న్యాయం జరిపిరచే స్థాయికి ఎదిగి, ప్రజలు ధర్మాన్ని రక్షిరచాలి

న్యాయం జరిపిరచే స్థాయికి ఎదిగి, ప్రజలు ధర్మాన్ని రక్షిరచాలి

ప్రకృతి ప్రకోపిరచినప్పుడల్లా ధర్మర దారితప్పుతోరదని ఓ నిట్టూర్పు విడువడం మనకు పరిపాటి అయిరది. ధర్మర అరటే మన వీధుల్లో వేగంగా తిరిగే మోటారు వాహనమో, లేక ఆకాశంలో పరిభ్రమిరచే గ్రహమో కాదు. ధర్మర అనేది మానవ ప్రవర్తన. అదెరత భీకరంగా మారిపోతోరదో ప్రతి రోజూ వార్తా పత్రికల్లో, టివి ఛానళ్ళలో తేటతెల్లమవుతోరది. ‘యత్రనార్యస్తు పూజ్యరతే రమంతే తత్ర దేవతాః’ అన్నారు. మానవ ప్రవర్తన దేవతలు ఆనందిరచడానికి అనువుగా లేనప్పుడు చెట్లు చిగిర్చి పూలు పూయాల్సిన వసంత రుతువులో మండుటెరడలు, నిరడు వేసవిలో వడగండ్ల వానలు, కష్టాల కడగండ్లు తప్పవు!

స్త్రీలు పూజనీయులైన తావుల్లో దేవతలు ఆనందిస్తారు అన్న ఆర్యోక్తిని మంటగలిపే మన ప్రవర్తనకు ఏటేటా పెచ్చుమీరుతున్న అత్యాచార నేరాల సంఖ్య అద్దర పడుతున్నది. 2014, 15, 16 సంవత్సరాల్లో దేశవ్యాపితంగా నమోదయి, కోర్టుల్లో విచారణకు నోచుకున్న కేసుల సంఖ్య ఇలా ఉరది. 2014లో 20 వేల 97, 2015 లో 21 వేల 604, 2016 లో 22 వేల 763. అత్యాచార నేరాల సంఖ్య పెరిగి పోవడానికి ప్రభుత్వం, సమాజం ఇరువురూ బాధ్యత వహిరచాలి.

మహిళలపై, మరీ ముఖ్యరగా బాలికలపై అత్యాచారం జరిగినప్పుడు సమాజం తీవ్రంగా స్పరదిస్తోరది. నేరస్తులను పట్టి పల్లార్చాలని, నడిరోడ్డుపై ఉరి తీయాలని తీవ్రమైన ఆవేశం, ఆవేదనలతో కూడిన డిమారడ్లు, ప్రదర్శనలు ¬రెత్తుతాయి. దారతో ప్రభుత్వ యంత్రారగం నిరదితులనో, ఆ పేరిట మరెవర్నో పోలీసులతో అరెస్టు చేయిరచి అరతా అయినట్లే అనిపిస్తురది. మరో అత్యాచార వార్త వెలుగు చూడ్డరతో గత సంఘటన మరుగున పడిపోతున్నది.

పెరుగుతున్న నేరాల సంఖ్యకు శిక్షల పాలవుతున్న నిరదితుల సంఖ్యకు పొరతన కనిపిరచడం లేదు. కోర్టుల్లో విచారణ అనంతరం శిక్షపడిన, విడుదలైన నిరదితుల సంఖ్య ఇలా ఉరది. 2014 లో 6 వేల 643 మందికి శిక్ష పడగా, 13 వేల 454 మంది విడుదలయ్యారు. 2015 లో 7 వేల 690 మందికి శిక్ష పడగా, 13 వేల 914 మంది విడుదలయ్యారు. 2016 లో 8 వేల 991 మందికి శిక్ష పడగా 15 వేల 772 మంది విడుదలయ్యారు. మూడొరతులకు పైగా నిరదితులు శిక్షలనురడి తప్పిరచుకోవడం వ్యవస్థ మీద అపనమ్మకాన్ని, భద్రత పట్ల నిరాశను పెరచుతురది. సరైన ఆధారాలు దొరకలేదని, సాక్షులు గట్టిగా సాక్ష్యర చెప్పలేదనే సాకులు నేర నిరూపణ, దండన జరిపిరచడాల్లో వైఫల్యానికి తొడిగిన ముసుగులు. ఇవి బాధితులతో పాటు సాధారణ ప్రజలకు సైతం వ్యవస్థమీద విశ్వాసం సన్నగిల్లడానికి దారితీస్తాయి. తప్పిరచుకున్న వాడు తప్పిరచుకున్నా చిక్కిన వాణ్ణయినా తీవ్రంగా శిక్షిరచాలనడం కూడా మానసిక బలహీనతే.

మనోదౌర్బల్య ప్రతీకలైన క్రూర, అనాగరిక శిక్షలను నాగరిక సమాజం ఆమోదిరచదు. నేరం జరిగాక కఠిన దండన కన్నా సంస్కారం మేలని, అసలు నేరం జరక్కురడా నిరోధిరచే వ్యవస్థలు, సంస్కారాలు బలోపేతం కావాలన్నది ఆధునిక నాగరిక సమాజ అభిలాష.

నేర నిరోధక చర్యల్లో ప్రథమ స్థానం అయిన సంస్కారం ఇరటినురడే ప్రారంభం కావాలి. మన బంగారం మంచిది కానప్పుడు కంసాలిని తప్పుపట్టి లాభం లేనట్లు యువత దారితప్పడానికి సినిమాలు, టివి ఛానెళ్ళ మీద ఆరోపణలు గుప్పిరచి ప్రయోజనం లేదు. నేర నిరోధంలో రెరడవదైన దండభయాన్ని నిలపడంలో ప్రభుత్వ యంత్రారగం, పౌరులు బాధ్యత వహిరచాలి. నేరగాళ్ళకు దండన కఠినంగా, త్వరితంగా, తప్పక ఉరటురదనే విశ్వాసాన్ని పాదుకొల్పాలి.

ప్రజలు అతిగా ప్రభుత్వరమీద ఆధారపడాల్సిన స్థితి ప్రజలను బానిసలుగా, పాలకులను రాచరికం వెలగబెట్టే నియంతలుగా మారుస్తోరది. ఆదర్శవంతమైన ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వర పాత్ర నామమాత్రం కావాలి. ప్రజలు దానికి జవసత్వాలు కూర్చి సమర్థపాలన, సుపరిపాలన రాబట్టాలి. ప్రజలకు భద్రత కల్పిరచాల్సిన ప్రభుత్వ యంత్రారగాన్ని కట్టడి చేయగల స్థితికి పౌర సమాజం ఎదగాలి. నేర నిరూపణ, దండనల విషయమై పోలీసు, న్యాయ వ్యవస్థల పాత్ర నిర్వహణలో ప్రజల భాగస్వామ్యర పెరగాలి. ఆ దిశగా నాలుగు వేల జనాభా గల సిద్ధిపేట్‌ జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్‌ గ్రామంలో సొరత ఖర్చులతో గ్రామంలో 20 సిసి కెమేరాలు అమర్చి గ్రామ యువకులు చేపట్టిన చర్యలు అరదరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. న్యాయాన్ని అర్థిరచే స్థాయినురడి న్యాయం జరిపిరచే స్థాయికి ఎదిగి, ప్రజలు ధర్మాన్ని రక్షిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *