మరోసారి జగన్‌ ఉచ్చులోకి బాబు…!

మరోసారి జగన్‌ ఉచ్చులోకి బాబు…!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో సాగుతోంది. ఈ పాద యాత్రలో ఆయన ప్రజలకు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. జగన్‌ కృష్ణాజిల్లా నిమ్మకూరులో పర్యటిస్తూ 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారం లోకి వస్తే కృష్ణాజిల్లాకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌.టి. రామారావు పేరు పెడతామనడం ప్రస్తుతం అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు ఎన్‌్‌.టి.రామారావు జన్మస్థలం. ఈ రోజుకి ఆయన బంధువర్గం నిమ్మకూరులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతమది.

సినిమా నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి, తరువాత తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ ఎన్‌.టి.రామారావు గొప్పవారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పేరు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు.

పార్లమెరటు నియోజక వర్గాలను జిల్లాలుగా ప్రకటిరచాలని వైయస్సార్‌ కారగ్రెస్‌ కోరుతోరది. ఆ క్రమంలో మచిలీపట్నర పార్లమెరటు ప్రారతం నూతన జిల్లాగా మారే అవకాశం ఉరది. కృష్ణా జిల్లాను రెరడు జిల్లాలుగా విభజిరచాలని దశాబ్దాలుగా ప్రజలు కూడా కోరుతున్నారు. జిల్లాలో ఈ మూలన ఉన్న జగ్గయ్యపేట, వత్సవాయి ప్రారతాల నురడి ఆ మూలన సముద్రతీరాన సుమారు 150 కిలోమీటర్ల దూరాన ఉన్న జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి వెళ్లి రావడం పశ్చిమ కృష్ణా వాసులకు ఇబ్బరదిగానే ఉరటోరది. కనుక విజయవాడ కేరద్రంగా కృష్ణాజిల్లా, మచిలీపట్టణం కేరద్రంగా వేరే పేరుతో మరో జిల్లా ఏర్పరచడం జిల్లా ప్రజలకు సౌకర్యరగానే ఉరటురది.

అయితే ఎన్‌.టి.ఆర్‌. మొదట సినీ నటుడే అయినప్పటికీ తరువాత రాజకీయ నాయకు డయ్యారు. రాజకీయ నాయకుడంటే ఏదో ఒక వర్గానికి నచ్చనివాడే అయిఉంటాడు. కొత్తగా వచ్చే జిల్లాకు అన్ని వర్గాలకు నచ్చినవారి పేరు పెట్టుకో వడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు.

అలా ప్రస్తుత కృష్ణా జిల్లా ప్రాంతంలో అనేక మంది సంఘ సంస్కర్తలు, కవులు, గాయకులు, నాట్యకళాకారులు జన్మించారు. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, స్వతంత్య్ర సమరానికి అక్షరాలను కూర్చిన ఆంధ్రపత్రిక దిన పత్రిక స్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు ముట్నూరి కృష్ణారావు ఈ జిల్లావారే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్యనాథ సత్యనారాయణ, మల్లాది రామకృష్ణ శాస్త్రి షెడ్యూల్డు కులాల ప్రజల కోసం వసతి గృహాన్ని నడిపి అనేకమంది షెడ్యూల్డు కులాల విద్యార్ధులకు విద్యాదానం చేసిన సంఘసంస్కర్త రాంజీపంతులు కృష్ణాజిల్లా వాసులే. ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ కవి వేటూరి సుందర రామమూర్తి, తెలుగు సినిమా ద్వారా అనేక సామాజిక అంశాలను వెలుగులోకి తెచ్చి సంస్కరణలతో ప్రజలను చైతన్య పరచిన అనేక మంది సినీ నిర్మాతలు, దర్శకులు ఈ జిల్లా వారే. వీరిలో అందరికీ నచ్చిన ఎవరి పేరైనా పెట్టవచ్చు.

అయితే జగన్‌ ఎన్‌.టి.ఆర్‌. పేరు ప్రతిపాదన చేయడం వెనుక మరో రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది. ఎన్‌.టి.ఆర్‌. పేరు పెడతానంటే ప్రస్తుత తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించడానికి అవకాశం ఉండదు. అలాగే ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టిన ఘనత వై.ఎస్‌.ఆర్‌.సి.పి.కి దక్కుతుంది.

ఇప్పటికే ప్రత్యేక ¬దా విషయంలో జగన్‌ వేసిన ఉచ్చులో పడిన బాబు, ఎన్‌.టి.ఆర్‌. పేరు ఎత్తుగడతో మరోసారి జగన్‌ ఉచ్చులో పడే వీలురది. ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టడాన్ని ఒప్పుకోడానికి లేదా వ్యతిరేకించ డానికి అవకాశం లేక బాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు తయారు కావచ్చు.

అయితే ఎన్‌.టి.ఆర్‌. పేరు పెడతానని జగన్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే అవకాశం జగన్‌కు ఇప్పట్లో రాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత కృష్ణా జిల్లాను ఎన్‌.టి.ఆర్‌. జిల్లాగా మార్చడానికి అందరూ ఒప్పుకోరు. అప్పుడు ఇది మరో శాంతి భద్రతల సమస్య కావచ్చు. ఇంతకుముందు కడప జిల్లా పేరు మార్చి వై.ఎస్‌.ఆర్‌. పేరు పెడతామంటే అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లాగా సర్దుబాటు చేశారు.

జిల్లాకు ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టే హామీ నిర్ణయాన్ని ఇప్పటికే వైసిపికే చెందిన దుట్టా రామాచంద్రరావు వ్యతిరేకించారు. జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. అవసరమైతే ఉద్యమాలు చేస్తానని ప్రకటించారు.

జగన్‌ తన హామీని నిలబెట్టుకోవాలంటే జిల్లాను ప్రజలు కోరుకుంటున్నట్లుగా రెండుగా విభజించి పశ్చిమ ప్రాంతం కృష్ణాజిల్లాగా, తూర్పు ప్రాంతం ఎన్‌.టి.ఆర్‌. జిల్లాగా పెట్టొచ్చు. ఇది జరగాలంటే జిల్లాల పునర్విభజనకు రాజ్యాంగం ఒప్పుకోవాలి. అది 2026 వరకు సాధ్యం కాదు. ఇది తెలిసి కూడా జగన్‌ ఈ హామీ ఇచ్చారంటే అది రాజకీయ ఎత్తుగడే.

ఈ రాజ్యాంగ నిబంధనను గుర్తించి బాబు జగన్‌ ఎత్తుగడను తిప్పికొట్టవచ్చు.

ఏదైమైనా ఎన్‌.టి.ఆర్‌. పేరు హామీ ఇప్పట్లో అమలు చేయలేని హామీగానే ఉండిపోవచ్చు. ఇటువంటి అమలు చేయలేని హామీలతో రాజకీయ నాయకులు ప్రజలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం విజ్ఞత అనిపించు కోదు. నాయకుల పాదయాత్రలు ప్రజలకు ఉపయోగ పడాలే తప్ప వృథా యాత్రలు కారాదు.

– పి.వి.శ్రీరామశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *