ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 20న జమ్ములో జరిపిన పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ఉగ్రవాదుల పీడ నుంచి బయటపడి, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారిన 370 అధికరణం రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొంటున్న సాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జరిపిన ఈ పర్యటన, ‘శాంతి’వల్ల కలిగే అభివృద్ధి ప్రయోజనాలు ఎట్లా ఉంటాయో ప్రజలకు స్పష్టంగా వివరించే రీతిలో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాని జమ్ములో రూ.32 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, గతంలో నిత్య హింసాకాండ అనే ‘చలి’ తప్ప మరోటి తెలియని జమ్ము-కశ్మీర్‌ ప్రజలకు ఉదయిస్తున్న ‘ప్రగతి భానుడి’ లేలేత కిరణాలు ‘నులివెచ్చని’ అనుభూతిని తప్పక కలిగించి ఉంటాయి. ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమాన యానం, పెట్రోలియం, పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రధాని శంకుస్థాపన చేసిన వాటిల్లో ఉన్నాయి. అంతేకాదు జమ్ము`కశ్మీర్‌ రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 1500 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా ప్రధాని అందజేయడం విశేషం. ‘వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము’ కార్యక్రమం కింద వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితో ప్రధాని నరేంద్రమోదీ ముచ్చటించడం, పలువురు లబ్ధిదార్లు అభివృద్ధి పథకాల ద్వారా తమకు కలిగిన ప్రయోజనాలను ప్రధానితో ముఖాముఖిగా వివరించడం మరో విశేషం.

గతంలో తాను జమ్ము-కశ్మీర్‌లో జరిపిన పర్యటనలకు, ప్రస్తుతం జరుపుతున్న పర్యటనకు ఎంతో వ్యత్యాసమున్నదని ప్రధాని పేర్కొనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలోనే బీజేపీ ఏలుబడిలో అక్కడ వచ్చిన పెను మార్పును చెప్పక చెప్పారు. ముఖ్యంగా అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఖాతరు చేయకుండా జమ్ములోని మౌలానా అజాద్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాని కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఈసారి ప్రత్యేకత! జమ్ము-కశ్మీర్‌లోని మూడు ప్రధాన ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో, వీటివద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలు ప్రధాని కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించడం, ఆయన ప్రసంగాన్ని వినడం వారిలో ‘ఉగ్రవాద’ భయం తొలగిపోయిందనడానికి గొప్ప నిదర్శనం! అంతేకాదు జమ్ము-కశ్మీర్‌లోని 285 బ్లాకులకు చెందిన ప్రజల్లో ప్రధాని పర్యటన గొప్ప స్ఫూర్తిని నింపిందనడంలో సందేహం లేదు. నిజానికి ఈ కార్యక్రమం కేవలం వికసిత్‌ భారత్‌కు మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు చెందిన లక్షలాదిమంది ప్రజలకు కూడా సంబంధించింది. గత 70 సంవత్సరాలుగా ఫలించని జమ్ము`కశ్మీర్‌ ప్రజల కలలకు, త్వరలోనే తాను వాస్తవరూపాన్ని తీసుకు వస్తానని మోదీ ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వడం విశేషం. తమ కుటుంబాల సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చిన గత పాలకులు, సామాన్య ప్రజలను ఎంతమాత్రం పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. ‘వికసిత్‌ జమ్ము`కశ్మీర్‌’ సాధనకోసం కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు, రైతులు, యువత, నారీశక్తిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న చర్యలవల్ల జమ్ము ప్రముఖ విద్యాకేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది. జమ్ము-కశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తామని 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ‘‘మోదీ హామీ ఇస్తే అది నెరవేరినట్టే’’ అన్న సత్యాన్ని జమ్ము-కశ్మీర్‌ ప్రజలు గుర్తిస్తున్నారు. విద్య, నైపుణ్య రంగాల్లో నేడు సాధించిన అభివృద్ధిని పదేళ్లక్రితం నాటి పరిస్థితితో ఎంతమాత్రం పోల్చలేం. నేడు ‘‘సరికొత్త భారత్‌’’ అవిర్భవించింది. వర్తమాన కాలానికి అనుగుణమైన ఆధునిక విద్యకు కేంద్రం అత్యంత ప్రాధాన్య మిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత పదేళ్లకాలంలో జమ్ము-కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో 50 డిగ్రీ కళాశాలలతో సహా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు ఏర్పాట య్యాయి. జమ్ము-కశ్మీర్‌లో 45వేల మంది పిల్లలు పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఒకప్పుడు పాఠశాలలు నడిచేవి, కానీ నేడు బళ్లు విస్తరిస్తున్నా యంటే అతిశయోక్తి కాదు. 2014లో జమ్ము-కశ్మీర్‌లో కేవలం నాలుగు వైద్య కళాశాలలుండగా నేడు వాటి సంఖ్య 12కు పెరిగింది. 2014లో రాష్ట్రంలో కేవలం 500 మెడికల్‌ సీట్లుంటే నేడవి 1300కు చేరుకున్నాయి. ఇక మెడికల్‌ పి.జి.సీట్లు 2014 వరక లేనేలేవు. కానీ నేడు 650కి పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత నాలుగేళ్ల కాలంలో 45 పారామెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు ప్రారంభమయ్యాయి. జమ్ము`కశ్మీర్‌కు రెండు ఏఐఐఎంఎస్‌లు మంజూరుకాగా, ఒకదాన్ని ప్రధాని ఫిబ్రవరి 20న ప్రారంభించారు. గత పదేళ్లకాలంలో దేశవ్యాప్తంగా 15 ఏఐఐఎంఎస్‌లను నెలకొల్పినట్టు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వెల్లడిరచారు. అంతేకాదు 370 అధికరణం రద్దు తర్వాత జమ్ము` కశ్మీర్‌లో సమతుల్య అభివృద్ధి సాధిస్తున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈ అధికరణం రద్దుపై త్వరలో విడుదల కానున్న చిత్రాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని యామి గౌతమ్‌ నిర్మించారు. కల్లోలిత జమ్ము-కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను ఈ చిత్రం వెల్లడిస్తుందంటూ ప్రధాని ప్రశంసించారు. ఉగ్రవాదం, అవినీతి, ప్రత్యేక ప్రతిపత్తి అంశాలపై ఈ చిత్రం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదలైంది. తన చిత్రాన్ని ప్రస్తావించినందుకు యామి గౌతమ్‌ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మారిన పరిణామక్రమంలో జమ్ము`కశ్మీర్‌లో ప్రస్తుతం సానుకూల అభివృద్ధి సాగుతోంది. అంతేకాదు ఎంతోకాలంగా పెండిరగ్‌లో ఉన్న ‘వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ విధానాన్ని అమల్లోకి తేవడంవల్ల ప్రయోజనం పొందిన మాజీ సైనికుల్లో ఈ ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారన్న సంగతిని ఆయన ప్రస్తావించారు. దేశంలో 3కోట్లమంది ‘లక్‌పతి దీదీ’లను తయారుచేయాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు.

అధిక ప్రయోజనం మహిళలకే

370 అధికరణం రద్దువల్ల ప్రధానంగా ప్రయోజనాన్ని పొందింది జమ్ము-కశ్మీర్‌ మహిళల మాత్రమే! ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పక్కా ఇళ్లను మహిళల పేర్న రిజిస్టర్‌ చేస్తున్నారు. హర్‌ ఘర్‌ జల్‌ పథకం కింద కుళాయి ద్వారా నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఆయుష్మాన్‌ కార్డుల పంపిణీ పెద్దఎత్తున జరిగింది. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం కింద పెద్ద సంఖ్యలో మహిళలకు ‘డ్రోన్‌ పైలెట్లు’ గా శిక్షణ ఇస్తున్నారు. లక్షల రూపాయల విలువచేసే డ్రోన్‌లను వేల సంఖ్యలో ఉన్న స్వయంసహాయక గ్రూపులకు అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలపై మందులను స్ప్రే చేయడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. దీనిద్వారా ఆయా గ్రూపులకు చెందిన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇటీవలికాలంలో జమ్ము-కశ్మీర్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ బాగా పెరిగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైలు సర్వీసు నడుస్తుండగా, శ్రీనగర్‌ నుంచి సంగాల్డన్‌కు, సంగాల్డన్‌ నుంచి బారాముల్లాకు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మోదీ విమర్శకుడు ఫారూక్‌ అబ్దుల్లా కూడా కృతజ్ఞతలు తెలియచేయక తప్పలేదు. దేశవ్యాప్తంగా రైల్వేల విద్యుదీకరణ వేగంగా కొనసాగుతోంది. జమ్ము- కశ్మీర్‌లో మొట్టమొదటి విద్యుత్‌ రైలు నేడు అందు బాటులోకి వచ్చిన సందర్భంగా ప్రధాని కేంద్రపాలిత ప్రాంత ప్రజలను అభినందించారు. ఇక రోడ్డు సదుపాయాల విషయానికి వస్తే శ్రీనగర్‌ రింగ్‌రోడ్డు రెండోదశ నిర్మాణం ద్వారా మానస్‌బల్‌ సరస్సు, ఖీర్‌ భవానీ దేవాలయానికి మరింత సులువుగా వెళ్లవచ్చు. అదేవిధంగా శ్రీనగర్‌` బారాముల్లా`యూరి హైవే వల్ల పర్యాటక అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలోని రైతులు ఎంతో ప్రయోజనం పొందగలరు. ఢల్లీి`అమృత్‌సర్‌` కట్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే వల్ల ఢల్లీి`జమ్ము మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతం కాగలదు.

పెట్టుబడులకు గల్ఫ్‌ దేశాల ఉత్సాహం

జమ్ము`కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గల్ఫ్‌ దేశాలు ఎంతో ఉత్సాహం చూపుతున్నాయి. అంతేకాదు జి-20 దేశాల సమావేశాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడంతో, ప్రపంచానికి జమ్ము-కశ్మీర్‌ అందాల గురించి మరింతగా తెలిసింది. గత ఏడాది జమ్మ-కశ్మీర్‌ను సందర్శిం చిన పర్యాటకుల సంఖ్య రెండుకోట్లు దాటింది. అమర్‌నాథ్‌, శ్రీ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య గత దశాబ్దకాలంలో ఎన్నడూలేని రీతిలో అత్యధిక స్థాయికి చేరుకుంది. జమ్ము `కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా కొనసాగిస్తున్న కారణంగానే పర్యాటకుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకున్నదనేది అక్షరసత్యం. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలుకా వాలంటే దేశ ఆర్థికపరిస్థితి బలంగా ఉండాలి. ప్రస్తుతం మనదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన నేపథ్యంలో ఈ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయగలుగుతోంది. పక్కా ఇళ్లు, ఉచిత రేషన్‌, వైద్యసదుపాయం, గ్యాస్‌ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కిసాన్‌ సమ్మాన్‌ నిధి వంటివి అమలు చేయగలగడానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే. వచ్చే ఐదేళ్లకాలంలో దేశాన్ని మూడో బలీయమైన ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. అప్పుడు నిరుపేదల సంక్షేమం, మౌలిక సదుపాయాలకోసం ప్రభుత్వం మరింతగా ఖర్చుచేయ గలుగుతుంది. ఇందుకు జమ్ము-కశ్మీర్‌ మినహా యింపు కాదని ప్రధాని వివరించారు.

విద్యారంగానికి ప్రోత్సాహం

దేశంలో విద్యారంగం, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో రూ.13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఐఐటి భిలాయ్‌, ఐఐటి తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి, ఐఐటీడీఎం కర్నూల్లో శాశ్వత క్యాంపస్‌ భవనాలను, ఐఐటి పాట్నా, ఐఐటి రోపోర్‌లలో అకాడమిక్‌, నివాస భవన సముదాయాలను, దేవప్రయాగ (ఉత్తరాఖండ్‌), అగర్తలా (త్రిపుర)ల్లో సంస్కృత విశ్వవిద్యాలయాల శాశ్వత భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎం జమ్ము, ఐఐఎం బుద్ధగయల్లో శాశ్వత క్యాంపస్‌లను ప్రారంభించారు. అదేవిధంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ (ఐఐఎస్‌), కాన్పూర్‌ను ప్రారంభించారు. ఐఐఎస్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నైపుణ్య శిక్షణ సంస్థ.

ఇదే సమయంలో ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యున్నత విద్యా సంస్థలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ప్రస్తుత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పరచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులివి! వీటిల్లో సింధూ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐఐఐటి రాయ్‌చూర్‌లలో శాశ్వత క్యాంపస్‌ల నిర్మాణం, ఐఐటీ బొంబాయిలో శాశ్వత అకాడమిక్‌ బ్లాక్‌ నిర్మాణం, హాస్టల్‌, ఫ్యాకల్టీ క్వార్టర్లనిర్మాణం, ఐఐటీ గాంధీనగర్‌లో హాస్టల్‌, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బాలికల హాస్టల్‌ నిర్మాణం ఉన్నాయి.

ఎఐఐఎంఎస్‌ జమ్ము

జమ్ము`కశ్మీర్‌ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవ లందించే లక్ష్యంతో విజయ్‌ పూర్‌ (సాంబ), జమ్ములో ప్రధాని నరేంద్రమోదీ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎఐఐఎంఎస్‌)ను ప్రారంభిం చారు. 2019 ఫిబ్రవరిలో ఈ సంస్థకు శంకుస్థాపన చేసింది కూడా నరేంద్రమోదీనే. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద ఈ సంస్థను నెలకొల్పారు. మొత్తం రూ.1660 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎఐఐఎంఎస్‌లో 720 పడకలు, 125 సీట్లు కలిగిన మెడికల్‌ కళాశాల, 60 నర్సింగ్‌ సీట్లు, 30 పడకలతో కూడిన ఆయుష్‌ బ్లాక్‌ ఉన్నాయి. ఇంకా ఫ్యాకల్టీ, సిబ్బందికి నివాసాలు, యు.జి, పి.జి. విద్యార్థులకు హాస్టల్‌ సదుపాయం, నైట్‌ షెల్టర్‌, గెస్ట్‌హౌజ్‌, ఆడిటోరియం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వంటి సదుపాయా లను సమకూర్చారు. ఈ క్యాంపస్‌ నిర్మాణం 227 ఎకరాల్లో జరిగింది. 18 స్పెషలిస్ట్‌ విభాగాల్లో ఈ సంస్థ రోగులకు అత్యాధునిక వైద్యసేవలందిస్తుంది. అదేవిధంగా కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, ఎండో క్రెనాలజీ, బర్న్స్‌ & ప్లాస్టిక్‌ సర్జరీవంటి 17విభాగాల్లో సూపర్‌స్పెషాలిటీ సర్వీసులు ఈ సంస్థలో రోగులకు అందుబాటులో ఉంటాయి. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, ఎమర్జెన్సీ Ê ట్రౌమా యూనిట్‌, 20 మాడ్యులార్‌ ఆపరేషన్‌ థియేటర్లు, డయాగ్నస్టిక్‌ లేబొరేట రీలు, బ్లడ్‌ బ్యాంక్‌, ఫార్మసీ వంటి సదుపాయాలను కూడా ఎఐఐఎంఎస్‌ సంస్థలో కల్పించారు. సుదూర ప్రాంతాలకు అందు బాటులో ఉండాలన్న ఉద్దేశంతో డిజిటల్‌ హెల్త్‌కు సంబంధించిన మౌలిక సదుపాయా లను కూడా ఈ ఆసుపత్రిలో పొందుపరచారు.

జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌ భవనానికి శంకుస్థాపన

ప్రధాని నరేంద్రమోదీ జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. 40వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ భవనంలో అన్నిరకాల ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రద్దీ వేళల్లో రెండువేల మంది ప్రయాణికులు ఈ సదుపాయాలను వినియో గించుకో గలుగుతారు. ఈ భవనం పర్యావరణానికి హాని కలిగించని రీతిలో, స్థానిక సంస్కృతీ సంప్రదా యాలను ప్రతిబింబించే విధంగా నిర్మించనున్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో వర్తకం, పర్యాటకాలకు తగిన ప్రోత్సాహం లభించడమే కాదు, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఇది దోహదకారిగా ఉండగలదు.

రైలు ప్రాజెక్టులు

జమ్ము-కశ్మీర్‌లోని వివిధ రైలు ప్రాజెక్టులతోపాటు, బనిహల్‌-ఖా రి- సంబర్‌-సంగల్డాన్‌ (48 కి.మి.) రైల్వే లైను, బారాముల్లా` శ్రీనగర్‌` బనిహల్‌` సంగల్డాన్‌ సెక్షన్‌లో(185.66 కి.మి) విద్యుద్దీకరణ పూర్తయిన రైల్వేలైన్‌న్లను ప్రధాని ప్రారంభించారు. జమ్ము-కశ్మీర్‌లో తొలి విద్యుత్‌ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించడమే కాకుండా, సంగల్డాన్‌- బారాముల్లా స్టేషన్‌ల మధ్య రైలు సర్వీసును కూడా ప్రారంభించారు. బనిహల్‌-ఖారి-సంబర్‌-సంగల్డాన్‌ సెక్షన్‌లో రైల్వే లైను బల్లాస్‌ లెస్‌ ట్రాక్‌ (బీఎల్‌టీ) రకానికి (రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో ఇదోరకం) చెందినది కావడం విశేషం. దీనివల్ల ప్రయాణీకులు మంచి ప్రయాణ అనుభూతిని పొందగలరు. అదేవిధంగా ఖారి-సంబర్‌ మధ్య 12.77 కిలోమీటర్ల మేర నిర్మించిన అతిపెద్ద టి-20 సొరంగం ప్రత్యేక ఆకర్షణ. ఈ రైలు ప్రాజెక్టు పర్యావరణ హితమైనది కావడమే కాకుండా, ఈ ప్రాంతానికి అనుసంధానతో పాటు, ఆర్థికాభివృద్ధికి దోహదకారి కాగలదు.

రోడ్డు ప్రాజెక్టులు

ప్రధాని తన జమ్ము పర్యటనలో భాగంగా రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి రెండు ప్రధాన ప్యాకేజీలను ప్రారంభించారు. వీటిల్లో 42 కిలోమీటర్ల దూరం ఉండే ఢిల్లీ`అమృత్‌సర్‌`కట్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే ఒకటి. ఇది జమ్మును కట్రాతో కలుపుతుంది. ఇక రెండో ప్యాకేజీ శ్రీనగర్‌ రింగ్‌రోడ్డు రెండో దశ. జాతీయ రహదారి-01కు చెందిన 161 కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్‌`బారా ముల్లా`యూరి సెక్టార్‌లో స్థాయి పెంపుకోసం ఐదు ప్యాకేజీలు, జాతీయ రహ దారి-444కు చెందిన కుల్‌గామ్‌ బైపాస్‌ మరియు పుల్వామా బైపాస్‌ల నిర్మాణం మరో ప్రాజెక్టు.

ఢల్లీి`అమృత్‌సర్‌`కట్రా హైవే నిర్మాణం పూర్తయితే మాతా వైష్ణోదేవి దేవాల యాన్ని సందర్శించే భక్తులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. ఇదే సమయంలో ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతో దోహదకారి కాగలదు. శ్రీనగర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి రెండోదశలో చేపట్టిన నాలుగు లేన్ల రహదారి నిర్మాణంలో జాతీయరహదారి-01కు చెందిన సుంబాల్‌` వాయుల్‌ రహదారి స్థాయి పెంపు కూడా భాగంగా ఉంది. 24.7 కిలోమీటర్ల దూరం గల ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే శ్రీనగర్‌ పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు మానస్‌బల్‌`ఖీర్‌ భవానీ దేవాలయాలకు అనుసంధానత కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో లేప్‌ా, లద్దాఖ్‌లకు ప్రయాణకాలం కూడా గణనీయంగా తగ్గడం మరో విశేషం. జాతీయ రహదారి-01కు చెందిన 161 కిలోమీటర్ల శ్రీనగర్‌` బారాముల్లా`యూరి రహదారి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఇదే సమయంలో బారాముల్లా, యూరి, జాతీయ రహదారి-444కు చెందిన కుల్గామ్‌ బైపాస్‌, పుల్వామా బైపాస్‌లు… ఖాజీగుండ్‌` కుల్గామ్‌`సోపియాన్‌`పుల్వామా`బద్గామ్‌`శ్రీనగర్‌లను అనుసంధానించడం వల్ల, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా పెరుగుతాయి.

సీయూఎఫ్‌ పెట్రోలియం డిపో

ప్రధాని నరేంద్రమోదీ జమ్ములో కామన్‌ యూజర్‌ ఫెసిలిటీ (సీయూఎఫ్‌) పెట్రోలియం డిపోకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ వ్యయం రూ.677 కోట్లు. దీని నిల్వ సామర్థ్యం లక్ష కిలోలీటర్లు. ఇందులో మోటార్‌ స్పిరిట్‌ (ఎంఎస్‌), హైస్పీడ్‌ డీజిల్‌ (హెచ్‌ఎస్‌డీ), సూపర్‌ కిరోసిన్‌ ఆయిల్‌ (ఎస్‌కేఓ), ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌), ఇథనాల్‌, బయోడీజిల్‌, వింటర్‌ గ్రేడ్‌ హెచ్‌ఎస్‌డీని నిల్వ చేయవచ్చు.

ఇతర ప్రాజెక్టులు

ప్రధాని నరేంద్రమోదీ ఇంకా రూ.3150కోట్ల విలువైన ఇతర పౌర అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. జమ్ము`కశ్మీర్‌లో పౌర సదుపాయాల కల్పనకోసం ఈ ప్రాజెక్టులను ఉద్దేశించారు. వీటిలో రోడ్లు, వంతెనలు, గ్రిడ్‌ స్టేషన్లు, రిసీవింగ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వివిధ కళాశాలల భవనాల నిర్మాణాలు, శ్రీనగర్‌ నగరంలో ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ, ఆధునిక నార్వెల్‌ ఫ్రూట్‌ మండి, కథువాలో ఔషధాల పరీక్షాకేంద్రం, గండెర్‌వాల్‌, కుప్‌వారాల్లో 224 ఫ్లాట్లు వంటివి ఉన్నాయి. శంకుస్థాపన చేసిన వాటిల్లో జమ్ము-కశ్మీర్‌లో ఐదు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లు కూడా ఉండటం విశేషం. జమ్ము స్మార్ట్‌ సిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అవసర మైన డేటా సెంటర్‌, డిశాస్టర్‌ రికవరీ సెంటర్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. శ్రీనగర్‌లోని పరింపురలో ట్రన్స్‌పోర్ట్‌నగర్‌ స్థాయిపెంపు, 62 రోడ్డు, 42వంతెనల ప్రాజెక్టుల స్థాయిపెంపు, అనంతనాగ్‌, కుల్గామ్‌, కుప్వారా, సోపియాన్‌, పుల్వామా తదితర ప్రాంతాల్లో 2816 ప్లాట్లకు శంకు స్థాపన చేశారు.

స్విట్జర్లాండ్‌కు పోటీగా…

ప్రపంచంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా పేరుపొందిన స్విట్జర్లాండ్‌కు పోటీగా, జమ్ము` కశ్మీర్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శరవే గంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రోడ్లు, రైలు, విమానా శ్రయాలను మరింతగా విస్తరించే పనిలో పడిరది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని పర్యటించారని విమర్శించేవారు ఎలాగూ ఉం టారు. కానీ చేసిన అభివృద్ధిని చూపి, చేయబోయే అభివృద్ధిని విడమరచి చెప్పడం ప్రభుత్వాధినేతగా ప్రధాని బాధ్యత! దాన్ని నరేంద్రమోదీ సమర్థవంతంగా చాక చక్యంగా నిర్వర్తిస్తున్నారు. 2019 ఆగస్టులో 370వ అధికరణాన్ని రద్దుచేసిన తర్వాత మోదీ జమ్ములో పర్యటించడం ఇది రెండోసారి. మౌలానా ఆజాద్‌ స్టేడియంలో ప్రధాని 30నిముషాలకు పైగా ప్రసంగించారు.   ఈ సందర్భంగా ప్రధాని సభకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనడం విశేషం. 2013లో తాను ప్రధాని కాకముందు నరేంద్రమోదీ ఇదే స్టేడియంలో ‘‘లల్‌కార్‌ ర్యాలీ’’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2022 ఏప్రిల్‌లో కూడా నరేంద్రమోదీ సాంబలో నిర్వహించిన సభకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నిజం చెప్పాలంటే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ, జమ్ము`కశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఉగ్రవాదం, హింస, విధ్వంసంతో అట్టుడికిపోతున్న జమ్ము`కశ్మీర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి, దేశ ప్రధాన స్రవంతిలో కలపాలన్న లక్ష్యంతో గట్టిగా కృషి చేశారు… చేస్తున్నారు. ఈ కృషి సత్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని సుస్థిరంగా కొనసాగేవిధంగా చూడాల్సిన బాధ్యత జమ్ము-కశ్మీర్‌ ప్రజలది. వారు ఉగ్రవాదం, మత ఛాందస వాదాలను దరిచేరనీయనప్పుడే సాధిస్తున్న అభివృద్ధి సుస్థిరంగా మనగలుగుతుంది.


భారత్‌లో భద్రంగా ఉన్నాను, కశ్మీర్‌లో స్వేచ్ఛగా ఉన్నాను

‘‘భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లో నేను భద్రంగా ఉన్నాను. స్వేచ్ఛగా ఉన్నాను.’’ అన్నారు కశ్మీర్‌ సామాజిక కార్యకర్త యానా మీర్‌. బ్రిటిష్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ మాటలు అన్నారు. సంకల్ప దివస్‌ సందర్భంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ యానా, తాను స్వదేశం వీడి పారిపోయిన మలాలా యూసుఫ్‌జాయిని కాదని కూడా అన్నారు. ముస్లిం ఉగ్రవాదుల బెదిరింపులతో మలాలా పాకిస్తాన్‌లోని స్వాత్‌ లోయ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘నేను మలాలా యూసుఫ్‌ జాయిని కాదు. ఎందుకంటే నా దేశంలో నేను భద్రంగా ఉన్నాను. నేను పుట్టిన గడ్డ కశ్మీర్‌లో స్వేచ్ఛగా కూడా ఉన్నాను. అది భారత్‌లో అంతర్భాగం అని యానా వ్యాఖ్యానించారు. నా దేశం నుంచి పారిపోయి వేరే ఎక్కడో ఆశ్రయం పొందవలసిన అవసరం తనకు లేదని కూడా యానా అన్నారు. నా మాతృదేశ ప్రతిష్టను మలాలా అవమానిస్తే అంగీకరించబోనని కూడా స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న నా దేశంలో ఎవరినో అణచివేస్తున్నారు వంటి ఆరోపణలు సరికాదని యానా అన్నారు. ఏనాడూ కశ్మీర్‌లో పర్యటించడానికి సాహసం చేయకుండా ఇలా జాతీయ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసే టూల్‌కిట్‌ సభ్యుల మాటలను తాను ఖండిస్తున్నానని కూడా యానా స్పష్టం చేశారు.

2012లో మలాలా మీద తాలిబన్‌ స్వాత్‌ లోయలో దాడి జరిపారు. బాలికల విద్యను తాలిబన్‌ నిషేధించినందుకు నిరసనగా ఆమె గళమెత్తి దాడికి గురయ్యారు. తరువాత పాక్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లి పోయారు. ఆక్స్‌ఫర్డ్‌లో చేరిన తరువాత ఆమె అతి పిన్న వయసులో నోబెల్‌ శాంతి పురస్కారం అందుకున్నారు. మలాల సహా  ఇంగ్లండ్‌లో ఉంటూ భారత్‌పై దుష్ప్రచారం చేసే వారంతా ఆ పని మానుకోవాలని యానా విజ్ఞప్తి చేశారు. ఇంగ్లండ్‌లో కూర్చుని భారతీయులను విడదీసే ప్రయత్నం ఆపాలని కూడా ఆమె కోరారు. మీ ప్రచారాలు ఆపండి, కశ్మీరీలను ప్రశాంతంగా బతకనివ్వండి. జైహింద్‌ అని ఉపన్యాసం ముగించారు యానా. డైవర్సిటీ అంబాసెడార్‌ పురస్కారం అందుకున్న యానా, 370 రద్దు తరువాత కశ్మీర్‌లో జరిగిన పురోగతి గురించి కూడా వివరించారు.


జమ్మూలో ప్రధాని నరేంద్రమోదీ మ్యాజిక్‌

*   ఐఐటి భిలాయ్‌, ఐఐటి తిరుపతి, ఐఐఐటిడిఎం కర్నూల్‌, ఐఐఎం బుద్ధగయ, ఐఐఎం జమ్ము, ఐఐఎం విశాఖపట్నం, ఇండియన్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ (ఐఐఎస్‌) కాన్పూర్‌ విద్యా సంస్థల క్యాంపస్‌లు జాతికి అంకితం.

*  దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన.

* జమ్ము ఎఐఐఎంఎస్‌ ప్రారంభం.

*     జమ్ము విమానాశ్రయం నూతన టెర్మినల్‌ భవనానికి, కామన్‌ యూజర్‌ ఫెసిలిటీ పెట్రో లియం డిపోకు శంకుస్థాపన.

*   జమ్ము`కశ్మీర్‌లో పౌర సదుపాయాలు,  మౌలిక వసతులకు  సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.

*  వికసిత్‌ జమ్ము`కశ్మీర్‌ కార్యక్రమం కింద యువత, మహిళలు, రైతులు, నిరు పేదలపై ప్రత్యేక దృష్టి.

*  సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ అనేవి జమ్ము-కశ్మీర్‌ అభివృద్ధికి పునాదులు.

*  మొట్టమొదటిసారి జమ్ము-కశ్మీర్‌ ప్రజలకు రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం అందుబాటులోకి రావడం.

*  370వ అధికరణం రద్దుతో జమ్ము-కశ్మీర్‌ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోవడం.

*    వికసిత్‌ జమ్ము`కశ్మీర్‌ను వీక్షిస్తూ ఉత్తేజం పొందుతున్న ప్రపంచం.


ప్రధానితో లబ్ధిదారుల ముఖాముఖి

*  వీణాదేవి (కిస్తివార్‌జిల్లా): ఉజ్వల యోజన పథకం వల్ల సమయం ఎంతో ఆదా అవుతోంది. అంతకుముందు వంటచెరకు కోసం అడవికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం ఎంతో కాలహరణం జరిగేది. ప్రస్తుతం ఉజ్వల యోజన కారణంగా నాకోసం, నా కుటుంబం కోసం కొంత సమయాన్ని వెచ్చించే అవకాశం కలిగింది.

* కీర్తి శర్మ (కతువా): రాష్ట్రీయ అజీవిక అభియాన్‌ లబ్దిదారు. ఈ పథకాన్ని స్వయం సహాయక గ్రూపులకు అనుసంధానించడం ఎంతో ప్రయోజన కరమైంది. తొలుత రూ.30వేలతో షెడ్‌ను  నిర్మించి గోవుల పెంపకాన్ని  ప్రారంభించగా, ఈ పథకం కింద మరో రూ.లక్ష రుణం లభించడంతో అదనంగా మూడు ఆవులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈమె గ్రూపుకింద 30 ఆవులున్నాయి. బ్యాంకు రుణం పూర్తిగా తీర్చివేశారు.

* లాల్‌ మహమ్మద్‌ (పూంచ్‌): పాక్‌ సరిహద్దు ప్రాంతంలో తనకు మట్టి ఇల్లు ఉండగా, పాక్‌ రేంజర్ల కాల్పులకు గోడలు దెబ్బతినేవని, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.1,30,000 సహాయం అందడంతో పక్కా ఇంటిని నిర్మించుకున్నట్టు తెలిపాడు.

* షహీనా బేగం (బందిపుర): ఈమె సోషియాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. ఉద్యోగం దొరకలేదు. స్వయం సహాయక గ్రూపులో చేరి రుణసహాయంతో తేనెటీగల పెంపకాన్ని చేపట్టింది. తర్వాత జాతీయ జీవనోపాధి మిషన్‌ కింద సహాయం పొంది ఈ ప్రాజెక్టును మరింత విస్తరించింది. అంతేకాదు తాను ప్రారంభించిన కోళ్లపెంపకం వ్యాపారానికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఏవిధంగా ఉపయోగపడిరది కూడా ప్రధానికి వివరించారు.

*  రియాజ్‌ అహమ్మద్‌ కోలి (పుల్వామా): ఈయన జల్‌జీవన్‌ మిషన్‌ లబ్దిదారు. ప్రస్తుతం తమ గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా పైప్‌లైన్లు ఉన్నాయని ప్రధానికి తెలిపారు. 370 అధికరణం రద్దు తర్వాత తన భూమిపై ఆస్తి హక్కులు లభించాయని ఆనందంగా వెల్లడిరచారు.


నా ఆశిస్సులు ఉంటాయి

ప్రధాని జమ్ము పర్యటనలో భాగంగా మౌలానా ఆజాద్‌ మైదానంలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సభకు వచ్చిన ఒక వ్యక్తి తన చిన్నారిని చేతులతో ఎత్తి పట్టుకుని మోదీ ఆశీస్సులు కోరారు. వెంటనే మోదీ తన ఉపన్యాసాన్ని ఆపివేసి నా ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఈ చలిలో ముందు చిన్నారిని జాగ్రత్తగా చూడండి అని సూచించారు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram