లాభసాటి పరిశ్రమగా వ్యవసాయం

లాభసాటి పరిశ్రమగా వ్యవసాయం

గారధీజీ మరణంతో మన దేశంలో స్వదేశీ భావన అనాథ అయిరది. జీవన రంగాలన్నిటా విదేశీయత చాపక్రిరది నీరులా కమ్ముకున్నది. చరఖా తిప్పే నాధుడు లేక గ్రామీణ వృత్తులు, కుటీర పరిశ్రమ కునారిల్లాయి. హరిత విప్లవం పేరిట సాగిన ఆధునిక సేద్య పద్ధతులతో భూసారం క్షీణిరచిరది. శాసన రక్షణ లేక గో సంరక్షణ కబేళా పాలయిరది. పాడిపంటలతో జోడెడ్లబండిపై జోరుగా సాగాల్సిన అన్నదాత సేద్య రధ చక్రం అప్పుల్లో క్రురగిపోవడం మొదలైరది.

పాలకుల తోడ్పాటు కోసం ఎదురుచూస్తూ కష్టనష్టాలను పళ్ళ బిగువున భరిరచిన తొలితరం మలితరానికి అప్పుల భారాన్ని తలకెత్తిరది. ఆదుకునే నాధుడు లేక, అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానంగల అన్నదాతలు సేద్యానికి స్వస్తి చెప్పి, వలస పాట, లేదంటే ఆత్మహత్యల బాట పట్టడం సర్వసాధారణమైరది. సేద్యంలో లాభాలు పండిస్తున్న దేశాలకు అధ్యయనం పేరిట ప్రజల సొమ్ముతో పాలకులు తమ విదేశీ పర్యటనల మోజు తీర్చుకుంటున్నారు. రుణమాఫీ వంటి చిట్కాలు మినహా సేద్యరంగానికి పట్టిన జాడ్యాన్ని వదిలిరచే మేలైన చికిత్స గురిరచి పాలకులు ఆలోచిరచలేదు.

అన్నదాతల ఆర్తిని బాపటానికి రాజకీయ నేతలు ముందుకు రానంత మాత్రాన లోకం గొడ్డుబోదని కాలం నిరూపిస్తోరది. సేద్యం పట్ల రైతుల్లో ఆశాభావాన్ని పెంపొందించే ప్రయత్నాలు, పరిశోధనలు, ప్రయోగాలు ప్రభుత్వానికి వెలుపలే జరుగుతున్నాయి.

సేద్యం గిట్టుబాటు కావడం లేదని ఉద్యోగాల బాటపట్టి దూర తీరాలకు వెళ్ళిన విద్యావంతులైన రైతుబిడ్డలు బానిస బ్రతుకులకు స్వస్థి చెప్పి పొలం బాట పట్టడం మొదలైరది. ప్రతి రైతు ఒక కార్పొరేట్‌ కావాలన్న దృక్పథం నవతరం రైతుల్లో బలంగా నాటుకొంటున్నది. వ్యవసాయాన్ని కేవలం వృత్తిగానే కాకుండా లాభదాయక పరిశ్రమగా మార్చుకోవాలనే కోరిక బలపడుతోంది.

ఒక పరిశ్రమ విజయం సాధించడానికి మ్యాన్‌, మోటివ్‌ పవర్‌, మనీ, మెటీరియల్‌, మెషిన్‌, మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ అని, యం అనే ఆంగ్లాక్షరంతో మొదలయ్యే సప్త మకారాల సమన్వయం అవశ్యమని ప్రముఖ శాస్త్రవేత్త సర్‌ మోక్షగురడం విశ్వేశ్వరయ్య సూచిరచారు. సాంప్రదాయిక సేద్యం కొనసాగిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలకు ఆర్థిక సాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటిరగ్‌ మెళుకువలే ప్రధాన కొరతలు.

ఆధునిక ప్రపంచాన్ని అధ్యయనం చేసిన అనుభవం, సేద్యరలో లాభాలు పండిస్తున్న పలుదేశాల రైతులు అనుసరిస్తున్న మెళుకువల పట్ల అవగాహన, ఆధునిక సారకేతిక పరిజ్ఞానం గుప్పిట పట్టిన విద్యావంతుల రంగ ప్రవేశంతో సేద్యరంగానికి కొత్త రూపు, ఊపు వస్తున్నది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఆచరణల్లో వ్యక్తమవుతోన్న మార్పు భారత రైతాంగానికి నూతన జవసత్వాలు నిరపనురది.

రైతులకు వ్యవసాయం, సేద్యం కొరకు 10 లక్షల కోట్ల రూపాయల దాకా రుణ సాయం అరదించి తోడ్పడాలని రిజర్వు బ్యాంకు, తదితర బ్యాంకులను భారత ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో కోరిరది. పది నుండి 20 మంది దాకా సభ్యులను గ్రూపుగా ఏర్పరచి, వాటన్నింటినీ కలిపి వ్యావసాయిక ఉత్పత్తి దారుల సంఘంగా జతకూర్చి, రైతులకు తక్కువ ఖర్చుతో బ్యారకుల నురడి రుణ సాయం, నిర్వహణ పెట్టుబడి సమకూర్చే పథకాలు రూపుదిద్దుకున్నాయి. సరకు నిల్వ సౌకర్యాలు, నిల్వలపై అప్పు ఇప్పించడం, సరకును మార్కెట్లో అమ్మిరచడం తదితరాల కోసం వాణిజ్య ప్రమాణాలతో పనిచేసేరదుకు డిఎఎల్‌ (DAL) అనే మరో సంస్థ రూపుదిద్దుకొన్నది.

సాంప్రదాయిక భారత రైతాంగం ఆధునిక పోకడలను, ప్రభుత్వ పథకాలను అవగతం చేసుకోవాలి. సాంకేతికతను పుణికి పుచ్చుకున్న నవతరం రైతు బిడ్డలతో చేయిచేయి కలిపి ముందుకు సాగాలి. కొత్త, పాతల మేలు కలయికతో వ్యవసాయం లాభదాయక పరిశ్రమగా వర్థిల్లాలి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *