జీవనస్రవంతి – 33

జీవనస్రవంతి – 33

: జరిగిన కథ :

ఆ రాత్రి భోజనాల వద్ద జీవన్‌ కిరణ్‌తో మాట్లాడుతూ సరుకు రవాణా, బాకీల వసూలు కోసం రాఘవను, ముడి సరుకులు తేవడానికి టెంపో, దానిని నడపడానికి వెంకటేశుని పనిలోకి తీసుకోమన్నాడు. తల్లి మీనాక్షి అనుమతించింది. జీవన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర అయ్యాడు. తన టీమ్‌లోకి శిరీష, స్రవంతి వచ్చారు. తనను గుర్తుపట్టలేకపోయిన జీవన్‌కు స్రవంతి తనను తాను నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆగస్టు 15 సెలవు కావడంతో జీవన్‌ ఇంటివద్దే ఉండి తన క్యాటరర్స్‌ నుండి శరభయ్య చేసిన వంట తినాలనుకున్నాడు. శరభయ్య తన కూతురు పెళ్లి కుదిరిందని, కొంత డబ్బు అప్పుగా కావాలని అడిగాడని మీనాక్షి చెపితే జీవన్‌ దానికి తిరస్క రించాడు. మీనాక్షి తెల్లబోయి మనం మొండిచెయ్యి చూపిస్తే శరభయ్య ఏమయిపోతాడు అంది.

ఇక చదవండి..

‘అమ్మా! చెప్పేది పూర్తిగా వినమ్మా. ఒక పిల్ల పెళ్లికి సాయపడడం కూడా పుణ్యకార్యమే ఔతుంది. జగన్నాథం తాతయ్య పేరుతో మనం కూడబెడుతున్న ధర్మనిధిలో నుండి డబ్బు తీసి మనర శరభయ్యకు ఇద్దాం. వేరే ఏ అప్పు చెయ్యకుండానే అతని కూతురు పెళ్లి జరిగిపోతుంది, ఏమంటావు?’

ఆ మాటకు మీనాక్షి చాలా సంతోషించింది. ‘అబ్బా ! నీ ఆలోచన అమోఘంరా! నేనిప్పుడే వెళ్లి ఈ సంగతి శరభయ్యకి చెప్పి వస్తా. బెంగ తగ్గి ప్రశాంతంగా పనులు చేసుకుంటాడు’.

‘అక్కడతో అవ్వలేదమ్మా! ఇంకా మాట్లాడాలి నీతో.. తాతయ్య చారిటబుల్‌ ఫండు విషయంలో నాకు ఇంకా ఆలోచనలున్నాయి! మనం లాభంలో 5% చారిటీకి అనుకున్నాక చారిటీ ఫండ్‌ చాలా వేగంగా పెరిగింది. ఆ డబ్బుని, డబ్బులేక చదువు ఆగిపోయిన కుర్రాడికిచ్చి పై చదువు చదివించాలని ఉందమ్మా. చదువుకోవాలని ఉండీ చదువుకోలేని పరిస్థితిలో ఆ కుర్రాడు పడే బాధ నాకు తెలుసు. ఇప్పుడు మన కిరణ్‌ ఉన్నాడు చూడు, వాడు కూడా నాలాగే మంచిమార్కులతో డిగ్రీ తీసుకున్నాడు. కాని ధనాభావం వల్ల అక్కడితో వాడి చదువు ఆగిపోయింది’.

కొడుకు మనసులో ఏముందో మీనాక్షికి తెలిసిపోయింది. ‘వివాహో విద్య నాశాయ’ అంటారు కదరా! రేపోమాపో బిడ్డకు తండ్రి కాబోతూన్న వాడేమి చదవగలడురా!’ అంది.

‘ఆ మాట అనవలసింది మనం కాదమ్మా, వాడినే అడిగి చూద్దాం. అయినా వాడు తండ్రవుతున్నాడని నీకెవరు చెప్పారు?’ అన్నాడు జీవన్‌.

‘ఎవరూ చెప్పలేదు ఇంకా. సుమతి డోక్కుంటూరటే చూశా. ఒక మగని ఆలి పొద్దున్నే డోకుతోందంటే తల్లి కాబోతోరదనే అర్థం’.

మెట్లమీద కర్ర తాటిస్తున్న చప్పుడు వినిపించింది. అంతలో కిరణ్‌ లోపలకు వచ్చాడు. ‘రారా కిరణ్‌’ అంటూ లేచి ఎదురు వెళ్ళాడు జీవన్‌. స్నేహితుడి భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు.

‘కిరణ్‌! నీకు నూరేళ్లు ఆయుష్షురా! నీ మాటే అనుకుంటున్నాం ఇప్పుడు’ అంది మీనాక్షి చిరునవ్వుతో.

‘నీకు ఈ రోజు సెలవు కదరా! ఇలా వచ్చావెందుకని? ఏదైనా పని పడిందా’ అడిగాడు జీవన్‌.

తల్లీ కొడుకులిద్దరినీ పరిశీలనగా చూస్తూ, ‘ముందు మీరు చెప్పండి, ఇంతకుముందు నా గురించే చెప్పుకురటున్నారన్నారు కదా, ముందది ఏమిటో చెపితేనే..’ చనువుగా అనేశాడు కిరణ్‌.

‘అదేమీ బ్రహ్మారడం కాదు, నీకు పై చదువులు చదవాలని ఉంటే, తాతయ్య చారిటీ ఫండ్‌ నుండి డబ్బు తీసుకుని, నైట్‌ కాలేజ్‌లో చేరి చదువు కుంటావేమో కనుక్కుందామని అనుకుంటున్నాము. అంతలో నువ్వొచ్చావు’ అంది మీనాక్షి.

‘అమ్మా ! మీ ఐడియా అయితే బాగుంది గాని, నాకంత ఓపిక లేదు. ప్రస్తుత స్థితి నాకు సంతప్తిగా ఉంది. ఇది ఇలా సాగితే సరిపోతుంది, నేను సుఖంగా ఉంటాను. నాకీ అదష్టం చాలు’ అన్నాడు కిరణ్‌.

మరిక నీసంగతి చెప్పు – అన్నట్లు సూటిగా జీవన్‌ వైపుకి చూసింది మీనాక్షి.

కిరణ్‌ ‘ఓపిక లేదు’ అన్నమాటతో జీవన్‌ బాధపడ్డాడు. అతనికి ఇష్టం లేని పని చేయించలేం కదా అని సరిపెట్టుకుని ‘సరేలే’ అన్నాడు ముక్తసరిగా.

‘సరేనమ్మా! ఇక నాసంగతి చెపుతా వినండి.. సుమతి త్వరలో ‘అమ్మ’ కాబోతోంది. ఈ సంగతి మీకు చెప్పిరమ్మని అమ్మ పంపించింది’ అంటూ సిగ్గుపడ్డాడు కిరణ్‌.

ఈ మాటతో కిరణ్‌ని చదివించలేకపోతున్నాననే బాధలోంచి బయటకువచ్చిన జీవన్‌ ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచి, కిరణ్‌ చెయ్యి పట్టుకుని ‘కంగ్రాట్యులేషన్సురా బ్రదర్‌!’ అంటూ కరచాలనం చేశాడు.

‘ఓరి నీ ఇల్లు బంగారంగానూ! అంత చక్కని కబురు ఇంత నెమ్మదిగా చెపుతావేమిటిరా కిరణ్‌! ఉండు, ఇంత తియ్యని కబురు చెప్పిన నీ నోటిని తియ్యనజేస్తా’ అంటూ లేచి వంటగదిలోకి నడిచింది మీనాక్షి.

‘మీరిలా సంతోషిస్తారనే ముందుగా మీకు చెప్పమని పంపించింది మా అమ్మ’ అన్నాడు కిరణ్‌, తలవంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.

ఇంతలో మీనాక్షి పళ్లెంలో పాల మైసూరుపాక్‌ ముక్కలు తెచ్చింది.

‘ఈ వేళ ఇంత మంచివార్త వింటానని ముందుగా అనుకోకపోయినా, దేశం స్వతంత్రం పొందిన శుభదినం కదా, తీపి తినడం మంచిదని చేశా! అదే కలిసొచ్చింది. తీసుకోరడి’ అంటూ ప్లేటుని, సోఫా ముందున్న టీపాయ్‌ మీద ఉంచింది మీనాక్షి.

‘అమ్మా! స్వీట్‌ మొత్తం ఇదేనా లేక సుమతికోసం వేరేగా ఉంచావా?’ ఒక ముక్క కిరణ్‌కిచ్చి తానొకటి తీసుకుంటూ అన్నాడు జీవన్‌.

‘చాల్లేరా నీ బడాయి! ఇవి మిఠాయి షాపులో పిండివంటలు వండిన చేతులురా, కొంచెం వండడం నాకసలు చేతకాదు. ఇవి మీరిద్దరూ తినడానికి. ఇంటికి వెళుతున్నప్పుడు సుమతి కోసం వేరే ఇస్తా. సుమతితో పాటుగా ఇంట్లో అందరూ తినొచ్చు. అందరికీ ఇద్దామనే చేశా’ అంది మీనాక్షి సంతోషంగా.

సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు జీవన్‌.

‘అమ్మా! ఒక విషయం నేను మీ ఇద్దరితో చెప్పాలనుకుంటున్నా. మళ్లీ మనం ముగ్గురం కలవడానికి ఎన్నాళ్లు పడుతుందో ఏమో! ఇప్పుడే చెప్పేస్తా..’ అన్నాడు.

ఏమి చెపుతాడోనని ఆత్రంగా చూశారు మీనాక్షి, కిరణ్‌లిద్దరూ.

‘మరేం కాదు. అది మనం చారిటీ కోసం దాచిన డబ్బు విషయం. ఇప్పుడది ఓ మాదిరి పెద్దమొత్తమే అయ్యింది. దానిని సద్వినియోగ పరచే విషయమే నేను మీతో మాటాడాలనుకుంటున్నది..’ అన్నాడు.

మీనాక్షి, కిరణ్‌లిద్దరూ ఇంకా శ్రద్ధగా వినసాగారు.

జీవన్‌ చెప్పసాగాడు. ‘ఆ డబ్బు తగుమాత్రంగా ఉన్నప్పుడు మనం అన్నదానం, వస్త్రదానం చేసేవాళ్లం, బాగుంది. మరి ఇప్పుడు అంతకంటే డబ్బు చాలా ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు అంతకంటే పెద్ద విషయాలమీద దష్టి పెట్టడం బాగుంటుంది కదా’.

వెంటనే కిరణ్‌ అందుకున్నాడు, ‘ఔను, నా ఉద్దేశం కూడా అదే! అన్నదానం వల్ల వచ్చిన సంతప్తి పూర్తిగా ఒక్కరోజు కూడా నిలవదు. ఇక వస్త్రదాన మంటావా – అది ఒకమనిషి అవసరాన్ని పూర్తిగా తీర్చగలిగింది ఎలాగూ కాదు. తగినంత డబ్బు సమకూరగానే మనం దానిని కన్యాదానానికి గాని వినియోగిస్తే, ఒకపిల్ల జీవితకాలం సంతోషిస్తుంది. అదే విద్యాదానానికైతే ఒక కుటుంబం బాగుపడుతుంది’ అన్నాడు.

‘సరిగ్గా ఇదే ఆలోచన నాకూ వచ్చింది, డబ్బు చాలక మన శరభయ్య కూతురు పెళ్లి ఆగిపోయేలా ఉందిట, విన్నావా ?’ అన్నాడు జీవన్‌.

‘ఔను – సుమతి చెప్పింది. ఆ విషయమే అమ్మతోనూ, నీతోనూ మాటాడాలనుకుంటున్నా. ఐతే ఈ విషయం మీకూ తెలిసిందన్నమాట!’

‘విషయం చెప్పి శరభయ్య అమ్మని అప్పిమ్మని అడిగాడుట. అప్పెరదుకు, చారిటీఫండ్‌ నుండి తీసి ఇస్తే సరిపోతురదనుకున్నాము అమ్మా నేనూ. నీ ఉద్దేశమేమిటి?’ కిరణ్‌ని అడిగాడు జీవన్‌.

‘భేషైన పని, శరభయ్యకు తెలుసా ఈ సంగతి?’

‘చెప్పాలి. వెళతా’ అంటూ లేచాడు జీవన్‌.

మీనాక్షి కూడా ఏదో పనిమీద లోపలికి వెళ్లింది.

‘డబ్బు లేక చదువు ఆగిపోయిన ఒక తెలివైన కుర్రాడికి సాయం చెయ్యాలని కూడా అనుకున్నాం. నిన్ను చదువుకోమంటే వద్దన్నావు’ అన్నాడు జీవన్‌, మాటను నిష్ఠూరంగా మార్చి.

‘పోరా, నేనేమైనా కుర్రాడినా? నువ్వు సహాయం చెయ్యాలంటే కుర్రాళ్లే దొరకరా ఏమిటి?’

‘ఇంజనీరింగ్‌ చదవడానికి ఉబలాటపడుతున్న సుమతి తమ్ముడిని ‘చదివించలేను, బిఎలో చేరు’ అన్నారుట కదా మీ మామగారు..’

తెల్లబోయి చూశాడు కిరణ్‌. ‘ఈ సంగతి నీకెలా తెలిసింది’ అని అడిగాడు.

‘ఎలా తెలిస్తేనేం, నిజమే కదా! తెలివైనవాడు, శ్రద్ధగా చదివే కుర్రాడు – అలాంటివాడికి కాక మరెవరికి చెయ్యాలిట సాయం?’

‘అది కాదురా జీవా! కొంచెం ఆలోచించి చూడు, ఇలా డబ్బంతా శ్రీ జననీ ఫామిలీలోనే పంచేస్తే.. జనం ఏమనుకుంటారు?’

‘అలాంటి కుశ్శంకలు వద్దురా కిరణ్‌! దగ్గరగా ఉన్నవాళ్లకి ఇవ్వడం తప్పనే ఉద్దేశంతో దూరంగా ఉన్న యోగ్యత లేనివాడికి పట్టం కట్టడం తప్పు. యోగ్యుడైనవాడు ఎదుట ఉండగా వాడిని తోసిపారేసి, ఎక్కడెక్కడో వెతికి తేవాలా? ఇదేమి న్యాయం? సుమతి తమ్ముడి చదువు పూర్తయ్యేసరికి వెంకటేశు మామ కూతురు పైచదువులకు ఎదుగుతుంది. ఆ తరవాత..’

కిరణ్‌ నవ్వుతూ.. ‘అలాగైతే నువ్వు చాలాదూరం ఆలోచించి ఉంచావన్న మాట! సరేరా! నీ ఇష్టం’ అన్నాడు.

ఏదో పనిమీద లోపలకు వెళ్లిన మీనాక్షి మళ్లీ వాళ్ల దగ్గరకు వచ్చింది. జీవన్‌ తల్లినుద్దేసిరచి అన్నాడు..

‘అమ్మా! నాదో కోరిక. ఈ సంవత్సరమే నాకు ఉద్యోగం వచ్చింది, త్వరలోనే తాతయ్య పుణ్యతిథి కూడా రాబోతోంది, ఆ రోజున నా జీతంలో నుండి ఖర్చుపెట్టి, తాతయ్య పేరుమీద అన్నదానం చేయాలని ఉంది, అలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని ఉంది, ఏమంటావు?’

‘వెనక ఎప్పుడో చేసిన మేలు మరిచిపోకపోవడం కతజ్ఞతకు మూలం. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్ని మూడింటినీ సమన్వయపరచి ఆలోచించగల శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అలాంటి మనిషే చేసిన మేలును మరిచిపోయి కతఘ్నుడై ప్రవర్తించిననాడు మానవజన్మ వ్యర్థం. తాతయ్య చేసిన మేలుకు మనం ఈ జన్మలోమాత్రమే కాదు, మరో ఏడు జన్మల వరకూ కతజ్ఞులమై ఉన్నా ఆయన ఋణం తీరేది కాదు’ అంది మీనాక్షి.

ఆ మాట చెపుతున్నప్పుడు భావోద్వేగంతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.

జీవన్‌కి కూడా అదే అనుభవమైంది. ఇద్దరి మనసులూ తాతయ్యపట్ల కృతజ్ఞతతో నిండి పోయాయి.

జీవన్‌ తేరుకుని.. ‘సరే అమ్మా! నేను వెళ్ళి భోజనానికి ఆర్డర్‌ చేసి వస్తా’ అని తల్లికి చెప్పి, కిరణ్‌తో, ‘ఒరేయ్‌ కిరణ్‌! ఈ వేళ నువ్వూ సుమతీ మాతోపాటే భోజనం చేస్తున్నారు. సరేనా’ అంటూ వెంటనే మేడ దిగి క్రిందకి వెళ్లిపోయాడు. కిరణ్‌తో కబుర్లు చెపుతూ కూర్చుంది మీనాక్షి.

—-  —-  —-  —-  ——

సుమతికి భోజనం విషయం చెప్పి తిరిగి వచ్చాడు జీవన్‌.

తల్లి పక్కనే కూర్చుంటూ.. ‘అమ్మా! మరో మాటుంది, నీతో చెప్పాలి.. మన జగన్నాథం తాతయ్యగారి మనుమరాలు, స్రవంతి, నీకు గుర్తుంది కదూ! ఆమె ఇప్పుడు మా ఆఫీసులోనే పనిచేస్తోంది. మనకు దగ్గరలోనే పక్క ఊరిలోనే ఉంటోరదిట..’ అన్నాడు.

వెంటనే మీనాక్షి ముఖం ఆనందంతో విప్పారింది. కొడుకిరకా మాట పూర్తిచెయ్యకముందే..

‘ఏమిటీ! ఆ బంగారుతల్లి ఇప్పుడు ఇక్కడే ఉందా! చూడాలని ఉందిరా, ఒకసారి మనింటికి నాకోసం రమ్మన్నానని చెప్పు’ అంది ఎంతో ఆనందంగా.

ఆ రోజు స్రవంతి తన కొడుకును కాపాడిన దృశ్యం ఇప్పుడు మీనాక్షి కళ్లముందు కదలాడింది. ఆమె హృదయం స్రవంతి పట్ల కృతజ్ఞతతో నిండి పోయింది.

‘రేపు తాతయ్య పుణ్యతిథికి భోజనానికి పిలుద్దాం. తప్పక వస్తుంది. లక్కీగా ఆ రోజు ఆదివారం అయ్యిరది కూడా!’ అన్నాడు జీవన్‌.

‘పాపం! తాతయ్య ఎప్పుడూ మనుమల్ని తలుచుకుని, ‘చూడాలని ఉంది’ అంటూ బాధపడే వారు నీకు గుర్తుందా? ఈ సంతర్పణలో స్రవంతిని పరమాన్నం వడ్డించమందాం. తాతయ్య ఆత్మ సంతోషిస్తుంది. తప్పకుండా వచ్చేలా చూడు’ అంటూ చెమర్చిన కళ్లను కొంగుతో తుడుచుకుంది మీనాక్షి.

ఆమె ఉద్వేగాన్ని చూసి ఆ కన్నీటికి కారణం ఏమిటో తెలియని కిరణ్‌ ఆశ్చర్యబోయాడు. కారణం తెలిసి ఉన్న జీవన్‌ హదయం ఆర్ద్రతతో నిండిపోయింది. అంతలో సుమతి రెండు పెద్ద పెద్ద కేరేజీలతో భోజనం తెచ్చింది.

—- —- —- —- ——

చదువుతున్న పుస్తకం మనసుని ఆకట్టు కోవడంతో, చాలా రాత్రివరకూ దాన్ని చదువుతూ నిద్ర మర్చిపోయిరది స్రవంతి. దానిని పూర్తిచేసి పడుకునేసరికి రాత్రి రెండయింది. ఆ రోజు సెలవు కావడం వల్ల లేవడానికి తొందరేం లేదనుకుంది. తెల్లారి ఎనిమిది దాటుతున్నా ఇంకా గాఢనిద్రలోనే ఉంది.

టీపాయ్‌ మీద ఉంచిన స్రవంతి సెల్‌ ఫోన్‌ రింగయింది. అలా ఎడతెగకుండా ఫోన్‌ మోగు తూరడడంతో ఆమెకు నిద్రాభంగం అయ్యిరది. బలవంతంగా కళ్లు తెరిచి దుప్పటి ముసుగులోరచి తల రవంత ఇవతలకి పెట్టి, చెయ్యిచాపి ఫోన్‌ అరదుకుని, ‘హల్లో! ఎవ్వరు’ అంది నిద్దరమత్తులో, బద్ధకంతో ఒళ్లు విరుచుకుంటూ. ఇంకా మత్తు వదలకపోవడంతో మాట ముద్దగా వచ్చింది.

‘సావీ! నేనేనే’ అంది ఆవతలి వ్యక్తి ఆర్తనాదం లాంటి అరుపుతో. ఆపై ఏడుపు వినిపించింది ఫోన్లో.

శిరీష వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమె కంఠాన్ని గుర్తుపట్టిన స్రవంతికి పై ప్రాణాలు పైకే పోయాయి. నిద్రమత్తు పూర్తిగా దిగిపోయింది. ఉలిక్కిపడి అదాటుగా లేచి కూచుంది.

‘ఏమిటే శిరీ! ఏమయ్యింది నీకూ’ అడిగింది కంగారుపడుతూ.

‘ఈ వేళ క్రానికిల్‌లో ఒక వార్త వచ్చింది చూశావా?’ ఏడుపు గొంతుతో అడిగింది శిరీష.

‘క్రానికలా! నా తలకాయేర కాదూ! ఇప్పుడే నిద్ర లేచా. నీ ఫోనే నన్ను నిద్రలేపింది. ఇంతకీ ఏమయ్యిందే, అంతలా ఏడుస్తున్నావు? నిన్నరతలా భయపెట్టిన ఆ వార్త ఏమిటిట!’

‘సారీ సావీ! నిన్ను మంచి నిద్రలో ఉండగా లేపేసినట్లున్నా! ఆ వార్త చూడగానే నా పై ప్రాణాలు పైకే పోయాయంటే నమ్ము! ఒళ్లు తెలియలేదు, సారీ! నాకు చాలా భయరగా ఉరది. నీకు పుణ్య ముంటుంది, వెంటనే బయలుదేరి నా దగ్గరకు రావే, అన్నీ చెపుతాను. నీకు చెప్పాల్సినవి చాలా విషయా లున్నాయి. అవన్నీ ఫోన్లో చెప్పలేను’ అంది శిరీష దిగులు నిండిన స్వరంతో.

కాదనలేకపోయింది స్రవంతి. ‘సరే! నేనింకా పళ్లయినా తోముకోలేదు. తొందరగా తెమిలి, ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను. బై’ అంటూ ఫోను పెట్టేసింది.

(ఇంకా ఉంది)

వెంపటి హేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *