అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

తెలుగునాట చోటుచేసుకురటున్న నేరాల, వివాదాల సందర్భంగా ప్రభుత్వ అధికారుల స్పందన, ప్రకటనలతో తెలుగు పాలకుల సత్యనిష్ఠ సందేహాస్పదం అవుతోంది.

విశాఖపట్టణం విమానాశ్రయంలో గతేడాది ఆక్టోబరు నెలాఖరులో విపక్ష నేత జగన్‌మోహన రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సందర్భంలో ఆరధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి స్పందించిన తీరు వివాదాస్పదం కావడం ఇటీవలి చరిత్ర. పాలకపక్షం మెప్పుకోరి ముఖ్యమంత్రి మాటలనే పోలీసు అధికారి తన ప్రకటనలో అప్పగించాడని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా తెలంగాణ, ఆరధ్రప్రదేశ్‌ రెరడు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిరచిన డేటా చౌర్యం కేసులో కూడా పోలీసు అధికారుల వ్యవహార శైలి విమర్శలకు గురి అవుతోంది. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐటి గ్రిడ్‌ సంస్థ మీద కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టినట్లు తెలంగాణ పోలీసు అధికారి చెపుతూండగా తెదేపా కోరిన ప్రకారం సేవామిత్ర యాప్‌ రూపొందించి, తెదేపా ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, పార్టీ కార్యకర్తల సమాచారం ఒకచోట గుది గుచ్చడంలో నేరమేమిటి? అని తెదేపా ప్రశ్నిస్తోంది. గత 20 సంవత్సరాలుగా కష్టపడి సమకూర్చుకున్న తమ పార్టీ కార్యకర్తల సమాచారాన్ని వైకాపాకు ఇవ్వడానికే తెలంగాణ పోలీసులు కుట్ర రాజకీయాలకు పాల్పడ్డారని తెదేపా నేత ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా భద్రంగా ఉండాల్సిన ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ప్రయివేటు సంస్థకు ఎలా చేరిందో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివరించలేకపోతోంది.

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుండి అక్రమంగా సేకరించడము, దాన్ని తెదేపా రాజకీయ అవసరాలకు తగినట్లుగా ఐటి గ్రిడ్స్‌ అనే ప్రయివేటు సంస్థ మలచడం నేరమే కదా! కానట్లయితే ఆ సంస్థ అధిపతి అశోక్‌ పరారు కావలసిన పనేరటి? రాజకీయ దుమారం సృష్టిస్తున్న ఈ కేసు పూర్తిగా విచారణబాట పట్టక ముందే విద్యుత్‌ బకాయిల వివాదం తెరమీదకు వచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా లెక్కల్లో తేలిన విద్యుత్‌ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం మాకు చెల్లించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ అధికారులు, లేదు.. లేదు.. ఆంధ్రప్రదేశే తెలంగాణకు బకాయి ఉందని తెలంగాణ విద్యుత్‌ అధికారులు అంటున్నారు. ఇరువురి ప్రకటనలను పరిశీలిస్తే ఎవరో ఒకరు అబద్ధం చెపుతున్నారని స్పష్టం అవుతోంది. సహజంగా ప్రభుత్వ అధికారికి ప్రజల ముందు అబద్ధం చెప్పవలసిన అవసరం రాదు. పాలకులైన ప్రభుత్వపెద్దలే తమ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులతో అబద్ధాలు చెప్పిస్తారు. కనుక బాధ్యత గల ప్రభుత్వ అధికారి అబద్ధం చెప్పాడంటే ప్రభుత్వమే అబద్ధం చెప్పినట్లు! అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం అధికారంలో కొనసాగే హక్కు కోల్పోతురది. పార్లమెంటు, అసెరబ్లీ వంటి చట్ట సభల్లో ప్రభుత్వం అసత్య సమాచాం వెల్లడి, లేదా ప్రకటన చేసిన సందర్భాల్లో ఆ ప్రభుత్వం అధికారం నుండి వైదొలగాలని విపక్షాలు పట్టుబట్టడం పరిపాటి. అలాంటిది సాక్షాత్తు ప్రజల ముందు ప్రభుత్వ ప్రతినిధి అయిన అధికారి లేదా అధికారులు అబద్ధాలు చెపితే అలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించాలని, లేదా ప్రభుత్వమే అధికారం నురడి వైదొలగాలని ప్రజలు కోరడం న్యాయమూ, సహేతుకం కూడా! ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, నేతలు అబద్ధాలు చెప్పడాన్ని ఉపేక్షించే స్థితికి మన ప్రజలు చేరుకున్నారు. కానీ ఎన్నికలు పూర్తయి అధికార పగ్గాలు చేపట్టిన పిదప కూడా రాజకీయ పార్టీలు, నేతలు అబద్ధాలు కొనసాగించి, సత్యనిష్ఠను పాటించకపోతే అది నైతిక పతనానికి దారితీస్తుంది.

ప్రజాస్వామిక వ్యవస్థలో నైతిక విలువలను నిలబెట్టే బాధ్యతను కూడా ప్రజలే స్వీకరిరచాలి. ‘సత్యమేవ జయతే!’ జాతీయ నినాదమైన దేశంలో అబద్ధాల కోరులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం, ప్రభుత్వాధినేతలై పాలన పగ్గాలు చేపట్టడం ప్రజా ప్రయోజనాలకు, జాతీయ విలువలకు చేటు అని ప్రజలు గ్రహిరచాలి. సత్య నిష్ఠ నిలపడంలో ప్రజలు ఉపేక్ష వహిస్తే అబద్ధాలకోరులదే రాజ్యమవుతుంది. అది అవినీతికి, అరాచకానికి దారితీస్తుంది. రాష్ట్ర స్థాయిలోనే సత్యనిష్ఠ లేని ఇటువంటి నాయకులు జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పాలని చూడటం దురదృష్టకరం. దీనివల్ల దేశ రాజకీయాలూ భ్రష్టు పడతాయి. సత్యనిష్ఠ లేని నాయకులను ప్రజలే కట్టడి చేయాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *