ఓఖి తుఫాను బాధితులకు ప్రధాని ఓదార్పు

ఓఖి తుఫాను బాధితులకు ప్రధాని ఓదార్పు

– బాధితులను ఇళ్ళకు వెళ్ళి కలిసిన ప్రధాని

– ప్రధానితో తమ బాధలు చెప్పుకున్న బాధితులు

– తప్పిపోయిన వారినీ వెతికిస్తామని హామి

– కేరళకు రూ.380 కోట్ల కేంద్ర సహాయం మంజూరు

కేరళలోని తిరువనంతపురం జిల్లా పూన్‌థురలో ఓఖి తుఫాను బాధితులను ప్రధాని నరేంద్ర మోది ఓదార్చారు. ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రధాని తుఫాను బాధితులను కలుసుకుని వారికి జరిగిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన తుఫాను వల్ల దెబ్బతిన్న లక్షద్వీప్‌, కన్యాకుమారి ప్రాంతాలలో కూడా పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కేవలం హెలికాప్టర్లో తిరగకుండా మోది ప్రతి బాధిత కుటుంబాన్ని కలిసి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. తుఫానులో చనిపోయిన వారి కుటుంబాలనూ ఓదార్చారు. ఆచూకీ తెలియకుండా పోయిన మత్స్యకారుల వివరా లను తెలుసుకున్నారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా ప్రధానే తమ ఇళ్లకు రావడంతో బాధితులు చలించిపోయారు. తమ గోడును ప్రధానికి వెళ్లబోసుకున్నారు. కేంద్ర మంత్రి అల్ఫాన్స్‌ కన్నన్‌ థానం అనువాదకుడుగా వ్యవహరించారు.

తుఫానులో తప్పిపోయిన మత్స్యకారులను వెదికి, తప్పక వెనక్కి తీసుకువస్తామని ప్రధాని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్‌ పి.సదాశివం, ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, కేంద్ర మంత్రులు అల్ఫాన్స్‌ కన్నన్‌ థానం, పోన్‌ రాధాకష్ణన్‌, బిజెపి కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనమ్‌ రాజశేఖరన్‌ తదితరులు ఉన్నారు.

తుఫాను తరువాత నాలుగు రోజులకు బాధిత ప్రాంతాలలో పర్యటించడానికి ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర మంత్రివర్గ సహచరులు వెళ్లినప్పుడు వారికి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానితో పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని వాళ్ళు తిరిగి రావలసి వచ్చింది. కానీ ఆ తరువాత ఆ ప్రాంతాలలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతా రామన్‌ పర్యటించినప్పుడు మాత్రం ప్రజలు ఆమెకు తమ సమస్యలు చెప్పుకున్నారు.

ఎప్పుడో రావలసిన ప్రధానమంత్రి ఇప్పుడు వస్తున్నారంటూ కమ్యూనిస్టులు వ్యతిరేక ప్రచారం చేయాలని ప్రయత్నించినా ప్రజలు పట్టించుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం సిపిఎం చేసిన ప్రయత్నాలను సాగనివ్వలేదు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన తరువాత పరిస్థితుల తీవ్రతను అంచనా వేసిన ప్రధాని స్వయంగా తమవద్దకు వచ్చారని ప్రజలు గ్రహించారు.

ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్‌, తమిళనాడు, కేరళలో ఓఖి తుఫాను బాధితుల సహాయం కోసం రూ.325 కోట్లు మంజూరు చేసింది. ఇది అంతకుముందు తమిళ నాడుకు ప్రకటించిన 280 కోట్లకు, కేరళకు ప్రకటించిన రూ.76 కోట్లకు అదనం. చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రధాని సహాయనిధి నుండి అందజేస్తారు. కొన్ని నెలల క్రితమే కేరళ రాష్ట్రానికి కరవు సహాయ నిధి కింద కేంద్రం రూ.125.47 కోట్లు మంజూరు చేసింది. కేరళ ప్రభుత్వం రూ.7,340 కోట్ల సహాయాన్ని కేంద్రం నుండి ఆశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి నివేదిక అందిన తరువాత తగిన సహాయాన్ని ప్రకటిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రకతి విపత్తులను ముందుగా పసికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. తుఫాను బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, సహాయం అందించడంలో నావికాదళం, వాయు సైన్యం, కోస్ట్‌ గార్డ్‌ల క షి, రక్షణ, హోమ్‌ మంత్రిత్వ శాఖల సమన్వయం పట్ల కేరళ ప్రభుత్వం ప్రధానికి కతజ్ఞతలు తెలిపింది.

రాష్ట్రంలో మత్స్యశాఖను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు ప్రధానికి సమర్పించిన మెమోరాండంలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *