైన సంస్థలో సమర్థులైన ఉద్యోగులు లేకపోతే ఆ సంస్థ కూడా వృద్ధిలోకి రాదు. ఈ విషయంలో సంస్థలు, ఉద్యోగులు కూడా భారతంలోని ఒక పద్యం తెలుసుకొని తీరవలసిందే. ధృతరాష్ట్రుండును పుత్రులున్‌ వనము కుంతీ నందనుల్‌ సింహముల్‌ మతి నూహింప నసింహమైన వనమున్‌ మర్దింతు రెందున్‌ వనా వృత వృత్తంబులు కాని సింహములకున్‌ వేగంబ చేటొందు గా న తగంబొందుట కార్యమీయిరువురున్‌ సంతుష్టియై యున్కికిన్‌ శ్రీకృష్ణుడు…

Read more »

నమస్కారం

By |

నమస్కారం

‘నమస్కారం చేయడానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి’ అని నా చిన్నతనంలో మా తెలుగు టీచరు గారు అన్నారు. అయితే అప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. మా మాస్టరు గారు క్లాసులోనికి రాగానే మేమందరం లేచి ‘నమస్కారం సార్‌!’ అని చెప్పి కూర్చునేవారం. కొందరు కొంటె పిల్లలు లేస్తున్నట్లు నటించేవారే కాని అసలు లేచేవారు కాదు. సమస్కారం పెట్టడం అయిపోగానే నేలమీద చతికిలపడి కూర్చునేవారం. ఆ రోజుల్లో డెస్కులు, బెంచీలు లేవు. ఒకరోజు మేం అలా నమస్కారం…

Read more »

యజమానితో ఎలా ఉండాలి?

By |

యజమానితో ఎలా ఉండాలి?

రాజగృహంబు కంటే నభిరామముగా నిలుకట్టకూడదే యోజ నృపాలు డాకృతికి నొప్పగు వేసము లాచరించు నే యోజ విహారముల్‌ సలుప నుల్లమునన్‌ గడు వేడ్క సేయు నే యోజ విదగ్ధుడై పలుకు నొడ్డులకున్‌ దగదట్లు సేయగన్‌ రాజు గారి భవనం కంటే రాజోద్యోగి ఇల్లు అందంగా ఉండకూడదు. రాజు గారితో సమానంగా దర్పం ప్రదర్శించేలా ఉద్యోగి వస్త్రధారణ చెయ్యకూడదు. రాజు గారు విహరించే ప్రదేశాల్లో తానూ విహరించాలని ఉబలాట పడకూడదు. రాజు మాటల్లో కనబడే లౌక్యం, తెలివి తేటలు…

Read more »

ఏ సంస్థలో ఉద్యోగం ?

By |

ఏ సంస్థలో ఉద్యోగం ?

నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు, నా నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభీన్‌ ; పౌరుష వృత్తులి ట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్‌ కాలిన పెనం మీద పడిన నీటిబొట్టు వెంటనే ఆవిరైపోతుంది. అదే నీటిబొట్టు తామరాకు మీద పడితే కొంతకాలం ముత్యంలా ప్రకాశిస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలో పడితే నిజంగానే ముత్యంగా మారుతుంది. అలాగే అధముని సేవలో ఉన్నవాడు ఆవిరైపోతాడు….

Read more »

అయిదింటితో అఖండ విజయం

By |

అయిదింటితో అఖండ విజయం

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః వకారంతో మొదలయ్యే అయిదు లక్షణాలు సంపాదించుకోగలిగితే ఆ మనిషిని అందరూ గౌరవిస్తారు. అవి వస్త్రధారణ, హావభావాలు (వపుస్సు), వాక్కు, విద్య, వినయం అనేవి. మన వృత్తిని బట్టి మన వస్త్రధారణ ఉండాలి. విద్యార్థికో వేషం, విద్యార్థినులకో వేషం, ఉపాధ్యాయులకి కాస్త గౌరవప్రదమైన వేషం, పండితులకో వేషం, రైతులకో వేషం, గృహిణులకో వేషం అందరికీ ఎవరి వేషాలు వారికున్నాయి. వెర్రివేషాలు వెయ్యకుండా ఉంటే…

Read more »

ఆయనే కారణం..!

By |

కొక్కొరో.. క్కో.. ‘నీవు ప్రమాదంలో పడ్డప్పుడల్లా దేశం ప్రమాదంలో ఉంది’ అని ప్రచారం చెయ్‌. అపుడే ప్రజలు నిన్ను అనుసరిస్తారు అని నాజీ నియంత హిట్లర్‌ అనేవాడు. ఈ మాటలు అతని జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఈ డెబ్భై ఏళ్ళ నుండి ఒక మతానికి వత్తాసు పలుకుతూ సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడిన గుంట నక్కలకు మోదీ అనే పక్కా జాతీయవాది కంట్లో నలుసులా తయారయ్యాడు. ఇన్నాళ్ళు ఓ మతం వాళ్ళు ఓటేస్తేనే బ్రతికి బట్టకడతాం అన్న దురూహను…

Read more »

గ్రామాభివృద్ధే… దేశాభివృద్ధి…

By |

గ్రామాభివృద్ధే… దేశాభివృద్ధి…

నిజమైన గ్రామీణాభివృద్ధి అంటే ఒక గ్రామంలో పండించిన ధాన్యం, ఉత్పత్తి చేసిన వస్తువులను ఎక్కువ భాగం ఆ గ్రామస్తులే వినియోగించుకోగలగాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతిఒక్కరికి సరైన పౌష్టికాహారం అందాలి. ‘గ్రామాభిరక్ష – నగరవత్‌ కృతా’ అన్నారు పెద్దలు. గ్రామీణాభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వాలు, సహకార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామాధికారులు, ఉపాధ్యాయులు ఐక్యంగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. అప్పుడే గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ సాధ్యమవుతుంది. జలవనరుల వినియోగం, సామాజిక…

Read more »

చూడండి.. సమరసత అంటే ఇదే.. ఆచరించండి..

By |

గిరిజన మహిళకు చెప్పులు తొడుక్కోవడంలో సహకరిస్తున్న ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 14, అంబేద్కర్‌ జయంతి నాడు జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, తెండూ ఆకులను ఏరుకునే గిరిజన మహిళలకు పాదరక్షలు అందజేశారు. ఈ సభలో పాల్గొన్న ఓ గిరిజన మహిళకు పాదరక్షలు బహూకరించిన సందర్భంలో వేదికపైనే ఉన్న ప్రధాని స్వయంగా తానే ముందుకు వంగి ఆమె కాళ్లకు వాటిని ధరింపచేశారు. ఇది చూసిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎస్‌.సి….

Read more »