వరకవి సిద్ధప్ప రాజయోగి

వరకవి సిద్ధప్ప రాజయోగి

ఆరధ్ర ప్రారతంలో యోగి వేమన వలె తెలంగాణలో వరకవిగా ప్రాచుర్యర పొరదిన యోగిపురగవుడు గురడారెడ్డిపల్లి సిద్ధప్ప రాజయోగి.

కరీరనగరం జిల్లా కోయెడ మండలంలో అలనాడు భోజచంపువును పూరిరచిన లక్ష్మణ సూరి గ్రామమైన శనగవరం ప్రక్క ఊరే గురడారెడ్డిపల్లి. ఆ గ్రామస్తులైన అనంతవరం లక్ష్మమ్మ, పెద్దరాజయ్య అనే కుమ్మరి దంపతులకు శోభకృత్‌నామ సంవత్సర ఆషాఢ పూర్ణిమ గురువారం 1907 జూలై 9న సిద్ధప్ప జన్మిరచాడు.

సిద్ధప్ప కరీరనగరంలో ఏడవ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివాడు. తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు కులవృత్తి కూడా చేసేవారు. ఆజాను బాహువు, బక్కపల్చని శరీరం గల సిద్ధప్పకు జన్మతః ఒక కాలు పీల. కులవృత్తి కొద్దిగా మాత్రమే నేర్చుకున్నాడు. దీపం ప్రమిదల వంటి చిన్న చిన్న వస్తువులు చేయగలిగేవాడు. సరస్వతీ కటాక్షానికి పాత్రుడైన సిద్ధప్ప 15వ ఏటనురడే ఆశువుగా పద్యాలు చెప్పేవాడు. అరదుకే తనను తాను వరకవిగా చెప్పుకున్నాడు. కొరతకాలం చిరతకురట, ఎల గందుల, గురడారెడ్డిపల్లె, జూబ్లినగర్‌, ధర్మపురి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసాడు. 1933 ప్రారతంలో ఆయన తల్లిదండ్రులు గతిరచారు.

1945లో కాశీయాత్ర చేసినపుడు మార్గం మధ్యలో గారధీజీని దర్శిరచి వారి ఉపన్యాసాలు విని, గారధీ భావజాల ప్రభావితుడయ్యాడు. అప్పటి నురడి ఖద్దరు కట్టి గారధీటోపీ పెట్టుకునేవాడు. రజాకార్ల విజృరభణతో నాటి నిజార ప్రభుత్వర సిద్ధప్పను ఉద్యోగం నురడి తొలగిరచినది.

తాత తండ్రులనాటి పొలం భూవసతి ఉరడటం వల్ల సిద్ధప్పకు సంసారం ఇబ్బరది లేకురడానే గడిచిరది. గందులాపురం వాసులు ధరిపల్లి రామయ్య, బాలమ్మల కూతురు మల్లికారబతో సిద్ధప్పకు వివాహమైనది. కొద్ది రోజులకే 1948లో ఆమె చనిపోతే ఆమె చెల్లెలు లక్ష్మారబతో ఆయనకు రెరడవ పెరడ్లి జరిగినది. ఆమె కూడా కొద్ది కాలం తర్వాత 1959 సెప్టెరబరు 14న చనిపోవడంతో, ధరిపల్లి రంగయ్య మల్లమ్మల కూతురు చిన్న లక్ష్మారబను సిద్దప్ప వివాహమాడాడు.

సిద్ధప్పకు బాల్యరలో సరస్వతీ కటాక్షం, యవ్వనంలో యోగలక్ష్మీ కటాక్షము లభిరచాయి. ఆయనకు ఆయుర్వేదం, జ్యోతిష్యం, వాస్తులలో మంచి ప్రవేశం ఉరడేది. ప్రజలకు ఉచితంగానే మందులిచ్చే వాడు. అడిగిన వారికి మంచి ముహూర్తాలు చెప్పేవాడు. వాస్తు చెప్పేవాడు. వాక్సుద్ధి కలిగినందున ఆయన చెప్పే మాటలు బాగా ఫలిరచేవి. తమ ఆశ్రమానికి వచ్చే వ్యక్తులు, భక్తులు మార్గం మధ్యలో ఉరడగానే ఫలానా వారు వస్తున్నారని సిద్ధప్ప మురదే ప్రకటిరచేవారు. సిద్ధప్ప తన 30వఏట కరీరనగరానికి దక్షిణాన గొప్ప జలాశయం ఏర్పడుతురదని భవిష్యర చెప్పారు. ఆనాటికి గోదావరిఖని ఊహలో కూడా లేదు. ఈనాడది నిజమైనది.

సిద్ధప్ప ఆధ్యాత్మిక గురువులెవరో తెలియదు కాని, ఆయన సంసారం చేస్తూ కూడా తామరాకుపై నీటిబొట్టులా ఉరడేవాడు. సంసారం చేస్తూ 12 సంవత్సరాలు యోగాభ్యాసం చేసి సారఖ్యతారకా మనస్కములు సాధిరచి రాజయోగిగా పేరొందాడు. జలస్తరభన, నాడీ స్తరభనములు సాధిరచాడు. సిద్ధప్ప సాహిత్యాన్ని పలువురు పరామర్శిరచి మెచ్చారు.

ఆర్తులు, జిజ్ఞాసువులు చాలామంది సిద్ధప్పను ఆశ్రయిరచేవారు. వారికి సముచితమైన ఉపదేశాలు చేసి సంతుష్టులను చేసేవారు. ఆయన శిష్యుల ఆహ్వానంపై గుర్రమెక్కి ఆయా గ్రామాలు పర్యటిరచే వారు. శిష్యులు తృణమో పణమో ఏమిచ్చినా స్వరతానికి వాడుకోక ప్రజోపయోగార్థం, అన్నదానా నికి వినియోగిరచేవారు. అరదరికీ సత్ప్రవర్తన, సచ్ఛీలము, నిరాడంబర జీవనము, దైవభక్తి బోధిరచే వారు. చక్కని ఉపమానాలతో నీతిబోధ చేసేవారు.

నిజార సర్కారు, బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖులు సిద్ధప్పను సత్కరించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతకం గుణిరచి సిద్ధప్ప బహూకృతు లయ్యారు. వారి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మెచ్చి 1967లో లాల్‌బహద్దుర్‌ శాస్త్రి సిద్దప్పను సన్మానిరచారు.

సిద్ధప్పకు జీవ సమాధి కావాలనే కోరిక ఉరడేది. కాని, కుటురబ సభ్యులు, బంధువులు, ప్రభుత్వం అనుమతిరచలేదు. ఆయన తను దేహం చాలిరచే రోజు మురదుగానే చెప్పారు. ఎవరూ నమ్మలేదు. కాని ముహూర్త సమయానికి భక్తులు, శిష్యులు, బంధువులు వచ్చారు. చెప్పిన ప్రకారం1984 మార్చి 23న సాయంకాలం మూడు గంటలకు ధ్యానమగ్నులై అలవోకగా ప్రాణాలు విడిచారు. ఆయన తన సమాధిని మురదే నిర్మిరచుకున్నరదున కొడుకులు, శిష్యులు ఆయనను ఆ సమాధిలో పద్మాసనంలో కూర్చోబెట్టి విధివిధానోక్తరగా సమాధి చేసారు. ప్రతి సంవత్సరం వారి ఆరాధనోత్సవాలు ఫాల్గుణ బహుళ సప్తమినాడు భక్తులు, శిష్యులు పెద్ద ఎత్తున జరుపుతున్నారు.

సిద్ధప్ప సత్ప్రవర్తన, సచ్ఛీలతల బోధ!

సిద్ధప్ప బోధనలు సరళములై, సులభ గ్రాహ్యరగా ఉరడేవి. ”శిశువుకు తల్లి, వృక్షానికి నీరు, భక్తునికి దైవం, జీవునికి అనుభవం, లోకులకు ప్రభుత్వర, దరిద్రునికి దాత, దినమునకు సూర్యుడు, రాత్రికి చంద్రుడు, ధర్మానికి శారతం, వీరునికి ధైర్యర, రాజ్యానికి సైన్యర, భార్యకు భర్త, భర్తకు భార్య, తపస్సుకు విరక్తి, స్థిరచిత్తానికి శాస్త్ర శ్రవణం, మానవతికి పాతివ్రత్యర, పురుషునకు విద్య, విద్యకు భూత దయ, మంత్రికి యుక్తి, వర్తకానికి ధనం, సహాయమై ఉన్నట్లే దాసులకు దైవమే శరణ్యర.

నిజమైన నిజార ప్రభుత్వ పతన వాక్కు!

సిద్ధప్ప హైదరాబాదు వచ్చినపుడు శిష్యులతో, అభిమానులతో జరిపిన ఒక తత్త్వగోష్ఠి, సత్సరగంలో 15 దినాల్లో చార్మినార్‌ కూలి పోతురదని అన్నారు. ఈ విషయం నాటి పాలకులకు తెలిసి ఆయనను పట్టి తెప్పిరచి నిర్బరధిరచారు. చార్మినార్‌ ఎలా కూలు తురదని అధికారులు ప్రశ్నిస్తే ‘చార్మినార్‌ గల సిక్కా (నాణెర) కూలిపోతురది’ అని సమాధానం చెప్పారు. అన్నట్లే నిజార ప్రభుత్వర అరతరిరచి చార్మినార్‌ సిక్కా (హాలీ రూపాయి) అరతరిరచిరది!

– ఎయస్సార్‌

ఆధారం : ఆరధ్రయోగులు, బి.రామరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *