వినోదాన్ని పంచేందుకు…!

వినోదాన్ని పంచేందుకు…!

శాస్త్రసాంకేతిక పరిశోధనలలోని వికృతులు, ఆవిష్కరణలలోని వికారాలు ప్రపంచానికి తెలియనివి కావు. అవే ఇతివృత్తాలుగా కొంత సాహిత్యం వచ్చింది. ‘ఎవరి పిచ్చి వారికానందం’ నాటిక అలాంటి రచన. కొండూరి కాశీవిశ్వేశ్వర రావు ఈ నాటిక రాశారు. మనిషి వందేళ్లు బతకడం ఎలా? అందునా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతకడం ఎలా? అనే అంశం మీద శాస్త్రవేత్త అమర్‌నాథ్‌ పరిశోధన చేస్తూ ఉంటాడు. ఇతడు తయారు చేసిన మందు ఒక హార్మోనిస్టు, క్రికెటర్‌, సైన్యంలో పనిచేస్తున్న జవాను తాగడంతో వచ్చిన పరిణామాలను హాస్యస్ఫోరకంగా చెప్పాలని రచయిత ప్రయత్నించారు. ఆరోగ్యంతో పాటు ఆదర్శవంతమైన జీవితం కూడా ఉండాలని మనం కోరుకోవాలి. అప్పుడే జీవితానికి సాఫల్యం.

ఎవరి పిచ్చి వారికానందం

(హాస్య నాటిక)

రచన : కొండూరి కాశీవిశ్వేశ్వరరావు

పుటలు : 30,

వెల : రూ.50/-

ప్రతులకు : రచయిత పేరిట: ఫ్లాట్‌ నం. 103,

ఎన్‌బిఆర్‌ కాంప్లెక్స్‌, ఎన్‌బిఆర్‌ కాలనీ, మీర్‌ పేట,

హైదరాబాద్‌, 500097, ఫోన్‌: 9290969633

–  శ్రీరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *