Archive For The “యోగా” Category

మధుమేహం – యోగ చికిత్స

By |

మధుమేహం – యోగ చికిత్స

మధుమేహం.. నేడు అనేకమందిని బాధపెడుతున్న అనారోగ్య సమస్య.. ఇది వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా.. వేరే మార్గం లేదా.. భారతీయ జీవన విధానమైన యోగలో ఏమైనా పరిష్కారం ఉందా.. చూద్దాం. మధుమేహానికి మరో పేరు ‘షుగర్‌’. దీనినే చక్కెర వ్యాధి అని, డయాబెటిస్‌ అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోస్‌ స్థాయి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే ఆ స్థితిని మధుమేహంగా గుర్తిస్తారు వైద్యులు. సాధారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ తగినంతగా ఉత్పత్తి అవకపోవడం వలన గ్లూకోజ్‌…

పూర్తిగా చదవండి

Read more »

అధిక రక్తపోటు – యోగ చికిత్స

By |

అధిక రక్తపోటు – యోగ చికిత్స

నేడు అనేకమందిని బాధపెడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. దీనినే బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి) అని అంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషిలోనూ రక్తపోటు ఉంటుంది. రక్తప్రసరణ వేగాన్నే రక్తపోటు అంటారు. అయితే ఈ రక్తపోటు సాధారణం (120/80) కంటే ఎక్కువ ఉంటే ఈ స్థితిని అధిక రక్తపోటుగా గుర్తిస్తారు. అధిక రక్తపోటు రావడానికి కారణాలు : మనిషిపై వత్తిడి ఎక్కువగా ఉన్న ఈ కాలంలో బిపి చిన్నవయసులోనే కనబడుతున్నది. బిపి రావడానికి ముఖ్యకారణం మనసుపై, శరీరంపై…

పూర్తిగా చదవండి

Read more »

ఆస్తమా – యోగ చికిత్స

By |

ఆస్తమా – యోగ చికిత్స

మనిషిలోని సాధారణ శ్వాసక్రియ నిమిషానికి 15 నుండి 18 సార్లు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సార్లు శ్వాసక్రియ జరుపుతుంటే  శ్వాస వదలటం బాగా ఇబ్బందిగా ఉంటే వ్యాధిగా గుర్తించాలి. ఈ వ్యాధినే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు. యోగ చికిత్స ద్వారా ఆస్తమాను పూర్తిగా నివారించవచ్చు. సంపూర్ణ వ్యాధి నిర్మూలన కోసం యోగాసనాలు, ప్రాణాయామం మాత్రమే సరిపోదు. వీటితోపాటు ధ్యానం, శుద్ధి క్రియలు, ముద్రలు, సరైన జీవనవిధానం, సకారాత్మక ఆలోచనలు చేయడం వంటి వాటివలన మాత్రమే సంపూర్ణ…

పూర్తిగా చదవండి

Read more »

ప్రాణాయామం

By |

ప్రాణాయామం

ప్రాణాయామం అనగా శ్వాసను తీసుకొవటడం, కుంభించటం, వదలడం, ఒక క్రమ పద్ధతిలో జరుపడం. దీని వలన శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు లోనికి వస్తుతుంది. రక్తం శుభ్రపడుతుంది. నరములకు బలము కలుగుంది.   విభాగీయ శ్వాసక్రియ : ప్రాణాయామం సాధన చేయటానికి సంసిద్ధం చేసే శ్వాస ప్రక్రియ ఇది. శ్వాసక్రియను సరిదిద్ది, ఊపిరితిత్తుల శక్తిని పెంచుతుంది. ఇది మూడు విధాలు. ఎ. అధమ (ఉదర శ్వాస) – చిన్‌ ముద్ర వజ్రాసన్‌లో కూర్చొని నిరంతరాయంగా…

పూర్తిగా చదవండి

Read more »

కీళ్ల నొప్పులు – యోగ చికిత్స

By |

కీళ్ల నొప్పులు – యోగ చికిత్స

నేడు అనేకమందిని బాధిస్తున్న సమస్యలలో మధుమేహం, రక్తపోటుతో పాటు  కీళ్ళ నొప్పులు కూడా చేరాయి. అనేకమంది ఈ కీళ్ళనొప్పుల సమస్యలతో సతమత మవుతున్నారు.  కీళ్ళనొప్పుల వ్యాధినే వైద్య పరిభాషలో ఆర్థరైటిస్‌ అంటారు. కీళ్ళనొప్పులు రావడానికి కారణాలు : కీళ్ళనొప్పులకు కారణం ఉరుకులు, పరుగులతో కూడిన ఆధునిక జీవన విధానమే. ఇంటి తిండి తగ్గిపోవడం, వత్తిడి, సమయం లేకపోవడం వంటి సమస్యల వలన మనిషి కీళ్ళనొప్పులకు గురవుతున్నాడు. కీళ్ళనొప్పులకు ముఖ్యంగా 1. శరీరంలో ఆమ్లాలు (యాసిడ్స్‌) ఎక్కువ కావడం…

పూర్తిగా చదవండి

Read more »

అజీర్ణం, గ్యాస్‌, ఎసిడిటి, మలబద్ధకం – యోగ చికిత్స

By |

అజీర్ణం, గ్యాస్‌, ఎసిడిటి, మలబద్ధకం – యోగ చికిత్స

శరీరంలో జీర్ణవ్యవస్థ అతి పొడవైన (నోరు నుండి మలద్వారం వరకు) వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆహారం పూర్తిగా జీర్ణమవ్వటానికి 3 నుండి 72 గంటల వరకు పడుతుంది. శాఖాహారం అయినప్పటికి వేపుళ్ళు చేయటంవలన అది జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణం ప్రతిరోజు సరిగా కాకపోవటం వలన ‘అజీర్ణం చేసింది’ అంటారు. అజీర్ణాన్ని వెంటనే సరిచేయకపోవటం వలన జీర్ణం కాని పదార్థం నుండి వాయువు వెలువడుతుంది. దానినే గ్యాస్‌ అంటారు. ఈ గ్యాస్‌ దీర్ఘకాలం ఉంటే…

పూర్తిగా చదవండి

Read more »

యోగ సాధనతో వ్యాధులు తగ్గుతాయి

By |

యోగ సాధనతో వ్యాధులు తగ్గుతాయి

జాగృతి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో సుజాత నాయక్‌ సుజాత నాయక్‌. కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌, వివేకానంద కేంద్రలో పనిచేస్తున్న ఆజీవన కార్యకర్త. ఆమె ప్రస్తుతం తెలుగు ప్రాంత (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు) ప్రాంత సంఘటన ప్రముఖ్‌గాను, గౌహతిలోని వివేకానంద కేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కల్చర్‌ సమన్వయకర్తగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలోని సమాజాన్ని కలుపుకుపోతూ ఈశాన్య రాష్ట్రాల గురించిన పరిశోధన, సదస్సుల నిర్వహణను చేస్తున్నారు. వివేకానంద కేంద్రలో 1996 లో పూర్తిసమయ కార్యకర్తగా అడుగుపెట్టిన సుజాత…

పూర్తిగా చదవండి

Read more »

ఆయుష్షును పెంచే సూర్యనమస్కారాలు

By |

ఆయుష్షును పెంచే సూర్యనమస్కారాలు

యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం వస్తుంది. సాధారణంగా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో సూర్యాభిముఖంగా నిలబడి సూర్యనమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాలు కింది మంత్ర ఉచ్చారణతో ప్రారంభించాలి. ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజా సన సన్నివిష్టః | కేయూరవాన్‌…

పూర్తిగా చదవండి

Read more »