జీవన స్రవంతి – 25

జీవన స్రవంతి – 25

: జరిగిన కథ :

జగన్నాథంగారింటికి ఆయన కొడుకు కుంటుంబం రావడంతో పరిస్థితి బాగాలేదని గ్రహించిన జీవన్‌ ఆ రాత్రి అక్కడ పడుకోకుండా తల్లితో కలిసి ఇంటికెళ్లిపోయాడు. జీవన్‌ గురించి అడిగిన స్రవంతికి అన్ని వివరాలు చెప్పారు జగన్నాథం గారు. తెల్లారి జగన్నాథంగారిని కొడుకు రఘురాం జీవన్‌ గురించి, అతనికి ఆస్తి పంచుతూ రాసిన విల్లు గురించి అడిగాడు. రుణపడ్డవాడికి కొంత డబ్బు చేతిలో పెట్టాలి గానీ, ఆస్తులు రాసివ్వడం ఏమిటంటూ నిలదీశాడు. జగన్నాథంగారు కోపంతో ‘నీవు చేయాల్సిన పనిని అతను చేస్తున్నాడు’ అంటూ కొడకును గద్దించారు. కోపం వలన గుండెనొప్పి వచ్చింది. అంతలోనే జీవన్‌ వచ్చి, రఘురాంకు డాక్టర్‌ నెంబరు ఇచ్చాడు. వెళ్లమని చెప్పినా అక్కడే నిలుచున్న జీవన్‌ గురించి రజనీ భర్తతో ‘మంచితనం నటించి, ఇల్లు గుల్ల చేసేది ఇలారటి వాళ్లే! జాగ్రత్తగా ఉండాలి’ అని గుసగుసలాడింది.

ఇక చదవండి..

వాళ్ళు ఎంత నెమ్మదిగా గుసగుసలాడినా ఆ మాటలు జీవన్‌కి వినిపించాయి. అతని మనసు గాయపడింది. అయినా తాతయ్య కోసం అన్నీ ఓర్చుకోవాలనుకున్నాడు. డాక్టర్‌ వచ్చి తాతయ్య పొజిషన్‌ ఏమిటో చెప్పాక, ఆయన రాసిచ్చిన మందులు తెచ్చి ఇచ్చి, ఆ తరవాతే తను వెళ్ళడం, అంతవరకూ ఎవరేమన్నా పట్టించుకోకూడదు – అని గట్టిగా నిశ్చయించుకున్నాడు అతడు.

డాక్టర్‌ మరో పది నిముషాలు గడిచేసరికి వచ్చాడు. జగన్నాధంగారిని పరీక్షించి, ‘తేలికపాటి గుండెనొప్పి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం మంచిది. మళ్ళీ వస్తే ప్రమాదం’ అని చెప్పి, ఇంజక్షన్‌ చేసి, మందులు రాసి ఇచ్చి, వాటిని ఎలా వాడాలో రఘురామ్‌తో చెప్పి వెళ్ళిపోయాడు. రఘురాం, జీవన్‌ సాయపడగా జగన్నాథంగారు నెమ్మదిగా లేచి వెళ్లి మంచంమీద పడుకున్నారు. ముందు అనుకున్నట్లుగానే మందులు తెచ్చి, రఘురాం చేతికి ఇచ్చి, తాతయ్య ప్రశాంతంగా మంచం మీద పడుకోడం చూసి, అక్కడనుండి వెళ్ళిపోయాడు జీవన్‌.

సామానంతా సదిరి, వచ్చిన మీనాక్షి ‘టిఫిన్‌ ఏమి చెయ్యమంటారు’ అని రజనిని అడిగింది.

‘టిఫిన్‌ మాట తరవాత. ముందు కాఫీల సంగతి చూడండి’ అంది రజని విసుక్కుంటూ, తప్పంతా మీనాక్షిదే ఐనట్లు. మీనాక్షి మనసు చివుక్కుమంది. అయినా మాటాడకురడా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టే ప్రయత్నంలో పడింది. ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది.

అప్పుడే టైం ఎనిమిది దాటింది, ఇంకా ఆ ఇంట్లో ఎవరూ కాఫీలు తాగిన జాడలేదు. పెద్దాయనకు ఈ మధ్య లేస్తూనే జీవన్‌ కలిపి ఇచ్చిన కాఫీ తాగడం అలవాటయ్యింది. జీవన్‌ ఈ రోజు ఇక్కడ లేకపోవడంతో ఆయనకీ కాఫీ ఇచ్చివురడరు ఎవరూ, పాపం! వేళకి కాఫీ లేక ఏ తలనొప్పయినా వచ్చిందో ఏమో! తొందరగా కాఫీ కలపాలి – అనుకుంది మీనాక్షి.

అందరికీ కాఫీలు ఇచ్చి, పెద్దాయనకు మీనాక్షి కాఫీ తీసుకెళ్లేసరికి ఆయన, ఇంజక్షన్‌ ప్రభావం వల్లనో ఏమో, గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇక చేసేదేమీ లేక కాఫీ వెనక్కి తీసుకెళ్ళిపోయిరది.

—————-

మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి అలవాటుగా జగన్నాథంగారి ఇంటికి వచ్చాడు జీవన్‌. వస్తూ ఒక డజను బత్తాయిపళ్ళు తెచ్చాడు. అప్పటికే మీనాక్షి వంట ముగించి, వండిన పదార్ధాలన్నీ కేసరోల్సులోకి సదిరి డైనింగ్‌ టేబులుపైన ఉంచుతోంది.

‘తాతయ్యకు రసం తీసివ్వమ్మా’ అంటూ తను తెచ్చిన బత్తాయిలు తల్లి కిచ్చాడు జీవన్‌.

‘రావోయ్‌ జీవన్‌! భోజనం చేద్దాం’ అంటూ జీవన్‌ని పిలిచాడు రఘురాం.

అక్కడే ఉన్న స్రవంతి ఉలికిపడి ఆశ్చర్యంగా చూసింది తండ్రివైపు. తన తండ్రిలో అంతలో ఇంతమార్పు ఎందుకు వచ్చిందో ఆమెకు అర్ధమవ్వలేదు.

జీవన్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా, ‘ముందుగా తాతయ్య పని చూసి ఆ తరవాత తింటాలెండి, తొందరలేదు, ముందు మీరు భోజనం చెయ్యండి’ అన్నాడు మొహమాటపడుతూ.

జీవన్‌ అలా తాతయ్యమీద అభిమానం చూపించడం రఘురాంకి నచ్చలేదు. పొంగి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుని నెమ్మదిగా మాట్లాడాడు, ‘ఫరవాలేదు రావోయ్‌! ఆయన మంచి నిద్రలో ఉన్నాడు, అంత తొందరగా ఏమీ లేవడు. అప్పటికి మన భోజనాలు అయిపోతాయి. మెహర్బానీ చెయ్యక రా’ అంటూ జీవన్‌ నడుముచుట్టూ చెయ్యివేసి టేబుల్‌ దగ్గరకు నడిపించాడు రఘురాం. జీవన్‌ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి, తను పక్కకుర్చీలో కూర్చున్నాడు.

రఘురాం చూపిస్తున్న ఆత్మీయత వింతగా తోచింది జీవన్‌కి కూడా. ఉదయమే అంత అవమానకరంగా ఈసడించిన మనిషి ఇప్పుడింత ఆత్మీయత చూపిస్తున్నాడంటే ఏమనుకోవాలి! ఏమనుకోడానికీ ఏమీ కారణం కనిపించలేదు జీవన్‌కి.

‘నీ గురించి నాకేమీ తెలియదు. ఏం చదివావు? ఏమి చేస్తూంటావు? అన్నీ వివరంగా చెప్పు, తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు రఘురాం.

రఘురామ్‌కి తనపైన సదభిప్రాయం లేదన్నది జీవన్‌కి నిన్నే తెలిసింది. అతడు తనని ఒక అప్రయోజకుడుగా, నిరక్షర కుక్షిగా, మరీ పనికిమాలిన వాడిగా భావిస్తూ ఉండివుండొచ్చు. తనను గురించి ఆయనకి ఉన్నది ఉన్నట్లుగా తెలియజెయ్యడం మంచిది – అనుకుని చెప్పడం మొదలుపెట్టాడు జీవన్‌.

‘నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదండి. మేథమేటిక్సు మెయిన్‌గా డిగ్రీ తీసుకున్నా. గోల్డు మెడల్‌ వచ్చింది. ప్రస్తుతం నిరుద్యోగిని. గోల్డు మెడల్‌ సంపాదించినంత తేలిగ్గా ఉద్యోగం సంపాదించలేము కదండీ! ఇకపోతే హాబీగా కథలు రాస్తూంటా. వచ్చిన పారితోషికం కాగితాలు, కలాలు, పోస్టేజ్‌కి పోగా జీవికకు చాలినంత మిగలదు. అందుకని ‘హెల్పులైన్‌’ అనే పేరుతో అవసరమున్న వారికి సహాయం చెయ్యడమే వత్తిగా చేసుకున్నా. అదే నా వత్తి, ప్రవత్తి కూడా. నిరుద్యోగినైన నాకు అదే ఉద్యోగమయ్యిరది’ అన్నాడు.

వెంటనే రఘురాం జీవన్‌ వెన్నుతట్టి, ‘నువ్వు నాకు బాగా నచ్చావోయ్‌! నిరుద్యోగులైన యువకులందరూ నీలా ఆలోచిస్తే, మనదేశానికి నిరుద్యోగమన్నది ఒక సమస్యగా మారేది కాదు’ అన్నాడు.

స్రవంతి అన్నం తినడం ఆపి, తండ్రి వైపు వింతగా చూసింది. పొద్దుటికీ ఇప్పటికీ తన తండ్రిలో వచ్చిన మార్పు ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. తన తండ్రి అలా ప్లేటు ఫిరాయించడానికి తగినంత కారణం ఏదో ఉండే ఉంటుంది అనుకుంది. అది మొదలు ఆమె తండ్రిని పరిశీలనగా కనిపెట్టి చూడసాగింది. రవి మాత్రం ఏమీ పట్టించుకోకురడా ఒక చేత్తో పుస్తకం పట్టుకుని చదువుతూ, రెండవ చేత్తో అన్నం తినే ప్రయత్నం చేస్తున్నాడు.

రజని ఎందుకనో చాలా ఉద్వేగంతో ఉంది. చిన్న చప్పుడైనా ఉలికిపడి, వీధి తలుపువైపు చూస్తోంది. ఉండుండీ భర్తను భావగర్భిత మైన చూపులతో పలకరి స్తోంది. అందరి భోజనాలూ పూర్తికా వచ్చాయి. ఒక్కొక్కరికీ పెరుగు వడ్డిస్తోంది మీనాక్షి.

స్రవంతి జీవన్‌ వైపు చూసి అడిగింది, ‘నేను మన తెలుగు పత్రికలు బాగా చదువుతాను. ఎక్కడా మీ పేరు చూసిన గుర్తులేదు. ఏదైనా కలంపేరు వాడుతారా?’

‘ఔనండీ. చిరంజీవి అన్నపేరుతో రాస్తూంటాను’ వంచిన తల ఎత్తకుండానే జవాబు చెప్పాడు జీవన్‌.

స్రవంతి కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. ‘పాఠకుల చేత ‘గ్రేట్‌ రైటర్‌’ అనిపించుకురటున్న ‘చిరంజీవి’ మీరా! మీ కథలంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఇలా చూడగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆటోగ్రాఫ్‌ కావాలి నాకు’ అంది.

రఘురాం కూతురువైపు కోపంగా చూసి ఏదో అనబోయేటంతలో డోర్‌ బెల్‌ మోగింది. పెరుగు అన్నం తిరటున్న రజని ఉలిక్కిపడి లేచి నిలబడింది. ఎవరొచ్చారో చూడాలని వెళ్ళిన మీనాక్షి, తలుపు తెరవగానే కనిపించిన పోలీసుల్ని చూసి నిర్ఘాంతపోయి, పక్కకి తప్పుకుంది.

తింటున్న కంచంలోని పెరుగన్నంలో చెయ్యి కడిగేసుకుని లేచాడు రఘురాం. పోలీసులకు ఎదురువెళ్ళి ‘రండి, రండి’ అంటూ వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు.

పోలీసులు ఇంటికి రావలసినంత అగత్యం ఏమొచ్చిందో తెలియక, కంచం వదిలి లేచివెళ్ళి సింక్‌లో చెయ్యి కడుక్కుని వచ్చాడు జీవన్‌.

రజని పోలీసులతో మాటాడింది, ‘మా మామ గారి చేతినున్న ఉంగరం మాయమయ్యింది. అది మాకు వంశపారంపర్యంగా వస్తున్న అపురూప వస్తువు. ఇప్పుడిక్కడ ఉన్నవారు తప్ప వేరే ఎవరూ ఈ రోజు ఈ ఇంటికి రాలేదు. పొద్దున్న ఆయన వేలికి ఉంగరం ఉండటం చూశాను. ఇప్పుడు లేదు. పెద్దాయన నిద్రలో ఉండగా ఎవరో కాజేసి ఉంటారు. ఎవరా పాడుపని చేశారన్నది కనిపెట్టడం మా వల్లయ్యే పనికాదు. అందుకనే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది’ అంది.

పోలీసులు తమపని మొదలుపెట్టారు. ‘ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఇటు వచ్చి, వరసగా నిలబడండి’ అన్నాడు పోలీస్‌ ఇనస్పెక్టర్‌.

అందరూ వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడ్డారు. మీనాక్షి కూడా తడి చెయ్యి కొంగుకి తుడుచుకుంటూ వచ్చి కొడుకు పక్కన నిలబడింది. అసలు ఇదంతా ఎందుకో, పోలీసులు రావలసిన అగత్యం ఏమిటో ఏమీ అర్ధం కాని సందిగ్ధంతో తబ్బి బ్బయ్యారు మీనాక్షి, జీవన్‌లు. ఉంగరం ఇదివరకు లాగే ఇంట్లోనే ఎక్కడో జారి పడిపోయి ఉంటుంది, వెతికితే కనిపిరచకపోదు. ఈ రోజు తాతయ్య గుమ్మం దిగింది కూడా లేదు. ఇంతటి దానికి పోలీసులతో పనేమిటి? అని విస్తుపోయారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అందరినీ నిశితంగా పరికించి చూసి అడిగాడు, ‘మీ అందరికీ పెద్దాయన వేలికి ఉంగరం ఉండేదని తెలుసుకదా?’

‘తెలుసు!’ స్రవంతి, రవిలతో సహా అందరూ తెలుసని ఒప్పుకున్నారు.

రజని కొంగుతో కళ్ళు ఒత్తుకుని, ‘ఆ ఉంగరాన్ని డబ్బుతో వెల కట్టకూడదు సార్‌! ఎన్నో తరాలనుండి అది తండ్రి నుండి కొడుక్కి వారసత్వంగా వస్తోంది. అచ్చొచ్చిన ఉంగరం. ఇంకా చాలా తరాలు మా వంశంలోనే ఉండాలని మా కోరిక. అందుకే అదెక్కడుందో కనుక్కోడానికి మీ సహాయం కోరాం’.

‘రజనీగారూ! మీరా ఉంగరాన్ని మీ మామగారి వేలికి ఉండటం ఎప్పుడు చూశారు?’

‘ఈ ఉదయమే చూశా! ఆయన ఈ పడక్కుర్చీలో కూర్చుని ఉరడగా ఉంగరం ఆయన వేలికి ఉంది. నాకు బాగా గుర్తుంది’.

‘ఇల్లూ, బాత్రూములూ, పక్క బట్టలూ అన్నీ వెతికారా?’

‘ఆ! మా వంతు పనంతా అయ్యాకే మీకు కబురు చెప్పాము’.

‘మరైతే పెద్దాయన ఏరీ?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

‘మా మామగారికి ఆరోగ్యం బాగాలేదు. గదిలో పడుకుని నిద్రపోతున్నారు’ అంది రజని.

జరుగుతున్న డ్రామా దేనికోసమో తెలుసుకోలేక తికమక పడుతున్నవారిలో మీనాక్షీ జీవన్‌లే కాదు స్రవంతి కూడా ఉంది. అందరిలోనూ రవి ఒక్కడే ఏ చీకూ, చింతా లేకుండా చదువుతున్న పుస్తకాన్ని అంటిపెట్టుకుని, కథలో లీనమైపోయి నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ ప్రదేశమంతా టెన్షన్‌తో నిరడి ఉరది.

ఇన్‌స్పెక్టర్‌ రఘురాం వైపు చూసి అడిగాడు, ‘సర్‌! మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా? ఇక్కడున్న అందరూ ఒకే కుటుంబానికి సంబంధిం చిన వారేనా?’

జీవన్‌ వైపు ఒక చూపు విసిరి చెప్పసాగాడు రఘురాం, ‘రజని నా భార్య. జగన్నాథంగారు మా నాన్నగారు. ఈ అబ్బాయీ, అమ్మాయీ మా పిల్లలు రవి, స్రవంతీ. ఇకపోతే, ఈమె మీనాక్షి – మా ఇంట్లో వంట చేస్తురది. అతడు జీవన్‌, ఈమెగారి కొడుకు. అనారోగ్యంగా ఉన్న మా నాన్నగారికి ఉపచారం చేస్తాడు. ఆ కారణంగా మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఇంతే, ఇంకెవరూ లేరు. దొరికేవరకూ ఎవరూ దొంగలు కారు. నాకెవరిమీదా అనుమానం లేదు’.

‘అందర్నీ ఒకసారి సోదా చేస్తాం. కానిస్టేబుల్‌!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. వెంటనే ఒక పోలీసు ముందుకు వచ్చాడు.

ముందుగా ఆ పోలీసు చివరలో నిలబడి ఉన్న జీవన్‌ని ఎడంగా తీసుకెళ్ళి సోదా చెయ్యడం మొదలుపెట్టాడు. జేబులు వెతుకుతూరడగా జీవన్‌ ప్యాంటుకు ఉన్న వెనుక జేబులో దొరికింది తాతయ్య ఉంగరం. జీవన్‌ నిర్ఘాంతపోయాడు. మీనాక్షి తుళ్లిపడింది.

వెంటనే పెద్దాయన గదిలోకి పరుగుపెట్టిరది మీనాక్షి. జీవన్‌ అటువంటి పని చేశాడని మీనాక్షి నమ్మలేదు. జరిగిన ఘోరాన్ని పెద్దాయనకు తెలియ జెప్పి, ఒక నిర్దోషిని కాపాడమని వేడుకోవాలను కురది. కానీ పెద్దాయన డాక్టరిచ్చిన ఇంజెక్షన్‌ మత్తులో పడి గాఢ నిద్రలో ఉన్నారు. తన కొడుకు ‘దొంగ’ అని ఆమె నమ్మలేకపోతోరది. దీని వెనకాల ఏదో మతలబు ఉండి ఉంటుంది అని ఆమె ప్రగాఢ విశ్వాసం. కాని పెద్దాయనని లేపడం ఎలాగో తెలియక అసహాయంగా దుఃఖిస్తూ గదిలో ఒక వారగా నిలబడింది మీనాక్షి.

స్రవంతికి అంతా అర్ధమయ్యింది. తన తల్లి దండ్రులు ఎందుకనో జీవన్ని ఒక క్రిమినల్‌గా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు అని గ్రహిం చింది. ‘అన్యాయం, అన్యాయం’ అని ఆక్రోశించింది ఆమె మనసు. తన తండ్రి ఆప్యాయత నటిస్తూ జీవన్‌ వెనుక జేబు తడమడం ఆమె కళ్లారా చూసింది. అలా తడుముతూ ఉంగరాన్ని పోకెట్లో పడెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. తన తండ్రి చేసిన పని ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. ఎలాగైనా నిర్దోషైన జీవన్‌ని రక్షించాలనుకురది. ఆమె వెంటనే తాతయ్య గదిలోకి పరుగెత్తిరది.

తాతయ్య మంచం మీద కూర్చుని, ఆయన భుజం పట్టుకు కుదుపుతూ, ‘తాతయ్యా! లే తాతయ్యా! నీ రాజకుమారుడు అన్యాయంగా అరెస్టయి జైలుకి పోబోతున్నాడు! తొందరగా లే తాతయ్యా’ అని ఆయన చెవిలో చెపుతూ ఆయన్ని లేపాలని ప్రయత్నిం చింది. ఆమె కషి తొందరగానే ఫలించింది. జగన్నాథంగారు కళ్లు తెరిచారు. ఏం జరుగుతోందో తెలియక, కంగారుగా లేవబోయారుగాని, విపరీత మైన నీరసంవల్ల మళ్లీ వెనక్కి వాలిపోయారు.

మళ్లీ నిద్రలోకి జారుకుంటున్న ఆయన్ని పదేపదే తట్టి లేపింది స్రవంతి. ‘లే తాతయ్యా! నువ్విప్పుడు లేవకపోతే మహా ఘోరం జరిగిపోతుంది. అన్యాయం గా జీవన్‌ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు. తొరదరగా లే తాతయ్య!’ అంటూ గగ్గోలుపెట్టింది.

జీవను – అరెస్టు – అన్యాయం లాంటి మాటలు తలకెక్కడంతో పెద్దాయనకి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. కాని నీరసంతో లేవలేకపోయారు. ఐనా మనుమరాలిని ఏం జరిగిందో చెప్పమని అడిగి, జరిగిందంతా తెలుసుకున్నారు. వెంటనే పోలీసు ఇన్‌స్పెక్టర్ని తన దగ్గరకి తీసుకురమ్మని చెప్పి, పంపారు మనుమరాలిని.

ఎలా వచ్చిందో అలాగే సుడిగాలిలా పరుగెత్తిరది స్రవంతి. మరుక్షణంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జగన్నాథంగారి మంచంపక్కన ఉన్నాడు. అతని వెనకే రఘురాం కూడా వచ్చాడు. గదిలో ఒక మూలగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తోంది మీనాక్షి ఇదంతా.

నీరసంతో వణుకుతున్న కంఠంతో నెమ్మదిగా చెప్పసాగారు జగన్నాథంగారు. ‘ఇన్‌స్పెక్టర్‌ గారూ! ఆ అబ్బాయి నిర్దోషి. తప్పంతా నాది. అతడు నా ప్రాణదాత! ఆ ఆబ్బాయికి ఆ ఉంగరం బహూకరిరచా లన్నది నా కోరిక. ఎప్పుడిచ్చినా అతడు తీసుకోవడం లేదు. అందుకని అతనికి తెలియకుండా ఆ ఉంగరం అతని జేబులో వేశా. తరవాత నెమ్మదిగా అతనికి చెప్పాలనుకుని మర్చిపోయా, పెద్దతనం కదా! నేను చేసిన దానికి అతనిని శిక్షించడం ధర్మం కాదు’ అన్నారు ఆయన. ఆ తరవాత ఆయనకు దగ్గు రావడంతో మరి మాటాడకురడా పడుకునిపోయారు.

(ఇంకా ఉంది)

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *