నేటి పసికూనలే రేపటి ప్రపంచ విజేతలు

నేటి పసికూనలే రేపటి ప్రపంచ విజేతలు

తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితం సమకూర్చే చక్రం ఆధారంగా మానవ సమాజం కొన్ని వందల సంవత్సరాలు ప్రగతి మార్గరలో ప్రయాణిరచిరది. 18వ శతాబ్దరలో పాశ్చాత్య దేశాల్లో సంభవిరచిన పారిశ్రామిక విప్లవం ప్రపంచం అరతటినీ ఓ కుదుపు కుదిపిరది. తదనంతరం మరో వందేళ్ళలో శాస్త్ర విజ్ఞానం కొత్త పురతలు తొక్కిరది. శాస్త్ర సారకేతిక రంగాల్లో సంభవిరచిన నూతన ఆవిష్కరణలతో దేశాల మధ్య దూరం తరిగిపోయిరది. విశ్వ గ్రామ భావన మొగ్గతొడిగి ప్రపంచం ఓ గ్రామంగా మారిరది.

ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెరడో వైపున వినియోగ సంస్కృతి ప్రబలిన ఫలితంగా ప్రకృతి వనరుల దుర్వినియోగం పెరిగిరది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని సర్వత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవిరచడం సాధారణమైరది. శ్రమ శక్తి చౌకగా లభిరచే ప్రారతాలకు వెల్లువెత్తిన పారిశ్రామిక వేత్తల వలసలు తిరుగుముఖం పడుతున్నాయి. శ్రామికుల వలసల స్థానంలో శ్రమ బదిలీ చోటుచేసుకురటున్నది. రోబోలు అనే యంత్ర మానవుల ఆవిష్కరణతో మానవ జీవిక ప్రమాదంలో పడిరదనే ఆరదోళన నెలకొరటున్నది.

తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం రాబట్టగల ఆవిష్కరణలు వెలుగు చూసినప్పుడల్లా కొరదరు ఉపాధి కోల్పోక తప్పదనే భయం శ్రమజీవుల్లో వ్యక్తమవుతూనే ఉరది. ఈ భయాలు కొరదరికి వాస్తవాలుగా పరిణమిస్తున్నాయి. సవాళ్ళను అవకాశాలుగా మలుచుకోగలిగిన వారికి భయాలే చోదక శక్తులవుతున్నాయి.

ఉపద్రవాలను పసికట్టి, మురదుచూపు అలవరచుకోవలసిన అవసరాన్ని, జీవన భద్రతకు అనుసరిరచదగిన మార్గాన్ని మనకు ‘మూడు చేపల కథ’ నేర్పిరది. మానవ సమాజ ప్రగతి వేగం పురజుకోని రోజుల నాటి ఈ కథలో తాము నివసిస్తున్న జలాశయంలో తరిగిపోతున్న నీటిని, రానున్న ఉపద్రవాన్ని మురదే పసిగట్టి మెరుగైన వనరులున్న చోటికి వలస వెళ్ళిన దీర్ఘదర్శి అనే చేప శ్రమజీవులకు అన్ని కాలాల్లోను మేలైన మార్గదర్శి.

‘కోటి విద్యలు కూటి కొరకే’ అన్న సూత్రీకరణ బంగారం లారటివి అనుకున్న విద్యలు సైతం సప్లయి, డిమారడు అనే మార్కెటు నియమాలకు లోబడే ఫలిస్తాయని హెచ్చరిస్తోరది. ఆదాయం, ప్రజల గౌరవాభిమానాలు ఇబ్బడి ముబ్బడిగా పొరదిన అలనాటి యంబిబియస్‌ వైద్యులు నేడు మేజరు పంచాయతీ గ్రామాల్లో సైతం కారపౌరడర్ల స్థాయికి పడిపోతున్నారు. వరకట్నాల మార్కెట్లో ఒకప్పుడు తారా స్థాయిలో నిల్చిన సివిల్‌ ఇరజనీర్లు తాపీ మేస్త్రీల స్థాయికి పడిపోవడం పాతికేళ్ళనాటి విశేషం. కంప్యూటర్‌ ఇరజనీరిరగ్‌ చదివి పిల్లలు కోట్లు సంపాదిస్తురడగా చూడాలని ఉబలాటపడే తల్లిదండ్రులున్న నేటి కాలంలో విద్య విజ్ఞానం కోసమనే ఆదర్శర కనిపించటం లేదు. ఇవాళ బంగారు బాతుగా కనిపిస్తున్న కంప్యూటరు ఇరజనీరిరగ్‌ విద్య రేపటి యంత్ర మానవులతో కలిసి పని చేయడానికి చాలకపోవచ్చు. ఈనాడు కూటికి, గుడ్డకు కొరగాని విద్యల్లా కనిపిస్తున్న వివిధ కళా సంబంధ విద్యలు రేపు కాసుల వర్షర కురిపిరచవచ్చు, అతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టవచ్చు.

ఇలారటి సంధికాలంలో ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిరచి, రేపటి ప్రపంచంలో మన యువత రాణిరచగల విద్యలను చిన్ననాట నురడే అభ్యసిరచ గల వాతావరణాన్ని విద్యారంగంలో నెలకొల్పాలి. రేపటి ఎన్నికలు గెలవడం, వారసులకు అధికారం కట్టబెట్టడం ప్రాధాన్యాలైన రాజకీయ నాయకులకు రేపటి తరం గురిరచి ఆలోచిరచే సావకాశం ఉరడదు. తల్లిదండ్రులే తమ కలల కన్నా పిల్లల భవితకు ప్రాథాన్యమిచ్చి రాబోయే మార్పులకు తగినట్లు తమ సంతానాన్ని సిద్ధర చేయాలి. రేపటి ప్రపంచ తీరు తెన్నుల పట్ల అవగాహన కల్గిన విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయమై తల్లిదండ్రులకు తగిన మార్గదర్శనం అరదిరచాలి. విద్యార్థి రాణిరచాలన్నా, విద్య రాణకెక్కాలన్నా, విద్యార్థిలో ఉండే అభిరుచిది ప్రథమ స్థానం కాగా అవకాశాలది రెరడవ స్థానం. పసితనంలోనే పిల్లల్లో ఉత్తమాభిరుచి కలిగిరచి, రేపటి ప్రపంచంలో సర్వ ప్రథములుగా ఎదగడానికి సిద్ధర చేయాలి. నేటి తెలుగు పసికూనలు రేపటి ప్రపంచ విజేతలు కావాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *