Author Archive

ప్రజా సమస్యల మీద చర్చలా ? ప్రజాస్వామ్యానికి మచ్చలా ?

By |

ప్రజా సమస్యల మీద చర్చలా ?  ప్రజాస్వామ్యానికి మచ్చలా ?

ఒక దేశం, ఒక జాతి ఆధునికతతో కలసి అడుగులు వేస్తున్నదని చెప్పడానికి కావలసినదేమిటి? అక్కడ ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ. ప్రజల ఆలోచనల మీద ఆ గొప్ప భావన పరచిన జాడ. దానితో వారు సంతరించుకున్న చైతన్యం. దేశ రాజకీయ నాయకత్వానికి ఆ సిద్ధాంతం పట్ల ఉన్న నిబద్ధత కూడా. దేశవాసులందరిని సోదరులుగా భావిస్తూ, అన్నింటా సమానావ కాశాలు కల్పిస్తూ, పాలనలో అందరినీ భాగస్వాములను చేసుకుంటూ దేశాన్ని సమున్నత స్థితికి తీసుకుపోవాలన్న ఆలోచన అక్కడ ఉన్నదని చెప్పడానికి రుజువు…

పూర్తిగా చదవండి

Read more »

సాంస్కృతికంగా మనం ఒక్కటవ్వాలి

By |

సాంస్కృతికంగా మనం ఒక్కటవ్వాలి

దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ప్రజలలో సాంస్కృతిక ఐక్యత లేకపోతే జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే మనమంతా విభేదాలు మరచి సాంస్కృతికంగా ఒక్కటవ్వాలి. అప్పుడే స్వాతంత్య్రఫలాలు అందరికీ అందుతాయి. అప్పుడు భారత్‌ తిరిగి పునర్వైభవం సాధించగలుగుతుంది. స్వతంత్ర భారతం ఈ ఆగస్టు 15కి 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ దేశం ముక్కలై కూడా 71 సంవత్సరాలయింది. దేశ విభజన జరిగి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలోనే భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లో…

పూర్తిగా చదవండి

Read more »

ఆధ్యాత్మిక భారతం – అరవింద్‌ మార్గం

By |

ఆధ్యాత్మిక భారతం – అరవింద్‌ మార్గం

15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు.. ‘ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, ముస్లింల పేరుతో రెండు…

పూర్తిగా చదవండి

Read more »

తులసీదాస్‌- రామపాదాలను అర్చించిన అక్షరం

By |

తులసీదాస్‌- రామపాదాలను అర్చించిన అక్షరం

ఆగస్టు 17 తులసీదాస్‌ జయంతి ప్రత్యేకం అమ్మ హులసీ అంటే తనకెంత ప్రేమో, రామకథ అన్నా తులసీదాసుకు అంత ప్రేమ. బాల్యంలో తులసీదాసు అసలు పేరు రామ్‌బోలా. పసిప్రాయం నుండే ఆయన రామనామం ఉచ్చరించటం తప్ప మరో పలుకు పలికేవాడు కాదట, అందువల్లే రామ్‌బోలా అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో తులసీదాస్‌గా ప్రసిద్ధుడయ్యాడు. తులసీదాసు గురువు నరహరి అనీ, నరహరిదాసు, నరహర్యానంద్‌ అని చెబుతారు. తులసీదాసు రాజాపూర్‌లో 1554 శ్రావణ శుద్ధ సప్తమి నాడు జన్మించాడు….

పూర్తిగా చదవండి

Read more »

రాజ్యాంగ రక్షణ హిందువులకెందుకు?

By |

రాజ్యాంగ రక్షణ హిందువులకెందుకు?

నిజం చూడకు. నీ యధార్థ స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకు. బుర్రకు పని పెట్టకు. హాయిగా భ్రమల్లో బతికెయ్‌. ఇదీ ఈ కాలంలో సగటు హిందువు మనఃస్థితి. రాజ్య వ్యవహారాలూ, రాజ్యాంగ విషయాలూ మామూలు జనాలకు ఎలాగూ బుర్రకెక్కవు. మేధావులమని, తమకు తెలియంది లేదని అనుకునే వింత శాల్తీలకైనా తాము ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నారో అర్థమైందా? మాట వరసకు మత స్వాతంత్య్రం సంగతే తీసుకోండి. హిందూ సమాజంలో ప్రతి అమాంబాపతు మేధావీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలికే…

పూర్తిగా చదవండి

Read more »

జీవనస్రవంతి -15

By |

జీవనస్రవంతి -15

జరిగిన కథ జీవన్‌ని మల్లెవాడకు చేర్చమని పూజారి రామారావుకి చెప్పారు. అలా జీవన్‌, రామారావులు మల్లెవాడకు బయలుదేరి కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. వీరిద్దరికి తోడుగా రంగనాథం కలిశాడు. ముగ్గురూ మల్లెవాడకు చేరారు. అప్పటికి చీకటి పడుతున్నది. మొదట రంగనాథం, తరువాత రామారావు తమ ఇళ్ల వద్ద ఆగిపోగా, జీవన్‌ ఒక్కడే తన పెట్టె పట్టుకుని కామేశం గారింటికి నడక సాగించాడు. చివరికి చీకటి పడకముందే గమ్యాన్ని చేరుకున్నాడు జీవన్‌. —- —– కరణంగారిది, ఎత్తు అరుగుల పెద్ద…

పూర్తిగా చదవండి

Read more »

విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలిచే విధానం కావాలి

By |

విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలిచే విధానం కావాలి

విద్యారంగంలో జరుగుతున్న ప్రయోగాలతో మన యువత భవిత అతలాకుతలమవుతోరది. విద్యావ్యవస్థ మొత్తం బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించలేదు. అలాగని ప్రయివేటు రంగానికి వదిలేయనూ లేదు. కొంతమేర ప్రభుత్వమే బరువు బాధ్యతలను మోస్తుండగా ప్రయివేటు రంగానికి అవకాశం ఇచ్చిన చోట నియంత్రణ బాధ్యతలను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దాంతో ప్రభుత్వ, ఎయిడెడ్‌, గుర్తింపు పొందిన అని పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయిదాకా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో విద్య కొనసాగుతోరది. పాఠశాల స్థాయిలో డిటెన్షన్‌ అని, నో…

పూర్తిగా చదవండి

Read more »

ఎన్నార్సీపై ఎందుకీ రగడ ?

By |

ఎన్నార్సీపై ఎందుకీ రగడ ?

అరబ్బు వాడు, ఒంటె ఎడారిలో ఒక రాత్రి మజిలీ చేశారు. రాత్రి అయ్యే కొద్దీ చలి పెరిగింది. లోపల నిప్పు రాజేసుకుని అరబ్బు వాడు చలి కాచుకుంటున్నాడు. ఒంటె వెచ్చదనం కోసం గుడారంలోకి తల దూర్చింది. అరబ్బు వాడు పట్టించుకోలేదు. తల తరువాత మెడ దూర్చింది. ‘పోనీలే.. చలిగా ఉందేమో’ అనుకుని అరబ్బు వాడు ఒక పక్కకి జరిగాడు. ఒంటె ముందుకాళ్లు, మొండెం గుడారంలోకి దూర్చింది. మన వాడు ఇంకొంచెం పక్కకి ఒదిగాడు. ఒంటె మొత్తం లోపలకి…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ నిర్లక్ష్యానికి 10మంది అమాయకుల బలి మైనింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి 10మంది క్వారీ కూలీలు బలయ్యారు. దూరప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన వీళ్లంతా క్వారీ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆగస్టు 4వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది. క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు వారి ప్రాణాలను హరించివేశాయి. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురై ఎగిరిపడ్డాయి. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో…

పూర్తిగా చదవండి

Read more »

మానవ హక్కులు కొందరికేనా?

By |

మానవ హక్కులు కొందరికేనా?

ఉగ్రవాదులతో హోరాహోరీ కాల్పులు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులకు అనుకూలంగా రాళ్లు విసిరేవారి పట్ల భద్రతాదళాలు ఎలా స్పందించాలి? ఆ అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ విషయంలో హక్కుల పేరిట వాదించేవారు, ఉగ్రవాదుల మద్దతుదారులు రాళ్లు విసిరే వారి ‘మనోభావాలు’, వారి ‘న్యాయసంగతమైన వాదనలు’ వినాలని, వాటిని మానవీయ కోణంలో పరిశీలించి, అర్థం చేసుకోవాలని అంటారు. రాళ్లు విసిరే మూకల నుంచి ఎన్నికల సిబ్బందిని కాపాడేందుకే ఆ మధ్య శ్రీనగర్‌ లోకసభ స్థానం ఉప ఎన్నికల్లో మేజర్‌…

పూర్తిగా చదవండి

Read more »