వికటించిన అవిశ్వాసం !

వికటించిన అవిశ్వాసం !

మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే విశ్వాసం దేశంలో ఎవరికీ లేదు. ఆఖరికి దాన్ని ప్రవేశపెట్టిన తెదేపాకు, లోక్‌సభలో పెద్ద విపక్షపార్టీ అయిన తమకే ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న కారగ్రెసుకు, మద్దతిస్తామంటూ ముందుకొచ్చిన ఇతర పార్టీలకు సైతం అవిశ్వాసం నెగ్గుతుందన్న నమ్మకం లేదు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని, మరీ ముఖ్యంగా విభజన ఫలితంగా తీవ్రంగా నష్టపోయామని ఘోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయం అంశాల వారీగా వెలికి తెస్తారని ఆశించిన వారికి కూడా నిరాశ కలిగింది. ఇంతకుమించి అంతా తూతూమంత్రం మొక్కుబడి వ్యవహారమే. మోదీ గుండెలమీద తలానించి వాటేసుకోవడం, సహచరులకు కన్నుగీటటం లాంటి రాహుల్‌ వెకిలి చేష్టలతో ఈ తంతు మరీ కామెడీగా మారింది.

అవిశ్వాసంపై చర్చను ప్రారంభించిన తెదేపా యం.పి. గల్లా జయదేవ్‌ ప్రసంగం మొత్తరలో నిన్నమొన్నటి వరకు బహిరంగ సభల్లో, దీక్షాస్థలాల్లో, మీడియా ముందు చంద్రబాబు ఏకరువు పెట్టిన విషయాలే తప్ప కొత్తవేమీ లేవు. కీలకాంశమైన ప్రత్యేక హోదా గురించి ఆయన చేసిన ఆరోపణకు బలం చాలలేదు. ‘చంద్రబాబు కోరిక, ఆమోదం మేరకే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చాము’ అన్న ప్రధాని మోదీ వివరణతో జయదేవ్‌ ఆరోపణ తుస్సుమన్నది. రాజకీయ అంశాలతో వాడిగా, వేడిగా సాగాల్సిన ప్రసంగంలో సినిమా కథను ప్రస్తావించడంతో తీవ్రత నీరుగారింది. అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ఆన్యాయం జరిగిందన్న ఆయన విభజన నేపథ్యాన్ని, బాధ్యులను పూర్తిగా ప్రస్తావించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ఆమోదం తెలుపుతూ బాబు లేఖ ఇచ్చాడని, విభజన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషిచేయలేదని జయదేవ్‌ ప్రస్తావిరచకపోవడం అర్థంచేసుకోతగినదే. బాబు తప్పులు కప్పిపుచ్చిన తీరు తెదేపా వారికి ఒప్పు, ఇతరులకు తప్పుగా తోచడం జయదేవ్‌ తప్పు కాదు.

చంద్రబాబుతో తమ స్నేహం ఈనాటిది కాదని, ఎన్‌డిఎ నుండి వారు బైటికి వెళ్ళినా తమ అనుబంధం కొనసాగుతుందని కేరద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సిరగ్‌ ప్రకటనను వైకాపా ఆయుధంగా మలచుకొంది. నిన్నటి వరకు మోదీతో జగన్‌ తెరమాటు సంబంధాలు సాగిస్తున్నాడన్న తెదేపా ఆరోపణలను తిప్పికొట్టి, మోదీతో బాబుది లాలూచీ పోరాటమని, వారిద్దరి మధ్యా తెరమాటు సంబంధాలు కొనసాగుతున్నాయని వైకాపా ఆరోపించింది. మోదీతో కెసిఆర్‌ రహస్య అనుబంధం కారణంగానే తెరాస యంపిలు అవిశ్వాసంపై చర్చలో దూకుడు ప్రదర్శించలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండంనే బిజెపి వాదన, దేశ ప్రధానిగా ముఖ్యమంత్రులతో మిత్రత్వరం పాటిస్తామన్న మోదీ వివరణ తెలుగు ప్రజలకు నమ్మబుద్ధి అయినట్లు లేదు.

జరుగుతున్న పరిణామాలు, తెదేపా, తెరాస, వైకాపాలపై వస్తున్న ఆరోపణలు అన్నీ కలిపి చూస్తే అంతా ముక్కోణపు ప్రేమకథలా, దానిలో మోదీ కథానాయకుడిలా కనిపిస్తున్నారు. ఆయనతో ఎవరి ప్రేమ ఫలిస్తురదో తేలాలంటే 2019 ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే అని తెలుగు ప్రజలు తీర్మానించుకున్నారు. బిజెపి, మోదీ వ్యతిరేక మీడియా విపక్షాల ఊతంతో మోదీ ప్రభుత్వరం మీద తీవ్రంగా దాడి చేయొచ్చని కన్న కలలు కూడా ఫలించ లేదు. ఇసుమంతైనా ప్రజోపయోగం సమకూర్చని బాధ్యతారహిత చేష్టలతో శుద్ధ దండుగ చర్చలకు పార్లమెంటును వేదికగా మార్చి ప్రజాధనాన్ని వృధాగా వ్యయం చేసిన పనికి మాలిన దండుగగా విపక్షాలు పేరు పొందాయి. ఇలాంటి వారిని పార్లమెంటుకు పంపడం దండగే అన్న ఖ్యాతి గడించాయి. మోదీ ప్రభుత్వం పట్ల అవిశ్వాసం ప్రకటించాలని చూసిన విపక్షాల ప్రయత్నం వికటించింది. ఓటేసిన 451 మంది సభ్యుల్లో 126 మంది మాత్రమే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే 325 మంది వ్యతిరేకించి మోదీ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోలేదని చాటిచెప్పారు. మెయ్యబోయి మెడకు వేసుకున్న చందాన విపక్షాలు ప్రజావిశ్వాసం కోల్పోయాయి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *