జనజాగృతి

జనజాగృతి

జిఎస్‌టి ఉపయుక్తమే..

జూన్‌ 11వ తేది సంచిక ‘ముందుంది మరింత సుఖం’ అనే వ్యాసంలో రచయిత ఆర్‌సి రెడ్డి ఉప్పల జిఎస్‌టి ద్వారా కొన్ని తాత్కాలిక ఇబ్బందులున్నా భవిష్యత్తులో సుదీర్ఘకాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని చక్కగా వివరించారు. అభినందనీయులు.

బుల్లితెర, ‘సినిమా’ శీర్షికలు నిష్పక్షపాత సమీక్షలు చేస్తున్నాయి. ‘మాటకు మాట’లో మిర్చి లాంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఇంపుగా ఉన్నాయి.

అలాగే… అంతర్జాతీయ యోగ దినోత్సవ ప్రత్యేక సంచికలో వ్యాసాలన్నీ చాల ఉపయోగకరంగా ఉన్నాయి.

ఉన్నమాటలో ఎంవిఆర్‌ శాస్త్రి ‘పిల్లలకి నేర్పే పాఠాలు ఇవా?’ అనే వ్యాసం ముఖ్యంగా విద్యా శాఖాధికారులు గమనించి సత్వర చర్యలు చేపట్టడానికి సూచనలిచ్చింది. రచయిత యదార్థ పరిస్థితులను వివరించారు. అభినందనీయులు.

ప్రత్యేక వ్యాసం – హైందవ సామ్రాజ్యం భారతీయ సంస్కృతిని ఇనుమడింప జేయడానికి ప్రేరణాత్మకంగా ఉంది. రచయితకు ధన్యవాదాలు.

జాగృతిలో ప్రచురిస్తున్న అన్ని ఫీచర్స్‌, శీర్షికలు ఉపయుక్తంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటున్నాయి. సంపాదకుల కృషి మిక్కిలి అభినందనీయం.

– అమర్‌, హైదరాబాద్‌

ఎంక్వైరీ చేయించాలి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు, సంబంధిత ప్రభుత్వాధికారులు వేంకటేశ్వరుడి అమూల్యమైన ఆభరణాలను సామాజిక ప్రజానీకానికి చూపించడానికి ఆగమశాస్త్రం అంగీకరించదు అంటున్నారు. తితిదే బోర్డు సభ్యులు ఆభరణాలను నిశితంగా పరీక్షించారని.. ఏమీ పోలేదని.. అన్ని ఉన్నాయని నిర్ణయించారు. కనుక ఏ ఎంక్వైరీలు అవరం లేదని చెబుతున్నారు. తితిదే సభ్యులుగా ముఖ్యమంత్రి తమ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వారిని నియమిస్తున్నారు.

నల్ల ధనం దాచుకొని పట్టుబడ్డ వారు.. కల్లు, సారాయి దుకాణాలు పెట్టుకున్నవారు వేంకటేశ్వరుని ఆభరణాలు చూడడానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా ? వీరేమైనా విశిష్టులైన దైవ భక్తులా? ప్రజలను తప్పుదారి పట్టించండి. అనుమానాలను నివారించడం కోసం సిబిఐ చేత ఎంక్వైరీ చేయించడం ఉత్తమం.

– త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *