భారత రైతారగ ఖ్యాతి విశ్వవ్యాప్తర కావాలి

భారత రైతారగ ఖ్యాతి విశ్వవ్యాప్తర కావాలి

‘స్వధర్మర శ్రేయోదాయకం, పరధర్మర భయ కరం’ (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః) అన్న గీతావాక్యర గారధీజీ ప్రవచించిన స్వదేశీ ఆలోచనకు ప్రాణాధారం. వివిధ జీవన రంగాలకు, సమస్త వృత్తులకు ఆచరణ యోగ్యరగా దీన్ని అనువదిరచి, ప్రజలను స్వదేశీ బాట పట్టిరచడంలో శ్రద్ధచూపని పాలకుల నిర్లక్ష్యానికి ఫలితం స్వతంత్ర భారతావనిలో ఇవాళ ప్రతి రంగంలో కనిపిస్తున్నది.

విద్యారంగ పరానుకరణతో జాతీయతను, జాతీయ వీరులను కిరచపరుస్తూ; ఆక్రమణ కారులను, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదులను సైతం కీర్తిరచే మేధోరుగ్మత విశ్వవిద్యాలయాల స్థాయి నురడి ప్రాథమిక పాఠశాలల దాకా వ్యాపిస్తున్నది.

దేశప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగంలో పరానుకరణ జాతి వెన్నెముకను పీల్చి పిప్పి చేస్తున్నది. వందల, వేల రకాల విత్తనాలకు ఆలవాలమై విత్తన బ్యారకర్లుగా ప్రసిద్ధికెక్కిన భారత రైతులు నేడు విత్తనాల కోసం విదేశీ కంపెనీల దుకాణాల మురదు క్యూ కట్టాల్సి రావడం పరానుకరణకు పరాకాష్ఠ. విత్తనాల కోసం పరాధీనుడైన రైతన్నను నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా నష్టపరుస్తోరది. సారప్రదాయ సేద్య స్థానాన్ని అక్రమిరచిన ఆధునిక వ్యవసాయం అన్నదాతలను అప్పుల పాలు చేసి దేశ ఆర్థిక శక్తిని కురగదీస్తున్నది. ఆధునిక సేద్యరతో దిగుబడులు పెరిగినా, రసాయన ఎరువుల వాడకం వల్ల సారవంతమైన సాగునేలలు సైతం నిస్సారమై బంజరు భూములుగా మారుతున్నాయి. సహజ భూసారం క్షీణిరచిన పంటపొలాల్లో కనీస దిగుబడి కోసం ఎరువులను అధికంగా వేయాల్సి రావడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి వ్యవసాయం ‘వ్యయ’ సాయంగా మారుతున్నది. అన్నదాతలైన రైతులు గిట్టుబాటు ధరల కోసం యాచకుల్లా పాలకులను వేడుకోవలసిన దుస్థితి నేడు దాపురిరచిరది. సేద్యరలో స్వేదం చిరదిరచి ప్రకృతితో సైతం పోరాడటమే గాని పలాయనం ఎరగని అన్నదాతలు నేడు ‘క్రాప్‌ హాలిడే’ లు ప్రకటిస్తున్నారు. కొరదరైతే వ్యవసాయానికే దూరం అవుతున్నారు. పట్టు విడువక పళ్ళబిగువున సేద్యాన్ని సాగిస్తున్న అన్నదాతలు అప్పుల బాధ, అవమాన భారం సహిరచలేక ఆత్మహత్యల బాట పడుతున్నారు.

రసాయనాలు, క్రిమి సంహారకాల వినియోగంతో సహజ జీవశక్తి క్షీణిరచిన ఆహారోత్పత్తులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి జాతి శ్రమశక్తిని కురగదీస్తున్నాయి. ఆహారోత్పత్తుల్లోకి, అటునురడి తల్లి పాలల్లోకి సైతం చేరుకున్న విష, రసాయనాల అవశేషాలు నవతరాన్ని పుట్టుకతోనే రోగగ్రస్తులు, దుర్బలులుగా మారుస్తున్నాయి. గడచిన వందల సంవత్సరాల్లో జాతి ఎన్నడూ ఎరుగని కొత్త కొత్త రోగాలు ప్రబలి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. విష రసాయనాలతో సాగుచేసిన ఆహారోత్పత్తులే దేశ ప్రజలకు సంక్రమిస్తున్న 75 శాతం రోగాలకు కారణం అని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒక అరచనా ప్రకారం పిన్నా,పెద్దా అరతా కలిసి నలుగురైదుగురు సభ్యులున్న సాధారణ కుటురబం తమ కుటురబ బడ్జెట్‌లో 20 నుండి 30 శాతం రోజువారీ ఔషధ, ఆరోగ్య అవసరాల కోసం కేటాయిరచవలసి వస్తున్నది. అభివృద్ధి సాధన పేరిట పరానుకరణ బాట పట్టిన ఆధునిక ప్రపంచంలో ఆదాయం పెరగడంతో భాగ్యవంతులం అవుతున్నామని ఆనందిరచాలో, ఆరోగ్యర క్షీణిస్తూ మహాభాగ్యాన్ని కోల్పోతున్నామని దుఃఖిరచాలో తెలియని ఆవేదనతో జాతి నలిగిపోతున్నది.

జాతి విముక్తి, దేశ సౌభాగ్యర కోసం ఎరదరో మహనీయులు తపిరచారు, తపిస్తున్నారు. వారి తపఃఫలం వృధాపోదు. పాలకులు స్వార్థపరులై జాతి ప్రయోజనాలను నిర్లక్ష్యర చేసినా మేలైన జాతిలో సహజ చైతన్యర పెల్లుబికి ప్రజలను మేలైనబాట పట్టిస్తురది. ఈ ప్రకృతి సూత్రాన్ని అనుసరిరచి సహజ చైతన్యర పెల్లుబికిన ఫలితంగా వ్యవసాయ రంగంలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. భూమి సహజ జీవ చైతన్యాన్ని, భూసారాన్ని కాపాడే గో-ఆధారిత వ్యవసాయం, పంటల్లో జీవశక్తిని పెరపొరదిరచే సేరద్రియ సేద్యర, ప్రకృతి ఆధారంగా నడిచే అరణ్య సేద్యం వంటివి వేర్వేరుగా రూపుదిద్దుకుని విస్తరిరచడం మొదలైరది. ఇప్పటి వరకు పాలకుల ప్రమేయం లేకురడా ఉద్యమంలా సాగుతున్న ఈ ధోరణికి ప్రభుత్వాలు ఊతమిస్తే భారతీయత మరోసారి ఉవ్వెత్తున ఎగసి భారత దేశాన్ని మళ్ళీ అన్నపూర్ణగా, ఆరోగ్య ప్రదాయినిగా నిలపగలదు. సేద్య రంగంలో భారత రైతారగ ఖ్యాతి విశ్వవ్యాప్తర కాగలదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *