బలశాలి భారత్‌

బలశాలి భారత్‌

పాకిస్తాన్‌ సైనికుల చేతికి చిక్కి సురక్షితంగా భారత్‌కు చేరిన మన వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ ఉదంతం దరిమిలా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పదాలు, వాక్యాలు, భావాలు వేరు వేరుగా ఉన్నా వాటన్నిటి సారం మాత్రం పాకిస్తాన్‌ బుద్ధి మారిందా, భారత్‌ దమ్ము పెరిగిందా అన్న ప్రశ్నల చుట్టూనే తిరగడం గమనార్హం. అత్యంత ఉత్కంఠ భరితంగా గడిచిన ఈ రెండు మూడు రోజుల్లో దేశ ప్రజల స్పందన, కాంగ్రెస్‌, తెదేపాల స్పందనల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. రఫేల్‌ కొనుగోళ్లలో అవినీతి, అవకతవకలు లేవని అటు సుప్రీం కోర్టు, ఇటు కాగ్‌ తేల్చి పారేసిన యుద్ధ విమానాల కొనుగోళ్లను ప్రస్తావించి రాహుల్‌ తన అల్పత్వాన్ని చాటుకున్నారు. దేశ భద్రత, రక్షణల అరశాన్ని రాజకీయం చేయడం తగదని ప్రధాని మోదీకి బాబు సలహా ఇచ్చి తన నైజాన్ని మరో మారు తెలుగు వారికి గుర్తు చేశారు. చావు, పుట్టుకలతో సహా ప్రతి అరశాన్నీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే వారితో అంటకాగే బాబు ధార్మిక కార్యక్రమాన్ని సైతం తన ప్రచాం కండూతికి అనువుగా మలచుకునే క్రమంలో ప్రజలను మనోవేదనకు, ప్రాణ నష్టానికి గురిచేసిన గోదావరి పుష్కరాల దుర్ఘటననను మర్చిపోయారా!

నిన్నగాక మొన్న గుంటూరులో ప్రధాని మోదీ పాల్గొనగా జరిగిన భారీ బహిరంగ సభ నిర్వహణ పూర్తిగా బిజెపి కార్యకర్తలే భరించారని, ఢిల్లీలో నిరసన పేరిట తెదేపా జరిపే పార్టీ కార్యక్రమానికి విమానాలు, ఎసి రైలు బోగీలు, ఢిల్లీలో స్టార్‌ హోటళ్ల కోసం భారీ ఎత్తున ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీ వినిపించిన వివరణ బాబులో మార్పు తేలేదు! అరత తేలిగ్గా ఇలాంటి వారు మారితే ‘ఎరత చదివిన, ఎన్ని విన్నను హీనుడవగుణంబు మానలేడు’ అన్న వేమన సూక్తి తప్పిపోదూ!

శాంతి కాముకతకు సూచనగా వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగిస్తాం అని పాక్‌ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటన వెనుక ఉన్నది జెనీవా ఒప్పంద ప్రభావమా, నిజంగానే పాక్‌ బుద్ది మారిందా! ఈ రెండూ కాక సౌదీ ఆరేబియాతో పాటు పలు ఇస్లామిక్‌ దేశాలతో సహా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌ తదితర అగ్రదేశాల మద్దతు కూడగట్టి అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసిన మోదీ దౌత్యం ఈ రూపంలో ప్రతిఫలించిందా అన్నవాటిపై సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అభినందన్‌ సాహసోదంతం నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ప్రస్తావనకు వస్తున్న చరిత్ర చర్చను అర్థవంతం చేస్తున్నది.

2008 నవంబరు 26న పాకిస్తానీ ముష్కరులు ముంబాయి నగరంలోని ఓ హోటల్‌పై దాడికి తెగబడ్డారు. పెద్దఎత్తున ఆస్థినష్టం, ప్రాణ నష్టం సంభవించిన ఆ దుర్ఘటన పట్ల నిష్క్రియమైన కాంగ్రెస్‌ నేతృత్వరలోని మన్‌మోహన్‌ ప్రభుత్వం అమెరికా వెళ్లి ఒబామాతో మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం.

2013లో పాకిస్తాన్‌ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి చొరబడి వచ్చి మన లాన్స్‌నాయక్‌ హేమరాజ్‌ తలనరికి తీసుకుపోయారు. ఆరోజు మన ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిరది.

1999లో కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో మన యుద్ధ విమానం కూలిపోతురడగా విరగ్‌ కమాండర్‌ అజయ్‌ అహూజా పాకిస్తాన్‌ భూభాగంలో దిగబడి పాక్‌ సైనికులు చేతికి చిక్కితే అతణ్ని చిత్రహింసలు పెట్టి పాశవికంగా చంపేశారు.

ఈ రోజున పాకిస్తానీ యుద్ధ విమానాలను వెరటాడి వేటాడుతూన్న మన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ నడుపుతూన్న లోహ విహంగం మిగ్‌ 21 కూలిపోతున్న సమయంలో పారాచూట్‌ సాయంతో నేలకు దిగే ప్రయత్నంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగడంతో పాక్‌ సైనికుల చేతికి చిక్కాడు. తరువాత ఏర జరిగిందో దేశం, ప్రపంచం అంతా చూసింది. శాంతి కారక్షకు సూచనగా అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తాము అరటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేశారు.

గతానికి ఇప్పటికి తేడా ఏమిటి? మన సైనిక దళాల శౌర్య పరాక్రమాలు, పాక్‌ దుష్ట బుద్ది, అప్పుడు, ఇప్పుడు ఒకటే. దమ్ము, ధైర్యం కలిగిన నేతలు మన పాలకులైనప్పుడు భారత్‌ దమ్ము పెరిగినట్లు యావత్‌ ప్రపంచం గుర్తిస్తుంది. బుద్ధి మార్చుకుని పాక్‌ కూడా దారిలోకి వస్తుంది. ఈ చిన్న సత్యాన్ని గ్రహించని, గ్రహించినా తమధోరణి మార్చుకోజాలని నేతలకు పాలన పగ్గాలు అప్పగిరచడం క్షేమం కాదని ప్రజలు గ్రహించాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *