ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

‘కృష్ణశాస్త్రి బాధ లోకం బాధ, లోకం బాధ శ్రీశ్రీ బాధ’ అంటాడు చలం. కవిత్వరలో కృష్ణశాస్త్రి తన బాధను లోకానికి అపాదించి రాస్తే, శ్రీశ్రీ లోకం బాధను తనకు అనువదించుకుని రాశాడని భావం. ఈ భావాన్ని వర్తమాన రాజకీయాలకు అన్వయిస్తే ఇద్దరు చంద్రులు తమ బాధను తెలుగు ప్రజల బాధగా అనువదిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల బాధలను, కష్టాలను పాలకులు తమవిగా భావించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి ఇందుకు భిన్నంగా సాగుతోంది.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మొత్తం నిధుల్లో రాష్ట్రాల వాటా పెరిగితే ఆనందంగా స్వీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నించడం విడ్డూరం. తనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే మతపరమైన రిజర్వేషన్లకు కేంద్రం సహకరించ లేదనే దుగ్ధతో జాతీయ సమైక్యత, సమగ్రతలకు సైతం గండికొట్టే ప్రతిపాదనలకు ఆయన సిద్ధపడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంటు పేరిట రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం కృషిచేస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన స్థానిక సంస్థలకు నిధుల, విధుల బదలాయింపును నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యమా!

రాజకీయ ప్రయోజనాలకోసం పూటకో మాట మార్చే ఆధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ధోరణి మరీ విపరీతం. ఉమ్మడి హైకోర్టు విభజన గురించి ఆయన తాజా స్పందన ఆయనలోని కపటిని బట్టబయలు చేసిరది. హైకోర్టు విభజన అంశం సుప్రీం కోర్టుకు ముందుకు వచ్చినప్పుడు ఆ పని త్వరగా పూర్తి చేయమని కోరిన కెసిఆర్‌ ప్రభుత్వం విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును హైదరాబాద్‌లో, అవసరమైతే ఇప్పుడున్న భవనంలోనే నిర్వహిరచుకోవచ్చని సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసిరది. చంద్రబాబు ప్రభుత్వం కూడా విభజన త్వరితగతిన పూర్తి చేయాలనీ, 2018 డిసెంబరు 31నాటికి హైకోర్టు కోసం ఆరధ్రప్రదేశ్‌లో నూతన భవనాలు ఏర్పాటు చేయగలమనీ మరో అఫిడవిట్‌ దాఖలు చేసిరది. రెండు ప్రభుత్వాల సానుకూల అఫిడవిట్ల నేపథ్యరలో హైకోర్టును విభజంచి జనవరి ఒకటి నురడి ఆరధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉనికిలోకి వస్తుందని, ఇప్పుడు హైదరాబాదులో ఉన్న హైకోర్టు ఇక తెలంగాణ హైకోర్టుగా పనిచేస్తుందని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆపైన కేంద్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ రాష్ట్రపతి పేరిట ఆదేశాలు జారీ చేయించింది. దీని మీదే, ‘ఎందుకింత హడావిడిగా విభజించారు, జగన్‌ కేసులను వాయిదా వేసి నీరుగార్చడానికా!’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంలోని మర్మమేమిటి! తెలంగాణ ఏర్పాటులోనూ ఆయనది ఇదే ధోరణి కదా! ‘తెలంగాణ ఏర్పాటుకు నేనే మొదటి లేఖను ఇచ్చాను’ అని తెలంగాణలో, ‘ఎవరినడిగి విభజిరచారు!’ అని ఆంధ్రప్రదేశ్‌లో పరస్పం విరుద్ధంగా ప్రకటనలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. తనకు కోర్టులు నోటీసులు ఇస్తే కుట్రలని వాపోవడం, ఆర్థిక నేరాలకు పాల్పడిన తన అనుచరులకు సంబంధించిన సంస్థల్లో తనిఖీలు జరిపితే దాడులని పేర్కొనడం ఆయనలోని ఫ్యూడల్‌ భావజాలానికి, అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనం. ప్రత్యేక హోదా ఆరధ్రప్రదేశ్‌కు వద్దని ఒకసారి, స్పెషల్‌ ప్యాకేజి ముద్దని మరోసారి మాటమారిస్తే మిగతా రాజకీయ పక్షాలు, ప్రజలు తనను సమర్థించాలని, కాదన్న వారంతా అభివృద్ధి వ్యతిరేకులే అని ఆరోపించడం ఆయనలోని నియంతృత్వ ధోరణిని వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ప్రజాపనులకు అమరావతిలో ఒకే బడ్జెటు, ఒకే టెండరు విధానం కోసం జీవోల జారీ యత్నాలు స్థానిక సంస్థల అధికారాలను కబళించి, ప్రజా పరిపాలన ముసుగులో ఆయన సాగిస్తున్న రాచరికానికి నిదర్శనం.

పార్టీలో, పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేయడంలో ముందుండే ఇద్దరు చంద్రులది అనువంశిక పాలన, వారసత్వ రాజకీయాలను కొనసాగించే విషయంలో ఒకేతీరు. తమ వారసులకు అధికారం కట్టబెట్టాలనే దుగ్ధతో అభివృద్ధి సాధించామని ఒకరు, సాధిస్తున్నామని మరొకరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఆ మాయాజాలంలో పడకుండా తెలుగు ప్రజలు ప్రాణప్రదమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరచుకోవాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *