పేద విద్యార్థులకోసం మొబైల్‌ లైబ్రరీ వాహనం

పేద విద్యార్థులకోసం మొబైల్‌ లైబ్రరీ వాహనం

దుండిగల్‌ : హైదరాబాద్‌ నగరంలోని మురికివాడల్లోని పిల్లలకు విద్యను అందించే దిశగా ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్షయవిద్య కేంద్రం కృషి చేస్తున్నది. దీనికి దుండిగల్‌ ఔటర్‌రింగ్‌రోడ్డు ప్రాంతంలో ఉన్న బిహెచ్‌ఈఎల్‌జీఈ టర్బైన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు 15 లక్షల విలువ చేసే మొబైల్‌ టైబ్రరీ వాహనాన్ని బీజీజీటీఎస్‌ కర్మాగారంలో ఏప్రిల్‌ 19న అక్షయ విద్య సంస్థ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌ హ్యండ్స్‌ అధ్యక్షుడు జీవానంద్‌, శ్రీధరన్‌, లక్ష్మీకాంత్‌, చైతన్య, కిరణ్‌, బీజీజీటీఎస్‌ నుంచి వినాయక్‌ ఈశ్వర్‌బాబు, ఆ సంస్థ ఉద్యోగులు, అక్షయ విద్య నుంచి వినోద్‌రావు, అరుంధతి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *