బందాసింగ్‌ – 16

బందాసింగ్‌ – 16

చారితక్ర నవల

జరిగిన కథ

బైరాగి మాధోదాస్‌ తాంత్రిక విద్యల్లో దిట్ట. మాధోదాస్‌ గురు గోవింద్‌సింగ్‌ చేతుల నుండి అమృతం స్వీకరించాడు. గురు గోవింద్‌సింగ్‌ మాధోదాసును శిఖ్ఖు సైన్యానికి అధిపతిగా, మహాయోధులైన అరుదుగురు ఖాల్సాలను అతనికి సలహా మండలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. మాధోదాసుకు బందాసింగ్‌ అని కొత్త పేరు ఇచ్చాడు. మొగలారూ పాలకుల అరాచకాల మీద యుద్ధం చెయ్యాలని, ధర్మవిరోధులైన మొగలారూలను శిక్షించాల్సిన బాధ్యత బందాసింగ్‌పై ఉంచుతున్నట్టు ఆదేశించాడు. బందాసింగ్‌ దానికి అంగీకరించి సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు.

గురువు హత్యోదంతం విన్న బందాసింగ్‌ అందుకు కారకుడైన వజీర్‌ఖాన్‌ని సంహరించాలనే ప్రతీకారేచ్ఛ జ్వాజ్వల్యమానమైంది. వజీర్‌ఖాన్‌, బందాసింగ్‌ లకు జరిగిన భీకర యుద్ధంలో వజీర్‌ఖాన్‌ మరణించాడు. మొగలాయీలు బందాసింగ్‌ను లక్ష్యంగా చేసుకుని అతని సైన్యాన్ని తరిమివేశారు. బందా బహదూర్‌ నాలుగు వేల మంది ఖాల్సాలతో తన స్థావరంలో నిబ్బరంగా ఉన్నాడు. ఆకలి శక్తిని క్షీణింపజేస్తుంది. జీవన్ముృతుల్ని చేస్తుంది. ఇప్పుడు బందాసింగ్‌ అతని నాలుగు వేల మంది ఖాల్సాల పరిస్థితి అదే. ఇంతలో బందాసింగ్‌, బినోద్‌సింగ్‌ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. బినోద్‌ సింగ్‌ తన అనుచర గణంతో మెరుపు వేగంతో కోటనుండి బయటపడి, శత్రుసేనని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. మొగలాయీ సైనికులు కోట లోపలికి దూసుకు పోయారు. మూడు వందలకు పైగా శిఖ్ఖుల్ని ఊచకోత కోశారు. బందాసింగ్‌తో సహా రెండు వందల మందిని బందీలుగా పట్టుకొని లాహోర్‌ వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. గురు ఆరాధకులు ఆ భయంకర దృశ్యం చూస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు.

(జరిగిన కథ)

1716 సంవత్సరం.

ఫిబ్రవరి 29వ తేది.

శిఖ్ఖు బందీల ఊరేగింపు గురించి టముకు (చాటింపు) వేశారు. ఇది చూడటానికి ఢిల్లీ నగర వీధుల్లో ప్రజలు కిటకిటలాడుతూ బారులు తీరారు. మొదట తమ బల్లేల మీద శిఖ్ఖుల శిరస్సులు గుచ్చి 2000 మంది సైనికులు ఊరేగింపుగా వచ్చారు. దారిలో కనిపించిన శిఖ్ఖుల తలలు నరుకుతూ వస్తే అవి రెండు వేలకు చేరారు.

సైనికులు వెళ్లాక బందా బహాదుర్‌ బందీగా ఉన్న ఏనుగు వచ్చింది. అతని తలమీద బంగారు అంచు ఉన్న ఎర్రని తలపాగా ఉంచారు. అతన్ని హేళన చెయ్యటానికి శరీరం మీద మెరుస్తున్న పొట్టి చొక్కా తొడిగారు. అప్పుడు (దారిలో బందీలుగా తీసుకున్న 500 మందితో కలిసి) 740 మంది శిఖ్ఖు బందీలను కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి, ఒంటెల మీద అడ్డంగా పడేసి తీసుకువచ్చారు. వాళ్ల మొహాలకు నల్లరంగు పులిమారు. తలమీద మొనదేలిన గొర్రె చర్మం, కాగితం టోపీలు అమర్చారు. వీరి వెనుక మొగల్‌ సైనికాధికారులు మొహమ్మద్‌ అమిన్‌ఖాన్‌, అతని కుమారుడు మరుద్దీన్‌ఖాన్‌, అల్లుడు జకరియాఖాన్‌లు వచ్చారు. రోడ్డుకిరువైపులా వారి సైనికులు బారులు తీరారు.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది.

కనీ, వినీ ఎరుగని రీతిలో హింసలకు గురవుతున్నా ఖాల్సాల మొహాల్లో కించిత్తు కూడా బాధ, పశ్చాత్తాపం కన్పించలేదు. ఈ ఘోరాలను కళ్లతో చూసిన చరిత్రకారుడు మహమ్మద్‌ హరిసి తన ‘ఇబ్రత్‌ నామా’ గ్రంథంలో ఇలా రాశాడు:

‘గుంపులు గుంపులుగా చేరిన ప్రజలు ఖాల్సాలను ఆ దయనీయ స్థితిలో మరింత బాగా చూడటానికి ముందుకు తోసుకురాసాగారు. సైనికులు వారిని వెనక్కి నెడుతూ అదుపు చేస్తున్నారు. వెకిలి మనస్తత్వం ఉన్న ప్రజలు శిఖ్ఖుల దుస్థితికి జాలి, సానుభూతి చూపటానికి బదులు వెక్కిరింతలు, హేళనలు చేస్తూ, పగలబడి నవ్వుతూ, ఆనందించ సాగారు.

కానీ, శిఖ్ఖులు వాటినేమీ పట్టించుకోవడం లేదు. పరిసరాలకు అతీతంగా, శరీర స్పృహ విస్మరించి, వాహెగురుని ధ్యానిస్తూ ప్రశాంతంగా ఉన్నారు. కొందరు ఖాల్సాలు తన్మయంగా వాహెగురు మీద భక్తి గీతాలు పాడసాగారు.

ప్రజల్లో కొందరు క్రూర మనస్తత్వం గలవారు ‘మీ పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు’ అని కేకలు పెడుతుంటే, మరికొందరు దానికి జవాబుగా ‘లేదు అంతా భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరుగుతోంది’ అని ధీరత్వం, భక్తి ప్రపత్తులతో జవాబులు చెబుతు న్నారు.’

గురుదాస్‌ నంగల్‌ కోటలో శిఖ్ఖుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇలా ఉన్నారు. ‘తజ్‌క్రా’ గ్రంథరచరుత ‘కన్వార్‌’ ఆయుధాల జాబితా ఇలా తెలియజేస్తున్నాడు.

1000 – ఖడ్గాలు

217 – చిన్న కత్తులు

114 – చురకత్తులు

278 – డాల్సు

173 – ధనస్సులు

180 – తుపాకులు

అరకొరగా ఉన్న ఈ ఆయుధాలతో, లక్షమంది మొగలారూ సైనికుల్ని ఎనిమిది నెలల పాటు నిరోధించటం నమ్మశక్యం కానిది. ఆహార పదార్థాలు తరిగిపోకపోతే, మరెంతోకాలం మొగలులని దూరంగా నిలబెట్టి ఉండేవారు.

బెంగాలీ పౌరుడు సి.ఆర్‌.విల్సన్‌ బెంగాల్‌లో బ్రిటిష్‌ వారి ప్రారంభ ప్రవేశం గురించి రాస్తూ, శిఖ్ఖుల ఢిల్లీ ప్రవేశం గురించి ఇలా వివరించాడు.

‘బందీలను చిత్రహింసలకు, అవమానాలకు మొగలారూలు గురి చేశారు. మొట్టమొదట గడ్డి కూరిన శిఖ్ఖుల తలలను వెదురు కర్రలకు గుచ్చి భుజాన మోస్తూ వందలాది మొగల్‌ సైనికులు ఢిల్లీలో ప్రవేశించారు. శిఖ్ఖు వీరుల శిరస్సుల నుండి వేలాడుతున్న పొడవాటి జుట్టు ముఖం మీద ముసుగులా కప్పి ఉంటోంది. కదలికల్లో ఆ జుట్టు అటూ ఇటూ ఊగుతోంది. గురుదాస్‌పూర్‌లో ఒక్క ప్రాణీ మిగల్లేదని చెప్పటానికా అన్నట్టు ఒక వెదురు కర్రమీద పిల్లి శవం తగిలించుకుని ఒక సైనికుడు వస్తున్నాడు.

బందా బహాదూర్‌ని హేళనకు గురి చేస్తున్నట్టు తలకి ఎర్రగుడ్డ చుట్టి, బంగారు రంగు జలతారు పట్టీని చుట్టారు. పువ్వులద్దిన బరువైన దుస్తులు వేశారు. ఏనుగు పైన ఉన్న ఇనుప పంజరంలో కూర్చోబెట్టారు. అతని వెనుక కవచంతో ఉన్న ఒక అధికారి చేతిలో ఖడ్గం ధరించి ఉన్నాడు.

వారివెంట రికాబులు (ఎక్కడానికి ఉపయోగించే రింగులు) లేని ఒంటెలు, వాటిమీద ఇద్దరు ఇద్దరు చొప్పున శిఖ్ఖుల్ని సరుకుల మూటల్లా అడ్డంగా పడేశారు. వాళ్ల తలలకి గొర్రె చర్మంతో చేసిన బఫూన్‌ టోపీలు తగిలించారు. ఒక చెర్యుని మెడ చుట్టూ ఉన్న చెక్క బంధంలో బిగించారు. ఊరేగింపు చివర మొగల్‌ ప్రముఖులు మహ్మద్‌ అమీన్‌ఖాన్‌, బందీలను తీసుకురావటానికి చక్రవర్తి నియామకం చేసిన ప్రభుత్వ మంత్రి, అతని కుమారుడు ఖమర్‌ ఉద్దీన్‌, అల్లుడు జకరియాఖాన్‌లు తమ మేలి గుర్రాల మీద ఉన్నారు.

ఈ శవ ఊరేగింపు రాజమహలు చేరడానికి ఇంకా కొన్ని మైళ్లు వెళ్లాల్సి ఉంది. దారి పొడుగునా బాటకిరువైపులా ప్రజలు గుమికూడి ఉన్నారు. వారిని అదుపు చేస్తూ సైనికులున్నారు. కొందరు ప్రజలు గురువును అవహేళన చేశారు. ఆయన శిష్యుల దుస్థితిని చూస్తూ వెక్కిరింతగా ‘హు..హు..’ అని తలలూపుతూ కేకలు పెట్టారు. ‘పిచ్చి కుక్కని ఆరాధించే మీకు మీ దుర్దినాలు వచ్చారు’ అని అరిచారు. ఇలాంటి అవమానాలు పట్టించుకోకుండా శిఖ్ఖులు గురుధ్యానంలో లీనమై ఉండిపోయారు.’

మేం మతం మారం.

శిఖ్ఖులు మతం మారటానికి అంగీకరిస్తే ప్రాణదానం చేస్తామని మొగల్‌ అధికారులు ప్రలోభపెట్టినా ఎవరూ వినిపించుకోలేదు. మరణానికి ఎంతమాత్రం భయపడని నిజమైన వీరోచిత లక్షణాలు వారిలో కన్పించారు. వీరమరణం కోసం ఆతృత పడుతున్నట్లు వారి ధోరణి ఉంది.

వధ్యశిల వద్దకు వారిని తీసుకు వెళ్తుంటే శిఖ్ఖులు ముందుకు తోసుకువెళ్తూ ‘నన్ను ముందు చంపు’ అంటూ పోటీలు పడుతుంటే కసారులు ఆశ్చర్యంతో నోరు తెరిచారు. అది ఖాల్సాల త్యాగనిరతి.

ఇక్కడ మొగల్‌ చరిత్రకారుడు ఖఫీఖాన్‌ ఒక అద్భుత సంఘటన గురించి ఇలా రాశాడు

‘బందీలలో కొత్తగా పెళ్లరున ఒక యువ ఖాల్సా ఉన్నాడు. అతన్ని గురుదాస్‌పూర్‌ నుండి ఢిల్లీకి వచ్చే దారిలో జకరియాఖాన్‌ సైనికులు పట్టుకున్నారు. శిఖ్ఖు అవటమే అతని అపరాధం. వీలైనంత ఎక్కువమంది శిఖ్ఖులను బందీలుగా తీసుకు వెళ్లి చక్రవర్తిని మరింత సంతోష పరచాలని మొగలారూల ఆలోచన. ఆ యువకుడికి తండ్రి లేడు. తన తల్లికి ఏకైక కుమారుడతను. ఆమె పరుగున చక్రవర్తి ఎదుటకు వెళ్ళి తన కుమారుణ్ణి బలవంతాన శిఖ్ఖు మతంలోకి మార్చారని దయచేసి కాపాడమని ప్రార్థించింది. ఆమె ప్రార్థన మన్నించి చక్రవర్తి క్షమాభిక్ష పత్రాన్ని ఆమె కిచ్చాడు. ఆమె మళ్లీ పరుగులు తీస్తూ శిక్షలు అమలు చేరుస్తున్న మొగల్‌ అధికారి వద్దకు వెళ్లి ఆ పత్రాన్ని చేతికిచ్చింది.

ఆ అధికారి దానిని పెద్దగా చదివాడు.

అది వింటున్న యువ ఖాల్సా పెద్దగా అరిచాడు.

‘నా తల్లి అబద్ధం చెప్పింది. నేను నా గురువు శిష్యుణ్ణి. ఈ దేహం, ఆత్మ ఆయనవే. నన్ను నా నుండి విడిపోరున, బలైన నా మిత్రుల నుండి వేరు చెయ్యకండి. నన్ను త్వరగా బలిచెయ్యండి. నేను వారిని కలుసుకోవాలను కుంటున్నాను’ అంటూ తనను పట్టుకున్న సైనికుల్ని వదిలించుకుని తలలు నరకబడుతున్న వారి వరసలో ముందుకు వెళ్లి నిలబడ్డాడు. వధ్యశిల మీద తలపెట్టి, కత్తితో నరికే వరకు కదల్లేదు! కసారుల కత్తి పడగానే తల మొండెం నుండి వేరరుంది.

మొగల్‌ చరిత్రకారుడు మొహమ్మద్‌ హరిసి ఇలా రాశాడు.

‘యువ ఖాల్సా వ్యవహరించిన పద్ధతిలోనే మిగతా శిఖ్ఖులందరూ పోటీలు పడి మరణించారు. ఎవరూ క్షమాభిక్ష కోరలేదు. ప్రాణం కోసం మతం మారలేదు. అలా 700 మంది శిఖ్ఖులు ఆత్మ బలిదానం చేశారు. వాళ్ల శరీరాలను ఊరి బయట రాబందులకు ఆహారంగా పడవేశారు. వారి తలలను తిరుగు బాటుదారులకు గుణపాఠంగా, హెచ్చరికగా చెట్లమీద, వెదురు కర్రల మీద ప్రదర్శించారు.’

చెరసాల అధికారులు 700 మంది శిఖ్ఖుల హత్య తరువాత ఇరవై మందికి పైగా ఉన్న శిఖ్ఖు సర్దారుల మీద దృష్టిపెట్టారు. వాళ్లలో ప్రముఖులు బాజ్‌సింగ్‌, ఫతేసింగ్‌, అహ్లిసింగ్‌, లోహ్‌గఢ్‌లో పేరుపొందిన గులాబ్‌సింగ్‌ ఉన్నారు.

మొగల్‌ అధికారులు వీరిని పలు రకాలుగా క్రూర హింసలు పెట్టారు. వీరందరూ శిఖ్ఖు సేనాపతులు. సర్‌హింద్‌, బటాలా, మిగతా ప్రాంతాల నుండి దోచుకున్న ఖజానాల ధనం ఎక్కడ దాచారో చెప్పమని తీవ్రంగా హింసించారు. ఇలా మూడు నెలలు వేధించినా సర్దారులు నోరు మెదపలేదు.

ఇక వారి నుండి ఎలాంటి సమాచారమూ రాబట్టలేమని గ్రహించి, మరణ శిక్ష అమలు చెయ్యటానికి నిర్ణరుంచారు.

(ఇంకా ఉంది)

–  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌, 9849568901

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *