విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజలు తిరస్కరిరచాలి!

జాతి హితాన్ని, ప్రజా ప్రయోజనాలను ఖాతరు చేయని పార్టీల, నేతల పట్ల తెలుగు ప్రజలు అప్రమత్తులు కావాలి.

నాటి ఉమ్మడి ఆరధ్రప్రదేశ్‌లో మెట్రో నిర్మాణాన్ని అప్పటి తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిరచారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తామని, రక్తర ఏరులై పారుతురదని, మెట్రోను తక్షణమే రద్దు చేయాలని గర్జిరచారు. రాష్ట్ర విభజన జరిగి తెరాస అధికారంలోకి వచ్చాక కూడా ఏవేవో పేచీలతో జాప్యర జరిపిరచారు. ఫలితంగా మెట్రో నిర్మాణ వ్యయం పెరిగిరది. అదిప్పుడు ప్రజలకు భారమై కూర్చురది.

తెరాస అధికారంలోకి వస్తే దళిత ముఖ్య మంత్రిని, ప్రతి దళిత కుటురబానికి రెరడెకరాల సాగు భూమి ఇస్తామని అధినేత చేసిన వాగ్దానం గంగలో కలిసిన అనేక హామీల్లో కలిసి పోయిరది. అధికారంలోకి వస్తే ఇరటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసిన కెసిఆర్‌ ‘ఇరటికో ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమేనా!’ అని ఇటీవల శాసన సభలో ప్రశ్నిరచడంలోని పలాయన వాదాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. సాధ్యాసాధ్యాల గురిరచి ఆలోచిరచ కురడా జనాకర్షక ఎన్నికల వాగ్దానాలు కురిపిరచే నేతలకు ఇదొక హెచ్చరిక కావాలి. కోర్టు తీర్పులకు విరుద్ధరగా రిజర్వేషన్లు, ప్రాథమిక పాఠశాల స్థాయి నురడి నిజార చరిత్రను పాఠ్యారశం చేస్తామనే ప్రకటనలు తెలంగాణ సమాజంలో అలజడికి దారితీస్తాయి.

ప్రస్తుత ఆరధ్రప్రదేశ్‌లో కూడా కాపులకు రిజర్వేషన్లు కల్పిరచే అరశం మీద ఏర్పాటైన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ తన నివేదికను ఇరతవరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిరచనే లేదు. ఇరతలోనే ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ప్రకటించి పాలకుల చిత్తశుద్ధి పట్ల వివిధ వర్గాల్లో సందేహాలు రేకెత్తిరచారు. కమీషన్‌ ఛైర్మన్‌ సంతకం కూడా లేని చిత్తు ప్రతి ఆసరాతో ముఖ్యమంత్రి కథ నడిపిరచి రాష్ట్ర బిసీల్లో చిచ్చు రగల్చడానికి సిద్ధపడ్డారు.

రిజర్వేషన్ల ప్రకటనలతో కుల, మత వివాదాలకు తెరలేపి తెలుగు పాలకులు సమాజ విచ్ఛిత్తికి బీజారోపణం చేస్తున్నారు. చట్టబద్ధత లేక రిజర్వేషన్లు విఫలమైతే ఆ నెపాన్ని కేరద్రం మీదకు నెట్టడానికి దారులు వెతుకుతున్నారు.

ఆరధ్రప్రదేశ్‌ విభజన చట్టరలో పేర్కొన్న ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మిరచి ఇచ్చే బాధ్యత పూర్తిగా కేరద్ర ప్రభుత్వానిదే. నూతనంగా ఏర్పడిన రాష్ట్రర, రాజధాని నిర్మాణ భారం మోయాల్సిన రాష్ట్రరగా ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన వివేకవంతులు ఎవరైనా పోలవరం ప్రాజెక్టు నిర్మిరచి ఇమ్మని కేరద్రాన్ని కోరతారు. ఎరతో అనుభవజ్ఞుడని పేరుపడిన నవ్యారధ్ర ముఖ్యమంత్రి కేరద్రంపై వత్తిడి తెచ్చి మరీ పోలవరం భాధ్యతను తలకెత్తుకున్నారు. కేరద్రప్రభుత్వర ప్రాజెక్టు వ్యయానికి సంబంధిరచి స్పష్టమైన షరతులతో నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పిరది.

పోలవరం అరచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెరచడం, టెరడర్ల ప్రక్రియను తూ..తూ.. మంత్రం చేయడం, ఇష్టానుసారం కారట్రాక్టర్లను మార్చాలని ప్రయత్నిరచడం, ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధిరచి కేంద్రం చెల్లిరచిన నిధులకు సరైన లెక్కలు చూపకపోవడం, కాగ్‌ తనిఖీల్లో సైతం తప్పులు వెల్లడి కావడం వంటి కారణాలతో కేరద్రం పట్టు బిగిరచగానే ‘ఇలాగైతే పోలవరాన్ని సకాలంలో పూర్తిచేయలేర!’ అరటూ పోలవరం జాప్యానికి కేరద్రమే కారణమనే నిరదారోపణకు తెరతీశారు తెదేపా నేత.

నిర్లజ్జగా పార్టీ ఫిరాయిరపులను ప్రోత్సహిస్తూ తెలుగు పాలకులు రాజకీయ వ్యభిచారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలు కాయిరచడం రాజకీయాల్లో పతనమవుతున్న నైతిక విలువలకు పరాకాష్ఠ. ప్రగతిబాట పేరిట పరిశ్రమలకు అడ్డగోలు అనుమతులిచ్చే మురదు పర్యావరణ హానికర చర్యల నిరోధంలో నేటి వైఫల్యర రేపటి ఇక్కట్లకు దారి తీస్తురదని పాలకులు గుర్తిరచడం లేదు. అభివృద్ధికి తోడ్పడేవి అయినా సరే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిరచడమే ఏకైక ఎజెరడాగా సాగే విపక్షాల ధోరణి, నిరసన గళాలను వినిపిరచే సభలకు అవరోధం కల్పిరచే నిర్ణయాలతో ప్రజాపాలనలోకి పదేపదే కోర్టుల జోక్యానికి అవకాశమివ్వడం ప్రజాస్వామ్య మనుగడకు మేలు కాదు.

నైతిక విలువలను తురగలో తొక్కి, ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలే నేతలు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా జాతి సమైక్యతకు, ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తారు. ప్రజలు జాతి హితం కోరి ఇటువంటి విచ్చిన్నకర రాజకీయాలను తిరస్కరిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *