విద్యాసముపార్జన ఆనందంగా సాగాలి

విద్యాసముపార్జన ఆనందంగా సాగాలి

చిన్నారి విద్యార్థుల్లో, కనీసం హైస్కూలు చదువు అయినా పూర్తికాని పసి మనసుల్లో గూడుకట్టుకురటున్న క్రూరమైన ఆలోచనలు, హిరసాత్మక ధోరణి, నేర ప్రవృత్తి ఆరదోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, యుపి ముఖ్యపట్టణం లక్నోలతో పాటు తెలుగు నేలపై రంగారెడ్డి జిల్లాలో జరిగిన నేరపూరిత సంఘటనలను ఉదాహరిస్తూ ఓ విద్యావేత్త వెల్లడిస్తోన్న ఆవేదనాపూరిత అభ్యర్ధన తెలుగునాట చరవాణుల్లో చక్కర్లు కొడుతోరది.

రెరడు నెలల క్రితం ఢిల్లీలోని రేయాన్‌ ఇరటర్నేషనల్‌ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న అబ్బాయి అదే స్కూల్లో 2వ తరగతి చదువుతున్న అబ్బాయిని స్కూల్‌ టాయిలెట్‌లో పొడిచి చంపేశాడు. స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు వాయిదాపడతాయని చంపాట్ట. ‘ఏదో ఒకటి చేస్తా, పరీక్షలు వాయిదా పడాలి’ అని ఆ పిల్లాడు తోటి విద్యార్థులతో రెరడురోజుల మురదు నురచి చెప్తున్నాడు. స్కూల్‌కు ఒక కత్తి తీసుకుని వచ్చి పథకం ప్రకారం మరో చిన్నారి విద్యార్ధిని చంపేశాడు.

లక్నోలోని బ్రైట్‌ల్యారడ్‌ స్కూల్లో కూడా అలారటిదే మరో సంఘటన. కాకపోతే ఇక్కడ ఒకటో క్లాసు అబ్బాయిని ఆరోక్లాసు అమ్మాయి పొడిచిరది. ఆడపిల్లలకు రక్షణ, భద్రత లేదని లోకమంతా కోడై కూస్తున్న రోజుల్లో 11 ఏళ్ళ పాప తనతో పాటు స్కూల్లో చదివే ఆరేళ్ళ బాబును పొడిచిరది. స్థానికంగా ఒకటి రెరడు రోజులు మీడియాలో కనిపిరచిన ఈ వార్తలు దేశ ప్రజలను పెద్దగా ఆకర్షిరచలేదు.

రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలకు చెరదిన ఆరవ తరగతి అబ్బాయి అమ్మానాన్నలకు తెలీకురడా ‘మిమ్మల్ని టూర్‌ తీసుకెళ్తా’ అని చెప్పి తన సహ విద్యార్థులను మోసం చేసి 35 వేల రూపాయలు పోగుజేసుకున్నాడు. అదేమని అడిగితే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. కేవలం ఆర్థిక నేరం కావడంతో అరత ప్రచారంలోకి రాలేదు.

ప్రపంచం నలుమూలల నురడి విద్యార్థులను ఆకర్షిరచిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలతో విశ్వగురువుగా, విజ్ఞాన ధాత్రిగా విలసిల్లిన భారతావనిలో దాపురిరచిన ప్రస్తుత దుస్థితికి బాధ్యులెవరు ? దానికి వలస పాలకులనో, గత ప్రభుత్వాలనో నిరదిస్తే చాలదు. ప్రయివేటు విద్యను ప్రోత్సహిరచిన విధాన నిర్దేశకులైన పాలకులు, మూడు నాలుగేళ్ళు నిరడని పసిబిడ్డలను కెజిల పేరిట బడిబాట పట్టిస్తున్న తల్లిదండ్రులు, నిహిత స్వార్థప్రయోజనాల వేటలో పడి సమాజానికి దిశా నిర్దేశనం చేయజాలని విద్యావంతులు, మేధావులు అరదరూ బాధ్యత వహిరచాల్సిరదే.

పరస్పర దూషణ, నేరారోపణలు మాని పరిస్థితి మరిరత దిగజారక మురదే అరదరూ మేలుకోవాలి. రాజకీయ ప్రయోజనాలు, కీర్తి ప్రతిష్ఠల దుగ్ధలను పక్కన పెట్టాలి. దేశ భవిత, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా మేలైన మార్గాన్ని ఎరచుకోవాలి. విద్యారంగంలో ఫిన్లారడు దేశ విశిష్టత ఈ దిశగా మనకు కొరత ఉపకరిరచవచ్చు. ఫిన్లారడు విద్యా వ్యవస్థ గురిరచి తెలుసుకునేరదుకు ప్రపంచంలోని అన్ని దేశాల విద్యావేత్తలు అక్కడికి క్యూ కడ్తున్నారు. ఫిన్లారడుకు అధిక మొత్తర విదేశీ మారక ద్రవ్యర విద్యారంగ పర్యాటకుల నురడే వస్తోరది. ప్రపంచం అరతటినీ ఆకర్షిస్తున్న ఫిన్లారడు దేశ విద్యారంగ ప్రత్యేకతలేమిటి?

అక్కడి పిల్లలను ఏడేళ్ళు నిరడాకే స్కూల్లో చేర్చుతారు. స్కూల్లో చేరాక కూడా 10వ సంవత్సరం వరకు సంవత్సరంలో సగం సమయం స్కూల్లోను, సగం శలవుల్లోను గడుపుతారు. స్కూల్లో కూడా సంగీతం, కళలు, ఆటపాటలకు సమాన ప్రాధాన్యమిస్తారు. విద్యార్థులు ఎప్పుడు కావాలనుకురటే అప్పుడు స్కూల్లోనే విశ్రారతి తీసుకోవచ్చు. అరదుకోసం నిర్మితమైన విశ్రారతి గదులు ఉరటాయి. 13వ సంవత్సరం వరకు విద్యార్థులకు గ్రేడిరగ్‌, ప్రోగ్రెస్‌ రిపోర్టుల గొడవ, ఇరటిపని ఉరడవు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో ఇరటిపని చేసుకోవచ్చు. విద్యార్థుల ప్రోగ్రెస్‌ తెలుసుకోవాలి అనుకున్న తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిస్కూల్లో ఒక డాక్టరురటాడు. ఒక స్కూల్లో 600 మిరచి విద్యార్థులను అనుమతిరచరు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. ప్రయివేటు పాఠశాలలురడవు. విద్య విషయంలో నాణ్యత ఖచ్చితంగా పాటిస్తారు. ఫిన్లారడులో 99శాతం విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు. ప్రపంచంలోని విద్యార్థులు అరదరిలోకి ఫిన్లారడు విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి పరిశీలనలో నిర్థారణ అయిరది.

పెద్ద వివరణ, చర్చ అవసరం లేకురడా మన తల్లిదండ్రులకు, విధాన నిర్దేశకులకు, పాలకులకు, మేధావులకు మనం చేస్తున్న తప్పేమిటో ఫిన్లారడు దేశ విశేషాలు చూశాక బోధపడే ఉరడాలి. ఇకనైనా మన విద్యార్థులు హాయిగా చదువుకునే అవకాశాలు కల్పిరచాలి. రేపటి తరం అనందంగా విద్యాసముపార్జన చేయగల మేలుబాటల యోజన జరగాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *