అధికారం ఎవరి స్వంతమూ కాదు

అధికారం ఎవరి స్వంతమూ కాదు

– రైతులకు, రాష్ట్రానికి అన్యాయమే; ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌. గుజరాత్‌లో దెబ్బతిన్నా తీరు మారలేదు.

– తెరాస నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌

– అప్పుడే ‘బద్నాం’ చేయడం మొదలు పెట్టారన్నమాట…!

– సమ్మక్క దయతోనే ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ సల్లంగుండాలని మొక్కిన.

– సిఎం కెసిఆర్‌

– మీరు ఉన్నాక అంతా చల్లదనమే. ఉడుకు నెత్తురు ఎప్పుడో చల్లబడింది.

– బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మాకు శత్రువు కాదు. మేమెందుకు చంపుతాం ?

– తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం

– అంటే శత్రువులైతే చంపేస్తారా ?

– రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య పాలన, కార్పొరేట్‌ శక్తులకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడింది. రాష్ట్రంలో 93 శాతం గల ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే మా లక్ష్యం.

– సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం

– దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే మరి. మీరు అగ్రకుల పెత్తనం గురించి మాట్లాడుతారు. ఒకసారి తమరెవరో చూసుకొండి వీరభద్రం గారూ! వర్గ పోరాటాలూ, సాయుధ పోరాటాలూ, గతి తార్కిక భౌతికవాదం అయిపోయి బహుజన వాదం అందుకున్నారా ఇప్పుడు !?

– కాంగ్రెసుకు డెబ్భై సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా !

– మంత్రి కెటిఆర్‌

– అంటే కాంగ్రెసు గెలవదనే కదా మీ ఉద్దేశ్యం ?!

– కాంగ్రెసు అధికారంలోకి వస్తే మీరు, మీ కుటుంబం రాజకీయాల నుండి వైదొలగాలి.

– పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

– బస్తీ మే సవాల్‌ ! బాగుందన్నా !

– గాంధీభవన్‌లో కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చు. కాంగ్రెసువారు కళ్లున్న కబోదులు.

– మంత్రి హరీశ్‌

– కొంపదీసి వాసన్‌ ఐ కేర్‌కు తీసుకెళ్ళి కళ్లద్దాలు ఇప్పిస్తారా ఏంటి?

– నేను హిందూ వ్యతిరేకిని కాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలను ఒకే విధంగా చూస్తాను.

– నటుడు కమల్‌ హాసన్‌

– అన్నీ మీకు సమానమే కానీ.. కొన్ని అంటేనే ఇష్టం. మీది ఎర్ర రక్తమేగా!

– మరీ ఇంత అన్యాయమా? హామీలపై ఒక్క మాటైనా ప్రస్తావించరా?

– కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం

– ‘వెనుక నుయ్యి ముందు గొయ్యి’ అంటే ఇదేమరి…!

– 1967 నుంచి రాష్ట్రంలో ద్రవిడ పార్టీలే అధికారంలో ఉన్నాయి. వంతుల వారీగా తమిళనాడును ఏలుతున్నాయి. తమిళనాట జాతీయ పార్టీలకు స్థానం లేదు.

– పన్నీరు సెల్వం, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి

– మొన్నటి వరకు జయలలితే పురుచ్చితలైవి, ఇప్పుడెవరు ? అధికారం ఎవరి స్వంతమూ కాదు సెల్వం..!

– 70 వేల రూపాయల విలువ చేసే జాకెట్‌ నేను కొనలేదు, ఎవరో బహుమతిగా ఇచ్చారు.

– రాహుల్‌ గాంధీ

– అబ్బో ! మరీ అంత వెర్రి పప్పల్ని చేయకండి.

– డా|| పి.భాస్కరయోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *