జన జాగృతి

జన జాగృతి

వారు చేస్తే సిద్ధాంతం.. ఇతరులు చేస్తే రాద్ధాంతం..

టీడీపీ నేత, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ వైకాపాలో చేరడాన్ని గంటా శ్రీనివాసరావు తప్పుపడుతూ రాజకీయ నాయకులకు నైతికత ఉండాలని సుద్దులు చెప్పారు. మరి సోనియా, రాహుల్‌లను ఘోరంగా విమర్శించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని ఏమనాలి? తాము చేస్తే అది సిద్ధాంతం, ఇతరులు చేస్తే అది అనైతికత అని తెదేపా విశ్వాసం. టీడీపీలో ఉంటే టిక్కెటు రాదనే.. అవంతి శ్రీనివాస్‌, ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీని వీడారని లోకేశ్‌ చెప్తే, వచ్చే ఎన్నికల్లో తెదేపాదే విజయం అని తెలిసి మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కుట్రపన్ని తమ పార్టీ నేతల్ని లాక్కుంటున్నారని చంద్రబాబు అంటున్నారు! కుమారుడి దృష్టిలో అవకాశవాదం అయితే తండ్రి దృష్టిలో అదే కుట్ర!

– శుభ, కాకినాడ

ఒకే గూటి పక్షులు..

రాహుల్‌, చంద్రబాబు ఒకే గూటి పక్షుల్లా మాట్లాడుతున్నారు. చౌకీదార్‌ దొంగ అని రాహుల్‌ అనగానే చంద్రబాబు కూడా మోదీని దొంగ అన్నారు. ఏపీకి మోదీ నమ్మకద్రోహం చేశారని బాబు అనగానే మోదీ దేశద్రోహం చేశారని రాహుల్‌ అందుకున్నారు. ‘వాళ్లు మహారాజులు. నా లాంటి సాధారణ చాయ్‌వాలా ప్రధాని అవడం వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు’ అన్నారు మోదీ కొంతకాలం క్రితం.. అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యే చంద్రబాబు ‘మోదీకి సరైన విద్యలేదు. నాయకత్వ లక్షణాలు లేవు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. చాయ్‌వాలా ప్రధాని అయితే ఇలాగే ఉంటుందని కూడా చంద్రబాబు అన్నట్టు ఒక చానల్‌ చర్చ లేవదీసింది.

– శాండీ

సంచిక బాగుంది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ఫిబ్రవరి 11వ తేదీ సంచికలో ప్రచురితమైన విశ్లేషణ బాగుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఎటువంటి హామీలు ఇచ్చారు. వాటిని ఎంతవరకు నిలబెట్టుకున్నారు? అని తెలిపే ఆర్టికల్‌లో వివరాలు బాగా సేకరించారు. ‘వికసిత పద్మాలు’ అంశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ‘మదర్సాలతో ముప్పు’ సమాజం ఆలోచించదగ్గ విషయం. దేశ వ్యతిరేక శక్తులు అసహనం పేరిట చేస్తున్న కుట్రలు.. ఆ వ్యతిరేకత ఎవరి మీద అనే విశ్లేషణ నెమరు శీర్షికలో చక్కగా వివరించారు.

– రామచంద్రమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *