విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలిచే విధానం కావాలి

విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలిచే విధానం కావాలి

విద్యారంగంలో జరుగుతున్న ప్రయోగాలతో మన యువత భవిత అతలాకుతలమవుతోరది. విద్యావ్యవస్థ మొత్తం బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించలేదు. అలాగని ప్రయివేటు రంగానికి వదిలేయనూ లేదు. కొంతమేర ప్రభుత్వమే బరువు బాధ్యతలను మోస్తుండగా ప్రయివేటు రంగానికి అవకాశం ఇచ్చిన చోట నియంత్రణ బాధ్యతలను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దాంతో ప్రభుత్వ, ఎయిడెడ్‌, గుర్తింపు పొందిన అని పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయిదాకా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో విద్య కొనసాగుతోరది.

పాఠశాల స్థాయిలో డిటెన్షన్‌ అని, నో డిటెన్షన్‌ అని, పలురకాల ప్రయోగాలు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవరోధాలుగా పరిణమిస్తున్నాయి. ఏటేటా పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి పై తరగతులకు అనుమతించే విధానం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగి విద్యార్థి అసలు విద్యకే దూరం అవుతున్నాడని భావిరచి ‘నో డిటెన్షన్‌’ పద్ధతి ప్రవేశపెట్టారు. నో డిటెన్షన్‌ పద్ధతివల్ల మధ్యలో బడిమానేసే విద్యార్థుల (డ్రాపవుట్స్‌) సంఖ్య తగ్గింది. కానీ శ్రద్ధగా చదవాలని ఇటు విద్యార్థుల్లోను, బోధించాలని ఇటు ఉపాధ్యాయుల్లోను బాధ్యత కనిపించడం లేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడిరది. పాఠశాల విద్య పూర్తిచేసిన వారిలో కూడా భాష, గణితం, సాధారణ జ్ఞానం వంటి విద్యా విషయాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు కనిపించడంలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ నిర్వహించే వార్షిక విద్యా స్థాయి నివేదిక ప్రకారం 14-18 సంవత్సరాల వయసు గ్రామీణ యువత విద్యాకౌశలాలు నిరాశ కలిగిస్తున్నాయి. మాతృభాషలో సరిగా చదవలేనివారు 25శాతం, ఒక్క ఆంగ్ల వాక్యాన్ని కూడా చదవలేనివారు 47శాతం, కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారం వంటి సరళ లెక్కలు చేయలేని వారు 52శాతం, కరెన్సీ నోట్లను సరిగా లెక్కించలేని వారు 24శాతం, బరువులు తూకాలు సరిగా లెక్కించలేని వారు 44శాతం, గడియారంలో సమయం సరిగా లెక్కిరచలేని వారు 40శాతం ఉన్నారని తెలుస్తోరది. పాఠశాల విద్య ప్రమాణాల మాదిరే ఉన్నత విద్యలో డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత ఘోరం. దేశవ్యాపితంగా గుర్తింపు పొందిన డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు 124 ఉంటే వాటిల్లో సరైన ప్రమాణాలు కలిగినవి సగం కూడా లేవు.

పునాది గట్టిగా లేని నిర్మాణాలు నివాస యోగ్యత పొందజాలనట్లు నాణ్యతా ప్రమాణాలు లేని పాఠశాల విద్యతో ముందుకు సాగి డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల వేటలో పడిన వారిలో 20శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా తేలుతున్నారు. పాఠశాల విద్యస్థాయిలో దాచిన డొల్లతనం ఉన్నత విద్య పూర్తయ్యాక తెలిసివచ్చి మొత్తం విద్య నిరుపయోగం అవుతున్నది. ఇంజనీరింగు సహా వివిధ డిగ్రీ పట్టాలతో వెలికి వచ్చిన వేలాది విద్యావంతులు ఏళ్లు గడచిపోతున్నా తమకు సంబంధిరచిన రంగాల ఉద్యోగ పరీక్షల్లో సఫలం కాలేకపోవడం విషాదం. ప్రయివేటు అయిన ప్రతి చోటా విద్య వ్యాపారంగా పరిణమించింది. విద్యావ్యాపారులు విద్యార్థులను లాభాలు పండించే ముడిసరుకుగా మార్చుకున్నారు. లాభాల వేటలో పడిన విద్యావ్యాపారులు తాము ఉత్పత్తి చేసి వదులుతున్న సరుకు నాణ్యత గురించి శ్రద్ధ వహించడం లేదు. దాంతో డబ్బురూపంలో విలువైన కుటుంబ శ్రమ, మరింత విలువైన కాలం మంటగలిసిపోగా యువత రెంటికి చెడిన రేవడుల్లా మిగులుతున్నారు. నాసిరకం వస్తువుల ఉత్పత్తి దేశ పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నష్టపరచినట్లే కనీస నాణ్యత ప్రమాణాలు లేని విద్యావంతులు తమ జీవన పురోగతికి, దేశ ప్రగతికి నష్టదాయకంగా పరిణమిస్తారు.

విద్యార్థిశక్తి జాతీయ శక్తి అని గుర్తించని ప్రభుత్వాలు విద్యావ్యాపారులు ఆడింది ఆట, పాడింది పాట కావడాన్ని అనుమతించాయి. విద్యావ్యాపారులు వెలుపల ఉండి తమ ఆర్థిక శక్తితో ప్రభుత్వాలను, పాలకులను ప్రభావితం చేసిన ఫలితాలు ఇరత అధ్వానంగా ఉంటే ఇక విద్యావ్యాపారులే స్వయంగా ప్రభుత్వంలో భాగమై పాలకులుగా మారిన కాల పరిస్థితులు ఎరత ఘోరంగా ఉంటాయో ఊహించడానికే భయమేస్తున్నది. రేపటి తరానికి ఉజ్జ్వల భవిత, దేశ సౌభాగ్యర కోరి ప్రజలు మేలుకోవాలి. మోసపూరిత ఎన్నికల వాగ్దానాల మాయలో, ఓటుబ్యాంకు రాజకీయాల ఉచ్చులో పడిపోకుండా విద్యావిధానం విషయమై ప్రభుత్వాలపైన, రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవాలి. విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలిచే విద్యావిధానం కోసం దేశప్రజలు పట్టుబట్టాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *