జనజాగృతి

జనజాగృతి

పత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

వార్తా పత్రికలు సమాజం పట్ల బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టి ప్రజాహితం కోసం పోరాడాలి. కాని ప్రస్తుతం ఏపిలో ఆ పరిస్థితి కనబడటంలేదు. ప్రముఖ తెలుగు దినపత్రికలన్నీ చంద్రబాబు భజన చేస్తున్నాయి. తనను విమర్శించే వాళ్లంతా కుట్రదారులు, ద్రోహులు అని సిఎం రెచ్చిపోతుంటే కొన్ని పత్రికలు సై అంటున్నాయి.

తెదేపా నేతలు బరితెగించి ప్రధాని మోదీని తిడుతుంటే ఆ తిట్లన్నీ అక్షరం పొల్లుపోకుండా ప్రచురిస్తున్నాయి. కాని చంద్రబాబు తప్పుల్ని వేలెత్తి చూపే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.

– శాండీ, కాకినాడ

తప్పుడు ప్రచారాలు వద్దు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి లౌకికవాద ముసుగు నాయకులు అసంబద్ధ, విచక్షణారహిత, వక్ర బుద్ధితో కూడిన తప్పుడు ప్రచారాలు చేస్తూ మైనార్టీలను, దళితులను తప్పు దోవ పట్టిస్తున్నారు. దేశంలో ఏ సంఘటన జరిగినా సంఘ్‌పరివార సంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మోదీని ప్రధాని పీఠం నుండి దించడమే లక్ష్యంగా రాజకీయ వైవిధ్యం ఉన్న పార్టీలు జత కట్టడం విచారకరం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో సామాజిక, మత సామరస్యం దెబ్బతిని అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ లక్ష్యాల సాధన కోసం వీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. మనదేశంలో మైనార్టీలు ఏ దేశంలో లేని హక్కుల్ని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నారనేది అక్షర సత్యం. మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్లు గత పాలకుల హయంలో 4800 మంది సిక్కుల ఊచకోతకు, కాశ్మీరు లోయలో హిందువుల మరణాలకు బాధ్యత వహిస్తారా?

– ఉల్లి బాలరంగయ్య, కడప

సంచిక బాగుంది!

జూలై 30వ తేదీ సంచిక బాగుంది. ముఖపత్ర కథనం ‘అవిశ్వాసం కాదు..అచ్చమైన ప్రహసనం’ చాలా ఆసక్తికరంగా సాగింది. దారిదీపాలులో ‘సంకల్పబలమే నిలబెట్టింది’ స్టోరి చాలా ఆదర్శవంతంగా ఉంది. పాఠకులకు అర్థవంతమైన శీర్షిలు అందిస్తున్న జాగృతి సంపాదక బృందానికి ధన్యవాదాలు.

– ఆంజనేయులు, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *