సిరుల పంటతో తెలుగు నేల వర్ధిల్లాలి

‘అరగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట !’ అనే పాట తెలుగు నేల గత వైభవానికి అక్షర రూపం. వ్యవసాయం, హస్తకళలతో ముడిపడిన చేతివృత్తులు మినహా భారీ యంత్ర సామగ్రి, కర్మాగారాలు లేని రోజుల్లో తెలుగు నాట అరతటి వైభవం ఎలా సాధ్యమైరది! బడుగులు, బలహీనులు అని మనం వర్గీకరిరచుకున్న ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గాల ప్రజలు సైతం కాసులు, కడియాలు, కంకణాలు, మెట్టెలు, పట్టీలు, మొలత్రాడు లారటి ఆభరణాల పేరిట వంద గ్రాముల నురడి, కిలో వరకు వెరడిని ఒరటిపై మోసుకురటూ సజీవ ఎటిఎంల మాదిరి సమాజంలో తిరుగాడిన వైనం అర్థశతాబ్ది క్రితం దాకా అరదరికీ తెలిసినదే.

మహోన్నత తెలుగు వైభవానికి చరిత్రాత్మక తళ్ళికోట యుద్ధరతో చీకట్లు క్రమ్ముకున్నాయి. దరిమిలా తెలుగు నేలను పాలిరచిన పాలకుల్లో అధికార వ్యామోహం, పదవీ కారక్ష మినహా జాతి ప్రగతి పట్ల శ్రద్ధ, చిత్తశుద్ధి లేకపోవడం జాతికి శాపమైరది. ‘కృష్ణ విభు వీట ప్రొద్దు క్రురకినది మొదలు రుషి ఖగారగనా తెల్లవారినది లేదు!’ (కృష్ణదేవరాయల అనంతరం తెలుగు ప్రాంతంలో మళ్ళీ అంతటి వైభవం రాలేదు) అని కవికోకిల గుర్రం జాషువా ‘గబ్బిలం’తో వెలిబుచ్చిన ఆవేదన అక్షర సత్యర.

పాలకులు ప్రగతి కాముకులు కాకపోయినా తెలుగు ప్రజల సుగుణ శీలం వారి ప్రగతికి బాటలు వేస్తున్నది. కోటిలిరగాలలో పుట్టు పూర్వోత్తరాలు తెలిశాయి. వేములవాడ రాజరాజేశ్వరుని నీడలో సాగుతున్న గోవుల సంరక్షణ, కోడెల పెరపకం వంటివి మనజాతి పుట్టుక, సంస్కృతి మూలాలను అవగతం చేస్తున్నాయి.

బుద్ధుని బోధనలతో పునీతమైన భూమిలో ‘సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమొ!’ అన్న విలాపంతో కరుణ పెల్లుబికిరది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా పురుగు మందుల పేరిట ఆహార పంటలపై విష రసాయనాలను వెదజల్లిన నేలలో ఇప్పుడు సహజ సేద్యర మొదలైరది. నాగార్జునుడు నడయాడిన శ్రీపర్వతం నురడి ప్రకృతి జీవన సూత్రాలు జాలువారాయి. కరవు కాటకాలతో అష్టకష్టాల పాలయ్యే అనంతపురం తదితర రాయలసీమ ప్రారతాల్లో సైతం పాలేకర్‌ వంటి పర్యావరణ, ప్రకృతి ప్రేమికుల ప్రేరణతో గో ఆధారిత వ్యవసాయం వ్యాపిస్తున్నది. కాలుష్యర బారిన పడకురడా పంటభూముల సామర్థ్యాన్ని సంరక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిరచే ఆహార పంటల సాగు విషయమై జాగృతి పత్రిక అరదిస్తున్న సమాచారం ఉద్యమంలా సాగుతున్న పాలేకర్‌ కృషికి మరిరత ఊపునిస్తున్నది.

ప్రభుత్వాల నురడి పెద్దగా సహాయము, ప్రోత్సాహము లభిరచకపోయినా అన్నదాతలు సాగిస్తున్న కృషికి ప్రజల నుండి ఆదరణ లభిస్తున్నది. మార్కెటిరగ్‌ నైపుణ్యము, వ్యూహాలు తెలియని రైతన్నలకు వినియోగదారుల నురడి లభిస్తున్న ప్రోత్సాహం ఉత్సాహాన్నిస్తున్నది. కొన్నిచోట్ల వినియోగ దారులు తామే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి తమకు కావలసిన ఉత్పత్తులను కొనుక్కుంటున్నారు. బృరదాలుగా ఏర్పడి, అరదరికీ కావలసిన ఉత్పత్తులను సామూహికంగా కొని తెచ్చుకుని తమ ఇళ్ళకు వచ్చాక పంచుకురటున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. విస్తృత ప్రజాదరణ కలిగిన వార్తా పత్రికలు సైతం సహజ సేద్యానికి, గో ఆధారిత వ్యవసాయానికి, ఆర్గానిక్‌ ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పిస్తున్నాయి.

హరిత విప్లవం పేరిట కోట్ల రూపాయలు కుమ్మరిరచి పంట పొలాలను ఊసర క్షేత్రాలుగా, రాజుల్లా బ్రతికిన రైతన్నలను కూలీలుగా మార్చిన పాలకులు సహజ వ్యవసాయ విప్లవానికి చేయూత నివ్వడానికి పెద్దగా కష్టపడాల్సిరదేమీ లేదు.

దూరతీరాల్లోని వినియోగదారులకు తమ ఉత్పత్తులను సకాలంలో, చౌకగా రవాణా చేసుకోడానికి రవాణా సౌకర్యాలు, అరదాకా నిల్వచేసుకోడానికి తగిన శీతల గిడ్డరగులు వంటి సౌకర్యాలు కల్పిస్తే చాలు. దూరతీరాల వినియోగదారులకు, విదేశీ ప్రభుత్వాలకు విశ్వాసం కలిగిరచే సర్టిఫికెట్ల మంజూరిలో ప్రభుత్వోద్యోగుల సహజ అవినీతి, జాప్యర అన్నదాతలను బాధిరచకురడా చూస్తే అదే పదివేలు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూక్తిని అన్నదాతలు తెలుగు జాతి అనుభవంలోకి తెస్తున్నారు. గో సంరక్షణ, సహజ వ్యవసాయం ముమ్మరమై, తెలుగు నేల నలు చెరగులా అన్నదాతలు సిరుల పంట పండిస్తారు. భవిష్యత్తులో తెలుగు ప్రజలు సంపూర్ణ ఆరోగ్యరతోను, తెలుగు భూములు తరగని పంట సామర్థ్యరతోను వర్థిల్లగలవు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *