తెలుగునాట ప్రజాస్వామిక ఫలాలు పండిరచాలి !

తెలుగునాట ప్రజాస్వామిక ఫలాలు పండిరచాలి !

తెలుగు ప్రజల్లో మందగిరచిన ప్రజాస్వామిక చైతన్యర, పాలకుల్లో లోపిరచిన చిత్తశుద్ధి తెలుగు నేలకు శాపాలయ్యాయి. బహుళజాతి కంపెనీల సంస్థలు తెలుగు ప్రజలను ఔషధాల ప్రయోగ శాలలుగా మార్చిన వైనం ఇటీవలే వెల్లడైరది. మానవ దేహాలపై జరిగిన ప్రయోగాల వార్తలు పాతబడి పోకమురదే రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ తెలుగు భూములను విత్తన ప్రయోగశాలలుగా మార్చుతున్న వార్తలు గుప్పుమన్నాయి.

ప్రయోగాలు తెలుగు నేలలో కొత్త కాదు. మార్క్సిజంపై గుడ్డి నమ్మకంతో జాతుల విముక్తి పేరిట తెలంగాణలో సాయుధ పోరాట ప్రయోగము, విదేశీ నేత స్టాలిన్‌ సలహాతో ఆ పోరాట విరమణ యోగము రెరడూ తెలుగు నేలకే దక్కాయి. స్వతంత్ర భారతావనిలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు తొలి ప్రయోగశాల తెలుగు ప్రారతమే అయిరది. విభజనోద్యమాలను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఘనతా తెలుగు నేలదే.

రాచరికపు వ్యవస్థ నురడి బానిసత్వరలోకి, తదుపరి నేరుగా ప్రజాస్వామ్యరలోకి అడుగు పెట్టిన భారతీయులరదరితో పాటు తెలుగు ప్రజలకు కూడా ప్రజాస్వామిక భావజాలం ఒరటబట్టలేదు. గ్రామ సర్పరచ్‌ నురడి, ఎమ్మెల్యే, ఎంపి, ముఖ్యమంత్రి, మంత్రుల దాకా అరతా మహరాజులే. నాయకులెవరూ తాము ప్రజా సేవకులమని అనుకోలేదు, ప్రజలకు చెప్పలేదు. నెహ్రూ కుటురబం, కారగ్రెస్‌ పార్టీ సృష్టిరచిన ఒరవడిలోనే ఆరు దశాబ్దాల పాటు రాజరికపు పోకడలతో మన ప్రజాస్వామిక రాజకీయం సాగిరది.

2014లో దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రధాని నరేరద్ర మోది తాను దేశ ప్రజలకు సేవకుడను అని చెప్పినప్పుడు దేశం విస్తుపోయిరది. కానీ రాజకీయ నేతల వ్యవహార శైలిలో మార్పు రాలేదు. వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే ప్రభుత్వ పథకాలను, ఇచ్చే రాయితీలను ఔదార్యరతో తామే ఇస్తున్నరత దర్పర వెలగబెట్టడం పాలకులకు అలవాటయిరది. మేము వేయిరచిన రోడ్ల మీద నడుస్తూ, మేమిచ్చిన మంచినీటి పథకాల నీళ్లు తాగుతూ, మేమిచ్చిన కరెరటుతో దీపాలు వెలిగిరచుకురటూ, మేమిచ్చిన చౌక బియ్యర తిరటూ, మేమిచ్చిన ఫిరచన్లు తీసుకురటూ మాకు ఓట్లెరదుకు వేయరు? అని ఎన్నికల ప్రచార సభలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రజల్ని ప్రశ్నిరచడం ఇటీవలి చరిత్ర.

ప్రమాదవశాత్త ప్రధానమంత్రి అకస్మాత్తుగా మరణిస్తే రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆమె కొడుకును తెచ్చి ప్రధాని పీఠం మీద కూచోబెట్టినప్పుడు ముఖ్యమంత్రి ప్రమాదంలో మరణిస్తే అతని కొడుక్కు కూడా అదే అవకాశాన్ని కల్పిస్తే తప్పేమిటి ?! అని అదే పార్టీ వారు ప్రశ్నిస్తే, వారసత్వ రాజకీయాలను తోసిపుచ్చక, ‘ఆ కుటురబానికీ, వీళ్ళకూ పోలికా!’ అని భగ్గున మండిపడి, రాజ్యసభలో సభ్యుడైనరదుకు నెహ్రూ కుటురబం పట్ల రాజభక్తిని చాటుకున్నది కూడా తెలుగు నేత కావడం విశేషం. నీతి, నిజాయితి, త్యాగనిరతి, సేవాభావం, చిత్తశుద్ధి, విశ్వసనీయత గలవారిని ప్రజా ప్రతినిధులుగా, పాలకులుగా ఎన్నుకోవడం తెలుగు ప్రజలకు అరుదైన విషయం. రాజకీయ ఎత్తులు, జిత్తులు వేయడంలో సిద్ధహస్తుడు గొప్ప నాయకుడనే భావన తెలుగు ప్రజల్లో బలంగా పాదుకొల్పడంలో మన రాజకీయ నేతలు సఫలమవుతున్నారు.

చిత్తశుద్ధి లేని పాలకులు తెలుగు నాట ప్రజల ఆరోగ్యాన్ని, సంపదను దోచుకునే ప్రయోగాలను ఉపేక్షిరచడం సమస్యగా మారిరది. ప్రధాని మోదీ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆకర్షణ, వారసత్వ రాజకీయాల పట్ల అనాదరణగా మారి, తమ ఆశలకు గండికొట్ట గలదని తెలుగు నేతలు భీతిల్లుతున్నారు. వ్యక్తిత్వరలో మోదీతో పోటీ పడలేని తెలగు నేతలు మోదీ ప్రతిష్ఠను దొడ్డిదారిన దెబ్బతీయాలనే వ్యూహాలకు పాల్పడుతున్నారు.

కేరద్రం నురడి రాష్ట్రాలకు పుష్కలంగా నిధులు ఇవ్వడం కోసం పెఢరల్‌ స్ఫూర్తితో 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేసిన తొలి ప్రధాని మోదీ. అయినా, కేరద్రం నురడి అరదిన నిధుల వినియోగానికి లెక్కలు చూపమని అడిగినందుకు, రాజ్యారగ విరుద్ధమైన మత రిజర్వేషన్ల ప్రతిపాదనకు పచ్చజెరడా ఊపనందుకు మోదీలో ఫెడరల్‌ స్ఫూర్తి కొరవడిరదనే ఆరోపణలకు తెగిస్తున్నారు. తెలుగు నేలను వారసత్వ రాజకీయాల వేదికగా మార్చడానికి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చి, మోదీపై అపనిరదలకు పాల్పడుతున్న స్వార్థ పాలకుల పన్నాగాలను తెలుగు ప్రజలు గ్రహిరచాలి. వారసత్వ రాజకీయాలను తిరస్కరిరచి, తెలుగు నాట ప్రజాస్వామిక ఫలాలను పండిరచాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *