హిందువుల హక్కుల కోసం…

హిందువుల హక్కుల కోసం…

తెలుగు నాట సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సామాజిక సేవానురక్తులు తీవ్రంగా ఎంచదిగిన పరిణామాలు ఈ సందర్భంగా చోటుచేసుకున్నాయి. తెలుగు నాట హిందువులే మెజారిటీ అయినా వివిధ రాజకీయ పక్షాలు హిందూ ఐక్యతకు, ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను తలకెత్తుకున్నాయి. తమ రాజకీయ లబ్ధి కోసం వలస పాలకులైన ఆంగ్లేయులు ప్రజలను హిందువులు, ముస్లిములని మతం పేరిట విభజిరచి పాలించారు. నేటి రాజకీయ పక్షాలు ప్రజలను కులం పేర విభజించి రాజకీయ పబ్బం గడుపుకో జూడ్డం హిందూ సమాజ ఐక్యతకు గొడ్డలిపెట్టు.

రాజకీయాలు జీవితంలో ఓ భాగమే కాని రాజకీయాలే ప్రజా జీవితం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ భావన. కనుకనే దేశభక్తి, జాతీయత ఆధారంగా సంఘం హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని చూస్తున్నది. దానికోసం రూపొందిన కార్యక్రమం దైనందిన శాఖ. శిక్షణ పొందిన సంఘ స్వయంసేవకులు రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశించి రాజకీయ పక్షాలను ప్రభావితం చేయాలని సంఘ పెద్దల ఆకారక్ష. ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఒక పవర్‌హౌస్‌ లాంటిది. పవర్‌హౌస్‌లో తయారైన విద్యుత్తు దీపాలను వెలిగించి, ఫ్యాన్లను తిప్పి, యంత్రాలను నడిపిన విధంగా సంఘంలో శిక్షణ పొందిన స్వయంసేవకులు సమాజంలోని వివిధ రంగాలలోకి వెళ్ళి వాటిని ప్రభావితం చేస్తారు’ అని తృతీయ సర్‌సంఘ్‌చాలక్‌ బాలాసాహెబ్‌జీ అనేవారు. సంఘ శిక్షణ పొందిన స్వయంసేవకులు రాజకీయాలతో సహా ప్రజా జీవితంలోని వివిధ రంగాల్లోకి వెళ్లి జాతీయతకు అనుగుణంగా వాటిని ప్రభావితం చేయాలని సంఘం అభిలాష. ఆ దిశగా తెలుగు నాట జరుగుతున్న కృషి మరింత వేగం, తీవ్రత సంతరించుకోవాలని నేటి రాజకీయ ధోరణులు సూచిస్తున్నాయి. సంఘ నిర్మాత డాక్టర్‌ హెడ్గేవార్‌ కూడా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ పిలుపు మేరకు సత్యాగ్రహాల్లో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్లారు. ఆ తరువాతి కాలంలో సంఘ శిక్షణ పొందిన స్వయంసేవకులైన దత్తోపంత్‌ ఠేగ్డే కార్మిక రంగంలోకి, బలరాజ్‌ మధోక్‌ విద్యార్థి రంగంలోకి వెళ్లగా దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, యల్‌కె అద్వాని వంటి వారు రాజకీయ రంగంలోకి ప్రవేశించి పని చేశారు. ఇవి మచ్చుకు పేర్కొన్న కొందరు ప్రముఖుల పేర్లు. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా లక్షలాది స్వయం సేవకులు వివిధ క్షేత్రాల్లో పని చేస్తూ ఆయా రంగాలను ప్రభావితం చేస్తున్నారు.

నేటి బిజెపి పూర్వరూపమైన జనసంఘ్‌లో పలువురు స్వయంసేవకులు పని చేస్తుండడం చూసి కాంగ్రెస్‌ నాయకులైన మిశ్రా నాటి సర్‌సంఘ్‌చాలక్‌ గురూజీతో ‘మీ సంఘము, స్వయంసేవకులు జనసంఘ్‌లో ఆధిపత్యం చూపుతున్నట్లురదే!’ అన్నారట. దానికి ‘ఔను ఇప్పటికి జనసంఘ్‌ మాత్రమే. భవిష్యత్‌లో దేశంలోని ఆన్ని రాజకీయ పక్షాలలో సంఘ స్వయంసేవకులు ఆధిపత్యం చూపుతారు’ అని గురూజీ బదులిచ్చారట. సంఘ్‌ అభిలాష, పెద్దల ఆకాంక్షలు 50 నుండి 60 శాతం సాకారమయి ఉన్నా హిందూ సమాజ ఐక్యతకు, ప్రయోజనాలకు నష్టం కలిగించడానికి తెలుగునాట రాజకీయ పక్షాలు సాహసించేవి కాదు.

మతం పేరిట ఆగ్లేయులు నాటిన ద్విజాతి సిద్ధాంత విషబీజాలు దేశ విభజనకు దారితీసిన చరిత్రను మరచి మతపర రిజర్వేషన్లు కల్పించడం, భక్తుల కానుకలు, విరాళాలతో హిందూ ధార్మిక కేంద్రాలలో పోగుపడిన ధనాన్ని విధర్మీయులకు పంచిపెట్టడం వంటివి హిందూ సమాజానికి కీడు చేసే విధానాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. తెలుగు నాట అధిక సంఖ్యాకులైన హిందువుల అనైక్యత, ఆధిపత్యం చూపగల సంఖ్యలో స్వయంసేవకులు తెలుగు ప్రారత రాజకీయ పక్షాలలో లేనందున రాజకీయ పక్షాలు హిరదూ ప్రయోజనాలకు చెరుపు చేయడానికి వెరవడం లేదు. కనుక హిందూ సమాజ శ్రేయోభిలాషులు తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ప్రాంతీయ రాజకీయ పక్షాలలోకి శిక్షణ పొందిన స్వయంసేవకులను పంపి ప్రభావితం చేయగల స్థాయికి చేర్చాలి. ద్విముఖ వ్యూహంతో జాతీయవాదులు, సమాజ సేవకులు కలిసి హిరదూ ప్రయోజనాల పరిరక్షణలో సఫలం కాగలరని ఆశిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *