జనజాగృతి

జనజాగృతి

ఇదేం న్యాయం !

కృష్ణా పుష్కరాల సందర్భంగా వీధుల విస్తీర్ణతకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 హిందూ దేవాలయాలను కూల్చి వేసింది. ఈ విషయంపై హిందూ సమాజం గగ్గోలు పెడితే వాటన్నింటినీ సమీప ప్రదేశాలలో తిరిగి నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు, అధికారులు వాగ్ధానం చేశారు. కాని ఇంతవరకు ఆ పని మాత్రం జరగలేదు. అయితే ఇటీవల విజయవాడలోని విద్యాధరపురంలో రూ.80 కోట్లు ఖర్చుపెట్టి ముస్లిం తీర్థయాత్రకుల కొరకు ఆరంతస్థుల ‘హజ్‌ హౌస్‌’ నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మూడు హజ్‌హౌస్‌లు కట్టించిన ఘనత తనదేనని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. మరి హిందూ దేవాలయాలు పడగొడితే తిరిగి ఎందుకు నిర్మించడం లేదు ? కేవలం ముస్లింల కొరకు మాత్రమే ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తారా ?

ఈ సంవత్సరం రంజాన్‌ మాసం ప్రారంభానికి ముందే ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంతి రూ.1100 కోట్ల కేటాయించారు. ప్రజల సొమ్ముతో ఉర్దూ ఘర్‌లు, షౌదీఖానాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం హజ్‌యాత్రికుల కొరకు రూ.15 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. అయితే హిందువులు అమర్‌నాథ్‌ యాత్రకి గాని, మానససరోవరం గాని వెళ్లాలంటే మాత్రం సొంత డబ్బులతో వెళ్లాలి. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయదు. ఇదేం సామాజిక న్యాయం. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి. హిందూ వ్యతిరేక పాలకులకు తగిన బుద్ధి చెప్పాలి.

– త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, హైదరాబాద్‌

మూన్నాళ్ల ముచ్చటేనా ?

మూడో ఫ్రంట్‌ ప్రయత్నం శుద్ధ దండగ. గతంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ భవిష్యత్తు ఏమైంది? ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి తప్ప ఈ థర్డ్‌ ఫ్రంట్‌ ఎందుకూ పనికిరాదు. ఇంగ్లండ్‌లో రెండే రెండు పార్టీలున్నాయి. అందుకే ఆ దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఫ్రంట్‌లు ఎక్కువైతే ప్రజాస్వామ్యం పల్చబడిపోతుంది.

– కె.వి. రమణమూర్తి, కాకినాడ

సంచిక బాగుంది

గతవారం సంచికలో ‘పెట్రోలు అధిక ధరలకు రాష్ట్రాల బాధ్యత ఎంత ?’ ఆర్టికల్‌ చక్కగా ఉంది. ‘అమ్మలకే అమ్మ..ఈ ఏఎన్‌ఎం’ వ్యాసం చాలా స్ఫూర్తి దాయకంగా సాగింది. అద్భుతమైన వ్యాసాలను, శీర్షికలను పాఠకులకు అందిస్తున్న జాగృతికి ధన్యవాదాలు.

– జంగం రాజశేఖర్‌, కరీంనగర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *