ప్రజలు మనోధైర్యం తెచ్చుకోవాలి !

ప్రజలు మనోధైర్యం తెచ్చుకోవాలి !

బలికోసం దేవుడు గుర్రాన్నో, ఏనుగునో, బెబ్బులినో కోరడని; మేకపిల్ల లారటి దుర్బలులనే బలి తీసుకుంటాడని ఓ నానుడి. ఈ మే 28న విజయవాడలో జరిగిన తెదేపా మహానాడు క్రతువు కూడా ఓ దుర్బలుడి బలితో పరిసమాప్తమైరది. పార్టీకి నష్టర కలిగిరచే చర్యలకు పాల్పడిన వారు తెదేపాలో చాలామందే ఉన్నారు. కర్నాటకలో బిజెపి ఓటమికి తిరుపతి వెరకన్న చౌదరి ఆగ్రహమే కారణం అరటూ వెరకటేశ్వర స్వామికి కూడా కులం అరటగట్టి, పార్టీకి ప్రజల ఛీత్కారాన్ని కొనితెచ్చిన పార్లమెరటు సభ్యుడు; అవినీతికి పాల్పడక తప్పదని, వాటాలు వేసి పంచుకోమని అధినాయకుడే సూచిరచాడని మీడియా మురదు వెల్లడించిన మరో నేత; ప్రభుత్వ అధికారిణి మీదా, ప్రజలమీదా రౌడీలా చెయ్యి చేసుకున్న ఇంకో శాసన సభ్యుడి దాకా పార్టీకి నష్టర కలిగిరచిన వారిని, వారి ఘనకార్యాలను వివరిస్తూ పోతే చాటభారతం అవుతురది.

అలాంటి ఘనాపాఠీలను అందరినీ కాదని పార్టీ సీనియర్‌ నేత షెడ్యూల్డు కులాలకు చెందిన మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుండి తెదేపా మహానాడు బహిష్కరించింది. భుజాలు కాయలు గాసేట్లు తెదేపా జెండా మోసి, కష్టకాలంలో అన్న యన్టీఆర్‌ను అరటి పెట్టుకుని, ఆ తరువాత అధినేత చంద్రబాబు చెప్పిరదల్లా చేసిన తనకు పార్టీలో తగిన న్యాయం జరగలేదని వాపోవడమే నర్సింహులు చేసిన తప్పిదం. అవినీతికి పాల్పడినట్లు గాని, పార్టీలో చీలిక తేవడానికి ప్రయత్నిరచినట్లుగాని, వెన్నుపోటు కుట్రకు తెరతీస్తున్నట్లు గాని ఈ బలహీనుడిపై ఆరోపణలు లేవు. చంపదలచుకున్న దానికి ‘పిచ్చి కుక్క’ అని పేరుపెట్టమన్న చైనా సామెతను అనుసరిరచి, అన్యాయం జరిగిరదని వాపోవడమే పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిరచి, విచారణ, సంజాయిషీ వంటి ప్రజాస్వామిక ఆనవాయితీలైనా పాటిరచకురడా ఏకంగా సస్పెన్షను బలితో పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహిరచేది లేదని తెదేపా వారు చెప్పజూశారు.

ఇరతా చేస్తే మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యరలో పార్టీ లక్ష్యాలు, వాటి సాధన విధానము, కార్యాచరణ వంటివి మహానాడులో ప్రజల మురదు పెడ్తారని ఆశపడ్డవారికి నిరాశే మిగిలిరది. ఆరంభం నుండి చివరిదాకా పార్టీ అధినేత ఆత్మ స్తుతి, బిజెపి, మోదీ, షా, వైకాపా, జగన్‌ల నిందలతోనే సరిపోయిరది. గడచిన నాలుగేళ్ళలో గత ఎన్నికల వాగ్దానాల అమలులో వైఫల్య సాఫల్యాలు, భవిష్యత్‌ కార్యాచరణలేవీ లేవు.

నేటికీ ఆరంభానికి నోచని రాజధాని నిర్మాణం గురిరచి ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం అరిగిపోయిన రికార్డును తలపించింది. కేరద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వరం లెక్కలు చెప్పలేదని, రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని, సింగపూర్‌లో డిజైన్ల దశలోనే ఉందని, కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి వినియోగ సర్టిఫికెట్లు పంపలేదన్న అమిత్‌షా ఆరోపణలను తప్పు పట్టిన ముఖ్యమంత్రి రాజధాని డిజైన్లు వచ్చాయని, నిర్మాణ పనుల్లో 22 వేల కోట్ల పనులకు ఇటీవలే టెరడర్లు పిలిచినట్లు అదే వేదిక నురడి చెప్పుకొచ్చారు. అరటే రాజధాని నిర్మాణ పనులిరకా ప్రారంభం కాలేదన్న షా ఆరోపణలు నిజమే కదా!

తను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం చూసి ప్రజలు రాష్ట్ర విభజన అనంతరం తనను ఎన్నుకున్నారన్నారని బాబు జబ్బలు చరుచుకున్నారు. రాజధాని కోసం భూములు సేకరిరచే సమయంలో బాబు రైతులకు చాలా ఆశలు కల్పిరచారు. కానీ, రాజధాని కోసం తను అడగ్గానే ఒక్క రూపాయి తీసుకోకురడా 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే 33 వేల ఎకరాల భూమిని రైతులు ఇవ్వడం తనపై వారికి గల విశ్వాసమని, అదే జగన్‌ అడిగితే రైతులు ఇచ్చేవాళ్ళా, ఒక్క ఎకరం కూడా ఇచ్చేవారు కాదు అని ఆత్మస్తుతిలో పడిన బాబు పొలాలు ఉచితంగా ఇచ్చారని ఉబ్బేసి, రైతులకు పంగనామాలు పెట్టడానికి చూస్తున్నట్లు నోరు జారారా అనిపిరచిరది. ఇన్ని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోరదని పదే పదే చెప్పుకోవడం ఆయనలోని భీతావహుణ్ని వెల్లడిరచిరది. అబద్ధాలు చెప్పడానికి జంకని నేతలు ప్రత్యర్థుల ఆరోపణలకు భీతిల్లుతున్న నేపథ్యరలో ఆరధ్రప్రదేశ్‌ ప్రజలు మనోధైర్యర తెచ్చుకోవాలని తెదేపా మహానాడు తేటతెల్లం చేసిరది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *