జీవనస్రవంతి -23

జీవనస్రవంతి -23

: జరిగిన కథ :

‘నా ఇంట్లోనే ఉండండి’ అన్న జగన్నాథం గారితో పూర్తిగా ఇక్కడే ఉండటం కుదరదని చెప్పిన మీనాక్షి, జీవన్‌లు జగన్నాథంగారు ఒంటరిగా కాక, ఎప్పుడూ ఎవరో ఒకరితో కలిసి ఉండేవిధంగా ప్రణాళిక వేశారు. అది జగన్నాథంగారికి కూడా ఇష్టమైంది. జగన్నాథంగారికి యాక్సిడెంట్‌ జరిగిన విషయం ఆయన కొడుకు రఘురాంకి ఉత్తరం రాయించాడు జీవన్‌. రఘురాం మొక్కుబడిగా సమాధానం రాశాడు. అందుకు జగన్నాథంగారు చాలా నొచ్చుకుని, తన భార్య కొడుకుపై దిగులు తోనే చనిపోయిందని చెప్పి బాధపడ్డారు. ఒకరోజు పెద్దాయన చేతి వేలి ఉంగరం ఎక్కడో పడిపోతే ఆ విషయాన్ని కొడుక్కి చెప్పి భయపడుతుంది మీనాక్షి. అంతలో నిద్రపోతున్న జగన్నాథంగారు లేచి ‘అమ్మాయ్‌! జీవన్‌ వచ్చాడా?’ అని అడిగారు.

ఇక చదవండి..

‘వచ్చా తాతయ్యా’ అన్న కేకతో జవాబు చెప్పి, ‘అమ్మా! రా’ అంటూ జగన్నాథంగారి గదివైపు నడిచాడు జీవన్‌.

లోపలకు వెళుతూనే, ‘ఏమిటిది తాతయ్యా! వేలికి ఉంగరం ఉందో లేదో చూసుకోవద్దా? మీ కసలు అది పడిపోయినట్లే తెలియదనుకుంటా! ఒకసారి పక్కమీద ఉందేమో వెతుకుదాం లేవండి’ అన్నాడు.

జగన్నాథంగారు లేచివెళ్లి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ‘ప్రాప్తమున్న వస్తువు నట్టేట్లో పడ్డా మళ్లీ నట్టింటికే వస్తుంది – అంటారు. మనకి ప్రాప్తముంటే అది ఎక్కడికీ పోదులే, భయపడకు’ అన్నారాయన.

‘అలా అంటే ఎలా తాతయ్యా? విలువైన వస్తువుని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా’ అన్నాడు జీవన్‌ చనువుగా.

‘నువ్వు చెప్పింది నిజమేరా అబ్బాయీ! ఆ ఉంగరం వారసత్వపు ఆస్తి లాంటిది. ఆ మాట చెప్పే మా నాన్న నా వేలికి దానిని తొడిగాడు. అంటే దీన్ని నేను నా పుత్రరత్నానికి అందజెయ్యాలన్నమాట! కాటికి కాళ్లుజాచుకుని కూర్చున్న కన్నతండ్రిమీదే గౌరవం లేనివాడు, ఈ అరిగిపోయిన పాత ఉంగరాన్ని పట్టిరచుకుంటాడా? నాకా నమ్మకమేమీ లేదు. ఇక ఈ ఉంగరం ఉన్నా, పోయినా ఒకటే’ అన్నారు కుర్చీలో వెనక్కివాలి కూర్చుంటూ.

అంతలో మీనాక్షి మొహమంతా సంతోషం నింపుకుని అక్కడకు వచ్చింది. ఆమె వెతగ్గా ఆ గదికి ఉన్న అటాచ్డ్‌ బాత్రూంలో ఒక వారగా కనిపించింది ఆ ఉంగరం. వెంటనే దాన్ని శుభ్రంగా సబ్బుతో తోమి, కడిగి పట్టుకుని వచ్చింది.

‘తాతయ్య బాగా చిక్కిపోయారు. ఉంగరం వదులైపోయి పడిపోయి ఉంటురది. ఉండు, నేను రిపేర్‌ చేసి తెస్తా’ అంటూ ఆ ఉంగరాన్ని అందుకుని, దారంచుట్టి, బిగువుగా ఉండేలా చేసి, తెచ్చి తాతయ్య కుడిచేతి వేలికి తొడిగాడు జీవన్‌.

‘ఇక భోజనానికి రండి, ఇప్పటికే తాతయ్యకు ఆలస్యమయ్యింది’ అంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు నడిచింది మీనాక్షి.

మీనాక్షి సంరక్షణలో రోజురోజుకీ జగన్నాథం గారు కోలుకుంటూ, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. తండ్రిలాంటి వ్యక్తికి సేవలు చేస్తున్నానన్న భావనతో ఒకవిధమైన ఆనందాన్ని అనుభవిస్తోంది మీనాక్షి.

———-

ఆరోజు కాలక్షేపానికి జగన్నాథంగారి ఇంటికి మిత్రులు ఉదయం తొమ్మిదికే వచ్చారు. మధ్యాహ్నం మీనాక్షి చేతి వంట తప్తిగా తిని, పేకాట మొదలు పెట్టారు. మూడున్నరకి అందరికీ కాఫీలు, తినడానికి చిరుతిండి ఇచ్చింది.

మరికొంతసేపటికి పేకాట విసుగెత్తడంతో, పేకముక్కల్ని వదిలి కబుర్లలో పడ్డారు.

‘ఏం బ్రతుకులో ఇవి! జీవికి వద్ధాప్యమంత దుర్దశ మరొకటి ఉండదు. చేసుకునే ఓపికలేక పరాధీనమయ్యి, అందరిచేత మాటలుపడుతూ, మనసు చంపుకుని బ్రతకవలసి వస్తోంది’ అన్నాడు జగన్నాథంగారి మిత్రుల్లో ఒకరైన పతంజలి నిట్టూరుస్తూ..

‘పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పెంచి, పెద్దవాళ్లను చేసి, చక్కని జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయపడతారు. మళ్లీ అలాంటి బాధ్యత, వద్ధులైన పెద్దవాళ్ల విషయంలో చూపించవలసిన పూచీ పిల్లలకి లేదా!? ఈవేళ యువకులుగా ఉన్నవాళ్లకి రేపు వద్ధాప్యం రాకమానదు. తన తండ్రిని తాను ఎలా చూశాడో, రేపు తనను తన కొడుకూ అలాగే చూసుకుంటాడు అన్న జ్ఞానం కూడా లేదు! తనదాకా వస్తేగాని తప్పు తెలియదు!’ అంటూ కంఠశోష పడ్డాడు సదాశివం అనే మరో మిత్రుడు.

‘ఈ రోజుల్లో ఇది అన్ని ఇళ్లలోనూ ఉంటున్నది. పెద్దవాళ్లు అందరికీ బరువైపోయారు’ అన్నాడు పరశురామ్‌.

‘చాలా ఊళ్లలో పెద్దవాళ్లను ‘ఓల్డేజ్‌ హోమ్సు’లో చేర్పిస్తున్నారుట కడుపున పుట్టిన పిల్లలు. డబ్బులు కట్టి బాధ్యత తీరిపోయిరదనుకురటున్నారు వాళ్లు’ అన్నాడు పతంజలి అందుకుని.

‘నాలాంటి అనాథ పక్షికి ఆపాటి సదుపాయ మున్నా చాలు అనుకునేవాడిని ఇదివరకు’ అన్నారు జగన్నాథంగారు.

అన్నీ విని తలెత్తి జగన్నాథంగారిని ఉద్దేశించి, ‘ఏదేమైనా భగవంతుడికి ఇన్నాళ్లకి నీమీద దయగలిగింది. నీతోపాటు మేమూ పెట్టిపుట్టాము మీనాక్షి చేతి వంట తినడానికి. ఆహా! ఏమి రుచి’ అన్నాడు సదాశివం లొట్టలేస్తూ.

వెంటనే పరశురాం అరదుకున్నాడు, ‘ఈ చివరి రోజుల్లోనైనా నిన్ను చూసుకునే వాళ్లు నీకు దొరికారు. ఎట్టి పరిస్థితిలోనూ వీళ్లని వదులుకోకు సుమీ!’.

‘మనుమడు, మనుమడు అంటూ మురిసిపోతున్నావు బాగానే ఉందిగాని, ఆస్తిలో వాటా కూడా ఇస్తావా?’ అన్నాడు పరాంకుశం పుటుక్కున.

జగన్నాథంగారు ఏమీ మాటాడలేదు. అంతలో మీనాక్షి అటువైపుగా వస్తున్న అలికిడి అవ్వడంతో వాళ్ల సంభాషణ వేరేతోవ పట్టింది.

———-

ఆ ఊళ్లోని ప్రముఖులు కొందరు కొత్తగా ఒక ఎడ్యుకేషనల్‌ అకాడమీ పెట్టి, దానిని నైట్‌ కాలేజీగా నడిపించసాగారు. దానిలో చెప్పే కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్సు కూడా ఉంది. అటునుండి వెళుతున్నప్పుడూ, వస్తున్నప్పుడూ ఆ బోర్డు కనిపించగానే జీవన్‌ మనసు గుబగుబలాడేది. అందులో చేరి కంప్యూటర్‌ కోర్సు చెయ్యాలని అతనికి ఆశగా ఉండేది. ‘కంప్యూటర్‌ సైన్సు’ మానవ మేధాశక్తికి పరాకాష్ట – అని అతని అభిప్రాయం. అది కనక చదివితే ఇక ఉద్యోగానికి ఢోకా ఉండదు అనుకునేవాడు. చిన్న చదువులు చదివినవాళ్లకి తొందరగా ఉద్యోగాలు రావు. అడపాతడపా ఇంటర్వ్యూలకు వెళుతూ, వస్తూవున్నా, తనలాంటి ఉత్తరదక్షిణాదులు సమర్పిరచుకోలేనివారిని, ఎంత మరచి మార్కులు తెచ్చుకున్నా, గోల్డు మెడలిస్టు అయినా కూడా ఎదో ఒక సాకు చెప్పి బయటకు పంపేస్తారు. డిగ్రీ ఒక్కటే చదివితే ఉద్యోగం వచ్చే సూచనలే లేవు కదా! ఇప్పుడు తమ పరిస్థితులు మెరుగుపడ్డాయి కనక, నెమ్మదిగా డబ్బు కూడబెట్టి తానీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి తప్పకుండా కంప్యూటర్‌ సైన్సుతో పై చదువు చదువుకోవాలి అనుకునేవాడు జీవన్‌.

———-

ఆ రోజు ఆ ఊరి హైస్కూల్లో టెరం ఫీజు కట్టాల్సిన రోజు కావడంతో, చాలామంది తమ పిల్లల స్కూల్‌ ఫీజు కట్టమంటూ జీవన్‌కి పురమాయించారు. ఫీజులు కట్టెయ్యడం అయ్యింది. కాని అక్కడితో సరిపోదు కదా, ఆ ఫీజులు తాలూకు రశీదులు, మిగిలిన చిల్లర ఇంటింటికీ తిరిగి అందజేయవలసి ఉంటుంది. ఆ పనులన్నీ ముగించేసరికి సాయం కాలం ఆరు దాటింది. తాతయ్య తనకోసం ఎదురుచూస్తూ ఉంటారని కంగారుపడ్డాడు. సరిగ్గా ఏడు అయ్యేసరికి భోజనం చెయ్యడం ఈమధ్యన తాతయ్యకి అలవాటుగా మారింది. ఆ సమయానికి తానూ ఇల్లు చేరాలన్న కోరికతో జీవన్‌ వేగంగా సైకిలు తొక్కుకుంటూ ఇంటిదారి పట్టాడు.

గేటు తెరుచుకుని కాంపౌండులో ప్రవేశించి, గుమ్మం పక్కగా సైకిల్‌కి స్టాండ్‌ వేసి, తాళం పెట్టి వేగంగా మెట్లెక్కి లోపలకు రాబోతున్న జీవన్‌ని గుమ్మందగ్గర, లోనికి వెళ్లనీకురడా అటకాయిరచింది జీన్స్‌ ప్యాంటు, టీషర్టు వేసుకుని, బాబ్డుహెయిర్తో ఉన్న సుమారుగా పదహారేళ్ల వయసున్న అమ్మాయి! ఒక్కక్షణం తటపటాయిరచాడు జీవన్‌. తన కంగారులో తను వేరే వాళ్ల ఇంట్లో ప్రవేశించాడేమో నని భయపడ్డాడు. కాని గోడకి ఉన్న తాతయ్య నేమ్‌ ప్లేటు చూసి, అది సరైన చోటేనని గ్రహించాడు.

ఇల్లంతా దీపాలు వెలుగుతున్నాయి. గుమ్మానికి ఎదురుగా పడకకుర్చీలో కూర్చుని వీధివైపు చూస్తూ తన రాక కోసం ఎదురు చూసే తాతయ్య అక్కడలేరు. గుమ్మానికి అడ్డంగా ద్వారబంధానికి చేతులు ఆనించి నిలబడ్డ ఆ అమ్మాయివైపు ఆశ్చర్యంగా చూశాడు జీవన్‌. తాతయ్య ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు గావును – అనుకున్నాడు.

ఆమె కూడా అతనివైపు ఆశ్చ ర్యంగా చూసింది. ‘ఇంత చొరవగా ఇతడు లోపలకు వస్తున్నాడంటే తాతయ్యకు బాగా తెలిసినవాడే అయివుంటాడు, సందేహం లేదు. ఎవరితను? అలెగ్జారడ రుకి తమ్ముడా లేక సెల్యూకస్‌కి మేనల్లుడా! ఎవరై ఉంటాడు? ఎంత ‘హాండ్సమ్‌’గా ఉన్నాడు’ అనుకుంది.

అతని సంగతేమిటో తేల్చేయాలనుకున్న ఆ అమ్మాయి గుమ్మానికి అడ్డం తప్పుకోకురడానే, కొంటెగా జీవన్‌ వైపు చూస్తూ, ‘ఎవరండీ మీరు? మా తాతయ్యకు తెలిసినవారా, అంత చొరవగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు! ఈ స్రవంతి పర్మిషన్‌ ఉరటేగాని మీరు లోపలి వెళ్లలేరు’ అంది కోపం నటిస్తూ.

జీవన్‌ తెల్లబోయి చూశాడు ఆమెవైపు. దాచాలన్నా దాగని చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఆమె కళ్లలోని కొరటె మెరుపులు పసిగట్టగలిగాడు జీవన్‌. వెంటనే అతనికి తెలిసి పోయింది, ఆ అమ్మాయి తనని ఆటపట్టిస్తోరదని! ఇక్కడ ఉందంటే, ఈమెకు తాతయ్యకు ఏదో చుట్టరికం ఉండే ఉంటుంది’ అనుకున్నాడు.

స్రవంతి స్వరూప స్వభావాలు అతనికి వింతగా కనిపించాయి. తనుకూడా ఆమెను ఆటపట్టిరచాలను కున్నాడు, ఆమె పద్ధతిలోనే తనూ జవాబు చెప్పాలనుకున్నాడు, ‘క్షమించండి యువరాణీ! నేను తాతయ్యకి నమ్మినబంటుని. ఆయన రమ్మంటేనే కార్యార్ధినై వచ్చాను. నన్ను చూసి భయపడవలసిన పనిలేదు. లోపల నాకొక ముఖ్యమైన పని ఉంది. దయయుంచి తమరు అడ్డు తప్పుకున్నట్లైతే నేనెళ్లి ఆ పని పూర్తిచేస్తా. అసలే అలసి సొలసి ఆకలితో ఉన్నాను’ అన్నాడు చిరునవ్వుతో.

‘ఎవరే అక్కా! ఎవరితో మాట్లాడుతున్నావు’ అని అడుగుతూ స్రవంతి తమ్ముడు రవి అక్కడికి వచ్చాడు.

స్రవంతి ద్వారబంధం మీద అడ్డంగా ఉంచిన చేతులు తీసేసి, ‘సరే ఐతే ! పర్మిషన్‌ గ్రాంటెడ్‌. ఇక వెళ్లొచ్చు’ అంటూ పక్కకి తప్పుకుంది.

ఎవరో చుట్టాలు వచ్చారన్నది తెలుస్తూనే ఉంది. కానీ ఎవరో! తాతయ్య చుట్టాలొస్తున్నట్లు చెప్పనే లేదు – అనుకుంటూ లోపల ప్రవేశించాడు జీవన్‌.

మొహం చిన్నపుచ్చుకుని హాల్లో పడకకుర్చీలో కూర్చుని ఉన్నారు జగన్నాథంగారు. జీవన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది. ‘హమ్మయ్య! వచ్చావా, నీ మాటే అనుకుంటున్నా’ అని, ‘ఇదిగో చూడుబాబూ! సర్పైజ్‌ విజిట్‌గా వచ్చి నన్నొకసారి పలకరించి పోడానికి మా అబ్బాయి కుటుంబ సమేతంగా వచ్చాడు. అతిథి మర్యాదలు చెయ్యాలిగా మరి! అమ్మనడిగి లిస్టు రాసుకుని కావలసినవన్నీ తీసుకురా. బీరువా సొరుగులో డబ్బురది, ఎంత కావాలో తీసుకెళ్లు’ అన్నారు.

ఈలోగా జగన్నాథంగారి అబ్బాయి రఘురామ్‌ అక్కడకి వచ్చాడు. జీవన్‌ అతనికి నమస్కరించాడు. రఘురామ్‌ ఎగాదిగా చూశాడు జీవన్‌ని.

‘వచ్చావా నాయనా, సంతోషం! ఇంతవరకూ ఈ పెద్దాయన నీ పేరే జపిస్తున్నాడు. నువ్వేనన్నమాట ఈయనను ఆదుకోడానికి పరుగు, పరుగున వచ్చిన మనవడివి! ఏం మాయ చేశావోగాని-వచ్చినప్పటి నుండి వింటున్నా, ఈయనకు నీ ఊసు తప్ప మరో ధ్యాసలేదు’అంటూ ఒక ఎడనవ్వునవ్వాడు రఘురామ్‌.

ఆయన స్వరంలోని వెటకారానికి ‘గతుక్కు’ మని తెల్లబోయాడు జీవన్‌. తన ఉనికి ఎందుకో రఘురామ్‌ గారికి కిట్టటం లేదని జీవన్‌కి అర్థమయింది. కానీ తాను చేసిన తప్పేమిటో అతనికి ఎంతమాత్రం అంతుపట్టలేదు. పెద్దాయన మళ్లీ హెచ్చరించడంతో కాగితం, పెన్సిలు తీసుకుని తేవలసిన సామాను లిస్టు రాసుకోడం కోసం వంటగది వైపుగా నడిచాడు జీవన్‌.

వంటగదిలో మీనాక్షి వంటపనిలో సతమత మౌతూనే, ఉత్తరదేశపు స్త్రీల ఆహార్యమైన సెల్వార్‌, కమీజ్‌, దుపట్టాలను ధరించివున్న ఒక యువతితో మాట్లాడుతూ, ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు చెపుతోరది. ఆమె తాతయ్యగారి కోడలని గ్రహించాడు జీవన్‌.

‘మీరు ఇదివరకు పనిచేసిన యాజులుగారు మా అమ్మవైపున మాకు దగ్గర బంధువులు. వాళ్లు అమెరికా నుండి వచ్చేవరకేనన్నమాట మా మామ గారికి ఈ భోగం’ అంది మీనాక్షితో ఆమె.

మీనాక్షి గుమ్మం బయట పెన్ను, పేపరు పట్టుకుని తచ్చాడుతున్న కొడుకుని చూసి పలుక రించింది, ‘పనేమైనా ఉందా నాతో?’ అని.

‘ఇంటికి కావలసిన సరుకులన్నీ లిస్టు రాసుకుని, రేపు ఉదయమే తీసుకురమ్మన్నారు తాతయ్య’.

‘ఔను, చాలావరకూ సరుకులు నిండుకున్నాయి, తేవాలి. ఈ పూటకి ఎలాగో సరిపెట్టాగాని, రేపు మాత్రం మన సరుకు ముందు తేవాలి, లేకపోతే పొయ్యిలో పిల్లికి లేవాల్సినపని ఉండదు’ అంది మీనాక్షి చిరునవ్వుతో.

‘సరే! మొదటి ట్రిప్‌లో మన పనే చక్కబెడతా, లిస్టు చెప్పు’ అంటూ జీవన్‌ లిస్టు రాసే పోజులో నిలబడ్డాడు.

‘నాకు వంటకి ఆలస్యమౌతుంది, నువ్వు రజనీగారినడిగి రాసుకో. తరువాత నేను వస్తా’ అంటూ తరిగి ఉంచిన కూరగాయ ముక్కల్ని పోపులో వేసేపనిలో పడింది మీనాక్షి.

జీవన్‌ రజనికి నమస్కరించి, ‘మీరు చెప్పం డమ్మా! నేను రాసుకుంటా. రేపు కొట్లు తెరవగానే ముందు మన సామానే తీసుకువస్తా’ అంటూ రాయడానికి వీలుగా కాగితం కలం పట్టుకుని నిలబడ్డాడు. రజని చెప్పసాగింది.

———-

ఆ రాత్రి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తండ్రి పక్కన రఘురామ్‌ కూర్చున్నాడు. రెండవ పక్కకి స్రవంతి వచ్చి తాత పక్కన కూరుచుంది. వెంటనే జగన్నాథం గారు స్రవంతిని వారించారు. ‘అమ్మలూ లే తల్లీ! అది జీవన్‌ చోటు. మా పరిచయం బలపడినప్పటి నుండి అతడు భోజనానికి అక్కడే కూర్చుంటున్నాడు. లేమ్మా! నాలుగురోజుల భాగ్యానికి ఇప్పుడీ మార్పులెందుకులే’ అన్నారు.

స్రవంతి కుర్చీలో కూర్చున్నదల్లా గమ్మున లేచింది. జీవన్‌కి అది సబవనిపించలేదు. అసలే అతడు, వాళ్ల మధ్య కూర్చుని తినడానికి మొహమాట పడుతున్నాడు.

చివరకి ఎంతో ఇబ్బంది పడుతూ అన్నాడు, ‘వద్దు తాతయ్యా! నాకిక్కడ బాగుంటుంది, నేనిక్కడే కూరుచుంటా’ అంటూ వచ్చి రవి పక్కన కూర్చు న్నాడు.

‘నాల్గు రోజుల భాగ్యానికి ఇన్ని మార్పులెందుకు! ఎవరి చోటులో వాళ్లు ఉండడం అందరికీ మంచిది కదాని అన్నాను’ అన్నారు జగన్నాథంగారు.

రజని రఘురామ్‌ వైపు కోపంగా చూసింది. రఘురామ్‌ మొహం ముడుచుకున్నాడు. మీనాక్షి వడ్డన ప్రారంభించింది. ఒక విధమైన బిగువు చోటుచేసు కుంది ఆ ప్రదేశంలో. అందరూ తలలు వంచుకుని మౌనంగా భోజనం చేయసాగారు.

జీవన్‌కి అది చాలా బాధ కలిగించింది. రోజూలా కబుర్లతో, జోకులతో, నవ్వులతో కాకుండా, ముక్తసరి మాటలతో ఆ రాత్రి భోజనాలు ఎలాగోలా ముగిశాయి. వంచిన తల ఎత్తకుండా ఎంతో ఇబ్బంది పడుతూ, తింటున్న జీవన్ని చూస్తూ తను భోజనం పూర్తిచేసింది స్రవంతి.

‘అయ్యో! ఈ రాత్రి ఎవరూ కడుపునిండా తిండి తినలేదు గావును, వండినవి వండినట్లే మిగిలి పోయాయి కదా! ఏమైయిందో మరి’ అనుకుంది మీనాక్షి బాధగా.

భోజనం ముగించి వెళ్లి పడకకుర్చీలో విశ్రాంతిగా కూర్చున్న జగన్నాథంగారికి, ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చి, ఆయన పక్క దులిపి వేసి, రాత్రి దాహమైతే అందుబాటులో ఉండటానికి, మంచం పక్కనున్న టీపాయ్‌ మీద మంచినీళ్లతో ఉన్న సీసా ఉంచాడు జీవన్‌. అలా పెద్దాయన రాత్రి సుఖంగా నిద్రపోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశాక, ఇక తాను అక్కడ ఉండడం మంచిపని కాదనీ, ఏదో ఒక సాకు చెప్పి తల్లితో కలిసి ఇంటికి వెళ్లిపోవాలని అనిపించింది జీవన్‌కి. (ఇంకా ఉంది)

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *