విశుద్ధ, విస్పష్ట తీర్పు కావాలి !

విశుద్ధ, విస్పష్ట తీర్పు కావాలి !

‘సత్యమేవ జయతే!’ మన జాతీయ నినాదం. కనుక ప్రజా జీవన రంగాలన్నిటా సత్యమే గెలవాలి. ప్రజలే పాలకులైన ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే వారు తమ రాజకీయ పార్టీలకు, ఎన్నుకున్న ప్రజలకు ఇరువురికీ ప్రతినిధులు. కనుక ప్రజలు తాము ఎన్నుకునే పార్టీలు, వారి అభ్యర్థులు ఇరువురి సత్యనిష్ఠను గమనించి ప్రతినిధులను ఎన్నుకోవాలి. అభ్యర్థులు పార్టీ వారయినా, స్వతంత్రులు అయినా స్థానికులైతే ప్రజలకు బాగా తెలిసి ఉంటారు కనుక వారి సత్య నిష్ఠ, మంచి చెడులను బేరీజు వేసుకోవడం సులువే. కాని స్థానికేతరులు పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగినప్పుడు అభ్యర్థి వ్యక్తిగత మంచి చెడులకన్నా పార్టీ మంచి చెడుల ఆధారంగానే ఓటేస్తుంటారు. పార్టీల సిద్ధాంతాలు, ఆచరణ చూసి ప్రజలు పార్టీల మంచి చెడుల బేరీజు వేస్తారు.

చాలాచోట్ల మంచి పార్టీ, మంచి వ్యక్తి రెంటినీ చూసి ఎన్నుకోవడం జరుగుతురటురది. దాంతో పార్టీ నచ్చినా అభ్యర్థి మంచివాడు కాడనుకున్నప్పుడు, అభ్యర్థి మంచివాడయినా పార్టీ నచ్చనప్పుడు ఓటమి సంభవిస్తుంటుంది. అలాగే పార్టీ, వ్యక్తి ఇరువురికీ ప్రజల్లో మంచి పేరు లేనప్పుడు సంభవించే పరాజయం చాలా ఘోరంగా ఉరటురది. కొన్నిసార్లు మంచి వ్యక్తులు చెడ్డపార్టీనురడి, చెడ్డ వ్యక్తులు మంచి పార్టీ నుండి అభ్యర్థులుగా ఎన్నికల్లో తారసిల్లి ప్రజలకు పరీక్ష పెడుతుంటారు. బహుళ పార్టీల వ్యవస్థ అమల్లో ఉన్నందున ఒకటి రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకుని, లేదా వివిధ పార్టీలు కూటమిగా ఏర్పడి అభ్యర్థులను రంగంలోకి దింపినప్పుడు ప్రజలు మరింత కఠిన పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంటుంది.

రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు వారి పార్టీ ఆదేశాలను పాటించక తప్పదు. కనుక సైద్ధాంతికంగా తమపార్టీతో విభేదించే పార్టీ అభ్యర్ధికి సైతం అనుకూలంగా ప్రచారం చేసి, అతనికి ఓట్లేయమని ప్రజలను అడుగుతారు. సాధారణ ప్రజలు ఇలాంటి సందర్భాల్లో మరింత విచక్షణతో ఓటు హక్కును వినియోగిస్తుంటారు. విభిన్న పార్టీలు కూటమి కట్టడం వెనుక దాగినవి ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలా, ప్రజల ప్రయోజనాలా! అనే అంశాన్ని తొలుత నిర్ధారించుకుంటారు. ఆ తరువాత తమ ముందుకు వచ్చిన అభ్యర్థి మంచి చెడులను పరిశీలిస్తారు. అన్నిటికీ సానుకూల సమాధానం లభిస్తేనే కూటమి అభ్యర్థిని గెలిపిస్తారు. సానుకూల సమాధానాలు రానప్పుడు కూటమి అభ్యర్థులకు సైతం ఓటమి తప్పదు.

కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడల ఫలితంగా తెలుగు ప్రజలకు బహుళపార్టీల, కూటముల మధ్య తెలివిగా మెలగడం అలవడిరది. తమ అభీష్టం ప్రకారం అధికార, ప్రతిపక్షాల స్థానాలను నిర్ణయించడం నేర్చుకున్నారు. శ్రీమతి ఇందిర విధించిన 1975 నాటి ఎమర్జెన్సీ అనంతరం వేర్వేరు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న జనతా పార్టీని ప్రజలు దేశం అంతటా గెలిపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయినా తెలుగునాట ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతో 1983లో యన్టీఆర్‌ స్థాపించిన తెదేపా ప్రభంజనానికి తెలుగునాట కాంగ్రెస్‌ మట్టి కరిచింది. యన్టీఆర్‌ నాయకత్వరలో తెదేపా ఒంటరిగా గెలిచింది, ఓడింది కూడా. అలాగే ఇతరులతో జట్టు కట్టినప్పుడూ గెలుపోటములను చవి చూసిరది. పార్టీ పగ్గాలను, అధికారాన్ని 1995లో చంద్రబాబు కైవసం చేసుకున్న నాటి నురడి ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో ప్రజలు ఒరటరిగా తెదేపాను గెలిపిరచనే లేదు. అరటే కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన తెలుగు ప్రజలు యన్టీఆర్‌ నాయకత్వాన్ని కోరుకున్నారు గాని, చంద్రబాబు నాయకత్వాన్ని కాదని చెప్పకనే చెప్పారు. ఇతరులతో జట్టుకట్టినప్పుడు గెలిచిన అనుభవాల ఆశతోనే ఆయన నేటి తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమికి తెరతీశారని తోస్తున్నది. ఈ పరిస్థితి తెలంగాణ తెలుగు ప్రజలకు గడ్డు పరీక్ష. అధికార పక్షాన్ని మార్చాలని వారు అనుకోకపోతే సులువే. కాని అధికార, విపక్షాలను తారుమారు చేయాలనుకురటే అంత సులువుగా కనిపించడం లేదు. అధికార పక్షంగా తెరాస, విపక్షంగా బిజెపి మాత్రమే ఒరటరిగా పోటీ చేస్తున్నాయి. విపక్షాల్లో కారగ్రెస్‌, తెదేపా తదితర పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. విపక్షం నుండి బిజెపిని గెలిపించాలా, కూటమిని గెలిపించాలా, కూటమిలో అధికార పక్షాన్ని ప్రజలు నిర్ణయించ గలరా! అన్నీ సందేహాలే. ఈ క్లిష్ట పరిస్థితులను తెలంగాణ ప్రజలు అధిగమించగలరని, విశుద్ధమైన, విస్పష్ట తీర్పు ప్రకటితం కాగలదని ఆశిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *