Archive For The “ఆధ్యాత్మికం” Category

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

By |

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

వాడుకలో అందరూ పిలుచుకునే యాదగిరి గుట్ట తెలంగాణ తిరుమల మాదిరిగా రూపుదిద్దు కుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన యాదాద్రి ఇల వైకుంఠం రీతిలో హంగులు అద్దుకుంటోంది. ఇంతకు ముందు కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో యాదాద్రి అలరారబోతోంది. అతికొద్ది రోజుల్లోనే తెలంగాణ జనం కళ్లముందు సాక్షాత్క రించబోతోంది. తెలుగునాట వెలసిన నృసింహా లయాల్లో విశిష్టమైన ఈ పంచ నారసింహ క్షేత్రం యావత్‌ భారతావనిని ఆకర్షించేలా తుది మెరుగులు దిద్దుకోబోతుంది. కొండను పిండి…

Read more »

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

By |

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

ఇక్కడి నుంచీ సృష్టిమార్గమే మారింది. సృష్టిలో ఒక నూతన ఆధ్యాయం ప్రారంభించింది. పశుపక్ష్యాది జీవరాసులు సృష్టిని మార్చే ప్రయత్నం చేయలేదు. సృష్టిలో లభించినవాటితో జీవించేవి. కాని మానవుడు వచ్చిన తర్వాత సృష్టినే మార్చడానికి పూనుకున్నాడు. అరణ్యాలు తీసివేసి నగరాలు నిర్మించాడు; భూమిని చీల్చి పైర్లు, ఫలవృక్షాలు పెంచాడు. యంత్రాలు నిర్మించి కాలదూరాలు నిర్జించాడు. పరిసరాలకు అనుకూలంగా మారడమే మానవ పూర్వ ప్రాణి వర్గాల జీవన మార్గమయితే, తనకనుకూలంగా పరిసరాలు మార్చుకోవడం మానవ జీవనమార్గం అయింది. అది సృష్టిలో…

Read more »

మరో బసవణ్ణ నేటి శివకుమార స్వామి !

By |

మరో బసవణ్ణ నేటి శివకుమార స్వామి !

నాటి బసవేశ్వరుని మార్గంలో నడిచిన నేటి శివకుమార స్వామి జాతి, కుల భేదాలు పాటించకుండా అందరికీ విద్యాభ్యాసం అందించారు. 12వ శతాబ్దంలో బసవణ్ణ అనేక కులాలను ‘అనుభవ మంటపం’ ద్వారా ఎలా కలిపారో అలాగే శివకుమారస్వామి కూడా అనేకమందికి కులబేధం లేకుండా ఆధ్యాత్మిక జీవనం అందించారు. ఆధ్యాత్మిక విద్యకు కులభేదం వద్దన్న బసవణ్ణ ఆదర్శపు అడుగుజాడల్లో శివకుమారస్వామి నడిచి చూపించారు. 12వ శతాబ్దిలో కూడల సంగమంలో నడయాడిన దేవుడు సంస్కరణలకు ఆద్యుడు.. ఆనాటి బసవేశ్వరుడు..! త్రివిధ దాసోహి…..

Read more »

సంక్రాంతి – లోగిళ్లు కళకళ ఐశ్వర్యం గలగల

By |

సంక్రాంతి – లోగిళ్లు కళకళ ఐశ్వర్యం గలగల

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి. సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతాడు. కొత్త రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయన్నమాట….

Read more »

కుంభమేళా పిలుస్తోంది!

By |

కుంభమేళా పిలుస్తోంది!

ప్రపంచ ప్రజానీకం ఎదురుచూసే కుంభమేళా మహోత్సవం మొదలవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (నిన్నటిదాకా అలహాబాద్‌) జనవరి 14వ తేదీ, 2019న ఈ తీర్థయాత్ర మహోత్సాహంగా ప్రారంభం కాబోతున్నది. అప్పటి నుంచి 48 రోజుల పాటు జరిగి మార్చి 4 (మహా శివరాత్రి) న ముగియనున్న ఈ మహా పండుగను అర్థ కుంభమేళ అంటున్నారు. కుంభమేళ అంటే లక్షలాది సాధారణ హిందువులతో పాటు, కాషాయాంబరధారులైన సాధుజనం, అఘోరాలు, హిందూ జీవన విధానంలోని వైవిధ్యాన్ని చాటుతూ వివిధ ఆరాధనా రీతులకు ప్రాతినిధ్యం…

Read more »

అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

By |

అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

భారతదేశ సాహిత్యంలో అత్యధిక భాగం నాలుగు మూల స్థంభాలపై ఆధారపడి విలసిల్లింది. ఆ నాలుగు రామాయణం, మహాభారతం, పురాణాలు, బృహత్‌ కథ. భారతదేశంలోని విభిన్న భాషల రచయితలందరికీ స్ఫూర్తి ఆ రామాయణం, జయకావ్య, మహాభారతం, పురాణాలే. భారతీయ సాహిత్యం గురించి చర్చించా లని అనుకున్నప్పుడు భారతం, రామాయణం, పురాణాల విషయాలు తేలుసుకోవలసిందే. వీటి గురించి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నప్పుడే సాహిత్య చర్చకు న్యాయం చేయగలం. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆ నాలుగు స్థంభాలపైనే భారతీయ…

Read more »

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

By |

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

13 డిసెంబర్‌ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి రోజున ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ జరుపు కుంటారు. దీనినే ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. తారకా సురుని సంహరించడానికి శివపార్వతులకు పుట్టిన అవతారమే సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు బ్రహ్మ ద్వారా వరం పొంది గర్వంతో ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేసి, దేవతలపై దండెత్తుతాడు. కొంతకాలం తర్వాత హిమవంతునికి సతీదేవి (పార్వతి) జన్మిస్తుంది. శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. ఆ నూతన దంపతుల…

Read more »

ధర్మం-శాసనం-పాలన

By |

ధర్మం-శాసనం-పాలన

ధర్మశాస్త్రాలనే స్మృతులని అంటారు. ధర్మ శాస్త్రకర్తలు లేదా స్మృతికర్తలు లోకహితం కోరినవారు. సమదృష్టి కలిగినవారు. అందుకే ఎంత పురాతనమైనా భారతీయ ధర్మశాస్త్రాల అధ్యయనం మీద నేటికీ ఒక విధమైన శ్రద్ధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిరపేక్ష రాజరికం లేనేలేదు. రాజు సర్వంసహ అధికారి కాడు. అంతేకాదు, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థలలో వేటి ఉనికి వాటిదేనని మొదటిగా గుర్తించినది మన ప్రాచీన భారతీయ న్యాయ వ్యవస్థేనని చాలామంది విజ్ఞుల అభిప్రాయం. ఈ సూక్ష్మ విభజన గురించి ఆసక్తి ఉండడం…

Read more »

ఆశే శూర్పణఖ, క్రోధమే మంధర

By |

ఆశే శూర్పణఖ, క్రోధమే మంధర

వాలి వధ, అహల్య కథ, సీతా పరిత్యాగం, శ్రీకృష్ణుని రాసలీల, తారాశశాంక కథ, మహర్షుల శాపకథలు, పాంచాలి పంచభర్తృకం వంటి అనేక గాథలు పైకి అనౌచిత్యాలుగా కనిపిస్తాయి. కానీ సమ్యక్‌ దృష్టితో ఆలోచించే వారికి ఇవన్నీ కూడా సరియైనవే. అనౌచిత్యాలు కావు. గురుదేవతా భక్తి గలవారికి, శ్రద్ధా విశ్వాస సంపూర్ణులకి వాటిలో మహత్వ పరిపూర్ణమైన అర్థాలే కనిపిస్తాయి. కాని దృష్టి లోపం ఉన్నవారికి వాటి నిండా దుష్టార్థమే కనిపిస్తుంది. కొందరికి రామాయణం విషవృక్షం. మరికొందరకి అది అమృతసాగరర….

Read more »

ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

By |

ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

ఆ మహాకావ్యాలు అక్షరబద్ధమై కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి. క్రీస్తుపూర్వం 400 ప్రాంతంలో ఆ గాథలు కావ్యరూపం దాల్చాయని కొందరి వాదన. అయినా 21వ శతాబ్దంలో కూడా ఆ మహా కావ్యాలు- రామాయణం, మహాభారతం, భాగవతం భారతీయులను రంజింప చేస్తూనే ఉన్నాయి. ఇరవై నాలుగువేల శ్లోకాల రామాయణం ఇప్పటికీ పఠనీయమే. లక్ష శ్లోకాల భారతం ఆరాధనీయ గ్రంథమే. ఆ ఇతిహాసాలతో ప్రభావితం కాని నేల భారత భూమిలో అంగుళమైనా కానరాదు. ఒక అంశాన్ని తాత్వికంగా చెప్పాలన్నా, భారతీయమైన శైలితో…

Read more »