మీరు పుట్టుకతోనే ఎంపీ అయ్యారా ?

మీరు పుట్టుకతోనే ఎంపీ అయ్యారా ?

– తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్న జీవియల్‌ నరసింహారావు సర్పంచ్‌గా కూడా గెలువలేదు.

– తెదేపా ఎంపీ మురళీమోహన్‌

– మీలాగా భేరీ మోగించడానికి ఓ ‘జయభేరీ’ సంస్థలేదు కదా, అయినా మీరు పుట్టుకతోనే ఎంపీ అయ్యారా ?

– రాష్ట్రానికో రీతి. ఇదే ద్వంద్వ నీతి. సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.

– ఆకాశమార్గాల భూబదలాయింపుపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

– మీది జిల్లాకో నీతి అని విమర్శిస్తే ఎలా ఉంటుందో ?

– దుర్గగుడిలో చీరమాయం. కేసు కాకుండా పైరవీ చేస్తున్న పాలకమండలి సభ్యుడు.

– చీరల మాయంపై పత్రికల వార్తలు

– ఇసుక, మట్టి మాయం చేసే వాళ్ళకు చీరను మాయం చేయడం పెద్ద విషయమా?

– నా కొడుకు లాడెన్‌ మంచోడు. కాలేజీలో ఎవరో మనసు మార్చేశారు.

– ఒసామాబిన్‌ లాడెన్‌ తల్లి

– మరీ అంత లాడ్‌ (గారాబం) పనికి రాదమ్మా!

– నాటి ఉద్యమ ద్రోహులే నేడు రాష్ట్ర ద్రోహులు. అభివృద్ధి నిరోధకులకు గుణపాఠం చెప్పాలి.

– మంత్రి హరీశ్‌రావు

– మీ వెంబడి మంత్రి మహేందర్‌ కూడా ఉన్నాడా? అయితే ఈ డైలాగ్‌ బాగా పేలుతుంది.

– నాకు ఇటాలియన్‌ రాదు. ఒకవేళ ఆ భాష వచ్చి ఉంటే రాహుల్‌కు ఆ భాషలోనే బదులిచ్చేవాడిని.

– భాజపా అధ్యక్షుడు అమిత్‌షా

– రాహుల్‌కి మాతృభాషలో కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తారా ఏం ?

– చిప్పకూడు అన్నా రేవంత్‌కు సిగ్గురాలేదు.

– టిఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి

– నేటి రాజకీయాల్లో అలాంటి వాటికి స్థానం ఉందా?

– సొంత పార్టీ పెట్టుకొంటాం.

– ప్రజా గాయకుడు గద్దర్‌

– ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లిన మీ కొడుకును పిలుచుకోండి !

– మత ధర్మాన్ని విశ్వసిస్తా.. కానీ నేను సెక్యులర్‌.

– ఆర్‌జేడి నేత తేజ్‌ప్రతాప్‌

– అంటే న్నాగారిని అనుసరిస్తున్నారన్నమాట..!

– కాపుల రిజర్వేషన్లపై టీడీపి, వైయస్సార్సీపీలవి డ్రామాలు.

– ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి

– ఈ ‘పాపం’లో మీకు భాగం లేదనుకుంటున్నారా?

– డా|| పి.భాస్కరయోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *