స్వతంత్రత సాకారం కోసం ప్రయత్నించాలి

స్వతంత్రత సాకారం కోసం ప్రయత్నించాలి

భరతుని వల్ల మనదేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని అందరికీ తెలుసు. ఆ భరతుడు ‘తన ప్రజలను పోషించి, రక్షించిన వాడు’ కావడంచేత భరతుడు అయ్యాడు అని చెప్పుకుంటాం. ‘ఈ చారిత్రిక నేపథ్యంతో భారత్‌ అయిన ఈ దేశంలో రక్షణ, పోషణలకు హామీ లేకపోతే దేశానికి భారత్‌ అనే పేరే అర్థరహితం!’ అరటారు ఏకాత్మ మానవ దర్శనంలో పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ.

స్వతంత్ర భారత ప్రస్థానం మొదలై ఏడు దశాబ్దాలు గడిచింది. కాబట్టి సాధించినదేమిటో సమీక్షించాలి. అంటే సమరయోధుల కలలు సాకారమవుతున్న తీరును గమనించడమే.

భారత్‌లో ప్రస్తుతం అర్ధాకలితో అలమటిరచే వారు 20 కోట్లమంది ఉన్నారని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. పేదల ఆకలి తీర్చేందుకు మనదేశంలో 2013లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం, పట్టణ ప్రాంతాల్లో 50శాతం పేదలకు అక్కరకు వచ్చేలా చట్టంలో విధివిధానాలు రూపొందించారు. కానీ ఆచరణలో అది సక్రమంగా అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లలో 2014 నురడి 2019 మధ్యకాలంలో రూ.6,76,928 కోట్ల రూపాయలను సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేటాయించింది. దేశంలో ప్రస్తుతం 81 కోట్ల మందికి సబ్సిడీ మీద ఆహార పదార్థాలు అందుతున్నాయని అంచనా. కేంద్రం రాష్ట్రాలకు అందజేస్తున్న ఆహార ధాన్యాలు, నిధుల తలసరి లెక్కలతో వేసిన అంచనా ఇది. అయితే అవినీతి అధికారులను, అక్రమార్కులను కట్టడిచేయడంలో రాష్ట్రప్రభుత్వాల అలసత్వం, అశ్రద్ధ, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాల వల్ల సంక్షేమ ఫలాలు లబ్దిదారులకు పూర్తిగా అందడం లేదని కూడా అందరికీ తెలుసు.

అవినీతికి అలవాటు పడిన అధికారుల అరడతో అక్రమార్కులు సబ్సిడీ ఆహార పదార్థాలను దొడ్డిదారిన తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యర, అవినీతి వలలో చిక్కి పేదల సంక్షేమ ఫలాల గొంగళి వేసిన చోటే ఉండిపోతుంది. ఫలితంగా దేశంలోని చిన్నారులను పోషకాహార లోపం వెన్నాడుతోంది. ఆరు నుండి 24 నెలల వయసున్న చిన్నారుల్లో 90 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ సర్వే నిరుడు వెల్లడించింది. దేశంలో సుమారు 2.3 కోట్ల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందుబాటులో లేదని అంచనా.

దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం మరీ ఎక్కువని నిన్‌ (జాతీయ న్యూట్రిషన్‌ సంస్థ) వెల్లడించింది. 2018 నాటి జాతీయ బాలల నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు వెల్లడైరది. ఎదుగుదల లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో 32.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 28.3 శాతం ఉండగా తెలంగాణ గ్రామాల్లో 33.3 శాతం, పట్టణాల్లో 20.9 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఏడు దశాబ్దాల స్వపరిపాలన తరువాత కూడా పేద ప్రజలకు అందని మానిపండుగా మారిన వివిధ సంక్షేమ ఫలాలు పోషణ విషయంలో మన ప్రభుత్వాల ఉదాసీనతకు నిదర్శనం. భారతీయతకు విరుద్ధర! భారతీయత ప్రతిఫలించని స్వతంత్ర పాలన వ్యర్థం.

అన్నార్తులైన పేదల సమస్య ప్రపంచం అంతటా ఉంది. వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ పోకడల ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా భారత్‌ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి. స్వేచ్ఛా భారత్‌లో స్వతంత్రత పాదుకొల్పడంలో గతపాలకులు విఫలమయ్యారు. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దడానికి పాలకుల దార్శనికత, నైతికతలో మార్పు రావాలి.

ఇల్లు కట్టుకోడానికి కొండరాళ్ళు కావాల్సివస్తే రాళ్ళుకొట్టే కొండయ్య కొండదగ్గరికి పోవాలి లేదా కొండమీది బండరాళ్ళయినా కొండయ్య వద్దకు రావాలి. అలాగే స్వతంత్ర భారతావనిలో కశ్మీరు నుండి కన్యాకుమారి దాకా అడుగడుగునా భారతీయతను పాదుకొల్పడం కోసం ప్రజలు ఎన్నుకున్న నేతలు భారతీయత దిశగా తమ విధానాలను మార్చుకోవాలి. లేదా ప్రజలు నేతలను మార్చుకోవాలి. జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం త్యాగమూర్తుల, దేశభక్తుల బలిదానాలు, త్యాగాల ఫలితంగా మనకు స్వేచ్ఛ ప్రాప్తిరచిరది. స్వేచ్ఛ ఆధారంగా స్వతంత్రత సాకారం కోసం ప్రజలు ప్రయత్నించాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *