జన జాగృతి

జన జాగృతి

ఇదేం నిరసన ?

సీరియస్‌గా సాగవలసిన నిరసన దీక్షల్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ చిత్ర విచిత్ర వేషాలతో కామెడీ షోగా మార్చేయడానికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎలా అనుమతిం చారు? చివరకు శివప్రసాద్‌ సత్యసాయి అవతారం ఎత్తి ‘నేను ఇచ్చిన వరం వల్లనే మోదీ ప్రధాని అయ్యారు. ఆంధ్రుల పట్ల ఆయన వైఖరి సరికాదు. నా వరాన్ని తిరిగి తీసుకుంటున్నాను’ అని తన నిరసన తెలియజేశారు. మహాత్ముల్ని ఇలా రాజకీయ రొంపిలోకి దించడం సరికాదు.

– శాండీ, కాకినాడ

చెప్పడానికేనా ?

టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ రాజమండ్రి సబ్‌కలక్టర్‌ ఆఫీస్‌ వద్ద చేసిన రగడ… అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రేణిగుంట ఎయిర్‌పోర్టులో జాయింట్‌ కలక్టర్‌ని తిట్టడం.. ఈ రెండు ఘనలతో చంద్రబాబు ఆగ్రహానికి గురై ‘ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. ఎదుటివారికి గౌరవం ఇస్తేనే మన గౌరవం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ సహనం కోల్పోరాదు. అనుక్షణం ప్రజలు మనల్నే గమనిస్తు న్నారు’ అని తన అనుయాయులకు హితబోధ చేశారు. మరి సాక్షాత్తు ఆయనా, తెదేపా ఎంపీలు, మంత్రులు మోదీ పట్ల, భాజపా పట్ల వ్యవహరిస్తున్న తీరు వీరి గౌరవం పెంచుతుందా? వీరు సహనం కోల్పోవడం లేదా? చెప్పడానికేనా నీతులు!

– పి.శుభ, తూర్పుగోదావరి జిల్లా

ఎన్నార్సీని స్వాగతించాలి!

పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీకి బాధ్యతారహితంగా గళమెత్తటం అలవాటుగా మారిపోయింది. పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టటానికి విషం కక్కారు. కాని అందువల్ల సత్ఫలితాలే వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారు. తన రాష్ట్రంలో ఎన్నార్సీ ఎలా నిర్వహిస్తారో చూస్తానని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఇది ఎంతవరకు సబబు? వలసవాదుల వల్ల దేశంలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే ప్రమాదముంది. స్థానికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇప్పటికే అసొంలో దాదాపు 40 లక్షల మంది వలసవాదులను గుర్తించారు. ఈ మంచి కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. అక్రమ వలసవాదులకు ఓటు హక్కు నిరాకరించాలి, నిషేధించాలి. లేకపోతే కశ్మీర్‌ పండితులకి జరిగిన అన్యాయమే అసొం ప్రజలకూ జరుగుతుంది.

– వీరపూర్ణచందర్‌ రావు, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *