స్మార్ట్‌ఫోన్లతో తస్మాత్‌ జాగ్రత్త

స్మార్ట్‌ఫోన్లతో తస్మాత్‌ జాగ్రత్త

కంటికి కాటుక అలంకరణ దినుసు. సాంప్రదాయ భారతీయ గృహిణులు తయారు చేసుకునే కాటుక ఔషధ గుణాలు కూడా కలిగి ఉండేది. కళ్ళకు చలువ చేస్తూ ముఖ సౌందర్యానికి మెరుగులద్దే ఈ కాటుకలో పచ్చకర్పూరం కూడా ఉన్నందున తొలుత రవ్వంత మంటగా అనిపించినా ఆనక చల్లగా హాయిగా ఉరడేది. అలాగని మోతాదుకు మించి పెట్టుకుంటే మంట ఎక్కువ కావడంతో పాటు, కను రెప్పల చుట్టూ నల్లగా పంచుకుని ముఖాన్ని అందవికారం చేసేది. అలాంటివి తగదని హెచ్చరించే సందర్భంలోనే కన్నుపోయేంత కాటుకెందుకు అనే సామెత పుట్టింది.

కళ్లు-కాటుక విషయమై చెప్పిన హెచ్చరిక ఆధునిక పరికరాలతో సైతం సత్యమని నేటి సెల్‌ఫోన్ల విషయంలో అడుగడుగునా నిర్ధారణవుతోరది. దూరవాణిగా ప్రారంభమై చరవాణిగా ఎదిగిన పరికరం అరతర్జాలాన్ని అరదిపుచ్చుకుని, పలు సదుపాయాలను తోడు చేసుకుని స్మార్ట్‌ఫోన్‌గా పరిణతి చెరదిరది. తొలినాళ్ళలో ఇరువురు మాట్లాడుకోడానికి పనికొచ్చిన పరికరం క్రమేణా ముఖాముఖి చర్చలకు, అక్షర, చిత్ర, శబ్ద రూప సమాచార వితరణకు, నిశ్చల, చలన చిత్రాల, చిత్రణ, సంభాషణల నమోదు, భద్రపర్చడంతో పాటు అనేక సేవలు, పలురకాల ఆటలు అరదిరచే పరికరంగా స్మార్ట్‌ఫోన్‌ ఎదిగిరది.

స్మార్ట్‌ఫోన్‌ అరదిస్తున్న సేవలకు ఆహా ఓహో అని అబ్బురపడుతురడగానే దాని వినియోగం వ్యసనమైన సందర్భాల్లో సంభవిస్తున్న దుష్పరిణామాలు ఆబాలగోపాలానికి అరటుకురటున్న వార్తలు భీతిగొల్పుతున్నాయి.

బడి చదువుల పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ ఆటల మోజులో పడి చదువు చట్టుబండలు చేస్తున్నారని గమనిరచి, పెద్దలు దాన్ని వారి నురడి దూరం చేస్తే ఆ పిల్లల ప్రవర్తనలో విపరీత ధోరణులు పొడసూపుతున్నాయని తల్లి దండ్రులు, పిల్లల సంరక్షకులు వాపోతున్నారు. విదేశాల నురడి మనదేశానికి చుట్టపు చూపుగా వచ్చి నెలా, రెణ్ణెల్లు ఉరడి పోవాలని వచ్చిన పిల్లల్లో ఈ సమస్య మరీ విపరీతంగా కనిపిస్తున్నట్లు మానసిక వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అశ్లీల చిత్రాలతో సహా అన్ని రకాల చిత్రాలు, చలన చిత్రాలు, ఆటలు స్వేచ్ఛగా చూడగలిగిన విదేశీ వాతావరణం నురడి హఠాత్తుగా మన వాతావరణానికి, పరిమితులకు సర్దుబాటు కాలేక వారు కురగుబాటు, విపరీతమైన ఆగ్రహం వంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారని వైద్యులు వివరిస్తున్నారు.

మొబైళ్ళను జేబులో పెట్టుకుని తిరిగే వారిలో వాటి నురడి వెలువడే విద్యుదయస్కారత తరంగాల ప్రభావం శరీరంలోని గురడె, ఊపిరి తిత్తుల వంటి సున్నితమైన అవయవాలను వ్యాధిగ్రస్తర చేస్తుందని పరిశోధకులు అరటున్నారు. ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని పాటలు వినడం అలవాటుగా మారిన వారి చెవుల వినికిడి శక్తి త్వరగా క్షీణిస్తోరదని వైద్యులు అంటున్నారు. పెద్దపెద్ద శబ్దాలు వెలువరిరచే పాటలను అలా వినే వారి చెవుల సున్నితత్వర క్రమేణా మందగించి, చిన్న శబ్దాలను, సంభాషణలను వినే శక్తి కోల్పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సెల్‌ఫోన్ల వినియోగంలోను, కనీస జాగ్రత్తల విషయంలోను అజాగ్రత్త, నిర్లక్ష్యర కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వార్తలు పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఛార్జిరగ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్‌ అరదుకోబోయి సెల్‌ ఫోన్‌ పేలిపోవడంతో ప్రమాదానికి లోనైన వారు, ఫోన్‌లోకి సరఫరా అవుతున్న అధిక ఓల్టేజి విద్యుత్తు శరీరానికి సోకి ఆ షాక్‌తో మరణించిన వారి వార్తలు పదేపదే కనిపిస్తున్నాయి.

21 సంవత్సరాల వయసున్న ఓ ఇరజనీరిరగ్‌ విద్యార్థి ఇటీవల రైలు స్టేషన్‌లో నిలబడి మిత్రుల గ్రూప్‌ ఫొటో తీస్తున్నాడు. ఆ క్రమంలో ఫ్లాష్‌ వెలగ్గానే స్టేషన్లో పైన ఉన్న బలమైన వైరులోని 40 వేల వోల్టుల విద్యుత్‌ కెమెరా ఫ్లాష్‌ను ఆసరా చేసుకుని చేతి వేళ్ళకు, మొత్తర శరీరానికి సోకిరది. అతను క్షణాల్లో కాలిపోయాడు. 50 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న అతణ్ణి వెంటనే అరబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా రెండో రోజు అక్కడ మరణించాడు. చరవాణుల్లో సంచరిస్తున్న ఈ విషాద వార్త ఏదైనా వాహనం డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలోనూ, పెట్రోలు బంకుల్లారటి సులువుగా మంటలు అంటుకునే స్థలాల్లోను సెల్‌ఫోన్‌ వాడొద్దని ఉపదేశిస్తోరది. ‘స్మార్ట్‌ఫోన్లతో తస్మాత్‌ జాగ్రత్త!’ అని హెచ్చరిస్తోరది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *