Archive For The “ఈ వారం ప్రత్యేకం” Category

చరిత్రకు రెండు వెన్నుపోట్లు

By |

చరిత్రకు రెండు వెన్నుపోట్లు

రెండు చేతులూ బారజాపి కమలదళాన్ని ఎదకు హత్తుకోగలరాయన. కమ్యూనిస్టు ‘సోదరుల’తో ఆప్యాయంగా కరచాలనం చేయగలరు. ‘అనివార్యతలు’ ముంచుకొస్తే కాంగ్రెస్‌ ముందు మోకరిల్లగలరు కూడా. ఇంకా… ఏడేళ్లు కలసి నడిచాక ఆ కమలంలోనే మతోన్మాదాన్ని చూస్తారు.. కమ్యూనిజం ఏమిటి అసహ్యంగా.. ఉన్నదొక్కటే.. టూరిజం అనగలరు.. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా చీల్చినది కాంగ్రెస్‌ కాదా? అన్నదీ ఆయనే! ఇదంతా చాణక్యం అనండి, లేదా చాకచక్యం అని పేరు పెట్టుకోండి… ఎలా పిలిచినా ఇంత గొప్ప విద్య తెలిసిన ఏకైక నాయకుడు భారతదేశంలో…

Read more »

ఆర్యజాతి.. శాస్త్రశోధనల వికృతి

By |

ఆర్యజాతి.. శాస్త్రశోధనల వికృతి

సంస్కృతం ఒక్క అక్షరం తెలియకపోయినా వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, భారతేతిహాసాల గురించి కొందరు దేశవిదేశ చరిత్రకారులు పరిశోధన చేయడం కనిపిస్తుంది. అలాంటివారు వెలువరించిన తీర్పులు రాజ్యమేలుతున్నాయి కూడా. ఊహాజనితమైన ఆర్యద్రావిడ సిద్ధాంతానికి వీరితోనే శక్తి చేకూరింది. ఆ శక్తే భారతభూమిలో ఒక ప్రమాదకర ధోరణికి ఆలంబ నయింది. దక్షిణాది భారతీయులు స్థానికులట. ఉత్తర భారతవాసులు దండయాత్రకు వచ్చిన ఆర్య జాతి వారట. తెల్లగా, ఎత్తుగా, అందంగా ఉండే ఉత్తర భారత ప్రజలంతా ఆర్యులనీ, ఇతర దేశాల…

Read more »

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

By |

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

ఇది భావురావ్‌ దేవరస్‌ శతజయంతి సంవత్సరం ఒకే కుటుంబం నుంచి వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా దేశానికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. సంఘ్‌ కుటుంబం అని పిలిపించుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ తుదిశ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనే గడిపిన అపూర్వ స¬దరులు బాలాసాహెబ్‌ దేవరస్‌, భావురావ్‌ దేవరస్‌. ‘బాల్‌-భావ్‌’ పేరుతో అందరికీ పరిచయమే. ఇందులో అన్నగారు సరసంఘ్‌చాలక్‌ అయ్యారు. కానీ భావురావ్‌ కృషి పూలమాల మధ్య అంతస్సూత్రం వంటిది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను ఏర్పరిచినప్పుడు అందులో…

Read more »

వారఫలాలు 19 – 25 నవంబర్‌ 2018

By |

వారఫలాలు 19 – 25 నవంబర్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,5,7,8,9   మేషం  అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం పెట్టుబడులకు అనుకూలం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దైవబలం కాపాడుతుంది. నూతన నిర్ణయాలు వాయిదా వేయడం మేలు. శత్రువులను మిత్రులుగా చూడండి. పనులందు గోప్యత మంచిది. ఒక వార్త శక్తినిస్తుంది. అనుకున్నవి ముందుకెళతాయి. ఇబ్బందులు కొన్ని తొలగుతాయి. కార్తీక దామోదర ధ్యానం శుభకరం.  వృషభం  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అదృష్టసిద్ధి. విజయప్రాప్తి….

Read more »

కొత్త సభాపర్వం

By |

కొత్త సభాపర్వం

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత శాసనసభకు రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన రాజకీయ పక్షాల మాట ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితికి (తెరాస) ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కిందే లెక్క. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస గెలుపొందడం ఒక ‘ఉద్యమ ఆకాంక్ష’ నెరవేరిన నేపథ్యంలో జరిగింది. అప్పుడు జనంలో ఉన్న ఉద్వేగం వేరు. వారి ఊహలు వేరు. పాలన నుంచి ఆశించినది వేరు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఉద్యమ ఆకాంక్షలు అందలం ఎక్కాయా? అడుగంటాయా?…

Read more »

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

By |

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

‘నీవు నన్ను అనంతంగా సృష్టించావు….’ గురుదేవ్‌, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘గీతాంజలి’ మొదటి గీతంలో, మొదటి వాక్యమది. కవి సమస్త మానవాళికి ప్రతినిధిగా నిలబడి చేసిన ప్రకటన. మానవ జన్మలను నీవు అనంతంగా సృష్టిస్తూనే ఉంటావని ‘ప్రభు’ను కవి స్తుతిస్తున్నాడు. గీతాంజలిలో ప్రతి గీతం తనదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నట్టే అనిపిస్తుంది. మళ్లీ వరసగా చదువు తుంటే ఒక భావధారలో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటికి ఒక అంతస్సూత్రం కూడా ఉంది. అది- తల్లి గర్భం…

Read more »

పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు

By |

పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు

ప్రస్తుత విద్యావ్యవస్థలో మనం మార్పు తీసుకు రాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి. వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది. పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువుండే వాడు. ఆయన దగ్గర పదిమంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకుమించి చేరనిచ్చేవాడు కాదు. ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థులను పిలిచి ‘మీరు అరణ్యం లోకి…

Read more »

వారఫలాలు 22 – 28 అక్టోబర్‌ 2018

By |

వారఫలాలు 22 – 28 అక్టోబర్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,2,4,6,7,8,9   మేషం  అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం ఎంచుకున్న రంగాల్లో ముందుచూపు అవశ్యం. కొన్ని ఇబ్బందు లున్నా మీ నేర్పుతో సర్దుకుంటాయి. కొత్త పరిచయాలతో ప్రయోజనాలు. విద్య, వివాహాది శుభకార్యాలలో కదలిలుంటాయి. పెట్టుబడులకు వనరులుంటాయి. దూరపు బంధువులు వస్తారు. వాహన సౌఖ్యం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందికరం. వస్త్ర, వస్తు లాభాలున్నాయి. వినాయక స్మరణం సంతోషప్రదం.  వృషభం  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2…

Read more »

అయ్యప్పకు అపచారం

By |

అయ్యప్పకు అపచారం

– పెక్యులరిజం – 17 వినేవాళ్లు ఉండాలేగాని – చాడీలు చెప్పే సోంబేరులకు ఏమి కొదవ? నౌషాద్‌ అహ్మద్‌ఖాన్‌ అని ఒక హక్కులరాయుడు ఉన్నాడు. ఆయన పుట్టింది మహమ్మదీయ మతంలో. ఆ మతంలో మసీదులో నమాజును మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఏ వయసు ఆడవాళ్లనూ వారితో కలవనివ్వరు. స్త్రీలను అనుమతించే కొన్ని మసీదుల్లో కూడా వారికంటూ ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. మగవారితో సమానంగా కూర్చోనివ్వరు. అందులో మహిళల పట్ల వివక్ష ఏదీ నౌషాద్‌ సాహెబ్‌కి కనపడలేదు. ఎప్పటి…

Read more »

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

By |

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

‘యుద్ధాలలో, సాయుధ సంఘర్షణలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఆ ఇరువురు చేసిన మహోన్నత కృషికి’ ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించినట్టు స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. ఆ ఇరువురు- కాంగో వైద్యుడు డాక్టర్‌ డెన్నిస్‌ ముక్విగ్‌, ఇరాక్‌లోని యాజిది మైనారిటీ మతానికి చెందిన యువతి నదియా మురాద్‌. నదియా వయసు కేవలం 25 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే ఇంతటి పురస్కారానికి ఎంపికైన నదియా గుండె నిజానికి ఒక అగ్ని పర్వతమే….

Read more »