Archive For The “ఆధ్యాత్మికం” Category

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

By |

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

తెలంగాణలో బతుకమ్మ పండగకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూల పర్వమిది. ప్రపంచ చరిత్రలో విభిన్నమైన పూలను కొలిచే ఆచారం బతుకమ్మ పండగలోనే ఉండటం విశేషం. ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పిం చడం బతుకమ్మ వైశిష్ట్యానికి నిదర్శనం. సిరులొలికించే ప్రకృతి పండగ బతుకమ్మను మహిళలు అత్యంత భక్తి పారవశ్యంతో జరుపు కోవడం ఆనవాయితీ. ఎంగిలిపువ్వు బతుకమ్మ.. మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా ప్రతిరోజుకి…

Read more »

గౌతముడు

By |

గౌతముడు

సప్తరుషులలో గౌతముడు ప్రసిద్ధుడు. అహల్యా-గౌతముల వృత్తాంతం వాల్మీకి రామా యణంలో విపులంగా ఉంది. అహల్యా-గౌతముల కుమారుడు శతానందుడే జనకమహారాజు పురోహితుడు. విశ్వమిత్రుని వెంట వచ్చిన రామ లక్ష్మణులకు స్వాగతం పలికి సీతారామ కల్యాణం జరిపించిన మహనీయుడు. కొందరి దాంపత్య జీవితాలు అర్ధంతరంగా ఏదో ఒక నెపంతో విడివడతాయి. మళ్లీ సానుకూల సమయం వచ్చినప్పుడు కలసి మెలిసి జీవిస్తారు. అహల్యా గౌతములిద్దరూ లోకోపకారానికి కృషి చేసినవారే. ఇద్దరి జన్మవృత్తాంతాలూ మహత్తర మైనవే. బ్రహ్మ మానస పుత్రులలో గౌతముడు ఒకడు….

Read more »

కేంద్రం జోక్యం చేసుకోవాలి

By |

కేంద్రం జోక్యం చేసుకోవాలి

దేవాలయ పరిరక్షణలో నాకు స్ఫూర్తినందించిన నా భార్య శ్రీమతి వసుమతి అక్టోబర్‌ 1న చిలుకూరు బాలాజీ దివ్యసన్నిధి చేరుకున్నది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చునంటూ వచ్చిన తీర్పు ఆమెను దిగ్భ్రాంతికి లోనుచేసింది. దేవాలయ పరిరక్షణ కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉండాలన్నది ఆమె చివరి కోరిక. ఆమె మరణం నాకూ, నా కుటుంబానికీ తీరని లోటు. ఆమె కోరిక, సరైన నాయకత్వం లేకపోయినా శ్రీఅయ్యప్ప దేవుడి హక్కుల కోసం అంకితభావంతో పోరాడుతున్న…

Read more »

హిందువుల హక్కులకు భంగం

By |

హిందువుల హక్కులకు భంగం

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. అయ్యప్ప భక్తుల జాతీయ సంఘం, నాయర్‌ సేవా సంఘం కలసి ఈ నెల ఎనిమిదో తేదీన సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ తీర్పు నిర్హేతుకమైనదని వారు తమ పిటిషన్‌లో వాదించారు. ఈ తీర్పు దేశంలోని లక్షలాది అయ్యప్ప భక్తుల హక్కులను భంగకరమని అయ్యప్పభక్తుల జాతీయ సంఘం అధ్యక్షుడు శైలజా విజయన్‌ న్యాయస్థానానికి…

Read more »

భాగవత చేతన-బమ్మెర పోతన

By |

భాగవత చేతన-బమ్మెర పోతన

భగవంతుని గురించి చెప్పేది భాగవతం! పూర్వం నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదునకూ తర్వాత వేదవ్యాసుడు తన పుత్రుడైన శుకునకూ, శిష్యుడైన సూతునకూ బోధించగా…. సూతుడు శౌనకాదిమునులకు విన్పించినది… కృష్ణ నిర్యాణ వేళ కృష్ణుడు మైత్రేయునకు, మైత్రేయుడు విదురునకూ వివరించినదీ విలువైన భాగవతం! శాపగ్రస్తుడిగా సప్తదినములు మాత్రమే ఆయుప్రమాణమున్న పరీక్షిత్తుకు శుకయోగి బోధించిన భక్తి సుధాపూరం ఈ భాగవతసారం! భాగవత రచనకు పూర్వం పూర్ణకాముడైననూ వ్యాసుడు పూర్తి వ్యాకుల చిత్తుడై వుండటం గమనించి దేవర్షి నారదుడరుదెంచి కారణమడిగాడు. అందుకు…

Read more »

మాటకారితనం

By |

మాటకారితనం

వాక్కు.. అంటే మాటకారితనం. ‘వాక్కే అన్నిటికి కారణం’ అనేది రుషి వచనం. మధురమైన మాటలనే పలకాలని వేదశాసనం. మాట ఎలా ఉండాలనే విషయంపై మన సనాతన ధర్మంలో విస్తృతమైన అంశాలు చెప్పారు. మనం మాట్లాడే మాట తత్కాలానికి చక్కగా ఉండటమే కాదు, శాశ్వతమైన హితం కలిగేలా ఉండాలి. అందుకే సత్యం, ప్రియం, హితం అనే విశేషణాలను వాక్కుకు జోడించారు మన పెద్దలు. మన సంస్కారం, అధ్యయనం, హృదయపు లోతు మనమాట ద్వారానే తెలుస్తాయి. ఈ మాటను సవ్యంగా…

Read more »

చ్యవన మహర్షి

By |

చ్యవన మహర్షి

భృగు మహర్షి సుప్రసిద్ధుడు. ఆయన గృహస్థ జీవనం కొనసాగిస్తూ అధ్యయన అధ్యాపనాలు కొనసాగిస్తున్నాడు. ఆయన భార్య పులోమ. పతి శుశ్రూషలో ఆమె మేటి. తన భర్తకు హోమద్రవ్యాలు సమకూర్చడం, సమయానికి అగ్నిహోత్రం సిద్ధం చేయడం వంటి పనులు సక్రమంగా నిర్వహిస్తూ భర్తృసేవలో నిలిచింది. భృగువు ఆమె పట్ల ఆదరంతో మెలిగేవాడు. పులోమ ఒకనాడు తన భర్తతో – ‘నాకు వంశోద్ధారకుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన ఒక కుమారుని ప్రసాదించ’మని వినయంగా కోరింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయింది….

Read more »

చనిపోయినప్పుడు వినిపించేది కాదు

By |

చనిపోయినప్పుడు వినిపించేది కాదు

ప్రపంచ భాషల్లో గల సామాజిక, ధార్మిక, మానసిక, తాత్విక, సర్వమత గ్రంథాలన్నింటిలోనూ శ్రీమత్‌ భగవద్గీత అత్యుత్తమమైనది. ఈ గ్రంథం వేదాలు, ఉపనిషత్తులు, యోగ దర్శన, ధర్మ గ్రంథాల సారమని పండితులు విశ్వసిస్తారు. ఇది జాతి, మత, కుల, లింగ, వర్ణ భేదం లేక మానవులందరికి సుఖశాంతులను, వారి అభ్యుదయానికి మార్గదర్శనం చేసే మూల గ్రంథం. అందుకే ప్రపంచ భాషలన్నిటి లోకి భగవద్గీత అనువాదమైంది. మనదేశ న్యాయ స్థానాలలో సాక్ష్యమిచ్చే ప్రతి హిందువుకు ప్రమాణ గ్రంథమైంది. ఈ మధ్య…

Read more »

మానవ జీవన సరళిపై గ్రహాల ప్రభావం

By |

మానవ జీవన సరళిపై గ్రహాల ప్రభావం

‘ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవేనమః’ వ్యక్తి జన్మించిన సమయంలో జన్మ నక్షత్రాన్ని, అది ఉన్న రాశిని గుర్తించి, ఆ సమయంలో గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకొని మానవుని జన్మపత్రికను రూపొందిస్తారు. ఆకాశంలో మొత్తం 12 రాశులను గుర్తించారు. ఆ రాశుల ఆకృతులను బట్టి ఆయా నామాలతో వ్యవహరిస్తారు. అశ్విని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాల ప్రభావం మానవునిపై ఉంటుంది. 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో 9…

Read more »

పంచారామాలు

By |

పంచారామాలు

పరమ శివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు (అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు. పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ…

Read more »