జీవనస్రవంతి -38

జీవనస్రవంతి -38

: జరిగిన కథ :

మల్లెవాడ వెళ్లే ముందు జీవన్‌ స్రవంతితో వితంతువు, ఇద్దరు పిల్లలున్న జాహ్నవిని పెళ్లి చేసుకుని, ఆమెకు కొత్త జీవితం ప్రసాదిద్దాం అని మూడేళ్ల క్రితమే అనుకున్నానని చెప్పాడు. అందుకు స్రవంతి ఎంతో బాధపడింది. మౌనంగా రోధించింది. జీవన్‌ ఆమెను ధైర్యంగా ఉండమని, జాహ్నవి వైపు నుండి ఆలోచించమని చెప్పాడు. అన్నీ ఆలోచించిన స్రవంతి కూడా జీవన్‌ నిర్ణయాన్ని కాదనలేకపోయింది. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంది. మల్లెవాడ వెళ్లిన జీవన్‌ని కరణంగారు ఆహ్వానించారు. సీతమ్మగారిని పిలిచి కాఫీ ఇమ్మని, మల్లేశుని స్నానానికి నీళ్లు సిద్ధం చేయమని చెప్పారు. జీవన్‌కి వాళ్ల ముఖాల్లో వేదన కనపడింది. జాహ్నవికి ఏదో అయిందని ఊహించాడు. కామేశంగారు పసిపిల్లని ఎత్తుకుని వచ్చి ‘అంతా మన ఖర్మ’ అని సీతమ్మగారితో అని, జీవన్‌తో జాహ్నవి గురించి చెప్పసాగారు.

ఇక చదవండి..

‘సరే! అయ్యిందేదో అయ్యింది. పైచదువులు చదివిస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, దాని పిల్లల్ని అది పోషిరచుకుంటుందని చదువులో పెడితే, పరీక్షలన్నీ బాగానే పాసయ్యిరది గాని, బ్రతుకు పరీక్షలో మాత్రం ఓడిపోయింది. ఇంగ్లీషు కష్టంగా ఉంది నాన్నా- అంటే, సుధీర్‌ అనే నా ప్రాణమిత్రుడి కొడుకు దగ్గరకు చదువుకోమని పంపిరచా. సుధీర్‌ ఇంత దుర్మార్గుడనుకోలేదు. వాడి మాయలోపడి ఇది కడుపు తెచ్చుకుంది, ఈ వయసులో మా బతుకుల్ని వీథికెక్కిరచింది. ఇకపై మాకు ఊళ్లో తలెత్తుకు తిరిగే యోగ్యత పోగొట్టేసిరది. చెప్పుకోడానికి సిగ్గౌతోంది’ అంటూ భుజం మీదున్న కండువాతో ముఖం కప్పుకుని ఉసూరుమని నిట్టూర్చారు కరణరగారు. కాసేపటిదాకా అక్కడ మౌనం రాజ్యమేలింది.

కొరచెంసేపు గడిచాక జీవన్‌ అన్నాడు, ‘ఇప్పుడు సుధీర్‌గారు ఏమంటున్నారు? వాళ్లిద్దరికీ పెళ్లి జరిపిస్తే సమస్య తీరిపోతురది కదా! వాళ్లని కనుక్కున్నారా?’

‘అదీ అయ్యింది బాబూ! ఇద్దరు బిడ్డల తల్లిని కోడలిగా తెచ్చుకునేందుకు వాళ్ల అమ్మా, నాన్నా ఇష్టపడటం లేదుట! ‘నేను ఒక్కగానొక్క కొడుకుని వాళ్లకి, వాళ్లు ఇష్టపడందే ఈ పెళ్లి నేనెలా చేసుకోను’ అంటున్నాడు సుధీర్‌ ఇప్పుడు. అతడి మాటలు విన్న తరువాత జాహ్నవికి జీవితంమీద విరక్తి కలిగి, గన్నేరుపప్పులు నూరుకుని నీళ్లలో కలుపుకుని తాగేసింది. ఇంకేముంది – ఆలగోల, బాలగోల! కన్నకడుపు కదా, చూస్తూ ఊరుకోలేక ఆసుపత్రిలో చేర్పిరచాము. రెండు రోజులయ్యిరది. మొత్తానికి బ్రతికించారు. బ్రతికిరదన్న సంతోషం మాకు ఏ కోశానా కనిపించడం లేదు. ఇకముందు ఏం చెయ్యాలి అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు’.

‘మీరు ఊర్లోని పెద్దమనుష్యులను తీసుకెళ్లి సబవు చెప్పించవలసింది. ఇలాంటి విషయాల్లో తేలిగ్గా ఊరుకోకూడదు. ఇద్దరు కలిసి చేసిన తప్పుకు ఒకళ్లకే శిక్ష పడడం న్యాయం కాదు’ అన్నాడు జీవన్‌ ఆవేశంతో.

‘అయ్యో! అదీ అయ్యింది బాబూ! మా సుబ్బడున్నాడు చూశావూ – వాడు జగమొండి. ఒకపట్టాన ఎవరికీ లొంగడు. అందరూ కలిసి ముక్కచివాట్లు పెట్టాక, ఎలాగైతేనేం జాహ్నవిని కోడలిగా చేసుకురటానన్నాడు. కాని, ఒక కండిషన్‌ పెట్టాడు – పిల్లలు ఆమెతోపాటుగా వాళ్లింటికి రాకూడదుట, ఎంత బాగుందో చూడు! తండ్రీ లేక తల్లీ లేక ఆ పిల్లలు ఏమైపోవాలి? అక్కడికీ జాహ్నవి అత్తవారి తరపు వాళ్లు దత్తత చేసుకురటామని అడిగితే, వాడైనా అక్కడ గారాబంగా పెరుగుతాడని, పిల్లాడిని వాళ్లకు పెంపుకిచ్చేశాము. ఇక మిగిలింది ఈ పిల్ల. ఆడపిల్ల! దీన్నెవరూ పెంచుకోరు’.

‘మీ అబ్బాయిల్ని అడిగారా?’

‘ఆ! ఆ ముచ్చటా తీరింది. దీన్ని వాళ్లూ పెంచుకోరుట! చాలా కాలానికి కలిగిన ఆడపిల్ల అని జాహ్నవిని తెగ గారాబం చేశారు కదా, ఇప్పుడు అనుభవించండి’ అని చెప్పారు. వాళ్లు మాకు వేరే మాటలలో చెప్పినా దాని సారాంశం ఇదే. మాకు సాయపడే వాళ్లెవరూ లేరు బాబూ! మేమూ డెబ్భయ్యవ పడిలో పడినవాళ్లం! ఏ క్షణంలోనైనా రాలిపోయే పండుటాకులం, ఈ పసిపిల్ల బాధ్యతను మేమెన్నాళ్లు మొయ్యగలము? చివరకు ఏమిరాసి ఉరదో, ఏమో! తరతరాలుగా కూడబెట్టుకున్న మానమర్యాదలు మంటలో కలిసిపోయాయి కదా!’ కంటినుండి ఉబికిన కన్నీరు ఆయన చెంపల వెంట ధారలుకట్టిరది.

సుమారుగా డబ్భై ఏళ్ల వయసున్న పెద్దమనిషి అలా దుఃఖిరచడం చూడలేకపోయాడు జీవన్‌. ‘మీరు అంతలా బాధపడకండి సార్‌ ! క్రమంగా అన్నీ సర్దుకురటాయి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం’ అన్నాడు జీవన్‌.

‘ఉండబట్టలేక అంతా నీకు చెప్పేశా కాని, బాబూ! మా సమస్యలతో నీ బుర్ర పాడుచేసుకోవద్దు. అంత తేలికగా పరిష్కారమయ్యే సమస్య కాదిది. చిన్నవాడివి, నీకెందుకీ బాధలన్నీ! ప్రయాణంతో బడలి ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో’ అన్నారు కరణం గారు.

‘రాత్రంతా బెర్తుమీద పడుకుని నిద్రపోయా, నాకేమీ బడలిక లేదు. ఒకసారి వెళ్లి సుధీరుగారితో మాటాడి వస్తా. ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో మనం ముందుగా తెలుసు కోడం మంచిది కదా! ఆ పనికి మీరు వెళ్లడం కంటే, మీ తరపున నేను వెళ్లడమే బాగుంటుంది. ఒకే వయసు వాళ్లం కనుక మేమిద్దరం మనసు విప్పి మాటాడుకోగలము’ అన్నాడు జీవన్‌.

‘సరే! పోయేరదుకేముంది కనుక, అలాగే కానియ్‌’ అన్నారు కామేశంగారు సగం అయిష్టంతోనే.

ఆయన మాట తీసుకుని సుధీర్‌ని కలుసుకోడాని కని బయలుదేరాడు జీవన్‌.

———

ఇదివరకు తెలిసివున్న ఇల్లే కావడంతో తిన్నగా సుబ్బరామయ్యగారి ఇంటికి నడిచాడు జీవన్‌. సింహద్వారానికి అమరి ఉన్న, పసుపు కుంకుమలతో అలకరిరచిన ఎత్తైన గడపను దాటి ఇంట్లో ప్రవేశించాడు. ద్వారబంధానికి కట్టిన బంతిపూల దండలు క్రిందికి వేలాడు తున్నాయి. అతడు గడపని దాటు తూండగా, ఆశీర్వదిస్తున్నవాటిలా అతని తలను తాకాయి.

కచేరీ చావడిలో పడకకుర్చీలో కూర్చుని ఏదో వేదాంత గ్రంథాన్ని చదువుకుంటున్న సుబ్బరామయ్య గారు అలికిడి విని తల పైకెత్తి చూశారు. జీవన్‌ని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘రా బాబూ! అంతా కుశలమా? శాన్నాళ్లకు కనిపించావు ! మళ్లీ యాజులు పనిమీద వచ్చావా ఏమిటి? ఇలా రా, వచ్చి కూర్చో’ అంటూ దగ్గరలో ఉన్న కుర్చీని చూపిం చారు. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చి, ఆయన చూపిరచిన కుర్చీలో కూర్చున్నాడు జీవన్‌.

కొంచెం సేపు సుబ్బరామయ్యగారితో కబుర్లు చెప్పి, ‘మీ అబ్బాయి ఈ ఊరి కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్నారని విన్నా. క్రితంమాటు నేను వచ్చినప్పుడు ఆయన ఊళ్లో లేకపోడంతో కలుసుకో లేకపోయా. ఒకసారి పిలుస్తారా’ అని అడిగాడు జీవన్‌. వెంటనే కొడుకుని పిలిచారు సుబ్బరామయ్యగారు.

తండ్రి పిలుపు విని తన గదిలోనుండి బయటికి వచ్చి, తండ్రి కుర్చీకి వెనకాల నిలబడ్డాడు సుధీర్‌.

‘అన్నట్లు మీరిద్దరూ కలుసుకోడం ఇదే మొదటి సారి అనుకుంటా’ అంటూ సుబ్బరామయ్యగారు వాళ్లిద్దరినీ, ఒకరినొకరికి పరిచయం చేశారు.

జీవన్‌ లేచివెళ్లి సుధీరుతో కరచాలనం చేసి అన్నాడు, ‘అసలు నేను వచ్చింది మీ ఇద్దరితో మాట్లాడిపోదామని. కాస్తంత పెద్దమనసు చేసుకుని, నా మాటలు విని, మంచి మనసుతో అర్ధం చేసు కోండి’ అన్నాడు, తను వచ్చిన పనికి ఉపోద్ఘాతంగా, తన కుర్చీని సుబ్బరామయ్యగారికి దగ్గరగా ఈడ్చుకుని కూర్చుంటూ.

సుధీర్‌ ముఖంలో అతని అంతర్మధనం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం పీక్కుపోయి, కళ్లు లోతుకి పోయి, సర్వం కోల్పోయినవాడిలా దీనంగా ఉన్నాడు. అది చూసి జీవన్‌ తప్తిపడ్డాడు. దానివల్ల అతనికి జాహ్నవి మీద నిజమైన ప్రేమ ఉందని అర్ధమయ్యింది. తండ్రినీ కొడుకునీ మార్చి మార్చి చూశాడు జీవన్‌.

ఆపై సుబ్బరామయ్యగారివైపు సూటిగా చూస్తూ, ‘అయ్యా! నేను వయసులో మీకంటే చాలా చిన్నవాడిని. మీకు చెప్పగలవాడిని ఎంతమాత్రం కాను – అన్నది నాకూ బాగా తెలుసు. కాని నా మనసుకి తోచిన మాట ఒకటి చెప్పకుండా ఉండలేక పోతున్నా. మీరు నన్ను క్షమించాలి..’ అంటూ మొదలుపెట్టాడు జీవన్‌, ‘విషయం ఈ స్థాయికి వచ్చాక ఇక మీరు మీ అబ్బాయి సుఖసంతోషాలను గురించి ఆలోచించకపోతే మరెవరు ఆలోచిస్తారు చెప్పండి? జాహ్నవి గారి పరిస్థితి మీకు తెలియంది కాదుకదా! మీ..’

జీవన్‌ మాటకు అడ్డొచ్చి అన్నారు సుబ్బరామయ్యగారు. ‘ఇదిగో అబ్బాయ్‌! నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్లిపో. అనవసరంగా మా విషయాల్లో తలదూర్చవద్దు. నువ్వీ ఊరివాడివైనా కావు, నీకెందుకు మా సంగతి? ప్రతివాడికీ ఎదుటివాడికి నీతులు చెప్పాలన్న ఉబలాటమే! తనదాకా వచ్చాకగాని తెలియదు తగులాటమేమిటో’ అంటూ కోపంతో గొంతెత్తి పెద్దపెద్ద కేకలు వేశారు.

కాని జీవన్‌ ఆ కేకల్ని పట్టించుకోలేదు. ఏ అలజడీ లేకుండా నెమ్మదిగా, నిదానంగా మాట్లాడాడు.

‘నీకెందుకు – అన్నారు, బాగుంది! మీరు అపార్ధం చేసుకోకూడదని వివరంగా చెపుతున్నా. విని సరిగా అర్థం చేసుకోండి. క్రితంసారి నేను ఈ ఊరు వచ్చినప్పుడు కరణంగారి ఇంట్లో వారం రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు విన్నా, జాహ్నవి గారిని గురించి. అప్పుడే అనుకున్నా, ఆమెకు నేను చెయ్యగలిగిన సాయం చెయ్యాలి అని. దానికీ ఒక కారణం ఉంది. నేను పుట్టడానికి ఇంకా మూడునెలలు ఉందనగానే మా నాన్నగారు ఒక ప్రమాదంలో చనిపోయారట! ఆ తరవాత మా అమ్మ నన్ను పెంచడానికి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అయినా చిన్నవాడిని కావడంతో నేను మా అమ్మకు ఏ సహాయం చెయ్యలేకపోయా. కాని మా అమ్మ కష్టాలకు కారణం నేనేనన్న అపరాధభావం ఒకటి నాలో ఉండిపోయింది. అది పోవాలంటే , కనీసం మా అమ్మలాంటి దైవోపహతురాలికి మరెవరికైనా నేను సాయపడి, ఆమెను కష్టాలనుండి గట్టెక్కిరచాలి అనుకున్నా. ఆ తరవాత నాకు కనిపించిన అటువంటి మొదటి వ్యక్తి జాహ్నవి గారు. ఆమెను పెండ్లాడి, ఆ పిల్లలకి తండ్రిగా, వాళ్లకొక మంచి జీవితాన్ని ఇవ్వాలని అప్పుడే అనుకున్నా. మా అమ్మకి కొడుకుగా అది నా కర్తవ్యం అనికూడా అనుకున్నా. కాని అప్పుడు నేను నిరుద్యోగిని కావడంతో నా ఆలోచనని పైకి చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు నేను సమర్థుడిని. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి, నా మనసులోని మాటను కరణం గారికి చెప్పాలని పనిగట్టుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడకు వచ్చాక ఇక్కడి పరిస్థితులన్నీ ఘోరంగా ఉండడం చూసి, సహించలేక మీతో మాట్లాడాలని ఇటు వచ్చా’ అన్నాడు జీవన్‌.

ఉద్వేగంతో జీవన్‌ చెప్పిన మాటల్ని అవాక్కై వింటూ ఉండిపోయారు సుబ్బరామయ్యగారు. గట్టిగా ఊపిరిపీల్చి, ధైర్యాన్ని కూడగట్టుకుని మాట్లాడాడు సుధీర్‌. ‘ఈ సమస్యను సష్టించినది నేను. కాని పరిష్కారం ఏమిటో నాకు అంతుపట్టడం లేదు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం! మధ్యలో నా బ్రతుకు అడకత్తెరలో పోక అయ్యింది. ఎటూ అంతుపట్టడం లేదు నాకు’ అన్నాడు విచారంగా.

‘సుధీర్‌ గారూ! మీరేం ఇదవ్వకండి. జీవితం అన్నాక సమస్యలు ఉంటాయి, అలాగే వాటికి పరిష్కారాలూ ఉంటాయి. ఆ పరిష్కారాన్ని వెతికి పట్టుకోడంలోనే మన ప్రజ్ఞ బయటపడుతుంది. మనకి కుదరకపోతే మన శ్రేయోభిలాషుల్ని సలహా అడగాలి. అంతేగాని, ఉన్న మతికూడా పోగొట్టుకుని బేజారైపోకూడదు’ అని చెప్పి, సుబ్బరామయ్యగారివైపు తిరిగి, ‘బాబాయిగారూ! మీరు మీ బిడ్డలమీద కొంచెం కనికరం చూపించాలి. జాహ్నవి గారు, ఆమె కడుపులో ఉన్న మీ వంశాంకురం, ఘోరప్రమాదం నుండి ఇప్పుడిప్పుడే బయటపడ్డారు. కాని త్వరలోనే ఆమెకు అబార్షన్‌ చేయిరచాలనుకురటున్నారు కామేశంగారు. ఇదేమిటంటే, పుట్టి ఉన్న బిడ్డలకే ఏ దక్షతా లేదు, ఇక పుట్టబోయే బిడ్డను ఎవరు పెంచుతారు – అని అంటున్నారు ఆయన. మీ వంశాంకురం, మీ ఏకైక పుత్రుని తొలి సంతానం, ఇలా తల్లి కడుపులో ప్రాణం పోసుకుంటూ ఉండగానే, కరకు కత్తులకు బలై, ఛిన్నాభిన్నాలై చనిపోవడం మీకు సమ్మతమేనా? ఇప్పుడు ఈ భ్రూణహత్యా పాతకం ఎవరిదౌతుంది?’

అక్కడున్న ముగ్గురి మనసుల్లోనూ చెలరేగిన భావావేశం వల్ల ఆ గదిలోని గాలి కంపించింది. గది నాలుగు గోడలు ‘ఈ పాతకం ఎవరిదీ? ఎవరిదీ? ఎవరిదీ’ అని పదేపదే ప్రతిధ్వనిస్తూ తనని నిలదీస్తున్నాయి – అనిపించింది సుబ్బరామయ్య గారికి. సుధీర్‌ కళ్లలో ఊరిన కన్నీరు, అతని చెంపల మీదుగా జారి, అతడు ఇంతసేపూ తండ్రి కుర్చీ వెనకాలే నిలబడి ఉడడరవల్ల, ఆ కన్నీటి చినుకులు సూటిగా వచ్చి సుబ్బరామయ్యగారి బట్టతలపై పడి, గిలిగింతలు పెట్టి, ఆయనకి తమ ఉనికిని తెలియజేసి, చెవులపక్కన మిగిలి ఉన్న కొద్దిపాటి జుట్టులోకి జారిపోయాయి.

సుబ్బరామయ్యగారికి కొడుకు స్థితి అర్ధమ య్యింది గాని, ఆయనలోని బింకం మాత్రం ఏపాటీ సడలలేదు. ‘చాలు! ఇక చాలు! గొప్పగా చెప్పొచ్చావు గాని పెద్దమనిషీ! మాకూ కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. నిప్పు కడిగి పొయ్యిలో వేసేటంత ఆచారవంతులు మావాళ్లు! అయినా మా అబ్బాయివల్ల తప్పుజరిగిరది. అంతేకాదు – చిన్నతనంలో మా ఇంట్లో ఆడుకున్న జాహ్నవి మీద నాకు అభిమానమూ ఉంది. అందుకే అదెంత అనాచారమైనా, ఆమెను మా ఇంటి కోడలుగా చేసుకోడానికి ఒప్పుకున్నా. ఒప్పుకున్నానని, అది అలుసుగా తీసుకుని మా కామిగాడు, మాకు ఏమీకాని ఆ పిల్లల బాధ్యత కూడా మామీదే వెయ్యాలని చూస్తే ఎలా ఊరుకోను చెప్పు? మా గోత్రమా, మా ఇంటి పేరా వాళ్లది! వాళ్లు మా ఇంటి పిల్లలతో ఎలా కలుస్తారు? ఇదేమీ మ్లేచ్ఛదేశం కాదు, కర్మ భూమి ఇది!’ సుబ్బారాయుడుగారికి ఆయాసం వచ్చింది, అయినా ఊరుకోలేదు ఆయన, క్షణం ఆగి మళ్లీ మొదలుపెట్టారు. ‘దీనికంతటికీ మా కావుడే కారణం! సరైన టైములో మేము వాడి కంటికి ఆనలేదు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా జాహ్నవికి పూలజడలు కుట్టీ, రకరకాల ముస్తాబులు చేసి, మా ఆవిడ తన ఆడపిల్ల ముచ్చట తీర్చుకునేది. మా సుధీర్‌కి పెళ్లీడు వచ్చాక కామేశాన్ని అడిగా – పిల్లనిచ్చి వియ్యం కలుపుకోమని! ఏదో గొప్ప సంబంధం వచ్చిందనీ, తాంబూలాలు పుచ్చుకోడానికి ముహూర్తం కూడా పెట్టేశారనీ చెప్పి, వాడు నాకు సుబ్బరంగా మొండిచెయ్యి చూపించాడు. నచ్చజెప్పా లని ఎంత ప్రయత్నించినా ‘ససేమిరా’ అన్నాడు. గొప్పింటి సంబంధం అన్న మోజులో వాడికి కళ్లు బైర్లు కమ్మాయి. అప్పుడే వీళ్ల పెళ్లి జరిగి ఉరటే ఎంత బాగురడేదో కదా! ఇప్పుడు చెప్పు – తప్పె వరిదో? ఇప్పటికీ మేము మాకు జాహ్నవి మీదున్న ప్రత్యేకమైన మమకారాన్ని చంపుకోలేకపోతున్నాము’ అంటూ నిట్టూర్చారు సుబ్బరామయ్యగారు.

‘ఇక ఆలస్యమెందుకు చెప్పండి? వాళ్లకు పెళ్లి చేసేయ్యవచ్చుగా..’ అన్నాడు జీవన్‌ ఉత్సాహంగా.

‘బలేగా చెపుతున్నావురా అబ్బాయీ! ఇదంత తేలిక విషయమా ఏమిటి? మన సంప్రదాయంలో ఇహపరాలు రెండిరటికీ దక్షత కావలసిన వాళ్లు సంతానమే కదా! పరాయిపిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాళ్లు మనపిల్లలౌతారా ఏమిటి? నువ్వెన్నైనా చెప్పు, వాళ్లని నా మనమలుగా ఎప్పటికీ నేను దర్శిరచలేను’ కోపంతో రగిలిపోయారు ఆయన.

సుబ్బరామయ్యగారి కోపం చూసి జీవన్‌ గతుక్కుమన్నాడు. ఇక లాభంలేదు, మరోదారేదైనా దొరుకుతుందేమో చూడాలి అనుకున్నాడు.

‘బాబాయ్‌ గారూ! మీకు తెలుసా – పిల్లాడిని తండ్రి వైపు వాళ్లు దత్తత చేసుకుంటామని తీసుకెళ్లారుట. ఇక ఉన్నది పాపాయి ఒక్కతే ! ఆడపిల్ల కదా, కొన్నాళ్లు పెంచాక పెళ్ళిచేస్తే అత్తవారింటికి వెళ్లిపోతుంది. ఆ కన్యాదాన ఫలం మీకే దక్కుతురది కదా!’ గొప్పగా చెప్పాను అనుకున్నాడు జీవన్‌.

–  వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *