ఆరోగ్య వ్యాపారులతో తస్మాత్‌ జాగ్రత

ఆరోగ్య వ్యాపారులతో తస్మాత్‌ జాగ్రత

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి సామాన్య ప్రజల పట్ల ఎరత సత్యమో అనారోగ్యమూ మహా భాగ్యమే అన్న సూత్రీకరణ కార్పొరేట్‌ వైద్యులకు అరతే సత్యర. వైద్యో నారాయణో హరిః సామెతను ‘వైద్యుడూ వ్యాపారే మరి’ అని మార్చుకుని జనం జాగ్రత్త పడాలి! విద్య, వైద్యర వృత్తి ఏదయినా వ్యాపారంగా పరిణమిరచి, లాభార్జనే ధ్యేయంగా మారాక వృత్తి ధర్మర, నీతి, నియమాలు అన్నీ మంటగలిసి పోతాయి. వృత్తి ధర్మాన్ని త్రోసిరాజని, రాజులను, రాజ్యాలను లోబరుచుకుని, ప్రజలను దోచుకునే గౌరవప్రద చోర కళకు విశ్వగురువైన ఈస్టిరడియా కంపెనీ పోయి చాలా కాలమైరది. పిల్లపోయినా పురిటి వాసన పోని చందాన పాలకుల అరడతో ప్రజలను దోచుకుతినే కళ కార్పొరేటీకరణ పేర దేశ ప్రజలను పట్టి పీడిస్తోరది. అక్రమ వ్యాపారుల, గూరడాల తోడ్పాటుతో రాజకీయ నేతలు, పార్టీలు అధికారం చేపట్టే దశమారిరది. నిన్నటి తోడ్పాటుదారులే నేడు రాజకీయాల్లోకి వచ్చి నాయకులై, ఏలికలై పాలిరచే దశ ప్రాప్తిరచిరది. దాని ఫలితమే కార్పొరేట్‌ కళాశాలల, ఆసుపత్రుల అవతరణ.

నగరాల్లో రద్దీగా ఉరడే రోడ్లకు ప్రక్కనే ‘ఛాతీలో నొప్పా! అది గురడె పోటు కావచ్చు, నిర్లక్ష్యర చేయక పరీక్షిరచుకో! అనే ప్రకటనల హోర్డిరగులు ఆ మధ్య వెలిశాయి. ‘పబ్లిగ్గా రోడ్ల ప్రక్కన ఏమిటీ భయపెట్టడం! అని కొరదరు సామాజిక వేత్తలు నిరసన గళం వినిపిరచాక వాటి జోరు తగ్గిరది. వైద్యరంగ కార్పొరేట్‌ శక్తుల వ్యూహాలకు అద్దర పట్టే తాజా ఉదాహరణ మరోటి చూద్దార. ‘ఎలర్జీ’ దానికదే వ్యాధికాదు. దేహ ప్రకృతిలో అది ఓ భాగం. దాన్ని ఓ వ్యాధికి సంకేతంగా ప్రజల్ని భయపెట్టి దోపిడికి బాటలు వేసే ప్రకటన ప్రముఖ దినపత్రికలో మొదటి పేజిలోనే వచ్చిరది. సోకగల వ్యాధిగా ఎలర్జీని తేల్చి దానికి పూలవాసన నురడి, తినే బటాణీ గిరజలు, చేపల దాకా ఏవైనా కారణం కావచ్చని ఆ ప్రకటన సారారశం. ప్రజల్లో వైద్య, ఆరోగ్య అరశాల పట్ల అవగాహన పెరచేరదుకు పలురకాల వ్యాధుల గురిరచి ఆయా రంగాల నిపుణలతో వ్యాసాలు, ముఖాముఖి పేరిట పత్రికలు స్వయంగా కృషి చేస్తునే ఉన్నాయి. లక్షలాది రూపాయలు కుమ్మరిరచి విడుదల చేసిన ప్రకటన కూడా పత్రికలు సహజంగా నిర్వర్తిరచే పనిలో భాగమే అనుకురటే మనం పొరపడినట్లే. కార్పొరేట్‌ శక్తుల దోపిడి వ్యూహంలో ఇది ఓ భాగం. ఈ ప్రకటన చదివాక ఎరతోమంది భయపడి, వైద్యర గురిరచి ఆలోచిస్తారు. ఎలర్జీ కూడా ఓ వ్యాధే అని భయం ఏర్పడ్డాక బాధితులు రక్త పరీక్షా కేరద్రాలకు వెళ్తారు. వారి ఎలర్జీ రోగంగా నిర్థారణ జరిగాక రోగి కార్పొరేట్‌ వైద్యుల వలలో చిక్కినట్లే! తన గూట్లో చిక్కుపడిన ప్రాణి రక్తమారసాలను సాలెపురుగు పీల్చినట్లే రోగులను కార్పొరేట్‌ వైద్యులు ఎలా పీల్చి పిప్పి చేస్తారో నగరవాసులకు తెలిసిన విషయమే. సాధారణ పేద ప్రజానీకానికి కార్పొరేట్‌ వైద్యుల దోపిడి నురడి రక్షణ కల్పిరచడానికి ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేర ప్రధాని మోదీ ఆరోగ్యబీమా పథకాన్ని సెప్టెరబరు 23న లారఛనంగా ప్రారంభిరచారు. ఈ పథకం క్రిరద ప్రతి కుటురబానికి ఐదులక్షల మేర ఆరోగ్య బీమా ఉచితంగా లభిస్తురది. ఈ బీమా పరిధిలో ఉన్న 1350 రకాలకు పైగా వ్యాధులకు పరీక్షలు, చికిత్స, మందులు ఉచితం. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాకురడా గుర్తిరపు పొరదిన ప్రయివేటు కార్పొరేటు ఆసుపత్రులలో కూడా చికిత్సపొరదే అవకాశం ఉరది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు దీనికి చాలా తేడా ఉరది. పేదలకు చికిత్స అరదిరచిన పిదప ఆసుపత్రులకు రావలసిన బిల్లులను బీమా కంపెనీ చెల్లిస్తురది కనుక బిల్లుల కోసం ఆసుపత్రులు ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రజలకు వైద్య సేవలు అరదిరచిన వారు అస్మదీయులైతే ఒకలాగ, తస్మదీయులైతే మరోలాగ చూసే అవకాశం రాజకీయ శక్తులకు ఉరడదు. ఉభయతారకంగా ఉరడే అవినీతికి ‘ఆయుష్మాన్‌ భారత్‌’ బీమా పథకంలో అవకాశం లేదు. రాజకీయ శక్తులను లోబరచుకున్న కార్పొరేట్‌ శక్తుల ఒత్తిడి, ప్రలోభాల కారణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి మోకాలు అడ్డుతున్నాయి. వైద్య కార్పొరేట్ల కుట్రకు బలికాకురడా రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రజలే ఆయుష్మాన్‌ భారత్‌ను దక్కిరచుకోవాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *